06-11-2019, 07:36 PM
కానీ నాలో ఏ ఫీలింగ్ కనిపించకుండా నటిస్తూ, మామ్మ దగ్గరికి వెళ్ళాను.
” రారా అబ్బాయి, ఒకే ఊర్లో ఉంటున్న ఎప్పుడూ మా ఇంటికి రావు, ఇంద ఈ సున్నుండ తిను” అంటూ నా చేతికి ఒక నేతి సున్నుండ ఇచ్చింది.
” మామ్మా, అన్నం తినేసాను, నాకు వద్దు,” అన్నాను.
“చస్, అలా అంటావేంరా, ఏది పడితే అది తినేయాలి, ఈ వయసులో తింటే అన్ని రకాలుగా పుష్టి పడుతుంది”.
అంటూ నన్ను ఫోర్స్ చేసేసరికి, చిన్నగా కొరుకుతూ మాట్లాడుతున్న.
” ఇంతకీ, ఎం పని మామ్మా, నన్ను పిలిచావ్” అన్నాను.
” అదీ పని అంటే పని కాదురా, అనూష ఇండకటినుండి, అదే పనిగా ఏడుస్తోంది” …. ఏమయిందో ఏంటో, వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేశా, తనకి కూడా ఎం తెలియదు అంది, బస్సు లో మీరిద్దరే వచ్చరంత కదా, ఏమైందిరా అది అలా ఉంది” అని అడిగింది మామ్మ.
ఇక చూస్కో నా గుండె 300 స్పీడ్ లో దూసుకెళ్తున్న రేస్ కార్ లా కొట్టుకోవడం మొదలయింది.
గాబరా పడితే ముసల్ది కనిపెట్టేస్తుంది అనుకోని, రిలాక్స్ అయ్యి.
” ఏమో మామ్మా, నేను పడుకున్న బస్లో, ఏమయిందో నాక్కూడా తెలియదు, అడిగొస్తా, నువ్వేం బయపడకు” అంటూ ఆమె దగరనుండి బయల్దేరాను.
అనూష గదిలో కూర్చొని, అలా పైకి చూస్తోంది.