27-10-2019, 01:27 PM
బాబాయ్ అలా ఏడుస్తుంటే మనసుకి ఎంతో బాధ అనిపించింది, పిన్ని అక్కా ఇద్దరు ఆయన్ని ఓదరుస్తూ ఉన్నారు. ఇంక నా మనసులో ఒక నిర్ణయానికి వొచ్చి అక్కడ నుండి లేచి వెళ్ళి బాబాయ్ మోకాళ్ళ దగ్గర కూర్చుని సరే బాబాయ్ నాన్న ఆఖరి కోరిక మీద నీ సంతోషం కోసం ఇక నుండి ఇక్కడే ఉండి బిస్నెస్ అంత నేనే చూసుకుంటాను అని చెప్పగానే ఒక్క సారిగా అందరి ముఖాల్లో ఆనందం, ఇంక బాబాయ్ ఆనందానికి హద్దె లేకుండా పోయింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు నాకు మాత్రం మనసులో ఏదో చిన్న కంగారు నేను ఒక్కడినే ఇంత వ్యాపార సామ్రజాన్ని చూడగలనా? ఆమెరికాలో నాకున్న బిస్నెస్ పరిది చాలా తక్కువ పైగా నాకున్న అనుభవం, పరిచయలతో అక్కడ సక్సెస్ అయ్యాను కానీ ఇక్కడ వేరు. బాబాయ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నా ఆయన నాన్న చెప్పింది చెయ్యడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే మనిషి కాదు పోనీ బావని అడగాలి అంటే పూణేలో పెద్ద MNCలో అక్కా బావ ఇద్దరు ప్రాజెక్ట్ మ్యానేజర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోతుంది అలా బాల్కనీలోకి వచ్చి సిగరేట్ వెలిగించాను, ఏదో ఆలోచనలో ఉండగానే "ఏంటి నందు అమెరికా తిరిగి వెళ్ళిపొదాము అనుకుంటే ఇప్పుడు ఇలా అయ్యింది ఏంటి అని ఆలోచిస్తున్నావా" అన్న మాటలతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వొచ్చి వెనక్కి తిరిగి చూశాను ఎదురుగా.............?
______________________________
______________________________


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)