Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అంతలో చక్రవర్తి రత్నసింహుడు కూడా ఆదిత్యసింహుడు వచ్చాడన్న ఆనందంతో అతన్ని కలవడానికి అక్కడకు వచ్చాడు.

కాని ఆ మందిరంలో వాతావరణం చాలా గంభీరంగా ఉండటం చూసి ఆయనకు కూడా ఏదో జరిగింది అన్న విషయం అర్ధమయ్యి మెదలకుండా వింటున్నాడు.
మహారాణీ కళావతీ అంత గట్టిగా అడిగేసరికి అప్పటిదాకా తల వంచుకుని నిలబడ్డ రమణయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తల ఎత్తి ఆమె వైపు చూస్తూ, “మహారాణీ గారూ….అదీ….” అంటూ చెప్పబోయాడు.
కాని అప్పటికే ఆదిత్యసింహుడి మనసు కకావికలమై పోయి ఉండటంతో ఆలోచనా జ్ఞానం మందగించింది.

[Image: baahubali-2_650x400_81493383904.jpg]

ఆదిత్యసింహుడు వెంటనే, “మీరు ఆగండి రమణయ్య గారు….” అంటూ అతన్ని ఆపి తన తల్లి కళావతి వైపు చూసి, “అమ్మా….నేను ఒక్కసారి ప్రభావతిని కలవాలనుకుంటున్నా,” అన్నాడు.
తన అన్న భార్యని వదిన గారు అని పిలవకుండా పేరు పెట్టి పిలిచేసరికి కళావతికి ఆదిత్యసింహుడి మీద విపరీతమైన కోపం వచ్చింది.
కళావతి : ఆదిత్యా….నువ్వు హద్దులు మీరుతున్నావు….మీ అన్న భార్యని పేరు పెట్టి పిలిచేంత సాహసం చేస్తావా….(అంటూ ఆదిత్యసింహుడి వైపు కోపంగా చూసింది.)
ఆదిత్యసింహుడు : ఇప్పుడు నేను రాచమర్యాదలు పాటించే పరిస్థితిలో లేను మాతా….ముందు నేను అత్యవసరంగా ప్రభావతిని కలవాలి అంతే….
కళావతి : నేను అనుమతించను కుమారా…నీ ఆవేశం చూస్తుంటే ఏదో అనర్ధం జరిగిందని అవగతమవుతున్నది….అది ఏంటో తెలియకుండా…ప్రభావతిని కలవడానికి అనుమతించను….(అంటూ తనను తాను సంభాళించుకుంటూ ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి అనునయంగా నిమురుతూ) అసలు ఏం జరిగింది చెప్పు కుమారా…నిన్ను ఇప్పుడు ఇంత క్రోధావస్తలో చూడలేదు…ఇంత విచిలితుడవైతున్నావెందుకు….(అంటూ అతని పక్కన కూర్చుని ఆదిత్యసింహుడి తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ) చెప్పు తండ్రీ…ఏమయింది…ఈ అమ్మకు చెప్పవా…..

[Image: images?q=tbn%3AANd9GcQlgIQj39zjpR8ob9_ao...OmSNYbPRB1]

కళావతి అంత ప్రేమగా అడిగేసరికి ఆదిత్యసింహుడు ఇక ఆగలేక ఆమె భుజ మీద తల పెట్టి కళ్ళు మూసుకున్నాడు.
ఆదిత్యసింహుడి కళ్ళల్లో నుండి నీరు కారి ఆమె రవికను తడపడంతో కళావతి ఇంకా కంగారు పడిపోయింది.
ఆదిత్యసింహుడిని అలా చూసిన రత్నసింహుడు కూడా కంగారుగా అతని దగ్గరకు వచ్చి ఇంకో వైపు కూర్చుని, “కుమారా….ఏంటి…ఏమయింది….జరిగింది చెబితే సమస్య నివారణా చర్యలు తీసుకుందాం,” అన్నాడు.
ఆదిత్యసింహుడు : అంతా అయిపోయిన తరువాత ఇక సమస్య నివారణ ఏం చేయమంటారు నాన్నగారూ….
రత్నసింహుడు : అసలు ఏం జరిగిందో వివరంగా చెబితే కదా మాకూ బోధపడేది…..
ఆదిత్యసింహుడు తన వదిన ప్రభావతిని పేరు పెట్టి పిలవడం….తనకు వచ్చిన లేఖలో రాజముద్ర లేకపోవడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుండటంతో కళావతికి విషయం దాదాపుగా అర్ధం అయింది.
కాని ఆ లేఖకు, ప్రభావతికి, ఆదిత్యసింహుడికి ఉన్న సంబంధం ఏంటో అర్ధం కాక కళావతి ఇక చివరి అస్త్రంగా, “కుమారా….ప్రభావతితో నీకు ఇంతకు ముందే పరిచయం ఉన్నదా,” అనడిగింది.
కళావతి అలా అనగానే ఆదిత్యసింహుడి ఆశ్చర్యంతో ఆమె కళ్ళల్లోకి చూసాడు.
రత్నసింహుడు : కళా….ఏం మాట్లాడుతున్నావు….మన కొత్త కోడలు ప్రభావతి మన ఆదిత్యసింహుడికి తెలియడం ఏంటి….నాకు ఏమీ అవగతం కావడం లేదు…..
కళావతి : మహారాజా…మీరు ఆగండి…నేను విచారిస్తున్నాను కదా…..(అంటూ చుట్టూ చూసింది.)
అక్కడ పనిచేసే దాసీలు, అంతఃపుర పరివారం మొత్తం నిల్చుని ఏం జరుగుతందా అని ఆసక్తిగా చూస్తున్నారు.
కుటుంబ సమస్య బయటకు పొక్కడం ఇష్టం లేక కళావతి వాళ్ళందరి వైపు చూస్తూ, “ఏకాంతం…..” అంటూ గట్టిగా అన్నది.

[Image: 1493279383-1898.jpg]

దాంతో అక్కడ పని చేస్తున్న పరివారం అంతా ఒక్కక్కరుగా ఆమెకు నమస్కరించి ఆ మందిరం నుండి వెళ్ళిపోయారు.
రత్నసింహుడు కూడా ఇప్పుడు వచ్చిన సమస్య చాలా గంభీరమైనదని అర్ధమయ్యి మెదలకుండా ఉండిపోయాడు.
రమణయ్య కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుండటం చూసి కళావతి, “రమణయ్యా….నువ్వు ఎక్కడకు వెళ్తున్నావు… నువ్వు ఇక్కడే ఉండు….ఈ సమస్య ఏంటో ఆదిత్యసింహుడి తరువాత నీకే పూర్తిగా తెలుసు…” అన్నది.
దాంతో రమణయ్య కూడా అక్కడే ఉండిపోయాడు.
అందరూ పూర్తిగా వెళ్ళిపోయిన తరువాత రమణయ్య ఆ మందిరం ద్వారాలు మూసేసాడు.
కళావతి మెల్లగా ఆదిత్యసింహుడి తలను నిమురుతూ, “ఇప్పుడు చెప్పు కుమారా…ఏం జరిగింది…వివరంగా చెప్పు,” అన్నది.
ఇక ఆదిత్యసింహుడు తను రాజ్య పర్యటనకు వచ్చిన తరువాత ప్రభావతితో తనకు జరిగిన పరిచయాన్ని, పెళ్ళి చేసుకుందామన్న విషయాన్ని మొత్తం కళావతికి చెప్పాడు.
మొత్తం జరిగింది చెప్పాడు….కాని తాను, ప్రభావతి ఏకశయ్యాగతులు అయినట్టు మాత్రం కళావతికి తెలుపలేదు.
దాంతో కళావతికి మొత్తం విషయం అర్ధమయింది.
కాని ఆమె తనకు వచ్చిన లేఖ విషయం మాత్రం అర్ధం కాలేదు.
కళావతి : మరి కుమారా….నీవు, ప్రభావతి వివాహం చేసుకుందామనుకున్నప్పుడు ఆ లేక నా దగ్గరకు వీరసింహుడి దగ్గర నుండి ఎలా వచ్చింది….
ఆదిత్యసింహుడు : నేను కామపురరాజ్యం నుండి అన్నగారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మీకు విషయం తెలియచేయాలని నేనే లేఖ పంపించాను…
కళావతి : కుమారా….ఎంత పని జరిగింది…..
ఆదిత్యసింహుడు : ఆ లేఖ పంపించింది ఎవరో కూడా తెలుసుకోకుండా అలా వివాహం చేసెయ్యడమేనా అమ్మా…..

[Image: dc-Cover-5ifp3jval40d3uolmdphav1fu4-2017....Medi.jpeg]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE ,.,. GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 5 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 19-11-2019, 08:27 PM



Users browsing this thread: 5 Guest(s)