Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కవ్వింత... by ramesh
#3
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తోంది అమృత. ఆమె షాక్ నుండి కోలుకోవడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. కానీ మహేష్ మాత్రం ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. అమృత ముఖంలో చిన్నగా నవ్వు స్టార్ట్ అయ్యింది. అది గమనించిన మహేష్ భూమి కంపించినంతగా వణికిపోసాగాడు. తను అలా నడుచుకుంటూ వచ్చి "హాయ్ మహేష్ గారు" అని చేయి చాపింది.
అతడు ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. అది గమనించిన అమృత తనలో తానే నవ్వుకొని మళ్లీ "హాయ్ మహేష్ గారు" అంది. కానీ ఆమెకు చేతిని అందించే పరిస్థితిలో అతను లేడు (ఎందుకంటే చేతికి కట్టు కట్టారు కాబట్టి). అప్పటికి అర్థమయ్యింది అమృతకి అతడిని ఎటువంటి పరిస్థితుల్లో చూసిందో. వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
"హాయ్ బట్ సారీ మేడం" అన్నాడు.
"అదేంటయ్యా హాయ్ చెబితే సారీ చెబుతున్నావ్?" అన్నాడు మూర్తి.
"తనకు చేయి అందించలేకపోతున్నందుకు సార్" అన్నాడు మహేష్.
అతడు అన్న మాటలు మూర్తికి ఒక రకంగా, అమృతకి ఇంకో రకంగా అర్థమయ్యాయి.
"దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావ్? నీ పరిస్థితి అలాంటిది" అన్నాడు మూర్తి.
ఆ మాట అనగానే కొంచెం ధైర్యంగా అమృత వైపు చూశాడు మహేష్. అతడి చూపులను అర్థం చేసుకున్న అమృత వెంటనే "లేదు డాడీ ఎప్పటికైనా అతడి చేతిని అందుకుని తీరతా" అంది అమృత నవ్వుతున్న మహేష్ ని కోపంగా చూస్తూ.
"ఏంటమ్మా?" అన్నాడు మూర్తి.
"సార్ మీరు ఎక్కువ సేపు నిలబడకూడదు" అంది నర్స్.
"ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటండి?" అని అడిగింది అమృత.
"వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి"
"అప్పటివరకూ ఇక్కడే ఉండాలా?"
"అవసరం లేదు. కానీ అతడికి ఎవరు లేరు అన్నాడు కాబట్టి ఇక్కడే ఉండి తీరాలి"
"డాడీ మనం అతడిని మన ఇంటికి తీసుకెళదాం. అతడు ఎలాగూ ఆఫీస్ కి రాలేడు. మీరేమో అతడ్ని చూడకుండా ఉండలేరు. మనమే కేర్ తీసుకోవచ్చు" అంది అమృత మహేష్ ని చూస్తూ.
"నిజమేనమ్మా" అన్నాడు మూర్తి తన కూతురి ఆలోచనని మెచ్చుకుంటూ.
"మేము ఇతడ్ని మా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటాం. వెంటనే డిశ్చార్జ్ చేయండి" అన్నాడు మూర్తి నర్స్ తో.
"అలాగే సార్" అంటూ ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది.
"మీకెందుకు సార్ శ్రమ. నేను నా రూముకు వెళ్లిపోతాను" అన్నాడు మహేష్.
"నువ్వింకేం మాట్లాడకు. మా అమ్మాయి చెప్పినట్లు చెయ్యి" అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా.
చేసేదేమి లేక నిస్సహాయంగా అమృత వైపు చూశాడు మహేష్. "హయ్యో... పాపం " అన్నట్లుగా మహేష్ వైపు చూసింది అమృత.
"సార్ నేను చెప్పేది ఒకసారి వినండి"
"అమృత ఇతడు ఇలాగే అంటుంటాడు గానీ పద" అన్నాడు అమృత వైపు చూసి.
అక్కడినుండి మహేష్ చేయి అందుకుని చిన్నగా నడిపించుకుంటూ బయటకి వచ్చారు. పార్కింగ్ లో ఉన్న అతడి కారుని చూసి డ్రైవర్ కి రమ్మని సైగ చేశాడు. డ్రైవర్ వెంటనే కారులో వాళ్ల ముందుకి వచ్చేశాడు. ముందు మూర్తి ఎక్కి ఆ తరువాత మహేష్ ని రమ్మని పిలిచాడు.
"నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను సార్" అంటూ డోర్ తెరవబోయాడు.
వెంటనే అతడిని ఆపి "మరేం పర్లేదు వెనకాలే కూర్చో" అంది అమృత.
"నువ్వేమి మొహమాట పడకు" అన్నాడు మూర్తి.
అమృతని ఒకసారి చూసి కారులోకి ఎక్కాడు మహేష్. వెనకలే అమృత ఎక్కి మహేష్ పక్కన కూర్చుంది. మహేష్ కి కుడి వైపు మూర్తి, ఎడమ వైపు అమృత కూర్చున్నారు. అప్పుడప్పుడూ అమృతని చూస్తున్నాడు మహేష్. కానీ అమృత మాత్రం తననే చూస్తోంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మహేష్ కి అమృత అలా చూస్తుంటే. మూర్తి వాళ్లింటికి వెళ్లాలంటే అరగంట సమయం పడుతుంది. ఇక్కడ మహేష్ కి ఒక్క క్షణం ఒక యుగం లాగా ఉంది. చిన్నగా అతడి ఎడమ చేతి మీద చేయి వేసి ఆమె వేళ్లతో అతడి వేళ్లను బంధించినట్లు పట్టుకుంది అమృత. కరెంట్ షాక్ కొట్టిన వాడిలాగ ఉలిక్కిపడ్డాడు మహేష్. అతడు ఉలిక్కి పడగానే "ఏమైందయ్యా?" అంటూ అడిగాడు మూర్తి. అమృత చేయి పట్టుకున్నట్లు కనిపించట్లేదు మూర్తికి.
"అబ్బే ఏమి లేదు సార్"
కుడి చేతికి కట్టు కట్టి ఉండడం వలన ఆమె చేతితో పోరాడలేక పోతున్నాడు.
"ప్లీజ్ నా చేయిని వదలండి మేడం" అన్నాడు అమృతకు మాత్రమే వినిపించేట్టుగా.
"మేడం ఏంటి? నన్ను ఎప్పటిలాగ పిలిస్తే వదిలేస్తా" అంది మహేష్ లాగే.
"ఇప్పుడు మీరు నా బాస్ కూతురు"
"అందుకే అడుగుతున్నాను"
"ప్లీజ్ నా జీవితం తో ఆడుకోకండి"
"ప్రపంచం చాల చిన్నది కదా"
"అందరూ అంటుంటే విన్నాను. కానీ నాకూ ఇప్పుడే అర్థం అయ్యింది"
"ఏమని?" అంది నవ్వుతూ.
"ఇంత చిన్న ప్రపంచంలో నాకు గాలి కూడా ఆడట్లేదని"
అలా అనగానే గట్టిగా నవ్వింది అమృత.
ఆమె అలా నవ్వగానే "ఎమైందమ్మా?" అని అడిగాడు.
"ఏమి లేదు డాడీ. మహేష్ మిమ్మల్ని తిట్టుకుంటున్నాడు"
"ఏంట్రా? నన్నే తిట్టుకుంటున్నావా?"
"అబ్బే లేదు సార్" అన్నాడు.
"వీడు ఇలాగే అంటాడూ కానీ నువ్వు చెప్పమ్మా" అన్నాడు కూతురి వైపు చూస్తూ.
తను ఏమి చెబుతుందోనని భయపడుతున్నాడు మహేష్.
అంతలో అమృత "ఏమి లేదు డాడీ హాస్పిటల్లో మిమ్మల్ని చూసి మెడిసిన్స్ మర్చిపోయాడంట" అంది.
"అవును నేను మర్చిపోయాను" అన్నడు మూర్తి.
"మరేం పర్లేదు డాడీ మన రాఘవ్ అంకుల్ ని అడిగి తెచ్చుకుందాం" అంది అమృత.
"థ్యాంక్స్" అన్నట్లు అమృత వైపు చూశాడు మహేష్.
మహేష్ పరిస్థితి చూసి నవ్వుకుంది అమృత.
"ఏమైతేనే? నువ్వు ఇవ్వాళ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావ్ నాకు" అన్నాడు మూర్తి అమృతతో.
"అదేంటి సార్?" అన్నాడు మహేష్ ఆశ్చర్యంగా.
"నిజమేనయ్యా...నా కూతురు తిరిగొచ్చి నెల రోజులవుతోంది. ఇప్పటివరకూ నవ్వింది కానీ ఆ నవ్వులో ఇంతకు ముందు ఉన్న వెలుగు లేదు. మళ్లీ నీవల్లే ఆ నవ్వు వచ్చింది" అన్నాడు మూర్తి.
"మహేష్ ని చూడగానే చాలా ప్రశాంతంగా ఉంది డాడీ" అని మహేష్ కి దగ్గరగా జరిగి "నీవల్లే ఆ నవ్వు దూరమయ్యిందని చెప్పు. ఏం జరుగుతుందో చూద్దాం" అంది గుసగుసగా.
మహేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇంతలో కారు మూర్తి ఇంటి దగ్గర ఆగింది.
కాలింగ్ బెల్ కొట్టాడు మూర్తి. డోర్ తీయగానే చేతికి కట్టుతో ఉన్న మహేష్ ని చూసి గాయత్రి "ఏమైంది మహేష్ కి?" అని అడిగింది.
"నీకు కూడా తెలుసా మహేష్?" అంది అమ్మను చూసి.
"నాకు తెలియక పోవడం ఏంటి? మీ నాన్నను ఆక్సిడెంట్ నుండి కాపాడాడు కదా?" అంది.
"అవన్నీ తరువాత బయటే నిలబెడతావా ఏంటి?" అన్నాడు మూర్తి భార్య వైపు చూసి.
"ఎంత మాట?" అంటూ మహేష్ ని లోపలికి తీసుకెళ్లింది గాయత్రి.
"వొద్దు అన్నా వినకుండా సార్, మేడం భయపెట్టి తీసుకొచ్చారు. మీరైనా చెప్పండి మేడం" అన్నాడు గాయత్రి వైపు చూసి.
"సంతోషించు. మేము ఇంకా భయపెట్టాం. మీ మేడం అయితే కొట్టి మరీ తీసుకొచ్చేది" అన్నాడు మూర్తి.
"నిజమే" అంది గాయత్రి.
"అదేంటి మేడం"
"మరి లేకపోతే ఏంటి? నిన్ను ఎన్నిసార్లు అడిగాను ఇంటికి రమ్మని. ఒక్కసారైనా వచ్చావా? ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా వదిలేస్తాను అనుకున్నావ్" అంది గాయత్రి.
"మా ఫ్యామిలీ మొత్తానికి ఏమి మందు పెట్టావ్ రా" అనుకుంది అమృత.
మహేష్ ని గెస్ట్ రూం లో పడుకోబెట్టి, గాయత్రి వంటింట్లోకి వెళ్లిపోయింది. మూర్తి అతనికి అలసటగా ఉందని వెళ్లి పడుకున్నాడు. మహేష్ తో పాటు అమృత అతని రూం లో ఉంది. ఆమె కళ్లలోకి చూడడానికి భయపడుతున్నాడు మహేష్.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: కవ్వింత... by ramesh - by Milf rider - 23-10-2019, 09:07 AM



Users browsing this thread: 1 Guest(s)