30-10-2019, 01:19 PM
అంతలో ఎవరో ఒకావిడ, “ఆగు,” అని వినిపించడంతో ఆదిత్యసింహుడు వెనక్కు తిరిగి చూసాడు.
అక్కడ ఉన్నతాసనం మీద ఒకావిడ కూర్చుని ఉన్నది….ఆమె ముందు పల్చటి తెర లాంటిది ఉండటంతో ఆమె రూపు రేఖలు సరిగా కనిపించడం లేదు.
ఆమె : ఇది ఖడ్గవిద్యా ప్రదర్శనమే కాని…యుధ్ధం కాదు కదా….
నిర్వాహకుడు : నిజమే యువరాణీ గారు….కాని ఈ ప్రదర్శనలో ఒకవేళ అతను గెలిచిన బహుమానాలు అతనికి ఇవ్వలేం కదా….
ఆదిత్యసింహుడు : నేను బహుమానాలు, బంగారు వరహాలను ఆశించి నేను రాలేదు….కేవలం వినోదం కోసమే పాల్గొన దలిచాను….ఒకవేళ నేను గెలిచినా కూడా అతన్నే విజేతగా ప్రకటించవచ్చు….నాకు ఎటువంటి అభ్యంతరం లేదు….
యువరాణి : అతను కేవలం వినోదం కోసమే అంటున్నాడు కదా….ఇందులో ఇబ్బంది ఏమున్నది….
యువరాణి అలా అడిగే సరికి నిర్వాహకుడు ఏం చెప్పాలో తెలియక రాజు వైపు చూసాడు.
రాజు కూడా ఒకసారి తన కుమార్తె వైపు చూసాడు.
ఆమె కూడా ఒప్పుకోమన్నట్టు సైగ చేయడంతో రాజు కూడా ఆదిత్యసింహుడిని పాల్గొనమన్నట్టుగా అనుమతి ఇచ్చాడు.
దాంతో ఆదిత్యసింహుడికి, ఇంతకు ముందు గెలిచిన అతనికి మధ్య కత్తి యుధ్ధం మొదలయింది.
ఆదిత్యసింహుడి ఖడ్గ విన్యాసం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికి అతను సామాన్యపౌరుడు కాదని అర్ధమయింది.
యువరాణి కూడా ఆదిత్యసింహుడిని రెప్పవేయకుండా అతని వైపు, అతని ఖడ్గ విన్యాసాన్ని చూస్తున్నది.
కొద్దిసేపటికి ఆదిత్యసింహుడు ఆ పోటీలో గెలిచాడు.
కాని ఆ రాజ్యపు షరతుల ప్రకారం ఇదివరకు గెలిచిన అతన్నే విజేతగా ప్రకటించారు.
అంతా అయిపోయిన తరువాత యువరాణి తన ఆసనం లోనుండి పైకి లేచి ఆదిత్యసింహుడిని చూపిస్తూ, “నేను ఇతనితో కత్తి యుధ్ధం చేయాలనుకుంటున్నా,” అన్నది.
ఆమె అలా అనగానే ఆదిత్యసింహుడితో సహా, అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
వెంటనే ఆ రాజ్యపు రాజు, ఆమె తండ్రి అయిన యశోవర్ధనుడు, “ప్రభావతీ….ఏంటి ఈ విపరీత నిర్ణయం,” అన్నాడు.
ప్రభావతి : లేదు నాన్నగారు….చాలా రోజుల తరువాత నాకు కత్తి యుధ్ధం చేయాలని అనిపిస్తున్నది…దయచేసి అనుమతి ఇవ్వండి….
దాంతో యశోవర్ధనుడు కూడా అది విద్యాప్రదర్శనే కాబట్టి యువరాణి ప్రభావతికి అనుమతి ఇచ్చాడు.
అది చూసిన ఆదిత్యసింహుడు కూఆ ఆశ్చర్యపోయి వెనక్కు తిరిగి రమణయ్య వైపు చూసాడు.
రమణయ్య కూడా ఏం చెప్పాలో తెలియక కానివ్వమన్నట్టు సైగ చేసాడు.
కొద్దిసేపటికి యువరాణి ప్రభావతి తన రాజరికపు దుస్తులు వదిలేసి కత్తియుద్ధానికి కావలసిన దుస్తులు వేసుకుని క్రీడా మైదానంలోకి వచ్చింది.
అప్పటిదాకా పరదా వెనకాల చూసిన ఆదిత్యసింహుడు ఇప్పుడు తన ఎదురుగా నిల్చున్న ప్రభావతిని, ఆమె అందాన్ని చూసి మైమరిచి పోయాడు.
ఆదిత్యసింహుడు అక్కడ పరిసరాలను పట్టించుకోనట్టు ప్రభావతి వైపు అలాగే కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
ప్రభావతి అది గమనించి చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న కత్తితో చిన్నగా శబ్దం చేసింది.
దాంతో ఆదిత్యసింహుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఎదురుగా నిల్చున్న ప్రభావతి వైపు చూసి నవ్వాడు.
ఇద్దరూ కత్తియుధ్ధం చేయడం మొదలుపెట్టారు.
అలా ఆదిత్యసింహుడితో యుధ్ధం చేస్తున్న ప్రభావతికి అతని ఖడ్గవిద్యా నైపుణ్యం చూసి ఆదిత్యసింహుడు సామాన్య పౌరుడు కాదని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు.
ఇద్దరూ హోరాహోరీగా యుధ్ధం చేస్తున్నారు.
కొద్దిసేపటికి ప్రభావతి తన నైపుణ్యంతో ఆదిత్యసింహుడి చేతిలొని కత్తిని గాల్లోకి ఎగిరేలా చేసింది.
ప్రభావతి అందానికి మైమరిచి పోయిన ఆదిత్యసింహుడు ఏమరుపాటుతో ఉండటంతో ప్రభావతి అతని కత్తిని గాల్లోకి ఎగిరేలా చేసింది.
దానికితోడు ఆదిత్యసింహుడికి తనెవరో బయటపెట్టడం ఇష్టం లేకపోవడంతో కావాలనే ఓడిపోయాడు.
అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు.
ఆదిత్యసింహుడు కూడా సామాన్యపౌరుడి వలె యువరాణి ప్రభావతికి ప్రణామం చేసాడు.
ప్రభావతి తన చేతిలోని కత్తిని పక్కనే ఉన్న పరిచారికలకు ఇచ్చి ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి, “ఈ రోజు మీరు మాతో భోజనం చేయడానికి మిమ్మల్ని మా అంతఃపురం లోకి ఆహ్వానిస్తున్నాము,” అన్నది.
ఆదిత్యసింహుడు సంతోషంతో, “తప్పకుండా యువరాణీ….ఇది మా అదృష్టం,” అన్నాడు.
తరువాత అందరూ అక్కడనుండి వెళ్ళిపోయారు.
యువరాణి ప్రభావతి ఆజ్ఞ ప్రకారం ఆదిత్యసింహుడికి కాపలాగా పదిమంది సైనికులు అతని వెంటే ఉన్నారు.
ఆదిత్యసింహుడు, రమణయ్య అక్కడ జరిగే జాతర అంతా చూసి రాత్రి సమయానికి అంతఃపురానికి చేరుకున్నారు.
అప్పటికే యువరాణి తన చెలికత్తెలకు చెప్పి భోజనం ఏర్పాట్లు చేయించడంతో అంతా కోలాహలంగా ఉన్నది.
కాని యువరాణి ప్రభావతి మాత్రం ఆదిత్యసింహుడు ఎవరా అని ఆలోచిస్తున్నది.
అంతలో ఆదిత్యసింహుడు, రమణయ్య రావడంతో ముగ్గురూ కలిసి భోజనం చేస్తున్నారు.
ప్రభావతి : (ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) ఇంతకు మీ నామధేయం ఏంటో చెప్పలేదు….
ఆదిత్యసింహుడు : ఆదిత్య….నన్ను ఆదిత్య అంటారు యువరాణీ…..(అంటూ రమణయ్య వైపు చూపిస్తూ) ఈయన నా మిత్రుడు రమణయ్య….
ప్రభావతి : మా రాజ్యానికి రావడానికి కల కారణం ఏంటి….
ఆదిత్యసింహుడు : పెద్ద విశేషం ఏమీ లేదు యువరాణీ…మేము దేశసంచారులం…రాజ్యాలు అన్నీ తిరుగుతూ అనుకోకుండా మీ రాజ్యానికి రావడం సంభవించింది…..