16-11-2019, 10:34 PM
(16-11-2019, 09:08 PM)Vikatakavi02 Wrote: కథలు మధ్యలో ఎందుకు ఆపేస్తారంటే... శీర్షిక చాలా బాగుంది సార్.
కథని వ్రాయడం నిజంగా ఒక రచయిత/త్రికి 'తుత్తి' అని నేనూ నమ్ముతాను. అది ఎవరినో ప్రత్యేకంగా ఉద్ధరించడానికి కాదు, మనః ఇచ్ఛలను సంతృప్తి పరచుకోవడానికే... పాఠకుల స్పందన కేవలం బయటనుంచి వచ్చే ప్రేరణ మాత్రమే!
ఉదా- ఒక కోడి గ్రుడ్డుకి బయట నించి వచ్చే పీడన/ప్రేరణ కాదు అంతఃప్రేరణ ప్రాణం పోస్తుంది. అదే మాదిరి వ్రాయాలనుకునేవాడు తనకుతానుగా పొందే ప్రేరణ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. పాఠకుల నుంచి వచ్చే ప్రేరణ కొన్నిసార్లు పీడనగా మారి వ్రాసేవారికి కథని కొనసాగించాలని అనిపించదు. మరికొన్నిసార్లు స్వతహాగా రచయితకి/త్రికి వ్రాయాలని లేకపోయినా సదరు పాఠకుల స్పందన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో పాఠకులు గ్రుడ్డుని పొదిగే తల్లి పక్షిలా కనిపిస్తారు.
వహ్... వాటే 'గుడ్డు' ఫిలాసఫీ!
సెహభాష్ వికటకవి (నా భుజం నేనే కొట్టుకుంటున్నాను);)
ఇక నా కథల విషయానికొస్తే, ఇంతకుముందు కన్నా నేను బిజీగా ఉండటం వలన కొనసాగించలేకపోతున్నాను. పైగా (గర్ల్స్ హైకాలేజ్)కథలో ఇంకాస్త భావుకతని జోడించే ప్రయత్నం చెయ్యడం, వాటిపై నాకు లేశమంతమైనా అనుభవం లేకపోవడం కారణాలు కావచ్చును. ఏదో ఒకటి గబగబా వ్రాసేసి జనాలమీదకి వదలాలన్నా ముందుగా నాలోని పాఠకుడు ఒప్పుకోవాలిగా! గతంలో ఓసారి ఇలాగే కొందరు పాఠకులపై కోపంతో అప్డేట్ సరిగ్గా వ్రాయకుండా ఎలా ఉంటే అలా పోస్టు చేసేశాను. కానీ, అలా చెయ్యడం వల్ల చెడింది నా కథే! అందుకే, ఇప్పుడు (అతిగా)జాగ్రత్త పడుతున్నాను!
ఎంతైనా 'అతి'గాన్ని కదా!
నేను వ్రాసేవన్నీ అనువాద కథలేఁ....! స్వంతంగా ఆలోచించి వ్రాసేంత ఊహాశక్తి నాకులేదనే నా ప్రగాఢ విశ్వాసం. అందుకే, ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చెయ్యలేదు. నేను వ్రాస్తున్న కథల్లో అక్కడక్కడా స్వంతంగా కొన్ని ఎపిసోడ్లను అప్పుడప్పుడు వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను గానీ, ఒక పూర్తి కథను స్వంత ఊహతో వ్రాయలేదింతవరకు. నేను వ్రాస్తున్న మరికొన్ని చిన్న కథలలో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాను.
అందుకే, నేను వ్రాసే దేనికీ క్రెడిట్ తీసుకోను. కావాలంటే చేసే తప్పులకు బాధ్యత తీసుకుంటాను.
అంతే!
FULLY AGREEING WITH YOU.