14-11-2019, 06:51 PM
ఇక నా దగ్గరకి వచ్చి ” రామ్, మనం చేసింది సమాజం దృష్టిలో తప్పే, కానీ ఏమి చేస్తాం చెప్పు, నేను నీ పేరు మరియు నీ గుణగణాలు మన కుటుంబాల్లో బాగా ఎక్కువగా పొగుడుతూ ఉంటే నాకు నీలాంటి భర్త కావాలని కోరుకున్నాను. కానీ నాకంటే చిన్నవాడివి కదా, కుదరదు అందుకే నా ప్రేమ ని నా యవ్వనాన్ని రెండింటిని ఇవ్వాళ నీకు అర్పించా” అంటూ వలవలా ఏడ్వసాగింది.
నేను తనని ఊరడించడానికి తన నుదిటిపై ముద్దు పెట్టి ” నువ్వు నీ ప్రేమని నాకు అందించావ్, నేను ఎప్పటికీ నీ ప్రేమని మర్చిపోను…. కానీ మనం ఇలా కలవటం నీ నా భవిష్యత్తు కి మంచిది కాదేమో… కాబట్టి కాస్త జాగ్రత్త గా ఉందాం….”
అన్నాను.
ఆమె మొఖం లో అపరాధ భావం అలాగే అనురాగం రెండు కనిపిస్తూ ఉండగా భారమైన గుండెతో అక్కడ నుండి ఇంటికి బయలుదేరాను……
బయటికి రాగానే
నాన్న ఆటో దిగుతూ కనిపించారు…..
” ఏరా ఏంటి ఏం జరిగింది రా, ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయావ్ అన్నారు…” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
“అబ్బా అంత సీరియస్ ఏం కాదు నాన్న, బానే ఉన్నాను ” అంటూ కన్విన్స్ చేయబోయాను….