06-11-2019, 07:40 PM
నా ప్లాన్ అమలు ఇలా జరిగింది.మొదట, నేను రేణు క్లాస్ కి వెళ్లిపోయామ్.స్వాతి పీరియడ్ వచ్చింది, క్లాస్ జరుగుతుండగా నేను అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాను.అధీ చూసిన వెంటనే రేణు” మేడం, రామ్ పడిపోయాడు” అంటూ గావుకేక పెట్టింది.
క్లాస్ అందరూ ఉలిక్కిపడ్డారు.
మేడం ప్లాన్ ప్రకారం అటెండర్ ని పిలిచి, మెడికల్ హెల్పర్ దగ్గరికి పంపించింది.
ఒక్క గమనిక: ఇదంతా నాటకం కాబట్టి నాకు అన్ని తెలుస్తాయి.
నన్ను గబాగబా నలుగురు మొస్కొని వెళ్లిపోయారు.
మెడికల్ హెల్పర్ ని రేణు ముందే లైన్ లో పెట్టింది.
అందుకే వాడు అబ్బాయి బాగా వీక్ గా ఉన్నాడు, అర్జెంటు గా సెలైన్ పెట్టాలి, కానీ ఇక్కడ కుదరదు……
ఎవరైనా ఇంటికి తీస్కెళ్లాలి అన్నాడు.
అక్కడ ఉన్న వాళ్ళు అయ్యో, ఇంటికా, ఎవరింటికి తీసుకెళ్తాము, అసలే ఇది డ్యూటీ టైం కూడాను, అంటూ తర్జన భర్జన పడుతున్నారు.
ఇంతలో రేణు , సర్, ఇతను సునీత మేడం కి బాగా దగ్గరి బంధువు, ముందామెకి కబురు పెట్టండి అంది
ఆలస్యం జరగకుండా, కబురు వెళ్ళింది.
అప్పుడు నాకు మొదటి రుజువు దొరికింది.