Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తోడొకరుండిన
#7
"అదేంట్రా మహీ! అవతల మృదూని పెళ్ళికూతురిని చేస్తుంటే ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావ్?" శ్రీకాంత్ ఏదో పనిమీద గదిలోకొచ్చి మహీని చూసి ఆశ్చర్యంగా అడిగాడు.
"ఊరికే!" మహీ బలవంతాన నవ్వు తెచ్చిపెట్టుకుందని తెలుస్తునే ఉంది. అతని గుండె చెరువైపోయింది. గబగబా వచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు.
"మహీ! ఏంటమ్మా ఇది. నీకేం తక్కువని నువ్వందరికీ దూరంగా ఉండాలి? సంజయ్ నీతో లేనంత మాత్రాన నువ్వు నువ్వు కాదా? పద వెళ్దాం" బలవంతాన ఆమెని లేపబోయాడు.
"నేనేం అలా అనుకోవటం లేదన్నయ్యా. నాకు తెలుసు. నేనప్పుడూ ఇప్పుడూ మహిమనే. నాలో ఏమార్పు లేదు. కానీ నన్ను చూసే వాళ్ళ కళ్ళల్లో మార్పొచ్చింది. నేనక్కడుంటే వాళ్ళంతా ఏమైనా అనుకోవచ్చు. ఇబ్బందిగా ఫీలవ్వొచ్చు. అమ్మా, మృదూ కూడా నాముందు కొన్ని చెయ్యలేరు. చేయించుకోలేరు. ఈ హ్యాపీ టైంలో నేనక్కడుండి వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చెయ్యడమెందుకని నేనే దూరంగా వచ్చేస్తున్నాను. ఈ ఒక్కరోజే కదన్నయ్యా. రేపట్నుంచీ మళ్ళీ అంతా రొటీనే" అంటున్న మహీని చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి శ్రీకాంత్ కి.
"అన్నయ్యా! ప్లీస్ అలా ఫీలవకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే స్టేజ్ నేనెప్పుడో దాటిపోయాను" శ్రీకాంత్ బాధ చూసి ఓదార్చసాగింది మహీ.
"అలా అనుకుంటే ఇదివరకు నాలాంటి సిట్యువేషన్ లో ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవారు? చెప్పాలంటే వాళ్ళనసలు మనుషుల్లా కూడా చూసేవాళ్ళు కాదు. కానీ నేను అందర్లానే ఉన్నాను. మనింట్లో నాకు ఏ ప్రాబ్లెమ్ లేదు. సంజాలు లేదని తప్పితే ఫైనాన్షియల్ గా కానీ, మీ అందరి సపోర్ట్ విషయంలో కానీ నాకే లోటు లేదు. మీ అందరి అండదండలూ, అమ్మానాన్నల ఆత్మీయత అన్నీ నాకున్నాయి. అవేమి లేని నాలాంటి అమ్మాయిలు, హుస్బెండ్ ఉన్నా పట్టించుకోక వదిలేసినవాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఈలోకంలో ఎన్నోరకాల వాళ్ళున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే నేను చాలా అధ్దుష్టవంతురాలినే.
నేనీ ఫంక్షన్ ఇప్పుడు చూడకపోతే ఏమైంది? రేపు వీడియో, ఫోటోలు అన్ని చూస్తాను. ఇంత చిన్న విషయానికి అంత వర్రీ అయిపోకు" మాములుగా చెప్పింది.
"మహీ! పర్లేదురా. కిండర్ గార్డెన్ టీచర్ అయ్యాక బాగానే క్లాస్ తీసుకుంటున్నావే? నీ స్టూడెంట్స్ కి ఇలానే క్లాసులు తీసుకుంటున్నవా?" చిన్నగా నవ్వాడు శ్రీకాంత్.
"వాళ్ళకి నేను తీసుకోనక్కరలేదులే. వాళ్లే నాకు తీసుకుంటారు"చిరునవ్వు నవ్విన మహీ తల మీద చెయ్యేసి ఇక అక్కడ ఉండలేక బయటికెళ్లిపోయాడు.
"అమ్మా" వున్నట్లుండి అర్జున్ పెద్దగా ఏడ్చుకుంటూ, మహీని వెతుకుంటూ వచ్చాడు.వాడి గొంతు విని కంగారుగా గదిలోంచి పరిగెత్తికొచ్చింది మహిమ.
"ఏం నాన్నా! ఏమయ్యింది. పడ్డావా?" అంటూ సముదాయించటానికి ప్రయత్నిస్తోంది.
"అమ్మా! స్వీటీ వాళ్ళ నాన్నా, కిరణ్ వాళ్ళ నాన్నా కూడా వచ్చేసారు. మన నాన్న మాత్రం రాడని స్వీటీ చెప్పింది. నాన్నేడి పీలూ" ఇంకా ఊహ పూర్తిగా రాణి ఆ పసికందు తన తండ్రి తిరిగిరాని లోకాలకెళ్లిపోయాడని తెలియక మహిమని కరుచుకుని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంటే...ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళన్నీ ఎప్పుడో ఇంకిపోయిన మహి కంట్లోంచి చుక్కనీరు బయటికి రాకపోయినా, చుట్టుపక్కల వున్న అందరి కళ్ళు చెమర్చి, గుండెలన్నీ భారమయ్యాయి. పెళ్ళికొచ్చిన దగ్గరనుంచి మహిమ పరిస్థితంతా గమనిస్తున్న మహిమకి వరసకి వదినయిన సుందకయితే కన్నీళ్లు ఆగలేదు. ఆమె మహిమ పెదనాన్న కోడలు. ఈ పెళ్లికాని ముంబై నుండి వచ్చింది.
"అర్జున్! నీకు స్పైడర్ మెన్ సిడి కావాలన్నావుగా, వెళ్లి తెచ్చుకుందామా?" ఎలాగైనా అర్జున్ దృష్టి మరల్చాలని మహిమ ప్రయత్నిస్తోంది.
"నాకేం వద్దు. నాకు నాన్నే కావాలి. పద వెళ్లి తెచ్చుకుందాం" అర్జున్ మొండిగా అన్నాడు.
"మహీ! నువ్వుండమ్మా. వాణ్ణి బైటికి తీసుకెళ్తాను" విశ్వనాధంగారు వచ్చారు.
"పర్లేదు నాన్నా. వాడు మీకు లొంగడు" అర్జున్ ని గదిలోకి తీసుకెళ్లింది.
"అర్జున్! స్పైడర్ మెన్ ఏలా గాలిలో ఎగురుతాడో తెలుసుకదా. ఫస్ట్ నువ్వే ఆ సినిమా చూసేస్తే, నీ ఫ్రెండ్స్ అందరికి స్టోరీ చెప్పొచ్చు" అంటూ అర్జున్నీ మరిపించి, వాణ్ణి తీసుకొని సిడి తేవడానికి షాపుకెళ్లిన మహిమని తదేకంగా చూస్తూ, ఆ హడావిడిలో వాళ్లాయన శేఖర్ కోసం వేతకసాగింది సునంద.
         *            *              *           *         *
            party  Vishu99  party
[+] 1 user Likes Vishu99's post
Like Reply


Messages In This Thread
తోడొకరుండిన - by Vishu99 - 19-01-2019, 11:50 AM
RE: తోడొకరుండిన - by Vishu99 - 21-01-2019, 03:54 PM
RE: తోడొకరుండిన - by krish - 23-01-2019, 05:39 AM
RE: తోడొకరుండిన - by Uma_80 - 05-02-2019, 10:04 PM
RE: తోడొకరుండిన - by raaki - 06-02-2019, 12:33 AM
RE: తోడొకరుండిన - by ravi - 06-02-2019, 10:25 AM
RE: తోడొకరుండిన - by ~rp - 06-02-2019, 01:01 PM
RE: తోడొకరుండిన - by Uma_80 - 11-02-2019, 07:08 PM
RE: తోడొకరుండిన - by RAANAA - 06-10-2022, 05:47 AM



Users browsing this thread: 1 Guest(s)