Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మత్స్యవల్లభుడు...by kittyboy
#2
అది పాతాళలోకం లంకాపురికి దిగువున వున్న ఈ లోకంలో మనుషులందరు సరిసృపాల రూపంలో ఉంటారు. లంకాపురాన్ని మయ బ్రహ్మ నిర్మించాడు,ఒకప్పుడు కుబేరుని ఆధీనంలో ఉండేది.కుబేరుని సంపద అంతా లంకానగర ఖజానాలోనే ఉండేది.
సకల సంపదలతో తులతూగే లంకాపురిని కుబేరుని సవతి సోదరుడు రావణబ్రహ్మ ఆక్రమణ చేశాడు.రావణుడు తన ఖజానాలో వున్న వజ్ర వైఢూర్యాలను పాతాళలోకంలో దాచాడు.పాతాళలోకానికి తన తమ్ముడైన అహిరావణుడిని రాజుని చేశాడు.పాతాళలోకానికి ద్వారపాలకుడు మకరధ్వజుడు .
పాతాళలోకంలో అందరి చర్మం పొలుసులతో వుంటుంది.ఆకారం సముద్ర జీవుల్లా వుంటారు .కానీ మకరధ్వజుడు వీరికి భిన్నంగా ఉంటాడు. ఒళ్ళంతా వెంట్రుకలతో ఒత్తుగా ఉంటుంది.వజ్రకాయుడిలా ఉంటాడు.దవడ కొంచెం ఎత్తుగా ఉంటుంది మకరధ్వజునికి స్వామి భక్తి మెండు .తన కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించేవాడు.అహిరావణునికి అతని మీద చాలా నమ్మకం .అంతకుమించి వాత్సల్యం ఉండేది. అతడి సహచరులు దీని వల్ల అతడి మీద అసూయ పడేవారు.మకరధ్వజుడుకి కూడా ఒంటరితనం వెంటాడేది.అతడి తల్లి తండ్రులు ఎవరో తనకు తెలియదు.అందరికన్నా అతడు భిన్నంగా ఉండేవాడు,
పాతాళలోకంలో ఒక రోజు అంటే, భూలోకంలో ఒక సంవత్సరం .కాలపరిణామం సముద్రగర్భం వల్ల మారుతుంది .
ఒక రోజు పాతాళలోక రాజు అయిన అహిరావణుడుకి సందేశం వచ్చింది. లంకానగరం దాడికి గురి అయ్యిందని .చాలా మంది లంకాపురి వాసులు పాతాళలోకానికి వస్తారని సందేశం వచ్చింది.అందరికి సదుపాయాలు చూడమని రారాజు ఆజ్జ్ఞ .
మకరధ్వజునికి సందేశం వచ్చింది ఆ సందేశాన్ని తన రాజుకు చూపించాడు . అహిరావణుడుకి ఏం జరిగిందో అర్ధం కాలేదు ,ఏర్పాట్లు చెయ్యమని తన పరివారానికి ఆజ్జ్ఞాపించాడు .మకరధ్వజుడు ఒక్క క్షణం ఆగి "రాజా ! నా తల్లితండ్రులు ఎవరు,నా వృత్తాంతం ఏమిటి? " అని సవినయంగా అడిగాడు.
అప్పుడు రాజు ఇలా చెప్పాడు �మత్స్యవల్లభా ! ఒక రోజు రాజ సభలో ఉండగా నాకు జాలరులు ఒక పెద్ద చేపను బహుకరించారు.దాన్ని వంటవాళ్ళు కోసినప్పుడు అందులో దివ్యతేజస్సు కలిగిన ఒక బుడతడు కనిపించాడు. చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ బుడతడే నువ్వు.ముద్దుగా ఉన్న నిన్ను నేనే పెంచి పెద్దచేశాను . సకల విద్యలు నేర్పించాను.ఈ పాతాళ లోకంలో యోధాను యోధులు కంటే పరాక్రమంలో మేటి అయిన నిన్ను పాతాళలోక పరిరక్షకునిగా నియమించాను.చేప కడుపులో జన్మించావు కాబట్టి "మత్స్యవల్లభుడు" అని పేరు పెట్టాను.
ఈ లోకంలో ఉన్న సిరి సంపదల కోసం యక్షులు కిన్నెరలు, కింపురుషులు దాడులు ఎక్కువగా ఉండేవి. వాళ్ళ దాడులను నువ్వు సక్రమంగా తిప్పి కొట్టావు. అందుకే ఈ దేశపు ధ్వజం అయిన మకరాన్ని నువ్వు కాపాడావు. కాబట్టి అందరూ నిన్ను "మకరధ్వజుడు" అని పిలుస్తున్నారు.
కానీ విచారమయిన విషయం ఏమిటంటే నీ తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు.ఇది నీ జన్మ వ్రుత్తాoతo "అని చెప్పాడు.మౌనంగా విన్నాడు మత్స్యవల్లభుడు.

అంతలో లంకా నగరము నుండి వచ్చిన అసురులు పాతాళలోకానికి చేరుకున్నారు. అందరికీ వారి వారి స్ధావరాల్లో బస ఉండేటట్లు ఏర్పాటు చేసారు.
రాజ దర్బారు నుండి వచ్చిన మకరధ్వజుడు ఏర్పాట్లు చూద్దామని వెళ్ళాడు . మకరధ్వజుడిని చూడగానే అసురులంతా పరుగెత్త సాగారు. అహిరావణుడికి ఈ విషయం తెలిసి అందర్నీ వారించి వారి భయందోళనకు కారణం ఏమిటని అడిగాడు .
అప్పుడు వాళ్ళు చెప్పారు. అసురులు భయకంపితులవుతూ లంకాపురిని దహనం చేసింది ఈ వానరుడే అని పలికారు. అహిరావణుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శివాలయం ప్రధాన పూజారి లంకానగర రహస్య పత్రాలు,దేవుని ఆభరణాలు తీసుకొని పాతాళలోకంలో దాయడానికి వచ్చాడు. నందీశ్వరుడు అని పేరుగల ఆయన తన పురవాసుల పరిస్ధితి చూసి వారికి చెప్పాడు .
"లంకాపురి వాసులారా ! మన సుందర లంకాపురాన్ని నామరూపాలు లేకుండా అగ్నికి ఆహుతి చేసినది వానరుడు ,రామదూత ,అతులిత బలధాముడు ,అంజనీ పుత్రుడు హనుమంతుడు".
ఇతను మకరధ్వజుడు స్వామి భక్తిపరాయణుడు. పాతాళలోకవాసి అని సర్ధి చెప్పాడు.
హనుమంతుని పేరు వినగానే మకరధ్వజుడికి ఒళ్ళు జలదరించింది,గగుర్పాటుకు లోనయ్యాడు .మకరధ్వజుడికి మనసులో ఎన్నో ఆలోచనలు స్పురించాయి. హనుమంతుడుకి తనకి సంబంధం ఏమిటి నా జన్మరహస్యం ఏమిటి,అని తర్జనభర్జనలు పడ్డాడు. ఏమి పాలుపోక నందీశ్వరుని వద్దకు వెళ్ళాడు.
నందీశ్వరుడు లంకాపురికి బయలుదేరుతుండగా తన వద్దకు వచ్చిన మకరధ్వజుని చూసాడు. మకరధ్వజుడు నందీశ్వరునికి నమస్కరించి తన జన్మరహస్యాన్ని తెలిస్తే చెప్పమని ప్రాధేయపడ్డాడు . నందీశ్వరుడు తనకు తెలియదని లోకకల్యాణ కారకుడైన నారదుని ఉపాసించమని చెప్పి వెళ్ళిపోయాడు.

మకరధ్వజునికి తను రాముని శిబిరానికి వెళ్ళి వస్తానని చెప్పి జాగ్రత్తగా ఉండమని అహిరావణుడు నుంచి తనకు వర్తమానం వచ్చింది .
మకరధ్వజుడు కావలి కాస్తూ నారదమహర్షిని ఉపాసించ సాగాడు.
నారద మహర్షి ప్రత్యక్షమై మకరధ్వజునికి ఏం కావాలో కోరుకోమన్నాడు.
అప్పుడు మకరధ్వజుడు "దేవర్షి,నాకు నా జన్మవృత్తాంతము గురించి తెలుసుకోవాలనుంది.
నా మాతృమూర్తి,పితృదేవులు గురించి తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది.
ఈ పాతాళలోకంలో మిగిలినవారితో కంటే భిన్నంగా ఉన్నాను. మహారాజు నన్ను పుత్రవాత్యల్యంతో చూసినా ఏదో తెలియని ఒoటరి తనం, వ్యాకులత నన్ను ఆవహించినవి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నా మనస్సుకు ప్రశాంతత చేకూర్చ ప్రార్ధన." అని నమస్కరించాడు
అప్పుడు నారద మహర్షి బాలకా, "మొదట నీవు తెలుసుకోవలసినది నీ మహారాజు సోదరుడు రావణ బ్రహ్మ గురించి "అని రావణుడు గురించి చెప్పసాగాడు.
Like Reply


Messages In This Thread
RE: మత్స్యవల్లభుడు...by kittyboy - by Milf rider - 26-10-2019, 03:57 PM



Users browsing this thread: