09-11-2019, 09:23 AM
నా తల నిమురుతూ నా పక్కనే కూర్చుంది.
ఎందుకో ఆమె మొఖం చూడలన్పించింది.
కళ్ళు చిన్నగా తెరిచి చూసా కదా.
ఆరాధన భావం కనిపించింది.
ఆర్ధ్రగా ఉన్న ఆమే కళ్ళలో ఒక సన్నని కన్నీటి తెర.
అలా చూస్తూ ఉండగానే, నా పైకి వంగి నా నుదుటి మీద ఒక తీయ్యని ముద్దు పెట్టింది.
చాలు బాసూ, ఇక ఆమె కి బానిసని అయినా పర్వాలేదు అనిపించింది.
ఆ ముద్దు లో తీయదనం అనుభవిస్తూన్నాను,. ఇంతలో ఆమె తనలో తాను మాట్లాడుకొంటోంది.
వినాలని నేను కాస్త ప్రయత్నించాను.
” రేయ్, ఎందుకురా నువ్వింత దగ్గరగా ఉన్నావ్, నాకు, నీ పై ఇష్టాన్ని నేను నువ్వు మెలకువ గ ఉన్నపుడు కూడా ప్రదర్శించే తెగువ లేదురా నాకు..
హ్మ్మ్ ఇప్పుడు నేను మరొకరి సొత్తు రా, కన్నా …”
అంటూ ఉంది.
ఎందుకో నా కళ్ళు చెమర్చాయి.
ఇంత అభిమానం పోగేయడానికి నేనేం చేశాను అనిపించింది.
అప్పుడే స్ఫూరణ కి వచ్చింది, మన పనేంటో.
నెమ్మదిగా ఆమె చెయ్యి అందుకున్నాను.