Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కవ్వింత... by ramesh
#4
ఎక్కడికి పోతావు చిన్నవాడా" అని పాడుకుంటూ అమృత బయటికి వెళ్ళిపోతూ మహేష్ వైపు చూసి కొంటెగా నవ్వి "ఈసారి తప్పించుకోవాలని ట్రై చేయకు" అని వెళ్ళిపోయింది.
ఏం చేయాలో అర్థంకావడం లేదు మహేష్ కి. బాగా దెబ్బలు తగిలినందువల్ల అలా పడుకుండిపోయాడు.
**********************************
**********************************
సాయంత్రం అతడు నిద్ర లేచే సమయానికి పక్కనే అమృత కుర్చీలో కూర్చుని ఉంది.
"గుడ్ ఈవెనింగ్ సార్"
"నేను మీకు సార్ ఏంటి మేడం?"
"నీ పెర్ఫార్మెన్స్ తగలెయ్య....! ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు" అంది లేచి నిలబడుతూ.
"ఎక్కడికెళ్లారు?" అన్నాడు మహేష్ కూడా లేచి నిలబడి.
"మమ్మీ డాడీ గుడికి వెళ్లారు"
"మరి మీరు?"
"నువ్వు ఒక్కడివే ఉంటావని నీకోసం ఉండిపోయా"
"అయ్యో...!"
"అయ్యో...! ఏంట్రా? నాలుగు సంవత్సరాల నుండి నీకోసం ఎదురు చూస్తున్నా. నా మీద కొంచెం కూడా జాలి కలగలేదా? ఎంత పిచ్చిగా ప్రేమించాను రా నిన్ను. నన్ను ఎలా వదిలెయ్యాలనిపించింది రా నీకు"
"నా వల్ల నువ్వు సఫర్ అయినందుకు సారీ"
"సారీలు కూడా చేబుతున్నావు. చాలా మారిపోయారండి మీరు"
"అలా మాట్లాడకు అమృత. ఇట్ హర్ట్స్ మి"
"నువ్వు హర్ట్ కూడా అవుతావా?"
"అదేంటి? నేను మాత్రం మనిషిని కాదా?"
"కాదు. నువ్వు మనిషివి కాదు. నన్ను మోసం చేసిన రాక్షసుడివి"
"అర్థం చేసుకో అమృత. నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను? ఇప్పుడెలా ఉన్నాను"
"ఏం జరిగిందో నాతొ చెప్పకూడదా?" అడిగింది మహేష్ కాలర్ పట్టుకుని.
"లేదు అమృత నా జీవితం ఛిన్నాభిన్నం అయ్యింది. ఒంటరి వాడిగా మిగిలిపోయాను. నా చేయి పట్టుకోవాలని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది" అన్నాడు తన చేతుల నుండి కాలర్ ని విడిపించుకుంటూ.
"నువ్వు లేకుండా నా భవిష్యత్తు బాగుంటుంది అని ఎలా అనుకున్నావురా?"
"నేను లేకపోతేనే బాగుంటుంది"
"అయినా నా గురించి నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవరు?"
అలా అనగానే చాలా కోపం వచ్చింది మహేష్ కి.అమృతని కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోయాడు. కొడతాడు అని భయపడిన అమృత తల దించుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. అమృతని అలా చూడగానే ఆగలేకపోయాడు మహేష్. తనని కౌగిలించుకోవడానికి దగ్గరికి వచ్చాడు. కానీ ఎందుకో మళ్ళీ వెనక్కి తిరిగబోయాడు. అది గమనించిన అమృత వెంటనే వాడిని ఆపి కౌగిలించుకుంది.అమృత కళ్ళ నిండా నీళ్లు. ఏం చేయాలో తెలియడం లేదు మహేష్ కి. ఇక చేసేదేమి లేక అమృత ముఖాన్ని తన ఎడమ చేతిలోకి తీసుకోవాలని చూశాడు. కానీ అతడు చేయి పెట్టినప్పుడల్లా తన తలతోనే విదిలిస్తోంది అమృత.
"నువ్వు ఏమి మారలేదు అమృత" అన్నాడు మహేష్ చిన్నగా నవ్వుతూ.
దాంతో అమృత తల ఎత్తి మహేష్ ని కోపంగా చూసింది.
"ఎందుకు మారలేదు. చూడు నీ మీద బెంగతో ఎంత చిక్కిపోయానో. కానీ నువ్వు మాత్రం పందిలాగా లావు అయ్యావు"
"నీకు అలా కనిపిస్తున్నానా?"
"మరి ఇంతకు ముందు నిన్ను హత్తుకుంటే నా కుడి చేయి నా ఎడమ మోచేయి దాకా వెళ్ళేది. ఇప్పుడు చూడు నా మణికట్టు దగ్గరే ఆగిపోయింది"
"సరేలే ఇక వదులు" అన్నాడు తనని విడిపించుకుంటూ.
ఇద్దరూ కౌగిలి నుండి విడిపడిపోయారు.
"అయ్యో నీకొక విషయం చెప్పడం మర్చిపోయా" అంది అమృత తల మీద చేయి పెట్టుకుని.
"ఏంటి?" అన్నాడు ఆశ్చర్యంగా.
"దగ్గరికి రా" అన్నట్లు సైగ చేసింది.
"నేను రాను. వస్తే ఏం చేస్తావో నాకు తెలుసు"
"రాకపోయినా చేస్తా" అంటూ అతడి షర్ట్ పట్టుకుని గుంజి అతడి పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకుంది.
ఐదు సెకన్లు ముద్దు పెట్టి "ఉమ్మా" అంటూ విడిచిపెట్టింది. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు మహేష్ కి. ఇంతలో సిగ్గుతో అక్కడి నుండి పరుగెట్టబోయిన అమృత ని ఆపడానికి "అమ్ము" అని కేకేశాడు మహేష్.
ఠక్కున వెనక్కి తిరిగి "గుర్తుందన్నమాట" అంది.
"ఏంటి?" అన్నట్లు చూశాడు.
"నా ముద్దుపేరు" అని మళ్ళీ మహేష్ దగ్గరకు వచ్చి ఈసారి బుగ్గపై ముద్దు పెట్టి పరుగెత్తుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది.
తాను కిందకి వెళ్ళగానే తన అమ్మా నాన్న కార్ సౌండ్ వినిపించింది అమృతకి. కాసేపటికి మూర్తి, గాయత్రీలు ఇంట్లో అడుగు పెట్టారు.
"మహేష్ కి ఎలా ఉందమ్మా?"
"నొప్పిగానే ఉందంట డాడీ. మీరు ఫోన్ చేసి రాఘవ్ అంకుల్ ని రమ్మని చెప్పండి"
"అవునమ్మా. నేను అసలు ఆ విషయమే మరిచిపోయాను" అని రాఘవ్ కి కాల్ చేసి విషయం టూకీగా చెప్పి తన కిట్ తో ఇంటికి రమ్మని చెప్పాడు.
"మహేష్ కి పాలు ఇచ్చావా?" అని అడిగింది గాయత్రి.
"లేదమ్మా? అతను ఇంకా నిద్రపోతున్నాడు"
"సరే నువ్వెళ్ళి చూసి రా. నేను పాలు కాచుతా" అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది గాయత్రి.
తాను వెళ్లేసరికి అప్పుడే బాత్రూమ్ నుండి బయటకి వస్తున్నాడు. డోర్ మత్ పై కాళ్ళు తుడుచుకుని బెడ్ దగ్గరికి నడవబోతూ కింద పడబోయాడు. అది గమనించిన అమృత వెంటనే మహేష్ ని పట్టుకుని ఆపి ఆమె భుజం అతడి చేతిని వేసుకుని నడిపించుకుంటూ అతడిని బెడ్ పై కూర్చోబెట్టింది.
"ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా?" అంది అమృత.
"తెలియదు" అన్నట్లు తల ఊపాడు మహేష్.
"పోనీ జరగబోతోందో తెలుసా?"
"తెలీదు"
"ఆక్సిడెంట్ బాగా డామేజ్ చేసినట్లుంది"
"నీ మోకాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయా?"
"తగిలాయి" విసుక్కుంటూ సమాధానం చెప్పాడు మహేష్.
"అందుకే బ్రెయిన్ పని చేయడం లేదు అనుకుంటా?" అంది నవ్వుతూ.
"నిన్ను చంపేస్తా" అంటూ లేవబోయాడు.
అక్కడి నుండి అమృత నవ్వుకుంటూ తుర్రుమని పారిపోయింది.
తాను వేసిన జోక్ కి మహేష్ కూడా నవ్వుకుని మళ్ళీ బెడ్ పై తల వాల్చాడు.
ఇంతలో ఇందాక జరిగిన సంఘటన గుర్తుకొచ్చి చిన్నగా తన గతాన్ని నెమరు వేసుకోసాగాడు.
*******************************
*******************************
ఆరు సంవత్సరాల క్రితం
అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అందులో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సాయి మహేష్. తన ఫ్రెండ్ గణేష్ తో పాటు కలిసి కాంటీన్ వైపు నడుచుకుంటూ వెళుతున్న అతడి కాలు పై తొక్కింది అమృత. అప్పుడే అమృతని మొదటిసారి చూశాడు మహేష్.
"ఐ యామ్ సారీ అండి" అంది.
"ఐ యామ్ సాయి మహేష్" అంటూ చేయి చాపాడు.
అలా అనగానే అమృత పక్కన ఉన్న తన ఫ్రెండ్ కావ్య, మహేష్ పక్కన ఉన్న గణేష్ కిసుక్కున నవ్వుకున్నారు. అది చూసి అమృతకి కోపం వచ్చింది.
"ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా?"
అప్పుడే రెస్పెక్ట్ తగ్గిపోయింది తన పిలుపులో.
"ఏ ఇయర్ మీరు?" అని అడిగాడు గణేష్ కోపంగా.
"ఫస్ట్ ఇయర్ అంటూ భయపడుతూ సమాధానం చెప్పింది" కావ్య.
"మరి సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా?"
"నువ్వాగరా" అని గణేష్ ని ఆపి "హలో మిస్ నేనేమి అడ్వాంటేజ్ తీసుకోవాలని అలా అనలేదు. అయినా మీ ఫ్రెండ్ కి ఉన్న సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా లేదే మీకు" అన్నాడు అమృతని చూస్తూ.
"మీ దారిలో మీరు వెళ్ళండి, నేను నా దారిన పోతాను" అన్నాడు మహేష్ మళ్ళీ.
"సార్ సార్" అంటూ ఆపింది కావ్య మహేష్ ని.
"ఏం కావాలి? ఈసారి నువ్వు తిట్టాలని అనుకుంటున్నావా?"
"అదేం లేదు సార్. మాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి. మీ దగ్గరుంటే ఇస్తారేమోనని"
"ఇంతకీ మీలో చేంజ్ ఎవరికీ కావాలి?"
"తనకే సార్?" అంది కావ్య.
"అయితే తననే అడగమను" అన్నాడు మహేష్.
"అడగవే" అంది కావ్య అమృతతో.
"సార్ నాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి" అంది క్యూట్ గా.
తన దగ్గర ఉన్న చేంజ్ తీసి తనకు ఇచ్చి థౌసండ్ రూపీస్ నోటు తీసుకున్నాడు మహేష్.
ఆ డబ్బులు తీసుకుని తన ఫ్రెండ్ తో పాటు కాంటీన్ వైపు నడిచింది.
"అమ్మాయి బాగుంది కానీ పొగరు అనుకుంటా?" అన్నాడు గణేష్ మహేష్ తో.
అప్పటివరకు పట్టించుకోలేదు కానీ అప్పుడే చూశాడు మహేష్. బుంగమూతితో అందంగా ఉంది.
"ఏయ్ నీ పేరేంటి?" అని అడిగాడు మహేష్.
"సారీ" అని అరిచి నవ్వుకుంటూ అక్కడి నుండి చిన్నగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమృత.
"అమ్మనీ ఏం ఝలక్ ఇచ్చింది మామా" అన్నాడు గణేష్.
"నీ అనుమానం నిజమే రా" అన్నాడు మహేష్.
"ఏ అనుమానం?"
"దానికి పొగరు ఉంది" అన్నాడు మహేష్ గణేష్ వైపు చూసి.
ఇద్దరూ కాంటీన్ లోకి అడుగు పెట్టగానే అమృత కనిపించింది. కావ్య, అమృత ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు.
"నువ్వెళ్ళి రెండు కాఫీ తీసుకురా" అని గణేష్ కి చెప్పి మరిత వైపు నడిచాడు మహేష్.
మహేష్ తమ వైపు రావడం గమనించకుండా కాఫీ తాగుతున్నారు ఇద్దరు. ఒక చేతిలో కాఫీ కప్, ఇంకో చేతిలో పర్సు పట్టుకుని నిలబడి ఉంది అమృత. మహేష్ నేరుగా అమృతకి ఎదురుగా నిలబడి తన మేడలో ఉన్న ఐ డి కార్డు తీసుకుని "అమృత" అని తన పేరు చదివాడు.
"ఒకే అమృత హావ్ ఏ నైస్ డే" అని అక్కడ నుండి గణేష్ దగ్గరకి వెళ్ళిపోయాడు.
అప్పటినుండి మహేష్ కనిపించినపుడల్లా నవ్వుతూ ఉండేది. రోజుకు ఒక్కసారైనా మహేష్ ను చూసి వెళ్లిపోయేది. ఇలా కొన్ని రోజుల్లోనే మాటలు లేక పోయినా మంచి బాండింగ్ ఏర్పడింది.
ఒకరోజు అమృత రెడ్ కలర్ చుడిదార్ వేసుకొని తన స్కూటీ పార్క్ చేసి క్లాస్ లోకి వెళ్ళబోతూ మహేష్ ని చూసింది. చాలా దూరంగా గణేష్ తో ఎదో మాట్లాడుతున్నాడు. అమృత దూరమైనా అతడి పక్క నుండే క్లాస్ కి వెళ్లాలని అటు వైపు నడుచుకుంటూ వెళుతోంది. తాను దగ్గరకి వచ్చాక చూసాడు మహేష్ అమృతని.
"రేయ్ గణేష్...!"
"చెప్పరా"
"నీకో విషయం చెప్తే ఏమి అనుకోవు కదా?"
"చెప్పి తగలడు"
"నీకు ఈ రెడ్ కలర్ డ్రెస్ ఏమి బాగాలేదు రా"
"ఎం మాట్లాడుతున్నావు రా? నీ కళ్ళనేమైనా కాకులు ఎత్తుకెళ్లిపోయాయా. ఇది బ్లూ కలర్ షర్ట్"
"అటు చూడు" అన్నట్లు సైగ చేసాడు.
అటువైపు అమృత నడుచుకుంటూ వెళుతోంది. తనని చూసి ఏమి మాట్లాడలేదు గణేష్.
ఇంతలో మహేష్ "నేను చెప్పేది అదే నీకు బ్లూ కలర్ డ్రెస్ అయితే బాగుంటుంది" అన్నాడు అమృత వైపు చూసి.
అమృత వారిద్దరినీ దాటుకుని నడిచి వెళ్లి మలుపు తిరిగే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తననే చూస్తూ నవ్వుతున్నాడు మహేష్. అతడిని చూసి ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది.
ఆ తరువాత రోజు ఏం జరిగిందో తెలీదు మహేష్ కి. ఎందుకంటే ఆ రోజు కాలేజ్ కి వెళ్ళలేదు మహేష్. మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళగానే తనకు ఎదురు పడింది అమృత. అతడిని చాల కోపంగా చూస్తోంది.
"ఏంటి చంపేస్తావా?" అని అడిగాడు మహేష్.
"అవును"
"నేనేం చేశాను?"
"నాకు బ్లూ కలర్ డ్రెస్ బాగుంటుందని చెప్పి, నేను అదే కలర్ డ్రెస్ వేసుకుని వస్తే నిన్న నువ్వు రాలేదు"
"దానికి చంపేస్తావా?"
తను సమాధానం చెప్పక ముందే అక్కడికి కొందరు సీనియర్స్ వచ్చారు. వాళ్లంతా మహేష్ క్లాస్మేట్స్.
"ఎవర్రా తను?"
"మన జూనియర్"
"నీ పేరేంటి?"
"అమృత అన్నయ్య" అంది.
"ఎమ్మా మేమంతా నీకు అన్నయ్యలమా?"
"అందరూ కాదు" అంది.
"మరి ఎవరెవరూ?"
"మహేష్ తప్పా అందరూ" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అందరూ మహేష్ వైపు ఒక రకంగా చూసారు. ఇక అక్కడే ఉంటె డేంజర్ అనుకోని అక్కడి నుండి జంప్ అయ్యాడు.
మరుసటి రోజు తన స్కూటీని పార్కింగ్ నుండి బయటకు తీయబోతూ పడిపోయింది అమృత. అక్కడే ఉన్న మహేష్ చూసి పైకి లేపి నిలబెట్టాడు. కానీ దెబ్బ కొంచెం గట్టిగా తగలడం వల్ల సరిగ్గా నడవలేకపోతోంది అమృత. తన చేతిని అతడి భుజం పై వేసుకుని తనని నడిపించుకుంటూ పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టాడు. అక్కడ అమృత ని వదిలి వెళ్లబోతుంటే అమృత "ఐ లవ్ యు సాయి" అంది.
"ఇట్స్ ఒకే. యు ఆర్ వెల్కమ్" అని చెప్పి రెండుఁ అడుగులు వేసి వెనక్కి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చి "ఏమన్నావు?" అని అడిగాడు.
"ఐ లవ్ యు" అని చెప్పి వెనక్కి తిరిగింది.
"మరి నా ఒపీనియన్ అవసరం లేదా?"
"నువ్వు చచ్చినట్లు నన్నే ప్రేమించాలి. నీకు వేరే ఆప్షన్ లేదు"
"నువ్వే ఫిక్స్ అయిపోయావా?"
"అమృత ఇక్కడ"
"ఐతే భయపడాలా?"
సాయంత్రం అవ్వడం వల్ల పెద్దగా స్టూడెంట్స్ లేరు.
"అదేంటి? నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా?"
"అవును"
గుండె పగిలినట్లు అనిపించింది అమృతకి.
"'ఎవరిని?"
"తను నీ క్లాస్ మేటే"
"ఎవరూ?"
"కావ్యా..........." అంటూ దీర్ఘం తీస్తుండగా "కావ్యనా?" అని అడిగింది.
"కాదు. ఆ అమ్మాయి ఎప్పుడు కావ్య పక్కన తిరుగుతూ ఉంటుంది".
అలా అనగానే ఆలోచనలో పడింది అమృత.
"తనకు బాగా పొగరు" అన్నాడు. ఇంకా ఆలోచిస్తూనే ఉంది అమృత.
"తను మొన్న బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చిందట. నేను చూడలేదని తిట్టింది" అనగానే అర్థం అయ్యింది అమృతకి మహేష్ ఎవరిని లవ్ చేస్తున్నాడో. చిన్నగా నవ్వి "నేను పొగరుబోతునా?" అని అడిగింది.
"నేను నీ గురించి చెప్పట్లేదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి చెబుతున్నాను" అన్నాడు నవ్వుతు.
"చంపుతా. కాసేపు టెన్షన్ పెట్టావు కదరా?" అంది రిలాక్స్ అవుతూ.
"ఇదంతా నిజంగా నాపై ప్రేమేనా?" అన్నాడు నవ్వుతూ.
"నీకు ఇప్పుడు తెలీదులే" అంది.
"మరెప్పుడు తెలుస్తుంది" అని అడిగాడు.
*****************************************************
*****************************************************
"బాబు మహేష్.....బాబు మహేష్......." అన్న పిలుపుతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు.
ఎదురుగా గాయత్రి పాలు పట్టుకుని నిలుచుంది.
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కవ్వింత... by ramesh - by Milf rider - 23-10-2019, 09:08 AM



Users browsing this thread: 1 Guest(s)