Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#36
తొలిదశలో మానవులది స్వేచ్ఛాశృంగారం. నదరుగా ఉండే ఆడది కంటపడితే ‘కల్లోకొస్తవు కౌగిలిస్తవు ననుం కవ్విస్తవే, ఈ కల్లోలంబు భరింపలేను కనవే కారుణ్యమున్‌ చూపవే...’ తరహాలో కాళ్లావేళ్లా పడి పురుషుడు కోరిక తీర్చుకొనేవాడు.

ఆడది తిరస్కరిస్తే రావణుడి లాంటివాళ్లు ‘గమనం వా పరస్త్రీణాం, హరణం సంప్రమధ్యవా... బలాత్కారం మా వంశాచారం’ అంటూ మొరటుగా వ్యవహరించేవారు.

ఉద్దాలక మహర్షి ఇంటికి అతిథిగా వెళ్ళినవాడొకడు ముని భార్యతో పొందు కోరాడు. తన తల్లిని ఒక పరాయివాడు అలా బాహాటంగా కామించడం కొడుకు శ్వేతకేతువుకు పరమ దుర్భరంగా తోచింది. ఆ తపశ్శాలి ఉగ్రుడై ‘ఇది ఆదిగా సతులెన్నండు పరపురుషార్థినుల్‌గా జనదు... ఇకపై వివాహితులను పరపురుషులు కోరడానికి వీలు లేదు. మానవజాతి మొత్తానికి ఈ కట్టడి విధిస్తున్నాను’ అంటూ గర్జించాడు. ‘అదియు ధారుణీ జనంబునందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచునుండె’- దాంతో లోకంలో కామం విషయంలో క్రమశిక్షణ మొదలైందని భారతం ఆదిపర్వం వివరించింది.

దరిమిలా మన వివాహ వ్యవస్థలో ఓ స్పష్టత వచ్చింది. అగ్నిసాక్షిగా పవిత్రబంధం ముడిపడుతూ వచ్చింది. ఒక పురుషుడికి ఒకే స్త్రీ అన్న భావం సమాజంలో బలపడింది. ‘ఆర్షము, బ్రాహ్మ్యము, ఆసురము, ప్రాజాపత్యము, పైశాచ్యము, గాంధర్వము, దైవము, రాక్షసము’ అంటూ అష్టవిధ వివాహరీతులు ఆచరణలోకి వచ్చాయని భారతం ఆనుశాసనిక పర్వంతోపాటు శకుంతలా పరిణయం వంటి పలు ప్రబంధాలు ప్రస్తావించాయి. ‘తగ వరుని బిలిచి కన్యకు తగిన అలంకారమిచ్చి ధారాపూర్వంబుగా (కన్నెధారపోస్తూ) పెండ్లిసేయు’ విధానం లోకంలో ఆచారమైంది. ‘నాతి చరామి’ (అతిక్రమించను) అనేది పెళ్ళికి ప్రామాణికమైంది.

హైందవ కల్యాణ సంస్కృతిలో మంగళసూత్ర ధారణ ఆచారమే తప్ప వేదవిధి కాదు. సమావర్తనం కన్యావరణం కన్నెధార పెళ్లి హోమం పాణిగ్రహణం అగ్నిపరిచర్య లాజహోమం సప్తపది నక్షత్ర దర్శనం స్తాలీపాకం... వంటివి వైదికంగా ప్రధానాంశాలు. రామాయణ కాలం నాటికి పాణిగ్రహణమే శుభముహూర్తం. రాముడు సీతకు తాళి కట్టలేదంది వాల్మీకిరామాయణం. భారతం ఆదిపర్వంలో దేవయాని ‘నాదు దక్షిణ కరాగ్రము పట్టితి కాన, మున్న పాణిగ్రహణంబు సేసితది’ నా చేయి పట్టుకొన్నావు కనుక మనకు పెళ్ళి అయిపోయినట్లేనని యయాతితో అందుకే అంటుంది. ‘మాంగల్యం తంతునానేన...’ శ్లోకమే తప్ప మంత్రం కాదు. ‘లగ్నాష్టక వ్యావృత్తిన్‌ గుడ జీరకంబులు (బెల్లం జీలకర్ర) శిరోభాగాంతరన్యస్తం’ చేయడమే ఈ రోజుల్లో సుముహూర్తం అంటున్నారు. ‘నేత్రాంతములన్‌ (కడకంట) నవీన దరహాస రుచుల్‌ ననలెత్త (చిగురించగా) హర్ష సంక్రాంత మనః ప్రసక్తిన్‌’ చూపులు కలవడమే అసలైన ముహూర్తమని పెద్దల అభిప్రాయం. అంతరార్థాల సంగతి అలా ఉంచి, పెళ్ళి వేడుకలను మన పూర్వకవులు మహా వైభవంగా వర్ణించారు. విజయవిలాసంలో సుభద్రార్జునుల బాసికధారణ శోభను చేమకూర ‘పులు కడిగిన ముత్తెముల బాసికంబులు సరవి కట్టిరి నేర్పు సంఘటిల్ల’ అన్నాడు. నలదమయంతుల వివాహ విశేషాలు చెబుతూ శ్రీనాథుడు శృంగారనైషధంలో ‘ఆశుశుక్షణికిన్‌(అగ్నిదేవుడికి) భక్తి ప్రదక్షిణ ప్రక్రమంబుల ఉపాసనంబును, అంశుక గ్రంథి(కొంగుముడి) కల్యాణ క్రియాచారము ఆచరించిరి’ అంటూ సప్తపదిలోని సొగసును సరసంగా వర్ణించాడు. ‘లేజవరాలి(గిరికాదేవి) పాణియుగళీ పరిరంభణ పాటలీభవల్లాజచయంబు(లాజహోమ)’ ఘట్టానికి వసుచరిత్రలో రామరాజ భూషణుడు అందమైన బొమ్మకట్టాడు. ఇక సన్నెకల్లు(కల్వపొత్రాన్ని) తాకించడం, అరుంధతీ దర్శనం, తలంబ్రాలు వంటి ఘట్టాలు ఎంత కోలాహలంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. మనువాడటాన్ని మధురస్మృతిగా మలచే క్రమంలో స్థానికమైన ఎన్నో ఆచారాలు ఆ వరసలో చేరాయి. దానిలో ముఖ్యమైనది- మంగళసూత్రం.

తాళిబొట్టు ఆరో శతాబ్దం నాటికి ఆచారంలోకి వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. 108 సన్నని దారపు పోగులను పెనవేసి, పసుపురాసి వాటికి పసుపుకొమ్ము గాని, బంగారు సూత్రాలు గాని ముడివేసే ప్రక్రియ ప్రధానంగా దక్షిణ దేశానిది. పోతన తన భాగవతంలో పార్వతీదేవి ‘మంగళసూత్రంబునెంత మది నమ్మినదో’ అంటూ దాని ప్రస్తావన తెచ్చాడు. స్వరోచి మనోరమ మెడలో ‘కట్టెన్మంగళ సూత్రమున్‌’ అన్నాడు మనుచరిత్రలో అల్లసాని పెద్దన. చక్రవర్తులు రాజ్యాలను జయించినప్పుడు తమ విజయాలకు గుర్తుగా లోహ శిలామయ స్తంభ తోరణాలు నెలకొల్పడం పరిపాటి. అలా నలమహారాజు దమయంతి హృదయ సామ్రాజ్యాన్ని ఆక్రమించి ‘తత్పురమున నిల్పెడు తోరణంబు మురువు దలిర్పన్‌(సొంపు ఇనుమడించేలా) భీమజ(దమయంతి) కంఠంబున మంగళసూత్రమపుడు పొందుగ గట్టెన్‌’ అని ‘షట్చక్రవర్తి చరిత్రం’ చమత్కరించింది. ఆ మూలాలు తెలుసో లేదోగాని- కర్ణాటకలోని నాలతవాడ గ్రామంలో అంకిత, ప్రియ అనే ఇద్దరు వధువులు వరసగా ప్రభురాజ్‌, అమిత్‌ అనే వరులకు మంగళసూత్రాలు కట్టి మురిసిపోయారు. పన్నెండో శతాబ్దంలో స్త్రీలే తాళి కట్టేవారని, ఆ ఆచారాన్ని తాము తిరిగి ఆరంభిస్తున్నామని సగర్వంగా ప్రకటించారు. ‘బసవణ్ణ సిద్ధాంత ప్రాబల్యమును మేము పునరుద్ధరింపంగ పూనినాము’ అంటూ ఢంకా బజాయించి మరీ చెప్పారు. ‘ఆచారాలనేవి శిలాశాసనాలేమీ కావు, దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి’ అనేది మరోసారి రుజువైందంటున్నారు అనుభవజ్ఞులు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by sarit11 - 30-11-2019, 05:06 PM



Users browsing this thread: 3 Guest(s)