29-11-2019, 07:59 PM
Quote:27th November 2012
kings gambit
మన మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు గారికి చాలా భాషలు వొచ్చు అని అందరికీ తెలిసినదే..కానీ మల్లాదివారికి వొచ్చినన్ని భాషలు మరెవ్వరికీ వొచ్చి వుండవు.
ఒకసారి వారిని ఎవరో రావు గారూ మీకేన్ని భాషలు వొచ్చండీ అని అడిగితె..ఏమోరా నాకూ తెలియదు అని చేతిలో వున్నతాటాకు విసిని కర్ర ఒక్కొక్క ఆకుమీదా ఒక్కొక్క భాషలో సంతకాలు చేస్తూ పోయారు..చెప్పేదేమిటంటే విసిని కర్ర వెనక్కి కూడా తిప్పాల్సి వొచ్చింది..
నిజంగా మధురమైన శృంగారం కావాలంటే రావు గారి కధలు చదవండి..
27th November 2012
malathirasagna
ధర్మ పన్నం,కామందకి
అద్గదీ స౦గతి ! అ౦దుకే ఇలా౦టి కొత్త విషయాలు తెలుస్తాయనే ఈ చర్చ మొదలుపెట్టి౦ది. kings gambit గారూ మీకు రె౦డుసార్లు ధన్యవాదాలు .. ఎ౦దుక౦టే ఒకటి కొత్త విషయ౦ తెలిపిన౦దుకు... ఇ౦కొకటి మల్లాది వారి రె౦డు పుస్తకాలని పరిచయ౦ చేసిన౦దుకు.. అవి చదవాలి.. ఆన్ లైన్ లో ఏమైనా దొరుకుతాయా ? లేదా ఏ పబ్లికేషన్ లా౦టి వివరాలు ఇవ్వగలిగితే ఇ౦కోసారి కూడా ధన్యవాదాలు. నా అభిప్రాయ౦లోని చాలా విషయాలకు ఆధార౦ తాపీ ధర్మారావు గారి పుస్తకాలు. ఏ రాజన్నది ఒదిలేస్తే మిగతా విషయ౦ కరక్టేనా ... మీ అభిప్రాయ౦ కూడా తెలుపగలరు.