22-11-2019, 09:26 AM
. అన్నం తినక తిరిగాను. కాని ప్రేమ వున్నప్పుడు త్యాగం చెయ్యడం ఎంత సులభమనుకున్నావు? ఊరికే ఏ త్యాగానికైనా పతివ్రతల్ని పొగుడుతారుగాని ప్రతి నిమిషం సౌఖ్యాల్నీ, ఆనందాన్నీ అవసరంగానైనా సరే వొదిలేసుకుని ప్రేమబలం స్థిరపరచాలని వుంటుంది.
ఆయన్ని ప్రేమిస్తూ నేను ఆయన యింట్లో వున్నప్పుడు ఒకసారి ఇంగ్లండు వెళ్ళివచ్చిన ఆయన స్నేహితుణ్ణి తీసుకొచ్చి తనతో భోజనం వడ్డించమన్నారు. ససేమిరా వీల్లేదన్నాను. కారణం - మా పెత్తల్లి సూరమ్మగారికి నా మీద కోపం వస్తుంది. ఏమంటుంది? 'మొగవాడు అతడు అన్నీ నిర్లక్ష్యంగానే చెయ్యాలంటాడు. ఆడదానివి నీకు బుద్ధిలేక పోయిందా? అంటుంది. తోడికోడలు నన్ను వెలేస్తానని బెదిరిస్తుంది, నవ్వులాటకులాగు. పాపం ఆయన నన్ను బతిమాలారు. తన పరువు పోతుందని కన్నీళ్ళపర్యంతమైనారు. తనమీద ప్రేమలేదా. తన మాట వినకూడదా అని అడిగారు. రాయివలె స్థిరంగా నా పట్టుదల విడవలేదు నేను. ఇదీ మనం భర్తలకోసం చేసే త్యాగం. ఆధ్యాత్మిక ప్రేమ. పవిత్ర దాంపత్యానికి మన జీవితంమీద వుండే "ఇన్ల్ఫుయస్సు" కాని మామయ్య వొచ్చి, "చివరికి తురకకూడు తింటున్నావుటే!" అంటే నాకేమనిపించింది? ఏమన్నాను? ఇది తురక కూడా? ప్రేమ దేనికి నైవేద్యం పెట్టి భక్తితో కళ్ళుకద్దుకుని మధ్య మధ్య అమీర్ ముద్దులతో ఆరగించిన ఆ అమృతం తురక కూడా? ఏం తింటున్నామో, తింటున్నామో లేదో అనే ధ్యాస వుంటేనా?