Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మత్స్యవల్లభుడు...by kittyboy
#3
నారదుడు ఇలా చెప్పారు

"రావణుడు తండ్రి వివశ్రుడు ,బ్రహ్మదేవునికి మనుమడు విశ్రవుడు. పదిమంది ప్రజాపతులలో, ఏడుగురు మహర్షులలో ఒకరాయన"

విశ్రవుని భార్యలు ఇలావద, కైకశి.

ఇలావద ద్వారా కుబేరుడు మరియు ఇద్దరు పుత్రుల్ని పొందాడు.

బాలకా ! రావణుని తల్లి కైకశి (సుమాలి తండ్రి) మీ సంతతికి చెందింది. తన తమ్ములు విభీషణుడు, కుంభకర్ణుడు, సోదరి శూర్పణక. రావణుడు తండ్రి ద్వారా సకల శాస్త్రాలను, తల్లి ద్వారా క్షత్రియ గుణాలను పొందాడు.

రావణుడు శివ భక్తుడు రుద్ర వీణను వాయించడంలో సిద్దహస్తుడు, మహారుద్రుని కోసం ఘోర తపస్సు చేసి కడుపులో అమృత భాండాన్ని వరంగా పొందాడు.

దేవతలు,యక్షులు,కిన్నెరల, కింపురుషులు, ఎటువంటి జంతువుల వల్ల తన మరణం సంభవించకుండా వరం పొందాడు.తన వర బలంలో భూలోకాన్ని ఆక్రమించాడు. సవతి సోదరుడైన కుబేరుని లంకను,అతని సంపదను ఆక్రమించాడు.కుబేరుడు దేవతలను సాయం కోరగా రావణుడు దేవలోకాధిపతి ఇంద్రుడిని ఓడించి దేవలోకాన్ని హస్తగతం చేసుకున్నాడు.
పాతాళలోకాన్ని ఆక్రమించి సోదరుడు అహిరావణున్ని అధిపతిగా చేసాడు.

ఇలా ముల్లోకాలను జయించాడు.

పరమశివుని ప్రియభక్తుడి వల్ల జరిగిన ఈ దారుణాలను దేవతలు ఆయన వద్దే మొర పెట్టుకున్నారు.

శివునికి ఉపాసన చేసే రావణుడు కైలాస ద్వారపాలకుడు నందిని అవహేళన చేసాడు మూపురం చూపించి.

కోపోద్రిక్తుడైన నంది శపించాడు, �నన్ను కోతిలా ఉన్నావని గేలి చేసావు కాబట్టి నువ్వు వానరుని వలన సర్వనాశనం గావింపబడతావు � అని.

రావణుడు పరమశివునికి పది తలలు బలి ఇచ్చాడు.కానీ ఆ బలి వల్ల మహాకాళుడు లోని పదిరుద్రులు మాత్రమే సంతృప్తి చెందారు. పదకొండవ మహారుద్రుడు శాంతించలేదు.

మహావిష్ణువు మానవరూపం దాల్చే సమయం ఆసన్నమైంది.మహాశివుడు విష్ణు అవతారానికి సాయపడతానని చెప్పాడు.

కానీ మానవ శరీరం మాయలకు, మోహాలకు అవలీలగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే శివుడు వానరరూపం దాల్చడానికి పూనుకున్నాడు.

శాంతించని పదకొండవ మహారుద్రుడు భూమి మీద మహాప్రతాపంతో ఆవిర్భవించబోతున్నాడు.

సతీదేవి శివుని అడిగింది. � ఈ మహత్కార్యంలో తనను కూడా భాగం చేయమని � .ఎప్పుడూ తన వద్ద ఉండేలా అందమైన తోకలా ఉండమని వరం ఇచ్చాడు.

అలా రావణాసుర సంహారానికి హనుమంతుని ఆవిర్భావం జరిగింది.


నారదుడు ఇలా అన్నారు ," హనుమంతుడే మీ జనకుడు.లంకాదహనం చేసి సముద్రం పై ఎగురుతున్న హనుమంతుని స్వేదం ఒక చేప నోట్లో పడి నీవు ఆవిర్భవించావు .ఆ మత్స్యమే అహిరావణుడికి దొరికింది ."
మత్స్యవల్లభుడు భావావేశం తో ఉప్పొంగిపోయి నారదుడికి సాష్టాంగనమస్కారం చేసాడు .
అప్పుడు మత్స్యవల్లభుడు నారదుని తన తండ్రి వృత్తాంతం గురించి చెప్పమన్నాడు.
నారద మహర్షి మకరధ్వజునితో ఇలా అన్నారు. � మీ తండ్రి జననానికి చాలా ప్రక్రియ జరిగింది.�
� శివతేజస్సును గర్భంలో ధరించే పుణ్యం చేసుకున్న మహాసాధ్వి అంజనాదేవి.� ఆమె అప్సరస. గత జన్మలో ఆమె పేరు "పుంజికస్ధల". ఇంద్రుని ఒంటినిండా ఉన్న కన్నుల చూసి నవ్వింది ,అందుకు ఇంద్రుడు ఆమెను కురూపిగా మారమని శపించాడు.కానీ లావణ్యమైన అందం ఆమెకు కోరుకున్నప్పుడు పొందగలదు అని చెప్పాడు.
అంజనాదేవి శివుని పరమ భక్తురాలు ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమె పుత్రునిగా ఉండటానికి అంగీకరించాడు .
దశరధ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు, ఆ యాగ ఫలం పాయశాన్ని ముగ్గురు భార్యలకు పంచాడు.
కైకేయికి ఇచ్చే సమయంలో దాన్ని గ్రద్ధ తన్నుకుపోయింది.కౌసల్య,సుమిత్ర తమ భాగాన్ని కైకేయి కు ఇచ్చారు. ఆ గ్రద్ధ ఆ పాయసాన్ని అంజనాదేవి ప్రార్ధన చేసే గుడి దగ్గర జారవిడిచింది.ఆ పాయసాన్ని వాయుదేవుడు అంజనాదేవి చేతిలో పడేలా చేసాడు.
వాయుదేవుని సహకారంలో పుట్టాడు కాబట్టి వాయునందనుడు అని పిలుస్తారు.
అప్పుడు మత్స్యవల్లభుడు ఇలా అన్నాడు. � నారదమహర్షి, మరి మా జనకుని పితృదేవుడు ఎవరు? "
అప్పుడు నారదుడు చెప్పాడు
"కేసరి హనుమ జనకుడు.రాజు అయిన కేసరికి చాలా కాలం పుత్రలాభం కలుగలేదు. దాంతో కేసరి ,అంజనాదేవి ఆకాశ గంగ తీరాన శివుని పరమ భక్తితో ఆరాధించేవారు.కేసరి గొప్ప పోరాట యోధుడు.సాంబసదమడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూ ఉంటే కేసరి అతణ్ణి మల్లయుద్దంలో మట్టికరిపించాడు.
.వానర రాజ్యం లంకాపురికి ఉత్తరంగా ఉండేది. వీరికి ఉత్తరంగా కిరాతార్జునుడు అనే మహారాజు ఉండేవారు. వానరులకు (కేసరి) ఆయన మిత్రుడు. ఉత్తర భారతం పై రావణుడు దండయాత్ర చేసి తిరిగి వస్తుండగా కిరాతార్జునుడు రాజ్యం పై దండేత్తాడు.వర గర్వంతో ఊగిపోతున్న రావణుడు కిరాతార్జునిపై విజయం అలవోకగా భావించాడు . కొలనులో కిరితార్జునుడు స్నానం చేస్తున్నాడు.రావణుడు అతని వద్దకు వెళ్లి లొంగిపొమ్మన్నాడు, ఓటమిని అంగీకరించని కిరాతర్జనుడు తన వెయ్యి చేతులలో సమానమైన కబంధ హస్తాలతో రావణుని ఉక్కిరి బిక్కిరి చేసాడు.విడిపించుకోలేక రావణుడు విలవిలలాడి ఓటమిని అంగీకరించాడు.కిరాతార్జునుడు,రావణుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అని రావణుడు బయట పడ్డాడు.అలాంటి హేమాహేమీలతో ఒక బలమైన వర్గంగా మధ్యభారతం వింధ్యకు దక్షిణంగా పెట్టనికోటగా మిగిలింది..
Like Reply


Messages In This Thread
RE: మత్స్యవల్లభుడు...by kittyboy - by Milf rider - 26-10-2019, 03:59 PM



Users browsing this thread: 1 Guest(s)