Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఊహాతీరం...by sankranti
#3
ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే అవి సూర్య ఎం.బి.ఏ చదివే రోజులు. ఆ రోజు క్లాస్ లో ఇంగ్లీష్ లెక్చరర్ లోనికి వచ్చి క్లాస్ తీసుకోబోతు రమేష్ ని చూసి ఎరా పది రోజుల నుండి కాలేజీ కి రావడం లేదు ఏంటి కారణం అని అడిగారు, దానికి రమేష్ సిగ్గుపడుతూ నాకు పెళ్లి అయ్యింది సర్ అని చెప్పాడు. సర్ నవ్వుతూ అంత తొందర దేనికి రా

అది సర్లే కట్నం ఏమాత్రం ఇచ్చారేమిటి అని అడగగా దానికి వంగ్యంగా చేతిని చూపిస్తూ ఎదో బెత్తెడు భూమి ఇచ్చారు సర్ అనగానే అందరూ నవ్వసాగేరు. దానికి ఇంగ్లీష్ మాస్టారు టక్కున ఇంతకీ చేస్తున్నావా ఎవరికైనా కౌలుకు ఇచ్చావ అనగానే క్లాసు లో అందరూ గొల్లున పగలబడి నవ్వారు.ఇక్కడ ఇంగ్లీష్ మాస్టారు గురించి చెప్పుకోవాల్సింది ఒకటి ఆయన సకల భాషా కోవిదుడు, చమత్కారి స్టూడెంట్స్ వేసే కామెంట్స్ కి వెంటనే పంచ్ పడిపోతుంది. ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటూ స్టూడెంట్స్ తో చాలా సరదాగా ఉంటారు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు కానీ పిల్లలు కలగలేదు, దానిని కూడా ఆయన జోక్ చేస్తూ ఒక రోజు ఆయన పడక కుర్చీ మీద కూర్చుని పేపర్ చదువుతుండగా ఆయన భార్య బియ్యం చేరుగుతూ సడన్ గా కెవ్వు మని కేక వేసి యవండి ఒకసారి పంచాంగం ఇటు ఇవ్వండి అని పేజీలు తిరగేసి మనకి సంతానం కలగ బోతోంది అంది. ఏమైంది అని అడిగిన ఆయనకు బదులిస్తూ కుడి తొడ మీద బల్లి పాకిందండి, కుడి తొడ మీద బల్లి పాకితే సంతాన యోగమండి అని సంతోషంగా చెపింది. దానికి ఆయన ఒసే పిచ్చి మొద్దు 25 సంవత్సరాలుగా నేను నీ వొళ్ళంతా పాకితేనే పుట్టలేదు బల్లి జస్ట్ కుడి తొడ మీద తాకితే పుడతారా అని చమత్కరించారు. మళ్ళీ క్లాస్ అంతా నవ్వులే నవ్వులు కానీ అందరికి ఒక పక్క ఎదో ఒక బాధ పాపం ఆయన సంతాన లేమి గురించి.
Like Reply


Messages In This Thread
RE: ఊహాతీరం...by sankranti - by Milf rider - 28-10-2019, 10:06 PM



Users browsing this thread: 1 Guest(s)