19-11-2019, 08:39 PM
కళావతి : నువ్వు నీ అన్నగారి దగ్గరకు వెళ్తావని నాకు ఎలా తెలుస్తుంది కుమారా…అయినా ఆ లేఖలో నీ రాజముద్ర లేదు….దానికి తోడు ఆ లేఖ తెచ్చిన దూత కూడా వీరసింహుడి దూత….దానితో నేను ఆ లేఖ వీరసింహుడి వద్ద నుండి వచ్చింది అనుకున్నాను….
ఆదిత్యసింహుడు : అక్కడే తప్పిదం జరిగిందమ్మా….నేను నా రాజముద్ర వేసాను అనుకుని విరించి చూసుకోకుండా ఆ లేఖను మీకు పంపించాడు…..
రత్నసింహుడు : మరి ఇప్పుడు ఏం చేద్దాం కుమారా…మన ఆచారం ప్రభావతికి వీరసింహుడి రాజఖడ్గంతో శాస్త్రోక్తకంగా వివాహం జరిగిపోయింది…
కళావతి : ఇంకొక్క సందేహం కుమారా…..
ఆదిత్యసింహుడు : ఏంటమ్మా అది….
కళావతి : మరి నిన్ను ఇష్టపడిన ప్రభావతి వీరసింహుడితో వివాహానికి ఎలా ఒప్పుకున్నది….
ఆదిత్యసింహుడు : అదేనమ్మా నాకూ అర్ధం కావడం లేదు….అది తెలుసుకుందామనే నేను ప్రభావతిని కలవాలనుకుంటున్నాను…..
కళావతి : సరె….నువ్వు కంగారు పడకు….నేను ప్రభావతిని ఇక్కడకు రమ్మని కబురు పంపుతాను…ఆమె ఇక్కడకు వచ్చిన తరువాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాము….కాని…..
ఆదిత్యసింహుడు : మరలా ఏంటమ్మా…..
కళావతి : ఏది ఏమైనా ప్రభావతికి మీ అన్నగారు వీరసింహుడితో వివాహం జరిగిపోయింది….కాబట్టి నువ్వు ఆమెను వదిన స్థానంలోనే చూడాలి…..
అదిత్యసింహుడు : అమ్మా….అదీ…..
కళావతి : ఇక చర్చించేందుకు ఏం లేదు కుమారా…వివాహం అయిపోయింది…దాన్ని మనం ఏమీ చేయలేం… ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలు అన్నీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడమే…..
ఆదిత్యసింహుడు : మీరు అలా సమస్యకు పరిష్కారం ఇదే అని చెప్పినప్పుడు ఇక విచారణ ఎందుకు మాతా….
కళావతి : విచారణ అవసరమే కుమారా….ఇప్పుడు మన దృష్టిలో ప్రభావతి తనకు నీతో వివాహం అయినట్టుగా భావిస్తున్నదని నాకు అనిపిస్తున్నది….కాబట్టి ఆమె అభిప్రాయం తెలుసుకున్న తరువాత ప్రభావతికి తన వివాహం జరిగింది నీతో కాదు….నీ అన్న వీరసింహుడితో అని సర్ది చెప్పాలి….ఈ సమస్యను కామపుర రాజ్యంలోనే పరిష్కరించుకుని వెళితే తరువాత అక్కడ మీ అన్నగారితో ఏ సమస్యలు ఉత్పన్నం కావు…..
ఆమె అలా చెప్పడంతో ఆదిత్యసింహుడు కూడా సమస్య సున్నితత్వం తెలియడంతో మాట్లాడలేకపోయాడు.
కళావతి : మీ ఇద్దరి విషయం ప్రభావతి తండ్రి యశోవర్ధనుడికి తెలుసా….
ఆదిత్యసింహుడు : లేదమ్మా…నేను కేవలం అతిధిగా మాత్రమే పరిచయం ఉన్నది…మీ ద్వారా సంబంధం మాట్లాడించాలి అన్న ఉద్దేశ్యంతో మా ఇద్దరి విషయం ఆయనకు చెప్పలేదు…..
కళావతి : ఇది కొంచెం మనకు అనుకూలంగా ఉన్నది….ఈ విషయం ఆయనకు తెలియనివ్వకు….(అంటూ రమణయ్య వైపు చూసి) రమణయ్యా…నువ్వు వెళ్ళి యశోవర్ధన మహారాజు గారితో మేము ఆయన పుత్రిక…మా నూతల కోడలు ప్రభావతిని మా మందిరంలో కలుసుకోవాలనుకుంటున్నామని వర్తమానం అందచేసి….ప్రభావతిని వీలైనంత తొందరగా మా సమక్షానికి వచ్చేలా కబురు పంపు…..
దాంతో రమణయ్య అలాగే అని తల ఊపుతూ మహారాణీ కళావతికి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఇక ఆ మందిరంలో వాళ్ళ ముగ్గురూ మిగిలిపోవడంతో ఎవరికీ ఏం మాట్లాడాలో తెలియక మెదలకుండా ఆసనాల్లో కూర్చుండిపోయారు.
కొద్దిసేపటికి రాకుమారి ప్రభావతి వస్తున్నట్టు సమాచారం అందడంతో కళావతి అప్రమత్తమయింది.
కళావతి : (ఆదిత్యసింహుడి వైపు చూసి) కుమారా….నువ్వు మెదలకుండా ఉండు…
ఆదిత్యసింహుడు అలాగే అన్నట్టు తల ఊపాడు.
అంతలో ప్రభావతి మందిరం లోకి వచ్చి కళావతికి, రత్నసింహుడి పాదాలకు అభివాదం చేసి నిల్చున్నది.
పక్కనే ఆదిత్యసింహుడు కూడా ఉండే సరికి ప్రభావతి మొహం ఆనందంతో వికసించింది.
అదిత్యసింహుడిని చూసిన తరువాత ప్రభావతి వదనంలో తాండవిస్తున్న సంతోషాన్ని చూసి మహారాణీ కళావతికి తన కుమారుడు చెప్పింది సత్యమేనన్న నిర్ధారణకు వచ్చింది.
రత్నసింహుడికి కూడా పరిస్థితి అర్ధమై తన భార్య కళావతి వైపు ఏం చేద్దాం అన్నట్టుగా చూసాడు.
కళావతి తన తొందరపాటుకు చింతిస్తూనే తన భర్త వైపు ఆందోళనగా చూసింది.
ఇంతలో ప్రభావతి ఆనందంతో ఆదిత్యసింహుడి దగ్గరకు వెళ్లబోయింది.
ఆ విషయాన్ని పసికట్టిన మహారాణీ కళావతి వెంటనే అప్రమత్తమై, “ప్రభావతీ….ఆగు,” అన్నది.
దాంతో ప్రభావతి ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై ఆమె ఎందుకు ఆగమన్నదో అర్ధం కాక కళావతి వైపు చూసింది.
కళావతి : ప్రభావతీ….నీ వివాహం మా ఆచారం ప్రకారం రాజఖడ్గంతో జరిగింది….అది ఎవరి రాజఖడ్గమో నీకు తెలుసా…
ప్రభావతి : ఇందులో సందేహమేమున్నది అత్తగారూ….అది ఆదిత్యసింహుడిదే కదా…..
ప్రభావతి అలా అనగానే కళావతికి ఒక్క క్షణం ఏం చేయాలో తెలియలేదు.
ఆదిత్యసింహుడు కోపంతో ఎందుకున్నాడో….మహారాణి కళావతి తనను తన భర్త దగ్గరకు వెళ్ళకుండా ఎందుకు ఆపుతున్నదో అర్ధంకాక…అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రభావతికి అయోమయంగా ఉన్నది.
కళావతి : ప్రభావతి…నేను నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం…అది నీ జీవితానికి సంబంధినది చెబుతున్నాను …జాగ్రత్తగా విను….
ప్రభావతి : చెప్పండి అత్తగారూ….
కళావతి : (ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని ఒక్కసారి ఆదిత్యసింహుడి వైపు….ప్రభావతి వైపు చూసి) నీకు వివాహం జరిగింది ఆదిత్యసింహుడితో కాదు….నా రెండవ పుత్రుడు వీరసింహుడితో…..