30-10-2019, 06:51 PM
మధ్యలో బస్సు బ్రేక్డౌన్ అయింది. చీకటి పడుతోందని ఇంట్లో లేట్ అవ్వుద్ధి అని ఫోన్ చేసిచెప్పేసా. ఊరు ఇంకా 5 కిలోమీటర్లు పై మాటే. అలా కాళ్ళీడ్చుకొంటు నడవసాగాను. కాస్సేపటికి ఒకాయన నా దగ్గరికి వచ్చి బండాపి ” ఏరా నువ్వు నరసింహం కొడుకువే గా, ఏంటి ఇలా నడుస్తున్నావ్ ” అని అడిగాడు.
” అంటే బస్సు లో వస్తుంటే, బస్సు బ్రేక్డౌన్ అయ్యింది అండి, ఇక ఏ టైం అవ్వుద్దో వెయిట్ చేస్తే, అని నడుస్తున్న “అన్నాను.
“సర్లే రా అబ్బాయి మీ ఊర్లో దింపుతా” అన్నాడు.
“అయ్యో పర్లేదు అండి, నేను నడవగలను” అన్నాను.
” నా దగ్గర మొహమాటం, ఎందుకు అబ్బాయి, నేనేం అవుతానో మీ నాన్న చెప్పలేదా, నా పేరు రాయుడు నీకు మామనవుతా” అన్నాడు.
నేను ఆశ్చర్యం తో ” పూతవారం రాయుడు గారా, అంటే మా సునీత మేడం వాళ్ళ నాన్న గారా మీరు?, సారీ అండి, ఎవరో తెలియక రాను అన్నానండి” అంటూ బండెక్కా.
దారి పొడుగునా బలే మాట్లాడుకున్నాం, చాలా మంచి మనిషి, ఎంత ఆస్తి ఉన్నా, నిరాడంబరంగా ఉన్నాడు.
అలా మాట్లాడుతూ ఉండగానే, మా ఇల్లు వచ్చేసింది. నన్ను ఆయనతో చూడగానే మా అమ్మ కంగారు పడుతూ , ” అన్నయ్య గారు, ఏమయింది మా వాడ్ని మీరు తీస్కోచ్చారు, మా వాడు ఏమైనా పిచ్చి పని చేశాడా” అంటూ హడావిడి గా అడుగుతోంది.