Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కవ్వింత... by ramesh
#5
ఏంటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావ్?" అంది చేతిలోని పాలని అతనికి అందిస్తూ.
"ఏం లేదు మేడం" అంటూ ఆమె చేతిలోని పాలు అందుకున్నాడు.
"ఎలా ఉంది ఇప్పుడు?"
"పర్లేదు మేడం. కొంచెం నొప్పి తగ్గింది"
"కాసేపు ఆగు మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు"
"నాకేం పర్లేదు మేడం. రేపు ఉదయనికంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే వెళ్ళిపోతాను"
"ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎన్ని చెప్పినా వారం రోజులు ఇక్కడ ఉంది తీరాల్సిందే"
వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి రాఘవేంద్ర మెడికల్ కిట్ తో వచ్చాడు. బెడ్ పై ఉన్న మహేష్ ని చూసి దగ్గరికి వచ్చి "అమ్మా గాయత్రీ...ఎక్కడ మహేష్?" అని అడిగాడు.
అతడి వెనకాలే అమృత, మూర్తిలు కూడా వచ్చారు.
"మీకు కూడా తెలుసా మహేష్?" అని అడిగింది అమృత రాఘవేంద్రని.
"తెలుసమ్మా. మీ నాన్న దయ వల్ల" అని మహేష్ వైపు చూసి "హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ?" అని అడిగాడు మహేష్ ని.
"నెవర్ బెటర్ డాక్టర్" అని బదులిచ్చాడు.
కాసేపు అతడిని చెక్ చేసి, అతడి చేతికున్న కట్టుని మార్చి బయటకు వెళ్ళిపోయాడు.
అతడి వెనకాల మూర్తి, మూర్తి వెనకాల గాయత్రీ బయటకు వెళ్లిపోయారు. కానీ అమృత మాత్రం వాళ్ళ వెనకాలే వెళ్లినట్లు వెళ్లి తలుపు కాస్త దగ్గరగా వేసి మహేష్ దగ్గరికి వచ్చింది.
రూంలో అమృత ని చూసి మళ్ళీ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యాడు మహేష్.
"హ్మ్" అని నిట్టూర్చి అతడి పక్కనే కూర్చుంది అమృత.
ఆమె అలా కూర్చోగానే టక్కున లేచి నిలబడ్డాడు మహేష్.
"ఏమైంది?" అని అడిగింది అమృత.
"ఏమి లేదు మేడం?"
"అబ్బా మళ్లీనా? ఇందాకే కదా అమ్ము అని ముద్దుగా పిలిచావ్?" అని అడిగింది.
"ఎంతైనా మీరు మా బాస్ కూతురు"
"నేను నీకు బాస్ కూతురిగా పరిచయం అయ్యానా?"
"కాదు. కానీ....." అంటుండగా అతడి సెల్ మోగింది.
అతడికి దూరంగా ఉంది ఫోన్. మహేష్ అందుకునేలోపు అమృత వెళ్లి తీసుకుంది.
చూస్తే "అరుణ కాలింగ్" అని ఉంది.
ఫోన్ లిఫ్ట్ చేసి "హలో" అంది.
"హలో ఎవరు?" అంది అటు వైపు నుండి. చాల స్వీట్ గా ఉంది ఆమె వాయిస్.
"మీరెవరు?" అంది అమృత దబాయిస్తున్నట్లు.
"మహేష్ లేడా?" అని అడిగింది.
"మహేష్ తో ఏం పని?" అని అడిగింది.
"ఇంకా ఇంటికి రాలేదు. అందుకని"
"అయినా ఫోన్ చేసి అడగడానికి నువ్వు ఎవరు?" అంటుండగా మహేష్ ఆమె చేతిలోని ఫోన్ ని తీసుకుని "అరుణ నేను రావడం కుదరదు మీరు ఏం ఖంగారు పడకండి" అన్నాడు.
"తానెవరు?" అని అడిగింది.
"తాను మా బాస్ కూతురు. నేను తరువాత ఫోన్ చేస్తాను" అని కాల్ కట్ చేసాడు.
"రేయ్ ఎవర్రా అది? వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్లడం ఏంటి?" అని ఆరా తీయసాగింది.
"తను మా ఇంటి ఓనర్ కూతురు"
"ఇంటి ఓనర్ ఏంటి?"
"మీకు ఇక్కడ ఇల్లు ఉంది కదా?"
"లేదు అమృత. మా డాడీ కి బిజినెస్ లో లాస్ రావడం తో అన్ని అమ్మేసి ఆత్మహత్య చేసుకున్నాడు"
"మరి మీ మమ్మీ"
"ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక పది రోజుల్లో అమ్మ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది"
"అయ్యో...! ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు. ఎక్కడో మారుమూల వ్యక్తి లాగా ఎందుకు ఉంటున్నావ్?"
"అన్నీ విషయాలు అందరూ చెప్పుకోలేరు. అయినా నేను బతకడమే కష్టం అయ్యింది నాకు. అటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎలా పోషించగలను"
"అందుకని దూరం అయ్యావా?"
"అవును" అన్నాడు తల దించుకుంటూ.
చెంప పై గట్టిగా ఒకటి కొట్టి "నీ సుఖాలు నాటో పంచుకుంటుంటే నీ బాధలను కూడా అలాగే షేర్ చేసుకుంటావ్ అనుకున్నాను. కానీ నన్ను పరాయి దాన్నిచేస్తావ్ అనుకోలేదు"
"నేను అలా ఆలోచించలేదు. నా కష్టాలు..."
"నాకు చెప్పి నన్ను బాధపెట్ట కూడదు అనుకున్నావ్. అంతేనా" అంది అతడి మాటలకు అడ్డుపడి.
"అవును" అన్నట్లు తల ఊపాడు మహేష్.
"ఏమనుకున్నావ్ రా నా గురించి" అంది అతడి కాలర్ పట్టుకుని.
"ప్లీజ్ అమృత మన మధ్య జరిగింది మర్చిపో"
"మర్చిపోయి?"
"నీకు మంచి భవిష్యత్తు ఉంది"
"మళ్ళీ మళ్ళీ అదే పాట పడొద్దు సాయి"
"నన్ను అర్థం చేసుకో అమృత"
"ఇంక నేనేమి వినను. నువ్వు కూడా నాకేమి చెప్పకు" అతడిని కౌగిలించుకుంటూ.
మహేష్ ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అమృత. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే మొండిగా ఉంది.
"నీ మొండితనం నీదేనా? నా మాట వినవా?" అన్నాడు మహేష్.
"నువ్వు దూరం అవుతానంటే నీ మాటేంటి నా మాట కూడా వినను" అంది ఆమె కౌగిలిలో అతడిని ఇంకా బంధిస్తూ.
"ప్లీజ్ అమృత నిన్ను, నన్ను సార్ ఇలా చూస్తే నా ఉద్యోగం పోతుంది"
"సార్ కాదు మావయ్య"
"సర్లే ఆయన్ని సార్ అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు. అలాంటిది మావయ్య అని పిలవడమా? నో వే"
"ఏయ్...! మా ఆయన్ని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడవనుకో..." అంది అమృత మహేష్ కాలర్ పట్టుకుని.
"ఆయనెవరు?"
"నీకెందుకు?"
"సర్లే ఇక వెళ్ళు" అన్నాడు ఆమె చేతులలో నుండి అతడి కాలర్ విడిపించుకుని.
"ఇప్పుడు కాదు నీ పని అందరు నిద్రపోయాక చెబుతా" అంది కొంటెగా.
ఆమె అన్న విధానానికి మహేష్ కి కూడా నవ్వు వచ్చేసింది. మహేష్ అలా నవ్వుతుంటే చూస్తూ ఉంది అమృత.
"ఏంటమ్మా మహేష్ అంతగా నవ్వుతున్నాడు?" అంటూ లోపలికి వచ్చాడు మూర్తి.
"ఏం లేదు సార్ మేడం జోక్ వేస్తె నవ్వుతున్నాను" అన్నాడు అమృత వైపు చూసి.
"అతడిని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వమ్మా. నువ్వు నీ రూమ్ కి పద" అంటూ పిలిచాడు.
"అలాగే డాడీ వస్తున్నా పద" అంది.
అక్కడి నుండి వెళ్ళిపోయాడు మూర్తి. అమృత వెళ్తూ మహేష్ నడుము పై గిచ్చి "ఇంకోసారి మేడం అన్నావో చంపేస్తా" అని చిన్నగా కన్ను గీటి వెళ్ళిపోయింది. కెవ్వుమని అరవబోతు అతడి నోటికి తన చేతిని అడ్డు పెట్టుకుని మేనేజ్ చేసాడు మహేష్.
అమృత తన రూం లోకి వెళ్లి బెడ్ పై వాలిపోయి మహేష్ నే తలచుకోసాగింది.
*********************************
*********************************
*********************************
ఆరోజు సండే. కాలేజీకి సెలవు. కానీ ఇంట్లో అమృతకి దిక్కు తెలియడం లేదు. వెంటనే మహేష్ కి ఫోన్ చేసింది.
"చెప్పు" అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే.
"ఏం చేస్తున్నావ్ బంగారం" అంది ముద్దుగా.
"ఖాళీగా ఉన్నా బంగారం" అన్నాడు వెటకారంగా.
"ఏంటి ఎగతాళిగా ఉందా?"
"ఇప్పుడు నేనేం అన్నాను?"
"నన్ను ఇమిటేట్ చేస్తున్నావు" అంది కంప్లైంట్ చేస్తున్నట్లు.
"పిచ్చి...నువ్వు కూడా నాకు బంగారం రా" అన్నాడు.
"బయటకి వెళ్దామా?"
"ఎక్కడికి వెళ్దాం?"
"సినిమాకి వెళ్దాం"
"ఆ తరువాత?"
"ఒకటి నేను చెప్పాను. ఇంకోటి నువ్వు చెప్పు"
"సరే అయితే సస్పెన్స్"
"వావ్...ఇంప్రెస్సివ్" అంది ఎక్సయిటింగ్ గా.
"నిన్ను ఆల్రెడీ ఇంప్రెస్స్ చేసాను"
"సర్లే...షార్ప్ టెన్ థర్టీ కి అలంకార థియేటర్ దగ్గరికి వచ్చేసేయ్"
"హే...మార్నింగ్ షోకి వెళ్దామా?"
"అవును నాకు ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. ప్లీజ్ మార్నింగ్ షో కే వెళ్దాం"
"సరే అయితే. నేను రెడీగా వచ్చేస్తాను. డిలే చేయకుండా నువ్వు కూడా వచ్చే"
"సో స్వీట్. ఇదిగో ఇప్పుడే బయల్దేరుతాను" అంటూ మరో అరగంటలో థియేటర్ దగ్గర ఉంది అమృత.
ఆమె వెళ్లేసరికి అక్కడే చేతిలో టికెట్స్ పట్టుకుని ఉన్నాడు మహేష్. నా కంటే ముందుగా వచ్చి అప్పుడే టికెట్స్ కూడా తీసావా?" అని అడిగింది.
"హ హ" అన్నాడు అతడి జుట్టుని ఎగరేస్తూ.
"ముద్దొస్తున్నావ్ రా" అంది మహేష్ బుగ్గలు పిండుతూ.
"సరే పద" అంటూ ఇద్దరూ థియేటర్లోకి నడిచారు.
"అవును ఇంట క్రౌడ్ లో టికెట్స్ ఎలా సంపాదించావ్?" అని అడిగింది అమృత.
"ఈ థియేటర్ మేనేజర్ మన గణేష్ మావయ్య. వాడే రెచొమ్మెంద్ చేసాడు" అన్నాడు మహేష్.
"పర్లేదు దొరగారు బాగానే మెయింటైన్ చేస్తున్నారు"
"ఏంటి?"
"సర్కిల్"
"ఏదో మీ దయ" అన్నాడు నవ్వుతూ. అతడు ఆలా నవ్వగానే అమృత కూడా నవ్వేసింది.
సినిమా స్టార్ట్ అయ్యింది. పది నిమిషాల తరువాత మహేష్ అమృత వైపు చూస్తున్నాడు. "ఏం చేస్తున్నాడో" అనుకుంటూ అమృత కూడా మహేష్ ని చూసింది. ఆమెనే చూస్తున్న మహేష్ ని చూసి "ఏంటి?" అన్నట్లు సైగ చేసింది. 'ఏం లేదు?" అన్నట్లు మహేష్ కూడా సైగ చేసి సినిమా చూడటం ప్రారంభించాడు.
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కవ్వింత... by ramesh - by Milf rider - 23-10-2019, 09:09 AM



Users browsing this thread: 1 Guest(s)