07-11-2019, 11:32 AM
(07-11-2019, 10:40 AM)Joncena Wrote:
మీకు మాట ఇచ్చినట్టుగా ఈ రోజు నాదే మొదటి కామెంట్ . తప్పుగా అనుకోవద్దు చిన్నగా పెట్టానని. అది చదువుతూ నిన్నలా మళ్లీ రెండో కామెంట్ అవుతుంది అని అలా పెట్టేసా. :D
ఇక ఈ రోజు కథలోకి వస్తే చాలా బాగా రాశారు. శ్యామ్ చనిపోయే ముందు చెవిలో bluetooth ఉండడం గమనించిన సిద్దు శ్యామ్ కి వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి ఎంక్వైరీ చెయ్యమని చెప్పి శ్యామ్ అలా ఎందుకు చనిపొయాడు, ఎవరన్నా తనని చనిపొవడానికి ప్రేరేపించారా అని అలోచిస్తుంటే కమిషనర్ నుండి ఫోన్ వస్తే, కమిషనర్ ని కలిసినప్పుడు శ్యామ్ ఎందుకు చనిపోయాడో త్వరలో కనిపెడతాం అని సిద్ధూ చెబితే, ముందు ఆ పెద్దాయన గురించి అలాగే శ్యామ్ గురించి వదిలి నిన్న పంపిన ఆ రెండో ఫొటోలోని అమ్మయిని పట్టుకో అని చెబితే ఎవరో చూద్దామని ఆ ఫొటో చూడగా అందులో ఫొటో సుమ ఉండడం.
ఇక్కడ సిద్ధు వాళ్ళ అక్క విజయకు వచ్చిన పోస్ట్ లో తన చెవి కమ్మె అలాగే ఒక ఉత్తరం ఉండడం చూసి, అది తీసి చదివిన తను రమణ అన్న వ్యక్తిని కలుసుకోవడనికి వెళదాం అని నిర్ణయించుకొని తనని కలవడానికి ఏమి బట్టలు వేసుకుని వెళదాం అని ఆలోచిస్తుండగా తను చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకోవడం, అందులో "కాలేజీ లో ఉన్నపుడు కాంటిన్ లో అందరూ కాలేజీ డే ఫంక్షన్ కోసం ఎలాంటి డ్రస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూంటే అప్పుడు రమణ అన్న మాట గుర్తుకు వచ్చింది తనకు "గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని"" అది గుర్తుకు వచ్చి విజయ ఆ రంగు చీర కట్టుకుని లెటర్ లో ఉన్న హోటల్ కీ బయలుదేరి వెళ్ళడం బాగా చెప్పారు.
అలాగే శ్యామ్‌కు వచ్చిన చివరి ఫోన్ నంబరు ఎవరిదా అని ఎంక్వయిరీ చెయ్యగా అది శ్యామ్ నంబరే అని తెలిసి అందరు షాక్‌కు గురవ్వటం. బాగా చెప్పారు.
Note: మొబైల్ లో సరిగా టైప్ చెయ్యటం కుదరక లాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి పెడుతున్న, అందుకే ఇంత లేట్ అయ్యింది.
పర్లేదు bro మీరు కథ నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అది చాలు