06-11-2019, 07:37 PM
నాకు ఎదురుగ వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. కానీ తప్పదు అనుకోని, తలుపు మీద చప్పుడు చేస్తూ ఆమె దగ్గరకి వెళ్ళాను.
నా వైపు కనీసం చూడట్లేదు…
” అనూ, నన్ను క్షమించు రా, నేను అలా చేసి ఉండకూడదు” అంటూ, తన పక్కనే కూర్చున్న.
లేచి కొంచెం జరిగింది.
నేను మరోసారి ట్రై చేద్దాం అనుకోని.
“ప్లీజ్ రా అను, అలా ఉంటె నేను ఇక తట్టుకోలేను, ఏదైనా మాట్లాడు” అంటూ బ్రతిమలాడుతున్నాను.
తను మల్లి ఏడవడం మొదలెట్టింది.
నేను మరింత కంగారిపడిపోతూ,
” అనూ నీ కాళ్ళు పట్టుకొంటా, ఏడవకు, ప్లీజ్ “అంటూ కాళ్ళు పట్టుకోబోయాను..
” బావా, నన్ను ముట్టుకోకు, మీ మగాళ్లంతా ఇంతే , మా శరీరం కోసమే మాతో మాట్లాడుతారు, మేమేం అనుకున్నా పట్టదు, మీ అవసరం తీర్చుకోవాలి” అంతేగా అంటూ నా పై విరుచుకుపడింది.
నాకిక పిచ్చెక్కిపోయింది, ఇది గట్టిగ అరిస్తే మామ్మా, వచేయటం, ఖాయం, నా తోలు వొల్వడం ఖాయం అనుకోని, ఇక లెగిసి వెళ్లిపోతూ,