Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మత్స్యవల్లభుడు...by kittyboy
#5
ఇంతలో మకరధ్వజుడు ప్రమాద ఘంటికలు విని రాముని వద్ద శెలవు తీసుకుని ద్వారం వద్దకు వెళ్లారు. తనతో నారదుడు కూడా వెళ్లారు.

మకరధ్వజునికి వర్తమానం అందినది.

"ద్వారపాలకా మనకు కాపలాగా ఉన్న మహా సర్పాలు చంపబడ్డాయి. వెంటనే జాగరూకులు కండి "అన్నారు వేగులు.

తన సైన్యాన్ని అప్రమత్తం చేశాడు మకరధ్వజుడు ,నారదుని నుండి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఒక మహాకాయుడు, మహాకాలుని వలె సైన్యాన్ని మట్టికరిపించసాగాడు.

ఇక తాను రంగంలోకి దిగాలని మకరధ్వజుడు మహాకాయుని వద్దకు వెళ్ళాడు.

అప్పుడు మహాబలసంపన్నుడు అయిన ఆవీరుడు, "బాలకా ఎవరు నీవు, అచ్చ౦ నాలాగే ఉన్నావు "అని ప్రశ్నించగా?

అప్పుడు నారద మహర్షి కలుగ చేసుకుని "హనుమా! ఇతను నీ పుత్రుడు మకరధ్వజుడు అని చెప్పగా

" దేవర్షీ అదెలా సాధ్యం నేను అస్ఖలిత బ్రహ్మచారిని నాకు పుత్రుడు ఎలా కలిగాడు " అని అనగా

అప్పుడు నారద మహర్షి మకరధ్వజుని జన్మ వృత్తాంతం చెప్పారు.

"బాలకా! నేను నా ప్రాణప్రదమైన రామలక్ష్మణులని విడిపించడానికి వచ్చాను. ధర్మనిరతులైన వారిని విడిపించడానికి సహాయం చెయ్యి, రావణునితో యుద్ధానికి అంతిమ ఘడియలు చేరువయ్యాయి. లోక కళ్యాణనికి నీవంతు సాయ౦ చెయ్యి "అని అన్నారు హనుమ తన కుమారునితో.

అప్పుడు మకధ్వజుడు "తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియనప్పుడు నా ప్రభువు అహిరావణుడు నన్ను ముక్కిలి వాత్సల్యంతో చూశారు.పితృవర్యా! నేను నా స్వామిభక్తిని నిరూపించుకునే సమయం ఇది. కావున మీకు సాయం చేయలేను ",అని ధర్మయుద్ధం మాటలతో మొదలుపెట్టాడు.

"పుత్రా! నీ పేరేమి?" అడిగారు హనుమ.

నాపేరు మత్స్యవల్లభుడు అని సమాధానమిచ్చాడు .

"నీ వివేచనా జ్ఞానానికి నేను మిక్కిలి సంతసించుచున్నాను. నీ స్వామిభక్తి నా స్వామిభక్తితో సమానమయినది.

మనం మన యొక్క స్వధర్మాలను నిర్వర్తిద్దాం " అన్నారు హనుమ.

ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది.

ఎంతసేపటికీ హనుమ మకరధ్వజుని మట్టికరిపించలేకపోతారు.

అప్పుడు తన దివ్యజ్ఞానంతో చూస్తే ఐదు దిక్కులలో ఉన్న ఐదు స్తంభాల మీద ఉన్న జ్యోతి కాంతులు మకరధ్వజుని పై పడుతూ ఉంటాయి.

అప్పుడు హనుమ దీపాలపై గాలి ఊదుతారు. అవి అన్నీ ఒకసారి ఆరలేదు .

ఆగ్రహించిన హనుమంతుడు, బ్రహ్మదేవుని వరాన్ని ఉపయోగించుకుని పంచముఖి ఆంజనేయుడిగా అవతరిస్తారు.

పంచముఖాల నుండి ఒక్కసారిగా ఆ ద్వీప కాంతులని ఆర్పడంతో మకరధ్వజుని తేజస్సు సన్నగిల్లింది . వెంటనే హనుమంతుడు మకరధ్వజుని తన తోకతోనే బంధించి కాళీ ఆలయంలోనికి వెళతాడు హనుమ.

కాషాయ వస్త్రదారులైన రామలక్ష్మణులను కాళికాదేవికి బలివ్వడానికి సిద్ధం చేస్తున్నాడు అహిరావణుడు.

హనుమ కాళికాదేవి విగ్రహాన్ని ప్రక్కకు నెట్టి తానే కాళికగా కత్తితో విగ్రహంలా నిల్చున్నారు.

అప్పుడు దేవికి అహిరావణుడు పంచభక్ష్యపరమాన్నాలతో నైవేద్యం పెట్టాడు . అప్పుడు హనుమ ఆ నైవేద్యాన్నంతా ఒక్క ఉదుటన ఆరగించేశారు.

"దేవి కరుణించింది, ఆమె దీవెన మనకే, చిరుతిండికే ఇంత సంతసమైతే, రామలక్ష్మణులను బలి ఇచ్చిన తరువాత ఎన్ని కోర్కెలు తీరుస్తుందో తల్లి?" అంటూ ముందుకు సాగాడు అహిరావణుడు.

లక్ష్మణుడు రామునితో ,"అగ్రజా! మన హనుమ ఎక్కడ? "అన్నారు.

అప్పుడు రామచంద్రప్రభువు ,"ఇవాళ హనుమ నాకు దేవుని లాగ కనిపిస్తున్నాడు" అన్నారు సౌమ్యంగా.

అహిరావణుడు బలిపీఠం మీద రాముని శిరస్సు వంచి ఉంచమని ఆజ్ఞాపించాడు అప్పుడు రామచంద్రప్రభువు �నేను అయోధ్య చక్రవర్తి ముద్దుల రాకుమారుడను, నాకు తల వంచడం తెలియదు. నీవు ఒకసారి చూపినచో నేను చేస్తాను "అన్నారు. నవ్వుతూ తలవంచి చూపించాడు అహిరావణుడు.

వెంటనే హనుమంతుడు ఒక్క ఉదుటన కత్తితో అహిరావణుని శిరస్సును ఖండించాడు.

ఇక ఆలస్యం చేయకూడదని రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకుని యుద్ధ శిబిరానికి వెళ్ళసాగారు హనుమ.

వెళుతూ బందీగా ఉన్న మకరధ్వజుని చూపించి �రామా! ఇతను నా పుత్రుడు�. అని చూపించాడు. దానికి రాముడు, హనుమా !" నీకు తగిన పుత్రుడు, ముందే నేను కలిసాను. తన తండ్రి గురించి చెప్పమని నన్ను అడిగాడు నీ పుత్రిడికి మన బాల్య విశేషాలు అన్నీ చెప్పాను.

ఇప్పుడు నువ్వు ఇతన్ని ఈ పాతాళలోకానికి రాజుని చెయ్యి, మనకి యుద్ధంలో ఇద్దరు హనుమలు రాముని సేనతో పోరాడతారు."

వెంటనే హనుమ తన పుత్రుని పట్టాభిషేకం చేసి యుద్ధభూమికి ఎగిరి వెళ్ళిపోయారు.

ఏకాకి అయిన అహిరావణుని అంత్యక్రియలు మాత్య్సవల్లభుడు జరిపించారు.

బ్రహ్మాస్త్రం రావణుని వద్ద ఉంది. దాన్ని ఇద్దరు హనుమ, మకరధ్వజుడు వెళ్ళి మండోదరి వద్ద బ్రాహ్మణులులా నటించి, విభీషణుడు దాన్ని దొంగిలించడానికి కుట్ర పన్నారని చెప్పి, దాన్ని వేరే చోట చేర్చమని మండోదరికి చెప్పి, దాన్ని మారుస్తూ ఉండగా తీసుకుని మాయమై పోయారు.

యుద్ధం ముగిసింది. రావణవధ జరిగింది.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: మత్స్యవల్లభుడు...by kittyboy - by Milf rider - 26-10-2019, 04:03 PM



Users browsing this thread: 1 Guest(s)