Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#37
వేదసంస్కృతిలో ఆలు మగల సంబంధాలు


యమ, యమి అనువారు ఏకగర్భ జనితులైన సోదర సోదరీమణులు. వీరిరువురూ వివస్వతుని సంతానం. యమి యముని కామించింది. తనను వివాహం చేసుకోవలసినదిగా సోదరుడిని అర్జించింది. సోదరుడు సోదరుని కామించరాదని చెబ్తూ సోదరి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అట్టి సంబంధం ధర్మ విరుద్ధమని నచ్చజెప్పి మరొకరిని పరిణయమాడి సుఖంగా జీవించమని హితబోధ చేస్తాడు. ఇది అధర్వణవేదం, 18వ కాండంలోనిది. రుగ్వేదంలో కూడా ఈ ఉదంతం వుంది.
వేదకాలానికి ముందు ఏకగర్భ జనితుల మధ్య కూడా వైవాహిక సంబంధాలుండేవని దీని ద్వారా తెలుస్తున్నది. మాతృస్వామ్య స్వేచ్ఛాసమాజం నుంచి సంస్కరణలలో భాగంగా, నియమబద్ధ వైవాహిక బంధంతో పితృస్వామ్య వ్యవస్థ రూపు దిద్దుకున్న తర్వాత కూడా పాతవాసనలు పూర్తిగా వదిలించుకోలేక, అలాంటి కోరికలు ఉత్పన్నమవుతున్నవని అర్థమవుతున్నది.

అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు కూడా ప్రేమించుకుని పెద్దల అభీష్టానికి విరుద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భాలు నేడు కూడా అక్కడక్కడ చూస్తున్నాం.
ఒక స్త్రీకి అబ్రాహ్మణ పతులు పది మంది వున్నప్పటికీ విధి విహితంగా పాణి గ్రహణం చేసుకున్న బ్రాహ్మణుడు ఒక్కడే ఆమెకు భర్త అవుతాడు. వైవాహిక వ్యవస్థ స్థిరపడిన ప్రారంభంలో స్త్రీ లైంగిక స్వేచ్ఛను యధేచ్చగా అనుభవిస్తున్న సందర్భాన్ని ఈ సంఘటన తెలియపరుస్తున్నది. అంటే మాంగల్యం కట్టిన భర్త భార్య మీద ఆధిపత్యం చెలాయించలేని సంధికాలమది. ఇతరేతర సంబంధాలను పెద్దగా తప్పుపట్టని కాలంగా గుర్తించాలి.

నియోగ పద్ధతి.. సంతాన తాపత్రయంతో విధవ, విధురుల సహజీవనాన్ని నియోగపద్ధతి అంటారు. స్త్రీ విధురునితోను, పురుషుడు విధవతోను నియోగం చేసి సంతానం పొందవచ్చునని రుగ్వేదం, అధర్వణవేదం తెలిపాయి. గురుపత్ని, భగిని (సోదరి), కన్య, కోడలు తదితర సమీప బంధువులతో నియోగం తగదని పేర్కొన్నది. వేదసమ్మతమైన నియోగ పద్ధతి ద్వారా అంబిక అంబాలికలకు వ్యాసుని ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు దాసి ద్వారా విదురుడు జన్మించారు. నియుక్త పతికి సంతానం కలగనిచో మరొక నియుక్త పతిని పొందేలా వెసులుబాటు వుంది. అయితే ఒకే సమయంలో అనేక నియుక్త పతులు వుండరాదు.
వేదం విధిగా అనుసరణీయమని, మార్పులకు అతీతమని, ఈశ్వరీయమైన వేదం సదా విరాజిల్లాలని నొక్కి పలికే వేదాభిమానులు వేదం అనుమతించిన, పైన పేర్కొన్న నియోగపద్ధతి, బహుపతుల సనాతన ధర్మాలను ఆచరణలో పెట్టగలరా అనేది ట్రిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఈ నియోగపద్ధతిని ఆపస్తంభుడు వ్యతిరేకించగా వశిష్టమహర్షి నియోగపద్ధతిని సమర్థించాడు. బాల వితంతువులకు పునర్వివాహం కూడా అనుమతించాడు. వశిష్టుడు అప్పటి కాలపు సంస్కరణ వాది. తదుపరి మనుధర్మ స్మృతి నియోగ పద్ధతిని వ్యతిరేకించింది.
శుక్ల యజుర్వేదం 37వ అధ్యాయంలో యజ్ఞం సందర్భంగా యజమాని పత్ని ముసుగు తొలగించి 'మహావీరా! నీవు వీర్యమునకు అధిదేవత యగు త్వష్ట యుక్తుడవు, మేము స్త్రీలము. మైధునం నిమిత్తం నిన్ను ముట్టుకుందుము నాకు పుత్రులను, పశువులను ప్రసాదింపుము. నా పతితో కూడి బాధలు లేకుండా జీవింతునుగాత!' అంటుంది.

దేవతకు ప్రతిరూపమైన వస్తువును పట్టుకుని అన్నప్పటికి వీర్య సంపన్నమైన పురుష సంపర్కంతో మాత్రమే సంతానం కలిగే అవకాశం వుంది. దాంపత్య జీవితంలో సంతానభాగ్యం కలగనపుడు స్త్రీ పురుష సంపర్కాన్ని కోరుకుంటే తప్పుపట్టని వేదకాలపు సమాజమని సృష్టమవుతున్నది. తదుపరి కాలంలో కూడా దేవుడిని ప్రార్ధించగా వరంతో జన్మించారని చెప్పుకునేవన్నీ ఈ కోవలోనివే. ఇలాంటి కథనాలు మన పురాణలలో అనేకం కన్పిస్తాయి.

జీవిత భాగస్వామి అయిన భర్త కావాలి. సంతానం సంపదలతో సంసార జీవితాన్ని కోరుకుంటున్న స్త్రీ మనస్తత్వం ప్రతిబింబిస్తున్నది. యజ్ఞ యజమాని పత్నిలో ప్రధానంగా పుత్రుడిని ప్రసాదించమని కోరుకున్నది. వృద్ధాప్యంలో ఆసరా కావాలి గనుక అనాది నుంచి మగ సంతానాన్నే కోరుకుంటూ వుండే వారు. కాళ్ళు చేతులు ఆడని కాలంలో ఏ దిక్కూ లేని వారి నిస్సహయ దుస్థితినే పున్నామ నరకమని పేరు పెట్టినట్లున్నారు మన పూర్వీకులు.
భర్త సంసారాన్ని కోరుకునే స్త్రీలు కొందరు నేటి కాపట్య జీవితంలో సంతాన కాంక్షను సాఫల్యం చేసుకునే ప్రయత్నంలో తెరచాటు సంబంధాలకు పాల్పడుతున్నారు. అలాంటివి సహించని భర్తల విషయంలో భార్యల పరువు హత్యల ఉదంతాలనూ చూస్తున్నాం.

సనాతన ధర్మ స్వరూపానికో దృష్టాంతాన్ని పరిశీలిద్దాం. ఉద్దాలకుడనే మహాముని కుమారుడు శ్వేతకేతువు. ఇతనికి ఊహ తెలిసిన దశలో ఒక సంఘటన జరిగింది. శ్వేతకేతువు తల్లి రుతుమతి అయిన సందర్భంలో ఒక విప్రుడు అతిథిగా వచ్చి పుత్రార్థం ఆమెను కామించి తన అభిలాషను ఆమెకు తెలియపరుస్తాడు. అందుకామె అంగీకరించింది. ఇది చూసి శ్వేతకేతువు హృదయం గాయపడి ఆ విషయం తండ్రితో చెప్పాడు. అప్పుడా ఉద్దాలకుడు 'ఆ విప్రుడు మీ తల్లి పూర్వాచారాన్నే పాటిస్తున్నారని సర్ది చెప్పాడు. అయినా శ్వేతకేతువు జీర్ణించుకోలేక ఆగ్రహించాడు. ఈ అపచారాన్ని సహించలేకపోయాడు. సనాతన ధర్మమే శరణ్యమని గొంతుచించుకునే వారు ఈ ధర్మాన్ని అనుసరిస్తున్నట్లేనా?
ఉద్దాలక మునివర్యుడు సనాతన ధర్మాన్ని సమర్థించడంతో మనం ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులతో సమానంగా అతిథిదేవోభవ అని ప్రవచించిన వేదసూక్తిలోని అతిథికి ఇంతటి హక్కు, వైభోగం ప్రాప్తి వుందా అని విస్తుపోవడం మన వంతు అవుతుంది.
అసలు సనాతన ధర్మం ఏంటంటే..... ''పక్వాన్నమివ రాజేంద్ర సర్వసాధారణాస్త్రీయ్ణం తస్మాత్తాసు నకుప్యేత వరజ్యేత, రమేఏవ''
ఓ రాజేంద్రా! పక్వాన్నమెలా వారిది వీరిదనే భేదములేక సర్వసాధారణమైనదో అంటె అందరికి అనుభవించే అర్హమై ఎలా వుందో అలాగే స్త్రీలు సర్వసాధారణులు గనుక పురుషులు వారి విషయమున నేరం ఆరోపించి కోప్పడకూడదు. వారిని రమించవలసినదే.
శ్వేతకేతువు ఈ సనాతన ధర్మం మీద తిరుగుబాటు చేశాడు. సంస్కారాలు ప్రవేశపెట్టి ఒక ఆదర్శ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. భారతదేశంలో వివాహవ్యవస్థను ఒక దారికి తీసుకువచ్చి కట్టుదిట్టం చేసిన వాడు శ్వేతకేతువు అనే పేరుగల రుషి అని ఇతిహాసాలు చెబుతున్నాయి.

ఇక దాంపత్య బంధంలోని ఆంతర్యాన్ని విడమరచి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఇద్దరు, భార్యలుగల యాజ్ఞవల్కుడు పెద్ద భార్య మైత్రేయిని పిలిచి తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించదలచానని, కనుక నీకు కాత్యాయినికి ఆస్థి పంపకాలు చేస్తానని చెప్పగా, మోక్ష ప్రాప్తి కల్పించలేని సంపదలను తిరస్కరించి తనకు మోక్షమార్గాన్ని ఉపదేశించమని మైత్రేయి అర్థిస్తుంది. అందుకు యాజ్ఞవల్క్యుడు హర్షించి భార్యాభర్తల అనుబంధాన్ని గూర్చి ఇలా వివరిస్తాడు.

స్త్రీకి లైంగిక ఇతర భౌతిక సుఖాలు లభించినంత వరకు భర్త ఇష్టుడగుచున్నాడని, ఆ సుఖాలు కొరవడినపుడు ఇష్టుడు కాబోడని, అలాగే పురుషునికి కూడా భార్య నుంచి అందం ఆకర్షణలతో కూడిన సంసారభోగం లభించినంత వరకే భార్య పట్ల ప్రేమ ఆప్యాయతలుంటాయని, ఇలా ఆలు మగలిద్దరూ వారి స్వసుఖాల కోసమే కలిసి వుంటున్నారు తప్పితే అవి లభించనినాడు ఆ బంధం వుండదని అప్పటి యదార్థ పరిస్థితిని విశ్లేషించాడు యాజ్ఞవల్క్యుడు.
నేటి కాలంలో బంధాన్ని కాపాడే అంశాల సంఖ్య పెరిగింది గనుక సంసారాలు కలిసి వుండడం జరుగుతున్నది. ఏది ఏమైనా యాజ్ఞవల్క్యుడు పేర్కొన్న రెండు అంశాలు నేడు కూడా అధిక ప్రాధాన్యం కలవి గానే గుర్తించాలి.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by sarit11 - 30-11-2019, 05:16 PM



Users browsing this thread: 10 Guest(s)