17-11-2019, 11:07 AM
** పదహారేళ్ల రజని ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో తరచూ చాటింగ్ చేసేది. ఒక ఫ్రెండ్ ఆమె అందచందాల్ని తెగ పొగిడేవాడు.
ఆ అమ్మాయి మురిసిపోయేది. రకరకాల డ్రెస్సుల్లో ఫొటోలు దిగి పంపమంటే అలాగే పంపించేది. కొన్నాళ్ల తర్వాత అతడు ఆ ఫొటోలను బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బు పంపాలని డిమాండ్ చేయడం మొదలెట్టాడు. ముక్కూమొహం తెలియని వారికి ఫొటోల్ని పంపడం తప్పే కదా.
... ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన కేసులే. సైబర్ క్రైమ్ ఇప్పుడొక వృత్తిగా మారిపోయింది. కష్టపడకుండా డబ్బు సంపాదించడానికీ అమ్మాయిలను లోబరుచుకోవడానికీ దీన్నో మాధ్యమంగా ఎంచుకుంటున్నారు. సాంకేతికంగా నైపుణ్యం ఉన్నవాళ్లు హ్యాకింగ్‌కి పాల్పడి బ్యాంకులూ వ్యాపారసంస్థలను మోసం చేస్తోంటే అంత నైపుణ్యం లేకుండానే చౌకబారు పనులతో అమాయకులైన మహిళల్నీ ఆడపిల్లల్నీ లక్ష్యం చేసుకుని డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. కంపెనీలు సైబర్ దాడుల్ని ఎదుర్కోడానికి తమ జాగ్రత్తలో తాముంటాయి. వ్యక్తులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి.