22-11-2019, 09:25 AM
2
అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్థమయింది నాకు, ఆ స్థలంలో అద్వితీయానందాన్ని అనుభవించబోతున్నానని, చుట్టూ వున్న ఆకాశాన్నీ, కొండల్నీ, పక్కన చింత చెట్లనీ, మా చిన్న యిల్లునీ, ఆ గాలినీ, అమీర్నీ చూడగానే నా మనసెట్లా అయిందనుకున్నావు! చెప్పనా? చిన్నప్పుడు మన ముందు పది పిండి వంటలు పెడితే, యేది తినాలో తోచక, తినబోతున్నామని తెలిసికూడా అన్నీ ఒక్కమాటుగా యెట్లా తినాలా, ఇది తినేలోపల రెండోది రుచి చూడడం ఆలస్యమౌతుందే, అని ఎంత కష్టపడుతుంది మనసు? అట్లానే ముందే, తెలుసు, దినం తర్వాత దినం నాకు తీసుకురాగల వివిధ వర్ణ రాగసుందరానుభవాలు! కాని ఆగలేను. అన్నీ ఒక్కసారిగా, తొరగా యెప్పుడు నన్ను కావలించుకుంటాయా అని తహతహలాడిపోయినాను.