15-11-2019, 09:13 PM
చీకట్లో వదిలిన బాణం బాగానే తగిలింది…
పాపా మురిసిపోతూ… ” నువ్వు బాగా మాట్లాడుతావ్… రాం..”
” అవునా… ఇంకా”
” బాగుంటావ్… మళ్ళినేమో నువ్ ఆ రేణుక తో ఎక్కువ గా ఉంటావు…. అది అంత గుడ్ కాదు అంట…. సీనియర్లు చెప్పారు…”
” హా ఆమె మా ఫామిలీ ఫ్రెండ్స్ లే…. అయిన మంచిదే కదా తను…. బాగా ఫ్రెండ్లీ గా వుంటుంది… ఏంటి ప్రాబ్లెమ్..”
” హ్మ్మ్….ఏమో రాం…. తన గురించి అంత బాడ్ గా మాట్లాడుతారు… నువ్ ఆమెతో ఎక్కువ ఉండేసరికి….. నీగురుంచి మన క్లాస్ లో ఎక్కువగా చిట్చాట్ నడుస్తోంది..”
” నిజంగా, ఏం మాట్లాడుతారు…”
” హ్మ్మ్… అందరూ….. మొదట నీ అందం అండ్ హెయిట్ గురించే మాట్లాడుతూ ఉంటారు… కానీ రేణుకా గురించి తెల్సినవాళ్ళు.. నువ్వు… రేణుక… అదేదో….”
అంటూ ఆగిపోయింది.
నాకు ఆమె చెప్పేది తెలిసినా కూడా కొంటేతనం పెరిగి…
” హ్మ్మ్…చెప్పు “చరీ” పూర్తిగా” అన్నాను.
ఒక్కసారి అలా పిలిచినందుకు… ఆమె నా కళ్ళలో ఒక్కసారి చురుగ్గా చూసి వెంటనే సిగ్గుతో తల దించేసుకుంది.