Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భర్తృహరి శృంగార శతకము
#13
భేతాళ కథలలో విక్రమార్కుడు ఎందుకు పట్టు వదలలేదు ?
A R Babu


‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవ రూపంలోని భేతాళుడు రాజా..అచంచలమైన నీ దీక్ష ప్రశంసించదగినదే... కానీ ఎందుకీ పట్టుదల అని అడిగినప్పుడు నువ్వు వహించే మౌనం మాత్రం నాకు నిగూఢంగా ఉన్నది. నన్ను మోస్తున్న నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతాను విను...’’

ఎన్ని భేతాళకథలు చదివినా ప్రారంభం ఇదే. కథ మొదలవ్వడంతోనే విక్రమార్కుడు భేతాళున్ని భుజాన వేసుకొని నడవటం తో ప్రారంభమౌతుంది. ఇంతకీ విక్రమార్కుడు ఎవరు? భేతాళుడికి అతనికి సంబంధం ఏంటి? అసలు విక్రమార్క-భేతాళకథలకు ప్రారంభం ఏంటి... మరుగున పడ్డ ఆ మూల కథ ఏంటి?

భేతాళ కథలఆధారంగా మూలాలను శోధిస్తే...
భేతాళకథలను రచించింది గుణాడ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయినీ రాజ్యంలో జరిగినట్టు గుణాడ్యుడి సంకలనం ప్రకారం తెలుస్తోంది. ఉజ్జయిని సామ్రాజ్య పాలకుడు విక్రమార్కుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకొని పరిపాలించేవాడు. తన పరిపాలనదక్షతతో కాళీమాతను ప్రసన్నం చేసుకొంటాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి వంటి భూపాలుడు చిరకాలం ధరిత్రిని పాలించాలని, వెయ్యి సంవత్సరాల పాటు పాలించే వరాన్ని అనుగ్రహిస్తుంది ఆమె.

విక్రమార్కుని మంత్రి భట్టి. ఇతడు విక్రమార్కుడి సోదరుడు కూడా. భట్టి తెలివితేటలతో రాజుగా విక్రముడి ఆయుష్షును రెండు వేల సంవత్సరాలకు పెంచుతాడు. భట్టి యుక్తితో విక్రమార్కుడు ఆరునెలలు రాజ్యపాలన, ఆరు నెలల దేశ సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేవాడు. ఇది విక్రమార్కుడి నేపథ్యం.
Like Reply


Messages In This Thread
RE: భర్తృహరి శృంగార శతకము - by rraji1 - 30-11-2019, 03:48 PM



Users browsing this thread: 1 Guest(s)