Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మధుబాల...by marro
#4
ఎంత తొందరగా తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు కాలేజ్ కి వెళ్ళి తనని చూద్దామా అన్న ఊహతోనే బాల కి ఆ రేయి గడిచిపోయింది. మరునాడు తొందరగా లేచి రెడీ అయ్యి తన బైక్ పై కాలేజ్ కి బయలుదేరాడు. సీనియర్స్ అందరూ రాజేష్ అన్న చెప్పడం తో బాల ని ర్యాగింగ్ నుండి మినహాయించారు. డైరెక్ట్ గా క్లాస్ రూమ్ కి వెళ్ళి సీట్ లో కూర్చొని తన కలల రాణి కోసం వేచి చూడసాగాడు. సమయం గడుస్తున్న కొద్ది ఒక్కొక్కరూ రాసాగారు. నిన్న ఎవరి పలకరింపులు లేకపోవటం తో ఒక్కొక్కరిగా క్లాస్ అందరిని పరిచయం చేసుకున్నాడు. ఇక ఒక్కరి కోసం ఎదురు చూపులు అది ఎవరో కాదు, తొలి కలయిక లోనే తన మనసుని తనది కాకుండా చేసి, దోర చూపుతో దోచుకెళ్ళిన సుందరి సుప్రియ కోసం. ఒక్కొక్క ఘడియ ఒక్కొక్క యుగం లాగా గడుస్తుంది. సమయం దగ్గర పడుతున్నా ఇంక రాలేదు ఏంటబ్బా అనుకుంటూ ఉండగా బ్లూ కలర్ చుడిదార్ తో దర్శనం ఇచ్చింది సుప్రియ. హంస కన్నా ఇంకా అందంగా నడుచుకుంటూ, జాబిలి కన్నా మరింత అందమైన నవ్వుతో తన వైపు నడుచుకురాసాగింది. ప్రేమించిన అమ్మాయి దగ్గర గా వస్తుంటే చూసే కళ్ళ కన్నా ఊపిరి పోసే గుండెకే ఎక్కువ తెలుసు అన్నట్లు గబ గబ కొట్టేసుకుంటుంది. ఆమె చిరునవ్వు తో హాయ్ బాల గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి తన పక్కన కూర్చోంది. బాల నోటి నుండి కాకుండా మనసు లో నుండి గుడ్ మార్నింగ్ అనే మాట బయటకి వచ్చింది. ఒక సారి క్లాస్ అంత కల చూసాడు. అమ్మాయి ల మాట ఏమో కానీ అబ్బయి ల కళ్ళు మాత్రం తన వైపు ఈర్ష్య గా చూడసాగాయి. ఎందుకంటే ఇంత అందం తన ఒక్కడి తోనే మాట్లాడుతున్నoదుకు. క్లాస్ లు మొదలయ్యాయి. అవి జరుగుతున్నా వినే మూడ్ మాత్రం బాల కి లేదు ప్రస్తుతం. మధ్య మధ్య లో సుప్రియ వైపు దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. ఇంతలో సుప్రియ హే బాల క్లాస్ చాల బోర్ గా ఉంది, ఆఫ్టర్ నూన్ నుండి ఏదన్నా మూవీ కి వెళ్దామా అంది. ఇటువంటి ఆఫర్ ఎదురుచూడని బాల సంతోషంగా సరేనని తల ఊపాడు. తన మొబైల్ నుండి టిక్కెట్లు బుక్ చేద్దామని చూస్తే తెలుగు సినిమా టిక్కెట్ ఒక్కటి లేదు ఇదే విషయం సుప్రియ తో చెప్తే ఏ మూవీ అయిన పరవాలేదు వెళ్దాం అంది. హాలీవుడ్ మూవీ కి కార్నర్ సీట్స్ బుక్ చేసి, లంచ్ టైం అవటంతో కాంటీన్ వైపు నడిచారు ఇద్దరూ.
Like Reply


Messages In This Thread
మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:13 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:14 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:15 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:18 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:19 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:22 PM



Users browsing this thread: 1 Guest(s)