22-10-2019, 08:10 PM
(22-10-2019, 06:25 PM)Joncena Wrote: మీరు అన్నది నిజమే మొదటి ప్రేమ ఎంతో బలమైనది మరియు మదురమైనది. అది ఒక చెరగని తీపి గుర్తు. అందుకనే అనుకుంట తన రూపం నా మెదడులోనుండి చెరిగిపోయినా తన పేరు నా మదిలో చెరగని ముద్ర వేసుకుని ఉండిపోయింది.
నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది తన రూపం గుర్తుకురానప్పుడల్ల. ఆ accident జరగకముందు నాకు ఏదన్న బాధపడుతున్న సమయంలో తన పేరు తలచుకోగానే తన రూపం కళ్ళముందు మెదిలేప్పటికి ఎంతో ఆనందం వేసేది. ఇప్పుడు తను గుర్తుకువచినప్పుడు తన రూపం గుర్తు రాకపోతే బాధ వేస్తుంది ఎందుకు తన రూపం నా మదిలో నుండి మెదడులోనుండి దూరం అయ్యినందుకు.
తన పేరులో ఉండే చివరి రెండు పదాలలో ఏ ఒక్క పదం పేరుగా కల్గిన వారు నా దగ్గరకు వచ్చి నాతో మాత్లాడినా, లేక నన్ను కలిసినా ఎందుకో తెలియదు కాని వారికి నేను ఆక్ర్షితుడనైపొతాను. వాళ్ళతో ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోతాను. వాళ్ళతో మాట్లాదుతున్నంతసేపు లేదా వాళ్ళతో ఉన్నంతసేపు ఎటువంటి చెడు అలోచనలు మదిలోకి చేరవు.
అంత magic ఉంది ఆ పేరులో.
Nice