06-11-2019, 07:35 PM
నేను ఇక నిరాశగా ,కాళ్ళీడ్చుకొంటూ ఇంటికి పోయా..
తలారా చన్నీళ్ళతో స్నానం చేసి, ఎదో కాస్త ఎంగిలి పడి అలా కూర్చున్నాను.
ఇంతలో నాన్న వచ్చి, రేయ్ సుబ్బమ్మ మామ గారికి ఏదో సాయం కావాలని చేప్పారు.
త్వరగా వేళ్ళు, అక్కడే పడుకోవాల్సి వస్తే పడుకో….
అంటూ నన్ను త్వరపెట్టాడు.
సుబ్బమ్మ మామ్మ అంటే ఎవరో కాదు, అనూష వాళ్ళ అమ్మమ్మ.
అబ్బా ఇప్పుడు అనూష మొఖం ఎలా చూడాలి? తను నేనేదో తప్పు చేశాను అనే ఆలోచనలో ఉందేమో,నేను ఎలా ఫేస్ చేయాలి ఈ సిట్యుయేషన్?
అనుకుంటూనే
వాళ్ళ ఇంటికి బయల్దేరాను.
ఒక 5 నిమిషాల్లో చేరుకున్నాను.
తలుపు తట్టి ,
” మామ్మా నేను రాము ని వచ్చాను” అన్నాను.
కాస్సేపటికి అను వచ్చి తలుపు తీసి, నా వైపు చూడకుండా వెళ్ళిపోయింది.
నా మనసు చివుక్కుమంది.