25-11-2019, 09:23 PM
ఇంతలో దీపావళి పండుగ వచ్చింది. రవి టపాసులు కావాలని రోజు గోల చేస్తున్నాడు. ఎలాగో బట్టలు కొనుక్కోవాలి కదా అని రాజమండ్రి వెళ్దామని అనుకున్నాను. తోడు కోసం రాజమ్మని అడిగితే చీటీ పాట ఉందని, వీరయ్య కూడా సామాన్లు కోసం వెళ్తున్నాడు , వాడితో వెళ్ళండి, జాగ్రత్తగా తీసుకొస్తాడు అని చెప్పింది. రవిని తను చూసుకుంటానని చెప్పింది. మధ్యాహ్నం మూడు గంటల బస్సుకి బయల్దేరాం. బస్సు రద్దీ గానే ఉంది. ఒక్క సీటు మాత్రం దొరికింది. వీరయ్య నన్ను కూర్చోమని చెప్పి తను నా ప్రక్కన నిలబడ్డాడు. ఇంతలో నా ప్రక్కన ఉన్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ స్టాప్ వచ్చిందని లేచారు.