22-11-2019, 10:46 AM
మీరా నా దగ్గిరిగా జరిగి, గొంతు తగ్గించి "దీదీ నిన్ను వొదిలి నిన్ను చూడక నేను బతకలేను, నిశ్చయం" అన్నాడు.
ఆ గొంతులోంచి నాకు వినపడ్డది ఆ సంగతి ఇన్ని రోజులు నా బాబు ఎంత బాధపడివుంటాడో! నాకోసం, నా క్షేమం కోసం, నా సౌఖ్యం కోసం. నా వేపు రాకుండా వుండాలనే నిశ్చయం నిలబెట్టుకోడానికై ఎంత ప్రయత్నించి వుంటాడో! దగ్గరికి జరిగి అతని తలని నా రోమ్ముకి అదుముకుని కూచున్నాను. అమీర్ చూస్తాడని భయపడే సమయం కాదు. నా పమిట మీరాకి వీవన వీస్తోంది. నా హృదయం అతనికి జోలపాట పాడుతోంది. నా పెదవులు అతని కన్నులకి శీతలాంజనం రాస్తున్నాయి. ఆనందంతో నేనూ కళ్ళు మూశాను.... "నిద్రవొస్తోంది. రా పడుకుందాం" అన్నాడు అమీర్. ఉలికిపడి కళ్ళు తెరిచాను. ఆ కంఠం వినేప్పటికి అంతసేపూ అమీర్ హృదయంలో యెంత యుద్ధం జరిగి వుండాలో గుర్తించాను. నా సాహసం, మీరాని అంత దగ్గిరగా, అతని యెదుటనే ముద్దు చెయ్యడం, దాని అర్థాన్ని గ్రహించడానికీ, పొంగే ఈర్ష్యని అణుచుకోవడానికీ అతను చేసిన ప్రబల ధైర్యంగాని, నిబ్బరంగాని నా దగ్గిర లేవు. నెమ్మదిగా మీరా తలని నా రొమ్ముమీద నించి దించి కటిక నేలని పెట్టిన కఠినాత్మురాలిని.