20-01-2019, 05:00 PM
(20-01-2019, 03:35 PM)Yuvak Wrote: ?"కుంకుళ్ళెరుగని" "తలంట్లు"......చాలా ఉన్నాయి మాట్లాడవలసినవి.
"నలుగు"లెరుగని "స్నానాలు"......
"సాంబ్రాణి" ధూపం తెలియని "కురులు"......
"పూల"కి నోచుకోని "కత్తిరించుకున్న జడ"లు..
"కాటుక" ఎరుగని "కళ్ళు"......
"గాజు"లెరుగని "చేతులు".....
"అందె"లు తెలియని "పాదాలు".....
"గోరింట" మెరియని "నఖాలు".....
"వరిపిండి" కలవని "రంగవల్లులు"......
"పట్టుపావడ"లు ఎరుగని "చిన్నారులు"...
"ఓహో......పండగొచ్చేసింది"......!
"ప్లాస్టిక్ తోరణాలు"......
"ఫేసుబుక్కుల్లో ముగ్గులు".....
"కొని తెచ్చుకున్న పిండివంటలు"....
"వాట్స్ ఆప్ శుభాకాంక్షలు"......
"ఓహో సంబరాలిస్తుంది".....!!
"ఎంకి పెళ్ళి సుబ్బి చావు"కంటూ......
"కోడిపుంజుల చావులు".....
"సంప్రదాయమంటూ...నాయకుల వికృతాలు"......
"జూదాలంటూ.....జనాల అప్పులు"...
"వహ్వా పట్టేయ్యాలంటూ........
సెక్యూరిటీ ఆఫీసర్ల లంచాలు"....
"ఓహో సంక్రాంతి సంబరాలు".......!!
"తెలుగు నేలపై......కృత్రిమ కోలాహలాలు".....
ఓహో...... "సంక్రాంతి పండగ అయుపోయిందోచ్".....
Source:Internet
బాగుంది.