Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భర్తృహరి శృంగార శతకము
#10
చంద్రవర్ణుడి వివాహం!– 08

తొమ్మిదో రోజున చంద్రవర్ణుడికి స్పృహ వచ్చింది. ఆ సమయానికి అలంకార వల్లి ఆ గదిలో లేదు. చంద్రవర్ణుడు చుట్టూ పరికించి చూశాడు. గది అలంకారాన్ని, పరిసరాలనీ చూసే సరికి, అతడికి ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదనీ, వేశ్యాంగన ఇల్లనీ అర్ధమైంది. తన ఆకుల మూటను తీసుకుని, ఆ ఇంటి నుండి బయట పడాలని, చప్పుడు చెయ్యకుండా బయలు దేరాడు.

ఇంతలో అలంకార వల్లి చూడనే చూసింది. చప్పున అతడి చేయి పట్టుకుని ఆపింది. "ఓ యీ బ్రాహ్మణ యువకుడా? నేను నీకు పరిచర్యలు చేశాను. నీకు స్పృహ లేని ఇన్నిరోజులూ కంటికి రెప్పవలె నిన్ను కాపాడాను. ఈ ఎనిమిది రోజులుగా నేనే స్వయంగా నిద్రాహారాలు మాని, నీకు సేవలు చేశాను. స్పృహ లేని నీకు వైద్యం చేయించాను. నీ ప్రాణాలు కాపాడాను. ఆ విధంగా చెప్పాలంటే నేను నీ ప్రాణదాతను. అటువంటిది, కనీసం ఒక్కమాటయినా మాట్లాడకుండా, అధమపక్షం కృతజ్ఞత అయినా చెప్పకుండా నా ఇల్లు విడిచి పోతున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నిన్ను నేను ఎట్టిపరిస్థితులలోనూ వెళ్ళ నివ్వను" అంటూ అడ్డం పడింది.

చంద్రవర్ణుడు బిత్తరపోయాడు. ఉత్తర క్షణం తేరుకుని "నర్తకీమణీ! నన్ను కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి. కానీ నన్ను వెళ్ళనీయక ఎందుకు అభ్యంతర పెడుతున్నావు?" అన్నాడు. ఒక్కక్షణం అలంకార వల్లి మౌనంగా తలవంచుకుంది. వెంటనే "ఓ బ్రాహ్మణ సుందరుడా! నేను నీయందు ప్రేమ కలిగి ఉన్నాను. నిన్ను పెండ్లియాడ గోరుతున్నాను. నీ ప్రాణములను కాపాడిన నా పైన కోపగించక, నా కోరికని మన్నింపుము" అన్నది.

చంద్రవర్ణుడిది విని హతాశుడైనాడు. అలంకార వల్లి అతడి ఎదుట నిలబడి ఆర్తితో చూస్తూ ఉన్నది. నిజానికి ఆమె అందగత్తె! మెరుపు తీగకు మాటలోచ్చినట్లు ఎదురుగా నిలబడి ఉంది. చంద్రవర్ణుడు మార్దవంగా "నర్తకీమణి! నేను బ్రాహ్మణుడను. మన వివాహము పొసగదు. దయ యుంచి నన్ను వెళ్ళనివ్వు" అన్నాడు.

అలంకార వల్లి అందుకు అంగీకరించలేదు. క్రమంగా వారి మధ్య వాదులాట రేగింది. చంద్రవర్ణుడు ఆమెని దాటుకుని వీధిలోకి వచ్చాడు. అలంకార వల్లి విడిచి పెట్టలేదు. వీధిలో జరిగే ఈ జగడాన్ని చూడటానికి చుట్టూ జనం మూగారు. చారుల వలన ఈ వార్త రాజుకు చేరింది. కన్యాపురానికి రాజు శుద్దవర్మ[అతడి పేరుకు అర్దం శుద్దుడు అని, అంటే Mr.Clean అన్నమాట.] అతడు రాజ భటులని పిలిచి వాళ్ళని సభకి తీసుకురమ్మన్నాడు. భటులు అలంకార వల్లినీ, చంద్రవర్ణుడినీ రాజసభకు తీసుకువెళ్ళారు.

రాజు చంద్రవర్ణుని చూసినంతనే ముచ్చట పడ్డాడు. ‘ఏమి ముఖవర్చస్సు! ఈతడు బాల బృహస్పతి వలె నున్నాడు’ అనుకున్నాడు. పైకి "ఎందుకు మీరు వీధినబడి అనాగరికుల వలె జగడము లాడు చున్నారు?" అని ప్రశ్నించాడు. చంద్రవర్ణుడు "మహారాజా! క్షమించాలి. నేను బ్రాహ్మణుడను. కొన్ని దినముల క్రిందట నేను, ఈ యువతి ఇంటి ఆరుగుపైన నిద్రించితిని. అది బ్రాహ్మణుల ఇల్లై ఉండవచ్చని తలచితిని. అది ఈ వెలయాలి ఇల్లని తెలియనైతిని. నా అలసట కారణంగా నేనే విషయము ఎరుగనైతిని.

ఇప్పుడీమె, నాకు స్పృహ లేనన్ని దినములూ నాకు వైద్యము చేయించినదనీ, నాకు స్వయముగా సపర్యలు చేసినదనీ, నా ప్రాణములు నిలిపిదనీ చెప్పుచున్నది. ప్రత్యుపకారముగా ఆమెను వివాహ మాడవలెనని నన్ను బలవంత పెట్టుచున్నది" అన్నాడు. అతడి దంతా చెబుతున్నంత సేపూ, రాజు శుద్దవర్మ అతడి వైపే చూస్తున్నాడు. మనస్సులో ‘ఇతడి ముఖవర్చసు చూడగా బ్రహ్మజ్ఞానిలా కనబడుతున్నాడు. అందం, విద్వత్తూ ఇతడిలో పోటీ పడుతున్నవి. సుగుణ శీలియైన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖ నిచ్చి వివాహము చేసిన బాగుండును కదా?’ అని ఆలోచించినాడు.
[చిత్ర రేఖ అంటే చిత్రమైన రేఖ అని అర్ధం. ]

అతడిలా ఆలోచిస్తున్నప్పుడే, సభలోని మంత్రి, రాజ పురోహితుడూ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించారు. రాజు శుద్దవర్మ సభలోని శాస్త్రపురోహితులని, పెద్దలని... అలంకార వల్లి, చంద్రవర్ణుల తగువుని తీర్చమని అడిగాడు.

పండితులు "మహారాజా! అలంకార వల్లి వాదనలోనూ న్యాయముంది. ఆమె సమయానికి ఆదుకోకపోయి ఉంటే, చంద్రవర్ణుడు జీవించి ఉండేవాడు కాదు. చంద్రవర్ణుడి వాదనలోనూ న్యాయమున్నది. బ్రాహ్మణుడైన అతడు, వేశ్యాంగన అయిన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు. అలంకార వల్లి పుట్టుకే, చంద్రవర్ణుడి అభ్యంతరమైతే ఇందుకొక తరుణోపాయముంది.

ఒక బ్రాహ్మణుడు ఇతర వర్గమునకు చెందిన స్త్రీని వివాహమాడదలిచిన ఒక మార్గమున్నది. అతడు అదే ముహుర్తమున ఒక బ్రాహ్మణ యువతినీ, క్షత్రియ యువతినీ, వైశ్య యువతినీ, శూద్ర యువతినీ వివాహ మాడవలెను.

అలాగ్గాక, బ్రాహ్మణుడు ఒక్క యువతనే వివాహమాడదలిచిన, ఆ యువతి బ్రాహ్మణ యువతియే అయి ఉండవలెను" అని తేల్చి చెప్పారు. రాజు శుద్దవర్మ "చంద్రవర్ణుని చూడ నాకు ముచ్చట కలిగినది. అతడి అందచందాలకు, గుణశీలాలకూ మెచ్చితిని. అందుచేత నా ఒక్కగానొక్క పుత్రికయైన చిత్రరేఖను, ఇతడికిచ్చి వివాహము చేయ సంకల్పించితిని" అన్నాడు, సాభిప్రాయంగా చంద్రవర్ణుడి వైపు చూస్తూ!

వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి "మహారాజా! నేనూ అట్టి ఆలోచననే చేసి ఉన్నాను. నేను వైశ్యుడను. నా పుత్రిక కోమాలాంగిని ఇతడి కిచ్చి వివాహము చేసేదను" అన్నాడు. [కోమలాంగి అంటే సుకుమారమైన దేహము కలది అని అర్ధం.]

అంతలో రాజపురోహితుడు లేచి "ప్రభూ! నేనూ నా కుమార్తె కళ్యాణిని ఇతడి కిచ్చి వివాహము చేయగలవాడను" అన్నాడు.

చంద్రవర్ణుడిందుకు సమ్మతించాడు. వధువుల సమ్మతి బడసి అందరూ సంతోషించారు. ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.
Like Reply


Messages In This Thread
RE: భట్టి విక్రమాదిత్యుల కథలు - by rraji1 - 21-11-2019, 04:32 PM



Users browsing this thread: 2 Guest(s)