21-11-2019, 10:05 AM
రెండు మూడురోజులు గుమ్మంలో తను వొచ్చినప్పుడు లేకపోతే, నా కోసం తన చూపుని అక్కడ వొదిలి వెళ్ళాడా అనిపించేది నాకు. నేను తనవంక చాలా యిష్టంగా చూసే దాన్నని అమీర్ తరవాత అన్నాడు. నా మనసులో మాత్రం అతన్ని యెదురు చూడడం అతని తీవ్ర కాంక్షకి నేను కావలసిందాన్ననే భావంతో గొప్ప సంతోషంతో నిండిపోవడం అలవాటైనాయి.
ఆ వేళ మధ్యాహ్నం రెండింటికి వాకిట్లో నుంచుని ఉన్నాను. ఎండతో ఆకాశం నుండి నేలవరకు లోకం నిండి వుంది. ఆ దాహం కొన్న యెండే వెన్నెలైనట్లు ఆ రోడ్లలో ఉద్యానవన విహారానికై వొచ్చినవాడివలె నడుస్తున్నాడు. ఎక్కడకెక్కడ నా వస్త్రాల్లోంచి నా శరీరం కనబడుతుందో అన్నట్లు వెతికి, వొళ్ళంతా సిగ్గుపరిచాయి అతని చూపులు. నిర్మానుష్యమైన ఆ రోడ్డుమీద నాకెదురుగా ఒక్క నిమిషం ఆగి ఇంట్లోకి పనిమీద వెళ్ళే యజమానివలె నడిచి వొచ్చాడు గుమ్మంవేపు. నేను ఇంట్లోకి వెళ్ళి ఆఫీసు గది గుమ్మంలో నుంచుని 'లే'రన్నాను. కాని అతను నేనేమంటున్నానో వినదలచుకోలేనట్టు తోచింది. నాతో గానీ, నా మాటలతో కానీ తనకి పనిలేనట్టే ఆ ఇంటికీ, తన హృదయానికీ తను అధిపతినని తెలిసినట్లే వొచ్చేశాడు. నేను లోపలికి వెళ్ళి తలుపు పక్కకి తప్పుకుంటూ ఉండగానే వొచ్చి నా చుట్టూ చేతులు పోనిచ్చి అదుముకున్నాడు.