14-11-2019, 06:53 PM
పరికిణి జాకెట్ లో ఒక అందమైన అమ్మాయి నా ఎదురుగా నుంచుని ఉన్నట్లు తెలుస్తోంది…
తేరుకొని చూస్తే ఆమె ఎవరో కాదు… అనూష.
” ఎంత సేపు పడుకుంటావ్! నిద్ర రోగం పట్టుకొంది నీకు” అంటూ వెటకరిస్తోంది….
పక్క నే మా అమ్మ ..
” ఒసేయ్ ఎందుకే అలా అంటావ్, వాడు నిన్న వచ్చేసరికి ఎంత నీరసం గా ఉన్నాడో తెలుసా నీకు?” అంటూ కసురుతోంది…
వెంటనే అనూష ” ఆహా, నీ కొడుక్కి మాయ రోగం వచ్చి ఉంటది అందుకే నీకు అలా కనిపిస్తుంది” అంది.
” సర్లే వాడిని రెడి అవ్వనీ, మనం బయటికి పోదాం… ” అని అమ్మ అంటుండగానే…
” నువ్ పో అత్త నేనేం నీ కొడుకుని తినేయను లే… జస్ట్ కాస్సేపు కూర్చొని మా ఇంటికి పోతా.. లేకుంటే మా ముసలిది …… నన్ను క్షమించదు…” అంటూ మా అమ్మని పంపేసింది..
అలా మా అమ్మ వెళ్లగానే
నా వైపు తిరిగింది….
అబ్బో అప్పటిదాకా ఆరిందలా మాట్లాడిన అనూష కళ్ల నిండా కన్నీళ్లు…..
” ఏం అయింది నీకు … హిక్…. హిక్క్…