Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రానా సంగ్రామ్ సింగ్...by kittiboy
#4
ఇలా మొదలైన పన్నాగాలపరంపర తో అరబ్బుల పాలన మన దేశం లో మొదలైనది.
నా తండ్రి రైమాల్ నుండి నాకు మేవాడ్ సంస్థానం దక్కింది. మన హిందూ దేశం ఇలా అస్తవ్యస్తం కావటానికి ప్రధాన కారణం ఐక్యత లేకపొవటం .అందువల్ల చిన్న రాజ్యాలన్నీ ఏకతాటి పైకి వచ్చేలా కృషి చేసాను .
నా గురించి తెలుసుకునే ముందు నా శత్రువు బాబర్ గురించి మీరు తెలుసుకోవాలి .అరబ్బు ఎడారిలో ఒక పేరున్న కిరాతక వీరుడు బాబర్. తన ధైర్యసాహసాల గురించి తన దగ్గర ఉన్న కవులతో గ్రంధాలు రాయించేవాడు బాబర్. బాబర్ యుద్ధ నీతి ఆటవికం గా ఉండేది.ఊచకోత తనకు ఆటవిడుపు. రాజ్యాల కోసం తోబుట్టువులను మట్టునపెట్టే చరిత్ర కలిగిన వారు.
ఇబ్రహీం లోడి ఢిల్లీ సంస్థానాధీశుడు ,ఇతను బాబర్ దండయాత్రను సమర్ధవంతంగా తిప్పి కొట్టాడు .వేల ఏనుగుల బలం కలిగిన లోడి బాబర్ తుపాకులను ,ఫిరంగులను లెక్క చేయలేదు .కానీ అతని మావయ్య ఆలం ఖాన్ లోడి సింహాసన కాంక్ష తో బాబర్ తో కలిసి పన్నాగం పన్నాడు .
పానిపట్టు దగ్గర యుద్ధం మొదలైంది ,బాబర్ తన కొడుకు హుమాయూన్ తో కలసి ౧౦, ౦౦౦ (10000 ) మంది ,ఫిరంగులు ,మందుసామాగ్రి తో వచ్చాడు. లొడి తన సామంతులు రహస్యం గా ౧, ౫౦, ౦౦౦ (150000 ) సైన్యం పోగయ్యింది .దీంతో బాబర్ హడలిపోయాడు .చేసేది లేక యుద్ధం మధ్యలో ఆలం ఖాన్ లోడి తన మేనల్లుడు ఇబ్రహీం లోడి ని వెనుక నుండి పొడిచాడు .రాజు చెనిపోయేసరికి సైనికులు మిన్నకుండిపోయారు .ఇంతలో బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి చెనిపోయాడని పుకారు పుట్టించారు .దగాకోరు తనం తో ఢిల్లీ ని చేజిక్కించుకున్నాడు బాబర్ .
లోడి మీద యుద్ధానికి నేను బాబర్ కి సహాయం చెయ్యలేదని నేను తనని నమ్మకద్రోహం చేసానని పుకార్లు పుట్టించాడు .
ఇబ్రహీం లోడి ని నేను ధోల్పూర్,కటోలి యుద్ధాల్లో రెండు సార్లు ఓడించాను .

ఇబ్రహీం లోడి ని నేను ధోల్పూర్,కటోలి యుద్ధాల్లో రెండు సార్లు ఓడించాను .
ఇబ్రహీం లోడి కొన్ని వేల మంది సైన్యం తో నా మీదకు యుద్దానికి వచ్చాడు .వందల ఏనుగులు, బలమైన అశ్వదళం తో రాజపుత్రుల సహకారం తో వేళా సైన్యాన్ని తునాతునకలు చేశాను .కటోలి లో పోరాటం లో నా కుడిచెయ్యి పోగొట్టుకున్నాను.
బాణం వచ్చి గుచ్చుకోవడం తో నడక కుంటుబారింది .
తర్వాతి రోజు మేవార్ సంస్థానం లో సభ ఏర్పాటయింది.
నేను సభకు వచ్చి మంత్రుల మధ్యలో కూర్చున్నాను .అందరు ఆశ్చర్యపోయి మహారాజ ఏమిటిది అన్నారు .
నేను ఇలా బదులిచ్చాను "రాజు పరిపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే రాజ్యం ప్రజ్వరిల్లుతుంది ,నేను ఆ పరిస్థితి లో లేను ,కాబట్టి యోగ్యులకు రాజ్యాధికారం కట్టబెట్టండి అని చెప్పను. "
అప్పుడు సామంతులు అందరు ఇలా అన్నారు ,రాజా గుండెధైర్యం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు .అయినా మీరు మీకున్నది అవిటి తనం అనుకుంటున్నారు ,మేము యుద్దవీర సంకేతం అని అనుకుంటున్నాము. గుండెధైర్యం,పోరాటపటిమ మీ వద్ద పుష్కలం గా ఉంది ,అరబ్బులను నిలువరించి మాతృభూమి ని కాపాడ గల బెబ్బులి మీరే అని సింహాసనం మీద రాణా ని కూర్చోబెట్టారు .
ఇంతలో ధోల్పూర్ లో ఇబ్రహీం లోడి ,గుజరాత్ మరియు మాల్వా సుల్తానులతో కలసి సైన్యం తో దాడి చేసాడు .సైన్యం సమకూర్చుకోవడానికి సమయం లేక మాకు మూడింతలు ఉన్న సైన్యం తో కలబడ్డాము . ఒంటిచేత్తో మూడు పెద్ద రాజ్యాల సైన్యాల్ని మట్టికరిపించాను .అశ్వదళం యొక్క వేగాన్ని సుల్తానులు నిలువరించలేకపోయారు .దాంతో లోడి ఆక్రమించుకున్న రాజ్యాలన్నీ వారి రాజులకు అప్పగించాను.
ఇప్పటివరకు పక్కలో బల్లెం లాగా ఉన్న గుజరాత్ సుల్తానుని కూడా గర్వం అణిచి ప్రాణభిక్ష పెట్టాను.
ముందు అన్ని యుద్ధాలలో శత్రువుని ఓడించడం ఒకటే విజయం ల భావించాను,యుద్ధం తర్వాత వారిని గౌరవం గా సామంతులను చేసుకునేవాడిని .అది నా పూర్వికులు నేర్పిన పాఠం .యుద్ధం అంటే శత్రువుని జయించడం మాత్రమే, చంపడం కాదు అని. ఓడించిన రాజ్యాల ప్రజలను కూడా క్షమించి వదిలేసేవాడిని .అలా చేయడం వాల్ల వారిలో నాకు గౌరవం పెరిగింది .
ఉత్తరభారతం లో అందరి సుల్తానులను ఓడించాను ,నా గురించి వింటే బాబర్ కు వెన్నులో చలిపుట్టింది .వెంటనే నా మీద విజయం దక్కాలని మద్యం మాని వేసాడు .సైన్యం తో ఈ యుద్ధం పవిత్రమైనదని ,ఎలాగైనా గెలిచి స్వర్గసుఖాలు అనుభవించాలని మనోధైర్యం నూరిపోశాడు .
ఆ రోజు రానే వచ్చింది .

సంధి కోసం రైసెన్ రాజు శిలాహాది ని బాబర్ వద్దకు పంపాను.బాబర్ యుద్ధం అనివార్యం అని శిలాహాది చేత వార్త పంపించాడు .
నా వ్యూహం ఏమిటంటే కుడివైపు పటాలాన్ని బాబర్ కొడుకు హుమాయూన్ చూస్తున్నాడు .ఎడమవైపు అరబ్బు వీరులు ఉన్నారు . మధ్యలో బాబర్ ఉన్నాడు .
బాబర్ వద్ద ఫిరంగులు ఉన్నాయని వేగుల ద్వారా తెలిసి ఏనుగులకు చెవులచుట్టూ దొంతరలు కట్టాము .
కుడివైపు ఉన్న పటాలన్ని నేను అశ్వదళం తో దాడి చేశాను .ఫిరంగుల దెబ్బతో మా దళం కకావికలైనా ఎదురొడ్డి పోరాటం సాగించాము .
శిలాహాది ని మా కుటుంబం లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఒప్పందం కుదుర్చుకున్నాము .కానీ నీచుడికి అది సరిపోలేదు .బాబర్ కి తొత్తు గా మారి నన్ను ముంచేశాడు .
ఎడమ వైపు వాడిని చూసుకోమని చెప్పాను ,౩౦౦౦౦ సైన్యం తో సరైన సమయం లో బాబర్ దగ్గరకు వెళ్ళిపోయాడు ,మాతృభూమి కి తీరని అన్యాయం చేసాడు ,రెండు వైపులా సైన్యం చుట్టుముట్టడం తో మా బలగం రక్తసిక్తం అయ్యి ఆత్మరక్షణ లో పడింది ,అప్పుడు బాబర్ సైన్యం కొత్త ఆయుధాన్ని తీశారు .చేతి లో ఒక గొట్టం తో పేలుస్తున్నారు ,నా సైన్యం లో ఒక్కొక్కరు నెలకొరుగుతున్నారు. ఇంతలో ఒక గుండు నాకు తగిలింది ,స్పృహ తప్పి పడిపోయాను .సైన్యం నన్ను అడవుల్లోకి తీసుకెళ్లింది.
నా పరాజయం నా మాతృభూమి కి అశనిపాతం అయ్యింది.
అడవుల్లో సైన్యాన్ని పోగుచేసాను ,మళ్ళీ బాబర్ పై యుద్ధభేరి మోగించడానికి ........
ఇంతలో తనను ఎక్కడ చంపుతానోనని శిలాహాది నన్ను విషప్రయోగం చేసి చంపేశాడు .........
నేను రాణా సంగ్రామ్ సింగ్ ఆత్మ ని ....చిత్తోర్గర్ కోట చుట్టూ తిరుగుతున్నాను ....ఎప్పటికైనా నా వారసులు వస్తారు అని ,నా కోరిక తీరుస్తారని ......
Like Reply


Messages In This Thread
RE: రానా సంగ్రామ్ సింగ్...by kittiboy - by Milf rider - 26-10-2019, 05:46 PM



Users browsing this thread: 1 Guest(s)