Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భర్తృహరి శృంగార శతకము
#24
2

“స్మితేన భావేన చ లజ్జయా భియా
పరాఙ్ముఖైరర్ధ కటాక్ష వీక్షణైః
వచోభిరీర్య్షా కలహేన లీలయా
సమస్త భావైః ఖలు బంధనం స్త్రియః”



(స్త్రీలు చిరునవ్వులచేతను, హావభావముల చేతను, సిగ్గు పడుచును, భీతి చెందుచును, పెడమొగము చేతను, కడకంటి అరచూపులతోను, మాటల చేతను, చిఱు కోపములతోను – ఇట్లే అనేక చేష్టలతోను పురుషులను బంధిస్తారు) అన్నాడు.

ఈ లక్షణాలు స్త్రీ ప్రకృతికి సహజభూషణాలౌతూ, పురుషుల పాలిటి ఆయుధాలౌతాయి. (ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది స్త్రీ నింద కాదు. స్త్రీ వ్యామోహనింద). ఇంతటి శక్తివంతమైన లలనా కటాక్షాలకు మోహపడనివాడు. ప్రాజ్ఞుడే. ధీరుడే.


[ ప్రతి పదార్ధం  


స్మితేన = మంద స్మితమైన మోముతో (చిరునవ్వుతో) - భావేన = హావ భావాలతో (చేస్టలతో)

చ = కాకుండా - లజ్జయా = సిగ్గుతో (సిగ్గును అభినయిస్తూ) - భియా = భయం తో

పరాజ్ముఖై = అందమైన నగుమోము ను ప్రక్కకు త్రిప్పి చూపించీ చూపించ కుండా

అర్ధ = అర్ధంతో - కటాక్ష = దయగల, కరుణారసస్పూర్తిని కలిగించే - వీక్షనైః = చూపులుగలదై


భావార్ధం & వివరణ 

మందస్మిత మోము తో ప్రేమైక భావాలతో నునుసిగ్గుల తో స్వల్పభయా భినయం తో, ముఖారవిందాన్ని కొంచెం ప్రక్కకి త్రిప్పి చూపించటానికి అయిష్టత అభియనిస్తూ, కడగంటి చూపులతో, వాక్చమత్కార -చాతుర్యంతో, ఈసునసూయలు నిండిన చేష్టలతో, ప్రేమ నిండిన శ్లెషపూర్వక పలుకులతో, నవరసాభినయ హావభావాల సమ్మిళితమైన ప్రదర్శనతో పురుషుణ్ణి కట్తిపదేయటం స్త్రీలకు సులభమై విద్యే ...
ఇదంతా నటనే సుమా!]



[శూరులలో మహాశూరుడు ఎవడు? – మన్మథబాణములతో వ్యథితుడు కానివాడు.

మన్మథుడు స్త్రీ , పురుషులలో పరస్పరము కామోద్దీపనను కలిగించు శక్తి కలవాడు. ఆయనకు అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అను ఐదు బాణాలున్నాయనీ, అవి ఎంతటి సంయమినైనా కామానికి లోబడేటట్లు చేయగలవని అనేక పురాణగాథలలో తెలుపబడింది. 


అలాంటి కామాన్ని అభ్యాసం ద్వారా జయించిన వాడు మహావీరుడని చెప్పటంలో సందేహం లేదు. జిత మన్మథుడు ధీరుడు. మన్మథ విజితుడు యోగ పతితుడు.]
Like Reply


Messages In This Thread
RE: భర్తృహరి శృంగార శతకము - by rraji1 - 30-11-2019, 04:28 PM



Users browsing this thread: 3 Guest(s)