Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఋగ్వేద సంహిత
#13
    3. అధ్యాయం :- అధ్యాయం కొన్ని అనువాకములు గలదు. అధ్యాయాలుకాగానే అష్టకంతో ముగుస్తుంది.
 
    4. అనువాకం :- అనువాకం కొన్ని సూక్తాల మాలిక. అనువాకం అధ్యాయంతో ముగియాల్సిన అవసరంలేదు. అధ్యాయం తరువాత కూడా కొనసాగుతుంది. అధ్యాయానికీ, మండలానికి ముడిలేనట్లే అనువాకానికి అష్టకానికీ ముడిలేదు.
 
    అనువాకం మండలంతో మొదలవుతుంది. అనువాక సంఖ్య మండలంతో ముగుస్తుంది. ప్రతి మండలం ఒకటవ అనువాకంతో మొదలవుతుంది.
 
    5. సూక్తం :- సూక్తం కొన్ని మంత్రాల మాలిక. ఇందులో ఇన్ని మంత్రాలు ఉండాలనే నియమంలేదు. కొద్ది మంత్రాలవీ ఎక్కువ మంత్రాలవీ ఉంటాయి. ఇది అనువాకంవలె మండలంతో మొదలై మండలంతో ముగుస్తుంది.
 
    మంత్రంతో ప్రారంభిస్తే 1. కొన్ని మంత్రాల కలయిక ఒక సూక్తం 2. కొన్ని సూక్తాలు అనువాకం 3. కొన్ని అనువాకాలు అధ్యాయం 4. కొన్ని అధ్యాయాలు మండలం 5. ఎనిమిది అధ్యాయాలది అష్టకం అవుతుంది.
 
    ప్రతి సూక్తానికి 1. ఋషి 2. దేవత 3. ఛందస్సు 4. వినియోగం ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
 
    6. మంత్రం దీన్నే 'బుక్' అంటారు. ఇదే వేదానికి మూలం. మంత్ర సంఖ్య సూక్తంతో మొదలవుతుంది. సూక్తంతో ముగుస్తుంది. దీనికి సంఖ్యానియమం లేదు.
 
    ఇవికాక వర్గం అనే మరొక విభజన ఉంది. వర్గంలో నాలుగైదు ఒక్కొక్కసారి అంతకుమించి మంత్రాలు లేక ఋక్కులు ఉంటాయి. నేను వర్గం పాటించలేదు. చూపలేదు.
 
                                 ఋషి
 
    సూక్తం ఋషి - దేవత -ఛందస్సు వినియోగం సూచిస్తుందని చెప్పాం. క్రమంలో ఋషిని గురించి తెలిసికొందాం.
 
    ఋషిని సాయణుడు అతీంద్రియదర్శి అన్నాడు. మనకున్న చక్షురాదా ఇంద్రియాలకు అతీతంగా ఇతరులు చూడని దానిని దర్శించువాడని అర్థం.
 
    'నావృష్టిః కురుతే కావ్యం' అన్నదాన్ని ఆవిధంగా అర్థం చేసుకుంటే కవిలేక రచయిత దృగ్గోచరం కాని విషయాలను దర్శించువాడు కావాలని అర్థం.
 
    వేదం అపౌరుషేయం. అంటే మానవ ప్రోక్తం కాదు. ఋషులు వేదద్రష్టలు. స్మర్తలు. వారు అపౌరుషేయమైన వేదాన్ని దర్శించి మనకు అందించారు.
 
    వృష్టే శర్ధాయ సుమభాయ వేధసే నోధః సువృక్తిం ప్రభరామదుర్భ్యః"
 
    అని 1. మండలం 64 సూక్తపు తొలి మంత్రంలో 'నోధస్సు' అనే ఋషిని మరుత్తులను స్తుతించే మంత్రం వ్రాయమని కోరడం కనిపిస్తుంది.
 
    "యశోనపక్వం మధుగోషన్తరా భూతాంశో అశ్వినోః కామమప్రాః"
 
    అని భూతాంశుడను నేను స్తోత్రము రచించి అశ్వినుల మనోరథము పూరించానని 10 మండలం 9 అధ్యాయం 107 సూక్తపు 11 ఋక్కున చెప్పబడింది.
 
    ఇంకా చాలచోట్ల ఋషులు తామే సూక్తాలు రచించినట్లు చెప్పారు. కొన్నిచోట్ల సంపన్నులను నుతించి ధనం పొందినట్లు కూడా ఉంది.
 
    అంతమాత్రాన వేదం మానవప్రోక్తం అందామా ! కాదు అలా అనడానికి వీల్లేదు.
 
    సమస్త చరాచర సృష్టి ఈశ్వరీయం. ఇది సాంతం భగవంతుడు సృష్టించింది. ప్రకృతి సూత్రములు పరాత్పరుడు చేసినవి. మానవుడు పుట్టిననాటినుంచి నేటి వరకు ఇకముందు కూడా ప్రకృతి శాస్త్రాన్ని మార్చజాలడు. మనం ఈనాడు చూస్తున్న మహా మహా ఆవిష్కరణలన్నీ భగవంతుని శాసనానికి అనుగుణంగానే జరిగాయి జరుగుతాయి. మహామహా ఆవిష్కర్తల్లో ఎవరూ సృష్టించింది ఏమీలేదు. వారు ద్రష్టలు మాత్రమే. వారు దర్శించి మనకు అందించారు.
 
    అలాగే ఋషులు సహితం కర్తలుకారు. తాము ద్రష్టలం అని చెప్పుకున్నారు.
 
    ఎంతటి మహా సైంటిస్టైనా ఉన్నదానిని కనుగొనవలసిందే గడ్డిపరకను సృష్టించలేడు! కావున అందరూ ద్రష్టలే!! స్రష్టలు కాలేరు!!!
 
    ఒక్క పరాత్పరుడే సృష్టికర్త. అందువలన శ్రూయతే దృశ్యతేపివా వినిపించేది, కనిపించేదీ సకలం అపౌరుషీయమే! వేద ద్రష్టలను ఋషుల పేర్లు పురాణ ఋషుల పేర్లు కనిపించినా వీరు వారూ ఒకటికారు. నామ సారూప్యమే. వేదాలూ పురాణాలమధ్య కాలవ్యత్యాసం చాలా ఉంది. అందువలన పేరు ఒకటైనంత మాత్రాన ఋషి ఒకడే అనుకోవడానికి వీల్లేదు.
 
    వేద విశ్వామిత్రునికీ - రామాయణ విశ్వామిత్రునికీ - పురాణ విశ్వామిత్రునికీ పేరులో తప్ప సామ్యం కనిపించదు.
 
    ఋగ్వేదంలోని ఋషులకు కోప, తాప, శాపాలు కనిపించవు. పురాణ ఋషులకు మూడూ ఉంటాయి. అసలు కోపమే ప్రధానంగా గల పురాణ ఋషులున్నారు.
 
    వేద, పురాణ ఋషులకు నామసామ్యం తప్ప మరేదీలేదు. వేద ఋషులను పురాణ ఋషులని భ్రమించరాదు.  
 
Like Reply


Messages In This Thread
ఋగ్వేద సంహిత - by sweet1guy - 19-11-2019, 09:12 PM
RE: ఋగ్వేద సంహిత - by sweet1guy - 21-11-2019, 05:47 PM



Users browsing this thread: 2 Guest(s)