Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
S/o.ఆ"నందు"రావ్...by hulk
#3
టైమ్ ఉదయం 11:00 అవుతుంది వచ్చిన వాళ్ళు అందరు ఆనందరావ్ బౌతిక కాయానికి నివాళులు ఆర్పిస్తున్నారు, ఇంతలో అక్కడికి రేంజ్ రోవర్ కార్ వచ్చి ఆగింది అందులోనుండి దిగిన వ్యక్తిని అక్కడ ఉన్నవాళ్ళు ఒకింత అశ్చ్యారానికి గురైయ్యారు. ఎందుకంటే వచ్చింది ఆనందారావ్ కొడుకు నందు. అక్కడ ఉన్నవాళ్ళ అశ్చ్యారానికి కారణం లేక పోలేదు నందుకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడం తో పిన్నిబాబాయిలే పెంచి పెద్ద చేశారు, తండ్రి తనను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు అనే కోపంతో ఆనందారావ్ కి దూరంగానే పెరిగాడు. నందు ప్లస్టూ కంప్లీట్ చేసిన తరువాత పిన్నిబాబాయితో మాట్లాడి వాళ్ళను ఒప్పించి స్టడీస్ కోసం ఆమెరికా వెళ్ళి కంప్లీట్ అయిన వెంటనే తనే సొంతంగా బిస్నెస్ స్టార్ట్ చేసి అక్కడే ఉంటున్నాడు. మొదట్లో ఆనందారావ్కి నందు స్టడీస్ తరువాత ఇండియా తిరిగివచ్చి తన బిస్నెస్ టేకోవర్ చేసుకుంటాడు అనుకునేవాడు కాని తరువాతే తెలిసింది తన మీద కోపంతోనే కొడుకు వెళ్ళిపోయాడు అని, చాలా సార్లు ఇండియాకి తిరిగి వచ్చేయమని బ్రతిమాలాడు కానీ నందు తండ్రి మాటను వినలేదు. నందు ఆమెరికా వెళ్ళిన ౧౦ ఏళ్లలో తన అక్క (అక్క అంటే పిన్నిబాబాయిల కూతురు) పెళ్ళికి మాత్రం వచ్చాడు అదికూడా వాళ్ల మీద ప్రేమతోనే. అప్పుడు కూడా తన తండ్రి ఎన్ని రకాలుగా బ్రతిమాలినా వినలేదు.

నందుని చూసిన సులోచన తనని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది, ఇంకోపక్క తన బాబాయ్ నోట మాటాలేకుండా కంట నీరుతో తన అన్నని చూస్తూ ఉండిపోయాడు. తన తండ్రి చనిపోయాడు అని విన్నప్పుడు కూడా నందులో ఎటువంటి బాధ లేదు, కాని ఇప్పుడు తండ్రిని చూడగానే మనసులో ఎక్కడో తాను చాలా పెద్ద తప్పు చేశాను అనే బాధ ఇన్నాళ్లు తండ్రికి దూరంగా ఉండి ఏదో కోల్పోయాను అని తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్ళు, తాను వచ్చిన తరువాత జరగవలసిన కార్యక్రమాలు అన్ని చూసుకున్నాడు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అప్పుడే తండ్రి చనిపోయి వారం రోజులు అయ్యింది, అమెరికా తిరిగి వెళ్ళడానికి కావాల్సిన వీసా కూడా పని పూర్తి అయిపోయింది అదే విషయాన్ని పిన్నిబాబాయిలకు చెప్పాలి అనుకునే టైమ్ లో తన బాబాయి పిలుపుతో కిందకు వచ్చాడు.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: S/o.ఆ"నందు"రావ్...by hulk - by Milf rider - 27-10-2019, 01:23 PM



Users browsing this thread: 1 Guest(s)