24-10-2019, 06:17 PM
ఆ రోజు సాయంత్రం ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను. తను వచ్చింది, వచ్చి రాగానే ఇక్కడ దగ్గర్లో నే మీ అన్నయ్య ఉన్నాడు, ఈ రోజు మన ఊరు బైక్ పైనే వెళ్లొచ్చు అంది. నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి లాలాచెర్వు స్టాప్ దగ్గర బస్సు దిగాము. తను వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది. అతను బైక్ పై వచ్చాడు. నన్ను అదోలా చూస్తూ వీడేవడు అన్నాడు, ఆమె మా చిన్న మామయ్య కొడుకు మన పక్కఊరే, మన పెళ్ళికి అరటి గెలలు సప్లై చేసారు గా ఆ మామయ్య అంది, ఓహ్ వాడా సర్లే బండి ఎక్కు అన్నాడు, సునీత మాత్రం వీడు కూడా మనతో పాటే వస్తాడు ప్లీజ్ అంటోంది. వాడు నీకేమన్న పిచ్చా వాడేవడినో మనతో రమ్మంటున్నావ్ అని కసురుతున్నాడు. అప్పటిదాకా ఓపిగ్గా ఉన్న నేను, ఇక కోపం తన్నుకొచ్చి ఒదిన నేను వెళ్లిపోతాను, మీరు వెళ్ళండి అని వచేస్తున్నాను. తను వెంటనే వాళ్ళ ఆయనతో వాడు కూడా మనతో వస్తున్నాడు, వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసే ఫామిలీ అన్నది, దానికి వాడు సర్లే తగలడమను అంటూ నన్ను మరింత రెచ్చగొట్టాడు. సునీత మద్యలో సైడ్ కి కూర్చుంది. నేను వెనకాల రెండువైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాను. తను ఏదేదో చెప్తుంది, మా ఇద్దరితోను మాట్లాడుతుంది.