Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మత్స్యవల్లభుడు...by kittyboy
#4
మత్యవల్లభుడు నారద మహర్షి తో "నన్ను బాల్యంలో ఎవరు పెంచారో తెలియదు నేను ఆలనాపాలనకు నోచుకోలేదు .కానీ మా మహారాజు అహిరావణూడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాత్స్యల్యంతో చూచేవారు బాల్యంలో ప్రేమను రుచి చూసింది ఆయన వల్లే ,కానీ మిగిలిన పిల్లలు గేలి వల్ల చాలా భాధపడేవాడిని. తల్లి తండ్రులు ఎవరో తెలిసేది కాదు మహర్షి మీ పుణ్యం వల్ల నేను నా మాత పితలను తెలుసుకోగలిగాను. జన్మధన్య మైనది .నాతండ్రి గారి గురించి ఇంకా చెప్పండి అన్నాడు.
నారదుడు ఇలా చెప్పారు "యువరాజు హోదాలో అన్నీ రాచమర్యాదలు జరిగేవి అంజనీపుత్రునికి.. ఆంజనేయుడు ఉరుకులు ,పరుగులు తో పాకుతూ ఉంటే అందరికీ ఆనంద౦గా ఉండేది . మిగిలిన వానరులకు చాలా తేజస్సుతో ఉండేవారు .వానర వాలం చాలా ముద్దుగా ఉండేది.అందంగా ఉండేది."


మత్య్సవల్లభుడు నారదునితో "మీరు అంజనీపుత్రుడు అంటారు .కానీ అందరూ హనుమంతుడు అంటారు" అని సందేహం వెల్లబుచ్చాడు. "బాలా , అంజనీపుత్రుడు ఒక రోజు ఆరుబయటపాకుతూ ఉండగా ఎర్రని పండు చూసి దాని అందుకోబోయాడు పవన వరప్రసాది అయిన ఆంజనేయుడు. ఒక్క ఉదుటున సూర్యుని వైపు వెళ్ళసాగాడు. శివ ప్రకాశంతో వెలుగొందుతున్న ఆంజనేయుని చూసి పరమేశ్వరా ప్రణామములు అంటూ సూర్యుడు చేతులు జోడించి నమస్కరించాడు .
అప్పుడు రాహువు సూర్యుని మింగబోతే తన పరాక్రమంతో ఆంజనేయుడు రాహువును తరిమి కొట్టాడు. రాహువు ఇంద్రునితో మొరపెట్టుకున్నాడు.ఇంద్రుడు తన మాట ఎక్కడ పోతుందో అని యుద్దానికి వచ్చారు .ఆంజనేయునిపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.వజ్రాయుధం ఆంజనేయుని దవడ ఎముకకు తగిలింది. దాంతో సృహ కోల్పోయాడు. విగతజీవిగా ఉన్న కుమారుని చూసి అంజనీదేవి స్తంభించిపోయింది.వాయుదేవుడు హూతశుడయ్యి గాలిని నిర్భంధించాడు.సకల జీవరాశులు అష్టకష్టాలు పడ్డాయి ".అప్పుడు ముక్కోటి దేవతలు ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు సృహతప్పిన బాలుని మరల జీవితున్ని చేశారు.
దవడ ముందుకు రావడం వల్ల హనుమంతుడు అని పేరు పెట్టారు.(హను అంటే దవడ)
ఇంద్రుడు వజ్రకాయం ప్రసాదించారు
సూర్యుడు సూర్యతేజస్సు,
యముడు తన పాశం నుండి రక్షణ ను,
విశ్వకర్మ తను తయారు చేసిన ఆయుధాల నుండి రక్షణను, పొందగలవు అని వరం ఇచ్చారు.బ్రహ్మ బ్రహ్మాస్త్రం నుండి రక్షణను,
వాయువు భూత పిశాచ గణాల నుండి రక్షణను ప్రసాదించారు.
అప్పుడు వాయుదేవుడు శాంతించాడు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, సూర్యచంద్రులు తన ఆధీనంలో ఉండాలనుకున్న రావణుడు సూర్యుని వైపు వెళుతున్న హనుమ తోకను పట్టుకున్నాడు.
రావణ సంహరానికై పుట్టిన పదకొండో రుద్రుడు వెంటనే తోకతో రావణాసురుని చుట్టుముట్టాడు.విడిపించుకోలేక పోయిన రావణుడు ఉక్కిరిబిక్కిరి అవుతుండుగా వివశ్రుడు(రావణ తండ్రి) ఆంజనేయున్ని వేడుకున్నాడు విడిచిపెట్టమని.
సర్వశక్తి సంపన్నుడైన హనుమంతునికి అల్లరి మహా మెండు .ఆశ్రమలలో మునులను,వారి పిలకలను,గెడ్డాలను,అంగవస్త్రాలను,పీకి ఆనందించేవాడు .వానర మూకతో కలసి మునుల పవిత్ర జలాలను లాక్కునేవాడు.ఏనుగులను,సింహాలను గాలిలో గిరాటు వేసేవాడు .
ఇదంతా చూసిన ఒక మహాఋషి కోపంతో �నీ శక్తులన్నీ నీవు మర్చిపోవుగాక �అని ఆవేశంగా శపించి కొంతసేపటికి తేరుకొని బ్రహ్మజ్జ్ఞాని,శివస్వరూపుడు అయిన ఆంజనేయుని చూసి"నాయనా ఎవరైనా ,నీకు గుర్తు చేస్తే నీ శక్తులు నీకు తెలియుగాక" అని వరం ఇచ్చారు.
నారదుడు మత్యవల్లభుడితో ,"బాలక చూశావా గంభీర స్వరూపుడైన నీవు ఎప్పుడైనా ఇలాంటి అల్లరి చేష్టలు చేసేవాడివా".
"లేదు మహాముని నన్ను ఎవరైనా గేలి చేస్తే నేను వారిని గాలిలో ఎగరవేసేవాడిని ,మేము ఆడుకున్నప్పుడు ఏదైనా పాతాళ మృగం మమ్మల్ని దాడి చేస్తే స్నేహితులను కాపాడడానికి నేను దాని మట్టికరిపించేవాడిని .మిగిలిన అందరూ మాంసాహారము తినేవారు.నాకు పండ్లు తప్ప ఏమి రుచించేవికావు.తర్బూజ కాయలు,పుచ్చకాయలు,నా ఇష్టమైన ఆహారం. నా పితృసమానుడైన అహిరావణుడు నా ధైర్య సాహసాలకు మెచ్చి ద్వార నగర రక్షకునిగా నియమించారు."అని చెప్పాడు మత్యవల్లభుడు.

"స్వామి ,నారద మహర్షి మా జనకుల బాలరిష్టాలను చక్కగా వివరించారు ఇందాక మా పితృవర్యులను ఉదహరించి బ్రహ్మజ్జ్ఞాని అని అన్నారు
అదేమిటో చెప్పగలరు" అని మత్యవల్లభుడు అన్నాడు.
"స్వామి ,నారద మహర్షి మా జనకుల బాలరిష్టాలను చక్కగా వివరించారు ఇందాక మా పితృవర్యులను ఉదహరించి బ్రహ్మజ్జ్ఞాని అని అన్నారు
అదేమిటో చెప్పగలరు" అని మత్యవల్లభుడు అన్నాడు.
నారదుడు ఇలా అన్నారు "అoజన దేవి శాపగ్రస్తుడైన తన బిడ్డను చూసి ఎవరైనా మంచి గురువు వద్ద విద్యా బుద్దులు నేర్పించాలి అనుకున్నది.
ఆఖరికి జ్జ్ఞానభాండాగరం అయిన సూర్యభగవానుని వద్దకు పంపిద్దామని కేసరి,అంజన నిర్ణయం తీసుకున్నారు.
వానరునితో సహవాసానికి సూర్యుని వద్ద ఉన్న సప్తర్షి మండలం ఒప్పుకోలేదు ".అప్పుడు సూర్యభగవానుడు హనుమతో ఇలా అన్నారు "వానరోత్తమా! నేను నీకు విద్యను ఉపదేశించడానికి సముఖమే కానీ నేను విశ్వంలో చుట్టూ తిరుగుతూ ఉండాలి ఒక చోట స్థిరంగా ఉండను" అన్నారు.
అప్పుడు సూర్యుని అభిముఖంగా సూర్యునివేగంతో వెనక్కి తిరుగుతూ అంజనీపుత్రుడు విద్యను అభ్యసించారు.
కొద్ది రోజులలో సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన ఆంజనేయుని చూసి ముచ్చట పడిపోయాడు .సూర్యభగవానుడు ఇంకొంత కాలంలో శివుని అంశతో గడపాలని చెప్పి నిన్నటి పాఠాన్ని గుర్తు చేసేవాడు కాదు సూర్యుడు అంజనిసుతుడు శాప ప్రభావం వల్ల గుర్తు చేసుకునేవాడు కాదు
ఇలా కొన్ని నెలల తర్వాత విద్యాభ్యాసం ముగిసింది అని అంజనా దేవి వద్దకు పంపి౦చ ఏర్పాట్లు చేసాడు సూర్యభగవానుడు.
అప్పుడు హనుమ సూర్యునికి నమస్కరించి గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు." నాకు ఏమి వద్దు కానీ నా పుత్రుడు సుగ్రీవునికి నీవు సహాయం చేయాలి.అతడు దీనావస్థలో ఉన్నాడు. అతనికి మంత్రిగా ఉండి నీవు మార్గోపదేశం చెయ్యాలి" అన్నాడు .

మకరధ్వజుడికి కబురు వచ్చింది అహిరావణుడు ఇద్దరు బందీలను కాళీకాలయంలో ఉంచారని,వారు తప్పి౦చుకోకుండా చూడాలని దాని సారాంశం .
వారు ఇద్దరూ ముని కుమారులుగా అగుపించారు.వారిని చూస్తూ వీరెవరని ప్రశ్నించాడు మకరధ్వజుడు . "వీరు అయోధ్య నగర కుమారులు రాముడు,లక్ష్మణుడు �.వారి ముఖారవిందములు చూడగానే మకరధ్వజునికి ప్రశాంతత,దైవత్వం ఉట్టిపడుతూ అగుపించాయి.
నాయనా బాలకా! ఈ రామచంద్రుడు సూర్యవంశ కోవిదుడు.సకలగుణాభిరాముడు అంతకు మించి హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి."ఆ మాట వినగానే మకరధ్వజుడు రామునికి నమస్కరించాడు.
రామచంద్రప్రభువు నారదుని అడిగారు �నారద ఈ బాలకుడు అచ్చం మన హనుమలాగా ఉన్నాడు ,ఎవరితడు."
అప్పుడు మకరద్వజుని జన్మవృత్తాంతం రామునికి వివరించారు దేవర్షి.


రాముని గురించి మకరధ్వజుడు గొప్పగా విన్నాడు .మకరధ్వజుడు తన తండ్రి గురించి రాముని నుంచే వినాలని ఇలా అడిగాడు .
�రామచంద్రప్రభు !మీకు మా తండ్రి గారికి సాంగత్యం ఎలా ఏర్పడింది మా తండ్రి గారి ప్రాణం మీరు ,ఇంత అవినాభావ సంబంధానికి పునాది ఎలా ఏర్పడిందో చెప్పండి", అన్నాడు.
అప్పుడు రాములవారు "నాయనా ,నా చిన్నతనంలో ఒక సాధువు జటఝాటదారి(సాక్షాత్ శివభగవానుడు ) వచ్చి రాజప్రాంగణంలో ఒక గారడీ ప్రదర్శన ఇచ్చారు. ఆయన ఆడించిన ఆటను చూసి మేము సమ్మోహనముతో ఆనందభరితులయ్యాము.
అతని వద్ద ఉన్న బాలుని విన్యాసాలు ఇంకా ఆకట్టుకున్నాయి.
నేను మారాం చేసి వాళ్ళిద్దరినీ ఇక్కడే ఉండిపోమన్నాను, కైకేయి మాతతో చెప్పి కానీ ఆ సాధువు ఒప్పుకోలేదు నేను మారాం చేయడంతో తన వద్ద ఉన్న బాలుడిని మాకు ఇచ్చి వెళ్ళిపోయారు.
బాలుడు తన పేరు హనుమ అని, తనది దక్షిణ దేశం అని చెప్పాడు. మూతి ఎర్రగా ఉండేది. మిగిలిన బాలురు తనను గేలి చేసేవారు. నాకు మాత్రం తాను అంటే మహా స్నేహంగా ఉండేది.
హనుమ రోజూ చిక్కుకున్న గాలిపటాలను విడదీసేవాడు, మా బంతి ఎంత దూరం వెళ్ళినా ఒక్క ఉదుటున గెంతుకుంటూ వెళ్ళి తెచ్చేవాడు. కోట గోదాల్ని అవలీలగా ఎక్కేవాడు. మంచి మంచి మామిడికాయలు, జామకాయలు, కోసుకొచ్చేవాడు.నాకు అలసట వస్తే భుజం మీద ఎక్కించుకొనేవాడు.
మా స్నేహం కాలంతో రెట్టింపయ్యింది. నా ఆంతరంగిక మందిరంలో నా పాన్పుపై శయనించేవాడు హనుమ.
అలా మాతో పెరిగేవాడు హనుమ, ఒక రోజు నేను ఎగురవేసిన గాలిపటం కిందకు రావటంలేదు. అప్పుడు హనుమ గాలిపటం కోసం ఆకాశంలోకి ఎగిరాడు.
ఇంద్రుని మేనకోడలు జయంతి విమానంలో వెళుతూ దాన్ని పట్టుకుంది. ఇంతలో హనుమ వచ్చి ఆమెను గాలిపటం ఇమ్మన్నాడు. ఆమె �ఇంతెత్తు గాలిపటం ఎగురవేసిన యోధుని నేను చూడాలి� అంటే ఆమెను తీసుకు వచ్చి రామచంద్ర ప్రభువుని చూపించాడు హనుమ. ఆమె ఆనందభరితురాలై నేను ఇంద్రలోకం వేగిరంగా వెళ్లాలి, మళ్ళీ మనం ఎప్పుడు కలవగలం అన్నప్పుడు ,రాములవారు అరణ్యవాసంలో కలుద్దాం అని మాటిచ్చారు.
వాయువేగంతో గాలిపటం తీసుకువచ్చాడు కాబట్టి �మారుతి� అని పేరు పెట్టాము.
మేము యుక్తవయస్కులం అయ్యాక హనుమ తాను గురుదక్షిణగా సూర్యునికి ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుని వద్ద రాజ్యపరిపాలనలో సాయం చేయాలని మా వద్ద నుంచి కిష్కిందకు వెళ్లిపోయాడు."
Like Reply


Messages In This Thread
RE: మత్స్యవల్లభుడు...by kittyboy - by Milf rider - 26-10-2019, 04:01 PM



Users browsing this thread: 1 Guest(s)