18-01-2019, 08:42 PM
వైజాగ్ వచ్చాక కమల్ తన దగ్గర ఉన్న బ్యాంకు డిపాజిట్స్ లో కొన్ని కాష్ చేసేసి ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాడు. అందులో కావలసిన ఫర్నిచర్ అన్నీ కొనుక్కున్నాడు నేనే హెల్ప్ చేసాను. ఒక వైపు మందులు వాడటం మొదలు పెట్టాడు. ఒక పదిహేను రోజులకే ఫలితాలు రావడం మొదలయ్యాయి. వెనుక వైపు పిరుదులు, నడుము వెడల్పు పెరగసాగాయి. వక్షస్థలం కూడా బ్రా వేసుకోనక్కరలేకుండానే ఉబ్బెత్తున పెరగసాగింది. తన కొత్త ఇంటిలోకి మారిపోయాడు. అక్కడ మాత్రం అందరికీ కమల్ కాదు కమల గానే పరిచయం చేసుకున్నాడు. తను ఇంటిలోకి మారేటప్పుడు మా అమ్మను ఇన్వైట్ చేసాడు(చేసింది అంటే బాగుంటుందేమో). మా అమ్మకు నేను "పాపం తనకు ఎవరూ లేరు. నిన్నే ఇంటికి పెద్దగా వచ్చి పూజల్లో కూర్చొమ్మని అడుగుతుంది. చాలా మంచి అమ్మాయి. రావే పాపం నువ్వు రాకపోతే బాగుండదు" అన్నాను. అమ్మ "పూజలో కూర్చునేట్లైతే మీ నాన్న కూడా ఉండాలి ... నాన్నకి కూడా చెప్పు" అంది. నాన్న సరే అన్నారు. ఆరోజు మేము ముగ్గురమూ, కమల్ (?) మాత్రమె ఉన్నాము. అక్కడే ఉండి భోజనం చేసి నైట్ ఇంటికి వచ్చేసాము. అమ్మ వచ్చేప్పుడు "నీకెవరూ లేరనుకోకు కమలా! మేమున్నాము ... మా ప్రమీ ఒక్కత్తే కాదు .... ఇంటిల్లిపాదీ నీకు కావాల్సిన వాళ్ళమే. నువ్వెప్పుడైనా రావచ్చు" అంటూ కమల కు చెప్పి బయలు దేరింది.సరిగ్గా నెల రోజుల తరువాత కమల్ ఒక్కడే తిరుచానూర్ వెళ్లి వచ్చాడు. డెవలప్మెంట్ బాగుంది అయినా ఎందుకైనా మంచిది ఇంకో నెల రోజులు మందులు వాడమన్నారట. నేను రోజూ ఉదయం తన ఫ్లాట్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేదాన్ని. నెల అయిన తరువాత డాక్టర్ ఫోన్ లోనే సర్జరీ డేట్ ఫిక్స్ చేసారు. ఒక వారం రోజులు ఉండాలన్నారు. అమ్మతో నేను, కమల తిరుపతి వెడుతున్నామని చెప్పి పెర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వచ్చేసాము. వెళ్ళిన రోజు సాయంత్రం కమల్ కి సర్జరీ చేసి తన పురుషావయవాన్ని తొలగించేసారు. రెండు రోజులు మత్తు మందుల ప్రభావం లో స్పృహ లేకుండా ఉన్నాడు కమల్ (సారీ సారీ కమల). ఒక త్రీ డేస్ బెడ్ మీదనే. యూరిన్ బాగ్ అమర్చారు. సరిగ్గా 6వ రోజున కొంచెం కొంచెం నడవ సాగింది కమల. అన్ని రోజులూ తను నైటీ లోనే ఉంది. ఏడవ రోజున డిశ్చార్జ్ చేసేసారు. అయినా కొంచెం నడవలేని స్థితిలో ఉంది కమల .... నేను వైజాగ్ అయితే లాంగ్ జర్నీ అని చెన్నై మా అన్నయ్య రూం కి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నయ్యకి ఫోన్ చేసి "కమల కొంచెం స్లిప్ అయి పడిపోయింది. అబ్డోమిన్(పొత్తి కడుపు) దగ్గర కొంచెం దెబ్బ తగిలింది. చిన్న సర్జరీ చేసారు .... పర్వాలేదు .... నీ దగ్గరికి తీసుకు వచ్స్తున్నా అని చెప్పి చెన్నై వచ్చేసాము.
నాకు చెప్పకుండానే ఐదు రోజులు సెలవు పెట్టేసాడు వాడు ఆఫీసు కి. వాడు "ప్రమీ! వంటలేమీ పెట్టుకోకు ... నేను హోటల్ కి ఆర్డర్ చేస్తాను. నువ్వు తననే కనిపెట్టుకుని ఉండు. ఇక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్ళే అవసరం ఉంటే తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. ఏమైనా డబ్బు ఏమైనా కావాలంటే క్రెడిట్ కార్డు వాడుకో ప్రాబ్లం లేదు" అన్నాడు. నేను "వద్దురా బాబూ! తన దగ్గర ఉన్నాయి డబ్బులు. ప్రాబ్లం లేదు. నువ్వు ఆఫీసు కి వెళ్ళు. కొంచెం డ్రెస్సింగ్ అవీ నేను చేసేస్తాను ... నో ప్రాబ్లం" అన్నాను. ఒక ఆరు రోజులకు తను పర్ఫెక్ట్ గా నడవగలుగుతున్నది. మేము మళ్ళీ తిరుపతి వచ్చి హాస్పిటల్ లో చూపించుకుని కొన్ని మెడిసిన్స్ ఇస్తే తీసుకుని వచ్చేసాము. ఒక లక్ష రూపాయలు ఖర్చయ్యాయి. సరిగ్గా ఒక పదిహేను రోజులకి కమల పరిపూర్ణ స్త్రీగా కనిపించ సాగింది.
మా అమ్మ తన ఆరోగ్యం బాగాలేదని తెలిసి రోజూ తన దగ్గరికి నాతో కలిసి వచ్చేది. తను ఇంటిని సర్దుకునే విధానం అవీ చూసి, తన కట్టూ బొట్టూ అన్నీ చూసి ఒక రోజు "ప్రమీ! కమలని మన జీవన్ గాడికి ఇస్తే యెట్లా ఉంటుందే?" అని అన్నది నాతో. నాకు మతి పోయింది. ఏం చెప్పాలో అర్ధం కాలేదు. కమల ఏమంటుందో? తను ఏమనుకున్నా నేనడిగితే కాదనదు. కానీ సహజ స్త్రీ కాదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం లేదు .... కానీ ఇవన్నీ జీవన్ కి చెబితే తను కాదనడు..... నాకు తెలుసు ..... అయినా ఏమీ బయట పడకుండా "జీవన్ ని అడుగు ..... వాడు ఓకే అంటే కమలని నేను ఒప్పిస్తాను" అన్నాను. అమ్మ వాడికి ఫోన్ చేసింది. ఒక అరగంట ఏం మాట్లాడిందో కానీ నవ్వుతూ ఫోన్ పెట్టేసి "నాకొడుకు నా మాట కాదనడు..... ఇంకా నీదే బాధ్యత .... నాన్నని అంటావా ఆయనే ముందు ఈ ఆలోచన నా ముందు పెట్టారు" అంది. నేను కూడా ఆలోచించాను "ఇది ఎవరికీ తెలియదు. మా ఇద్దరి మధ్యా ఉన్న రహస్యం. అసలు తను ఆడదానిగా మారడానికి పురికోల్పిందే నేను. ఇక నా వదిన గా జీవితాంతం నా ముందే ఉంటుంది కాబట్టి మేమిద్దరమూ మంచి స్నేహితులుగా ఉన్నాము ... అదే విధం గా వదినా ఆడపడుచులుగా కూడా ఉండగలం. ఈ రహస్యం మా మధ్యనే ఉండిపోతుంది" అనుకున్నాను మనసులో. ఆ సాయంత్రం కమల్ దగ్గరికి వెళ్లాను .... తను లైట్ కలర్ నైటీ లో చూడముచ్చటగా ఉంది. కమలా! నేను నిన్నొకటి అడుగుతాను. నీకిష్టమైతే వచ్చి నా ప్రక్కన కూర్చో .... లేకుంటే ఉన్న చోటనే కూర్చో అన్నాను. కమల ఏమిటో అంత సీరియస్ మాటర్ అంటూ ఉండగానే నేను "నిన్ను మా అమ్మ నాన్న తా ఇంటి కోడలిని చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు. నీకిష్టమేనా చెప్పు అని అడిగాను. తను అస్సలు ఆలోచించలేదు వెంటనే వచ్చి నా ప్రక్కన కూర్చుని నన్ను ఆలింగనం చేసుకుని "ఇప్పటివరకూ నేను నాకిష్టమైన విధంగా ఆడదానిగా మారినా నా తరువాతి జీవితం ఏమిటి అనే ఆలోచనలతో చచ్చి పోతున్నాను ప్రమీ! కానీ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు తెలుసుగా? మరి మీ అన్నయ్య కు ఆ నిజం చెప్పు అంది. నేను వెంటనే ఫోన్ చేసాను. వాడు అవతల్నుండి మంచి జోష్ లో ఉన్నట్లున్నాడు "థాంక్ యు ప్రమీ! కమల ని ఒప్పించి నందుకు. నాకు ఇష్టమైన అమ్మాయి నాకు భార్యగా రావడమే కాదు ..... ఇంటిల్లిపాదికీ నచ్చడం నాకు ఆనందం గా ఉంది" అన్నాడు. నేను "అరేయ్! ఒక సీరియస్ విషయం నీతో చెప్దామని ఫోన్ చేసాను .... అని తనకు మొన్న పొత్తికడుపు లో దెబ్బ తగిలింది కదా అప్పుడు డాక్టర్ తనకు భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాసం లేదని చెప్పారు .... అమ్మకు చెబితే బాధ పడుతుందని చెప్పలేదు ...... మరి ఆలోచించు నీ కిష్టమైతే తనకు కూడా ఇష్టమే .... తను నీ భార్య కావడం కంటే అదృష్టమే లేదని మురిసిపోతుంది ... ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే" అన్నాను. తను ఒక ఐదు నిమిషాల తరువాత "ప్రమీ! ఎవరికీ ఈ విషయం చెప్పనక్కరలేదు. ప్రపంచం లో పిల్లలు పుట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు ..... ఈ విషయం పెళ్ళైన తరువాత తెలిస్తే ఏమి అయ్యేది. మన ముగ్గురి మధ్యే సమాధి చేసెయ్యి ఈ విషయం అన్నాడు .... కమలని పెళ్ళికి రెడీ అవ్వమను ..... థాంక్ యు ఒన్స్ అగైన్ ప్రమీ అంటూ ఫోన్ పెట్టేసాడు. ఇదంతా ప్రక్కనే కూర్చుని ఇన్న కమల ఆనందం అంతా ఇంతా కాదు.సరిగ్గా ఒక నెల రోజులకు వాళ్ళిద్దరి పెళ్ళీ ఘనం గా జరిగిపోయింది. జగదీష్ కి కూడా విషయం చెప్పలేదు. కమల్ వాళ్ళ దూరపు చుట్టాలు అని కమలే పరిచయం చేసాడు అని మాత్రమే చెప్పాను ..... కమల్ పోలికలలో ఉంది కదూ మీ వదిన అని మాత్రమే అన్నాడు.
నెక్స్ట్ డే మేఘాలయలో శోభనం ఏర్పాటు చేసాం ..... నేనే ముస్తాబు చేసాను కమలని. తెల్లని పట్టు చీరలో, మల్లె పూల అలంకరణలో నగల నిగారింపులో తను ఒకప్పటి మగాడే అన్న విషయమే గుర్తుకు రాలేదు నాకు. చేతిలో పాలగ్లాసుతో మా అన్నయ్య ఉన్న రూం లోకి అడుగుపెట్టింది మా వదిన కమల. మరుసటి ఉదయం సరిగ్గా 8 గంటలకు బయటకు వచ్చింది మా కమల వదిన. నలిగిపోయిన చీరలో .... పెదవి పై గాట్లు .... చెదరిన జడ ... నన్ను చూసి సిగ్గుగా నవ్వింది. నేను కౌగిలించుకుని కంగ్రాట్స్ వదినా అని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను .... ఇదంతా నువ్విచ్చిన భాగ్యమే అంటూ తను కన్నీళ్లు నిండిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పింది. నాకు అర్ధం కావడం లేదు "ఒక నిక్షేపమైన మగాడిని ఆడదానిగా మార్చి నేను మంచి చేసానా పాపం చేసానా? ఆ దేవుడే చెప్పాలి