22-10-2019, 11:36 AM
అతను గారాబంగా అడిగాడు "ఏం జరిగిందో చెప్పవూ?" అని.
ఆమె చెప్పటం ప్రారంభించింది.
"నాకు ఇప్పుడు ముప్ఫై ఏళ్ళు. నాకు వయసొచ్చిన మూడు సంవత్సరాలకు నా పెళ్లి శ్రీనివాసరావుతో జరిగింది.
నా పెళ్ళి నాటికి ఆయన ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నారు. కొత్త కాపురం, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. వీటినన్నిటినీ ఆకళింపు చేసుకుని తిరిగి చూసుకుంటే ఇద్దరు పిల్లలు, కాస్తంత లావెక్కిన శరీరమూ మిగిలాయి.
చాలారోజుల ప్రయత్నాల తరువాత మావారికి స్వంత ఊరైనా తిరుపతికి ట్రాన్స్ ఫర్ అయింది. మా ఆయన పుట్టి పెరిగిన ఊరు తిరుపతి దగ్గర్లోని ఓ పల్లెటూరు. మా అత్తామామలు, మా వారి బావమరిది మధుసూదన్ ఆ ఊర్లో వుండేవారు. మేము తిరుపతిలో అద్దె ఇల్లు తీసుకుని స్థిరపడ్డాం.
దగ్గరికి వచ్చేశాం కనుక మా వారు రోజూ ఊరెళ్ళి వ్యవసాయం చూసుకునేవాళ్ళు. కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడేవారు. ఇందులో భాగంగానే బావమరిది మధుచేత చంద్రగిరిలో నర్సరీ పెట్టించాడు. పూలమొక్కల వ్యాపారం అన్న మాట.
నా జీవితం అంతవరకూ సాఫీగా జరిగిపోయింది. అదిగో అక్కడే ఓ పెద్ద కుదుపుకు లోనయ్యింది ఆ కుదుపు పేరు జయంత్.
అతను నాకంటే చాలా చిన్నవాడు. మధుకి మంచి ఫ్రెండ్. రోజూ సాయంకాలం తన మిత్రులతో వచ్చి నర్సరీలో బాతాఖానీ వేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ, పిల్లలూ కలిసి నర్సరీకి వెళ్ళి, కాసేపు గడిపి తిరిగి అందరం రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం.
మావారికి పూర్తి ఆపోజిట్ జయంత్. అప్పుడే ఎం.ఏ పూర్తి చేశాడు. పెళ్ళి ఆలోచన ఇంకా రాని వయసు. ఇరవై రెండేళ్ళు వుంటాయేమో, సన్నగా , పొడవుగా, రొమాంటిక్ గా వుండేవాడు.
సాయంకాలం అయ్యేసరికి నీట్ గా టక్ చేసుకుని కనిపించేవాడు జయంత్. ప్రతి అరగంటకీ టీ తాగి, సిగరెట్ అంటించేవాడు. గ్రూప్ లో అతనిదే డామినేషన్. అన్నిటికన్నా అతనిలో నన్ను ఆకర్షించింది అతని స్టేట్ మెంట్స్.
"అత్తకీ, కోడలకీ పడకపోవడం ఎందుకో తెలుసా? ఫ్రాయిడ్ మాటల్లో చెప్పాలంటే కాంప్లెక్స్- అంటే తల్లికి కొడుకు మీద వుండే ఓ విధమైన ప్రేమ. ఇప్పుడొచ్చిన కోడలు కొడుకుని మంచం మీద పంచుకుంటూ వుందన్న ఆలోచనను తల్లి భరించజాలదు. అందుకే ప్రతి అత్తా కోడలు నిద్ర ఆలస్యంగా లేస్తూ వుందన్న ఆరోపణతోనే యుద్ధం మొదలుపెడుతుంది."
"స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం వల్లే బానిసలుగా తయారయ్యారు. ఈ సృష్టిలో ప్రతి జీవీ తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటుంది. ఒక్క స్త్రీ తప్ప. దీంతో మగవాడికి లోకువ అయిపోతుంది. స్త్రీ కష్టపడుతుంది కానీ అదంతా సంసారం కోసమే. కానీ ఆర్ధిక పుష్టి లేని ఆమెని కుటుంబమంతా చులకనగా చూస్తుంది."
"ఫ్రాయిడ్ నీ, కారల్ మార్క్స్ నీ సింథటైజ్ చేయాల్సిన అవసరం చాలావుంది. జర్మనీలో ఒక కార్మికుడు పని మానేసినా, జయింపులో సర్పంచ్ చిన్నకూతురు ఇంట్లోని వంటవాడితో లేచిపోయినా ఈ రెండు థీరీలతో వాటి వెనుకనున్న కారణాలను చెప్పేయవచ్చు."
ఇలా అతను అదరగొట్టేసేవాడు. భర్తా, పిల్లలు, సంసారమూ వీటి చట్రాల మధ్య అంతవరకు బిగుసుకుపోయిన నేను అలాంటి షాకింగ్ స్టేట్ మెంట్స్ విని బాగా కదిలిపోయేదాన్ని. అతను చెప్పిన వాటిల్లో నిజమెంతోనని ఆలోచనలో పడేదాన్ని.
ఇలా అతని గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది
ఆమె చెప్పటం ప్రారంభించింది.
"నాకు ఇప్పుడు ముప్ఫై ఏళ్ళు. నాకు వయసొచ్చిన మూడు సంవత్సరాలకు నా పెళ్లి శ్రీనివాసరావుతో జరిగింది.
నా పెళ్ళి నాటికి ఆయన ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నారు. కొత్త కాపురం, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. వీటినన్నిటినీ ఆకళింపు చేసుకుని తిరిగి చూసుకుంటే ఇద్దరు పిల్లలు, కాస్తంత లావెక్కిన శరీరమూ మిగిలాయి.
చాలారోజుల ప్రయత్నాల తరువాత మావారికి స్వంత ఊరైనా తిరుపతికి ట్రాన్స్ ఫర్ అయింది. మా ఆయన పుట్టి పెరిగిన ఊరు తిరుపతి దగ్గర్లోని ఓ పల్లెటూరు. మా అత్తామామలు, మా వారి బావమరిది మధుసూదన్ ఆ ఊర్లో వుండేవారు. మేము తిరుపతిలో అద్దె ఇల్లు తీసుకుని స్థిరపడ్డాం.
దగ్గరికి వచ్చేశాం కనుక మా వారు రోజూ ఊరెళ్ళి వ్యవసాయం చూసుకునేవాళ్ళు. కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడేవారు. ఇందులో భాగంగానే బావమరిది మధుచేత చంద్రగిరిలో నర్సరీ పెట్టించాడు. పూలమొక్కల వ్యాపారం అన్న మాట.
నా జీవితం అంతవరకూ సాఫీగా జరిగిపోయింది. అదిగో అక్కడే ఓ పెద్ద కుదుపుకు లోనయ్యింది ఆ కుదుపు పేరు జయంత్.
అతను నాకంటే చాలా చిన్నవాడు. మధుకి మంచి ఫ్రెండ్. రోజూ సాయంకాలం తన మిత్రులతో వచ్చి నర్సరీలో బాతాఖానీ వేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ, పిల్లలూ కలిసి నర్సరీకి వెళ్ళి, కాసేపు గడిపి తిరిగి అందరం రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం.
మావారికి పూర్తి ఆపోజిట్ జయంత్. అప్పుడే ఎం.ఏ పూర్తి చేశాడు. పెళ్ళి ఆలోచన ఇంకా రాని వయసు. ఇరవై రెండేళ్ళు వుంటాయేమో, సన్నగా , పొడవుగా, రొమాంటిక్ గా వుండేవాడు.
సాయంకాలం అయ్యేసరికి నీట్ గా టక్ చేసుకుని కనిపించేవాడు జయంత్. ప్రతి అరగంటకీ టీ తాగి, సిగరెట్ అంటించేవాడు. గ్రూప్ లో అతనిదే డామినేషన్. అన్నిటికన్నా అతనిలో నన్ను ఆకర్షించింది అతని స్టేట్ మెంట్స్.
"అత్తకీ, కోడలకీ పడకపోవడం ఎందుకో తెలుసా? ఫ్రాయిడ్ మాటల్లో చెప్పాలంటే కాంప్లెక్స్- అంటే తల్లికి కొడుకు మీద వుండే ఓ విధమైన ప్రేమ. ఇప్పుడొచ్చిన కోడలు కొడుకుని మంచం మీద పంచుకుంటూ వుందన్న ఆలోచనను తల్లి భరించజాలదు. అందుకే ప్రతి అత్తా కోడలు నిద్ర ఆలస్యంగా లేస్తూ వుందన్న ఆరోపణతోనే యుద్ధం మొదలుపెడుతుంది."
"స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోవడం వల్లే బానిసలుగా తయారయ్యారు. ఈ సృష్టిలో ప్రతి జీవీ తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటుంది. ఒక్క స్త్రీ తప్ప. దీంతో మగవాడికి లోకువ అయిపోతుంది. స్త్రీ కష్టపడుతుంది కానీ అదంతా సంసారం కోసమే. కానీ ఆర్ధిక పుష్టి లేని ఆమెని కుటుంబమంతా చులకనగా చూస్తుంది."
"ఫ్రాయిడ్ నీ, కారల్ మార్క్స్ నీ సింథటైజ్ చేయాల్సిన అవసరం చాలావుంది. జర్మనీలో ఒక కార్మికుడు పని మానేసినా, జయింపులో సర్పంచ్ చిన్నకూతురు ఇంట్లోని వంటవాడితో లేచిపోయినా ఈ రెండు థీరీలతో వాటి వెనుకనున్న కారణాలను చెప్పేయవచ్చు."
ఇలా అతను అదరగొట్టేసేవాడు. భర్తా, పిల్లలు, సంసారమూ వీటి చట్రాల మధ్య అంతవరకు బిగుసుకుపోయిన నేను అలాంటి షాకింగ్ స్టేట్ మెంట్స్ విని బాగా కదిలిపోయేదాన్ని. అతను చెప్పిన వాటిల్లో నిజమెంతోనని ఆలోచనలో పడేదాన్ని.
ఇలా అతని గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది
ఓరోజు మా వారు ఆఫీసుకు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొలక చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు.
కాఫీ తీసుకుని వెళ్ళి యిచ్చాను. ఆయన్ను చూస్తునే జయంత్ గుర్తుకు రావడంతో "పొట్ట చూడండీ ఎంత అసహ్యంగా వుందో! ఎప్పుడూ ఆ జయంత్ లా టక్ చేసుకోండి" అన్నాను.
ఆయన ఏమనుకున్నారో తెలీదు. ఎప్పుడూ ఆయన అతిగా మాట్లాడరు. ఏ ఫీలింగ్ నీ ఎప్పుడూ ఎక్స్ ప్రెస్ చేయరు. ఎప్పుడయినా పూలు ఇంటికి తెచ్చినా దాన్ని అలా సోఫా మీద పడవేస్తారే తప్ప "పూలు పెట్టుకో" అని అనరు. చివరికి రొమాన్స్ లో కూడా అంతే. నిశ్శబ్దంగా వుంటారే తప్ప. నోరువిప్పి మాట్లాడరు.
నిజానికి ఆయనను జయంత్ తో పోల్చిచూడడం తప్పు. నలభైఏళ్ళ వాడికి ఇరవై రెండేళ్ళ కుర్రాడితో పోల్చి అలా వుండమని అడగడం ఎబ్బెట్టుగా వుండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని వుంటాడన్న భ్రమ నాకుంది. అతనూ ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనబడటేట్టు లుంగీ లు వుంటాడన్న నిజం నాకు తట్టలేదు.
ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్నీ సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా చెబితే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేనూ అంతే.
సాయంకాలమైతే నేనూ, పిల్లలూ నర్సరీ దగ్గరికి వెళ్లడానికి తయారైపోయే వాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో వెలితిగా వుండేది. అయితే ఆ వెలితి ఎందుకో, అతను నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే తెలీదు.
* * *
ఓరోజు సాయంకాలం యధాప్రకారం నర్సరీ దగ్గర వున్నాము. పిల్లలిద్దరూ దూరంగా ఆడుకుంటున్నారు. మా వారూ, మధూ ఏదో పని వుందని బజారుకి వెళ్ళారు.
అప్పుడొచ్చాడు జయంత్. నేను చిన్నగా నవ్వాను.
"మా మిత్రులెవరూ ఇంకా వచ్చినట్టు లేదు. వీడు- అదే మీ తమ్ముడు ఎక్కడికెళ్లాడు?" అని అడిగాడు.
"బజారెళ్ళాడు" అని ముక్తసరిగా చెప్పాను. అతనితో మామూలుగా మాట్లాడలేకపోతున్నాను. ఏదో డిఫరెన్స్ వుంది.
అతను కొంచెంసేపు ఆగి "మీరు అద్భుతంగా వీణ వాయిస్తారని విన్నాను. నాకు వినాలని వుంది. అయితే అందరూ వున్నప్పుడు మీరు వాయిస్తానంటే కుదరదు. నాకు అలా ఇష్టం వుండదు. మనం యిద్దరమే వుండాలి. మీరు అలా కూర్చుని వాయిస్తుంటే వినాలి. అప్పుడు విధిగా వెన్నెల వుండాలి. ఆ వెలుతురులో మీరు వీణ మీటుతుంటే నేను వినాలి" అన్నాడు. ఇదంతా చెబుతున్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ తో అతని కంఠం బరువుగా వినబడింది.
నేను చిన్న జర్క్ ఇచ్చాను. ఎప్పుడో పెళ్ళికి ముందు వీణ నేర్చుకున్నాను. పెళ్ళయిన తరువాత ఎప్పుడైనా ఒంటరిగా వున్నప్పుడు అలా రెండు మూడు రాగాలు వాయించేదాన్ని. మావారు ఎప్పుడూ వీణ వాయించమని అడగలేదు. నేను ఆయన ముందు నా విద్య ప్రదర్శించలేదు. ఆ తరువాత అప్పుడప్పుడూ కూడా వీణ జోలికి పోలేదు.
ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు ఓ వ్యక్తి వీణ వాయించమని అడుగుతున్నాడు. అదీ వెన్నెల్లో ప్రత్యేకంగా అతని కోసమే వాయించాలాట. నా గుండె జల్లుమంది. నా చిన్నతనం, అప్పట్లో వీణ నేర్చుకోవడం కోసం మాస్టారు దగ్గరికి వెళ్లడం, నేర్చుకున్న విద్యను అమ్మమ్మ దగ్గర ప్రదర్శించడం గుర్తొచ్చాయి.
వెన్నెల్లో తనకోసమే వీణ వాయించాలన్న కోరిక కోరడం వెనుక అతని కళాతృష్ణ, సౌందర్య భావన ఏదయినా అనుభవాన్ని గాఢంగా అనుభవించాలన్న తపన నాక్కనిపించాయి.
నేను ఏమీ జవాబు చెప్పలేదు. అదో రకమైన మైల్టు షాక్ తో అలా మౌనంగా వుండిపోయాను.
అంతలో అతని మిత్రులు వచ్చారు. తిరిగి కాఫీలు, సిగరెట్లలో పడిపోయారు. ఏ దురలవాట్లూ లేకుండా, ఎప్పుడూ ఏదో మూడీగా, సౌమ్యంగా వున్న మా ఆయన్ను చూసీ చూసీ విసుగేయడంవల్ల అనుకుంటాను అతని విశృంఖలత అదో ఆకర్షణగా కనిపించింది.
ఇలా అతను అడిగిన వారం రోజులకనుకుంటాను. మావారు పనిమీద ఒంగోలు వెళ్ళారు. రెండు రోజులు రారు. ఆయన వెళ్ళిన సాయంకాలమే నేను పిల్లల్ని తీసుకుని చంద్రగిరి వెళ్ళాను.
మా తమ్ముడ్ని చూస్తూనే పిల్లలు చాక్ లెట్ల కోసం అల్లరిచేశారు. అతను వాళ్ళను తీసుకుని బజారు వెళ్లాడు. నేను ఏదో దొరికిన పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టాను.
"హలో" ఆ పిలుపు మరీ దగ్గరగా వినిపిస్తే గబుక్కున తలెత్తి చూశాను.
ఎదురుగ్గా జయంత్.
"ఎప్పుడొచ్చారు? ఇక్కడున్న పూలకుండీల్లో మీరూ ఓపూల మొక్కలా కలిసిపోయారు" అన్నాడు. అతను గాఢంగా చెబుతున్నట్టు అనిపించడంవల్ల అనుకుంటాను అతను చాలా అడ్వాన్స్ డ్ అయిపోతున్నాడని అనుకోకుండా గర్వంగా ఫీలయ్యాను. చప్పున సిగ్గు ముంచుకొచ్చింది.
నిజానికి అతను అలా కాంప్లిమెంట్ చేయడం హద్దుమీరడమే. కానీ కొన్ని ఏళ్లుగా ఓ రొటీన్ జీవితానికి అలవాటు పడడంవల్ల ఏదో మార్పును కోరుకుంటోంది మనసు. అందుకే అతనిమీద కోపం రాలేదు. పైపెచ్చు అదో విధమైన గర్వం నన్ను పోంగించింది.
మావారు ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరుగరు. నేనెప్పుడయినా కొత్తచీర కట్టుకున్నా ఆయన కామెంట్ చేయరు సరికదా పరిశీలించి కూడా చూడరు. మొదట్లో ఆయన ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా ఆ తరువాత సర్దుకున్నాను. ఎప్పుడూ ఆయన నుంచి నేను ఎలాంటి కాంప్లిమెంట్లూ ఆశించలేదు.
"మీవారు ఒంగోలు వెళ్ళారు కదా. మరి నా కోరిక తీరుస్తారా?వస్తాను."
చప్పున తలెత్తాను. నా కళ్ళల్లో కోపం ప్రస్ఫుటం అయిందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ నా రక్తమంతా ఏదో హడావుడిగా పరుగులెత్తడం తెలుస్తూనే వుంది.
విచిత్రమేమంటే అతను తడబడలేదు. ఈసారి మరింత స్పష్టంగా అడిగాడు- "వీణారవళి వినే భాగ్యం కల్పిస్తారా?"
అదీ సంగతి. అంతకుమించి ఆలోచించనందుకు నాకు నాకే ఎబ్బెట్టుగా వుంది.
ఏమీ చెప్పకుండా తల వంచుకున్నాను.
"రేపు సాయంకాలం ఆరుగంటలకు వస్తాను" మెల్లగా చెప్పాడు. నేను నోరు తెరవబోయేంతలో మధుసూదన్, పిల్లలు వస్తూ కనిపించారు.
అతను వాళ్ళను చూసి 'హాయ్' అంటూ ఎదురెళ్లాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ వుండగానే మిగలిన మిత్రులు వచ్చారు. అందరూ కబుర్లలో పడ్డారు.
నేను పిల్లల్ని తీరుకుని ఎనిమిది ప్రాంతాన తిరిగి ఇంటికొచ్చేశాను.
ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. ఏవేవో ఆలోచనలు. ఇలాంటి అవస్థ అంతా పెళ్ళికి ముందు అనుభవించాల్సింది. కానీ నాకు వీలు కాలేదు. నాకు బాగా స్పృహ తెలిసేలోగా పెళ్ళి జరిగిపోయింది.
ఒక మగవాడి కోసం సాయంకాలమయ్యేసరికి అందంగా అలంకరించు కొని వెయిట్ చేయడం, అతను వీధిలో అటు వెళుతుంటే ఓరగా చూడడం, ఏ రాత్రో వీధిదీపాలు లేనిచోటు అతను గబుక్కున ముద్దు పెట్టుకుంటే తెల్లారేవరకు అక్కడ తీయతీయగా సలపడం, ఏ ఏడు గంటలప్పుడో ఎవరో చిన్నపిల్ల వచ్చి 'అక్కా! ఆ అన్న నీకు ఇది ఇమ్మన్నాడు' అని లవ్ లెటర్ ఇవ్వడం, దాన్ని ఏ అర్థరాత్రో అందరూ నిద్రపోయాక కిరోసిన్ దీపాన్ని బాగా తగ్గించుకుని దొంగతనంగా చదవడం ఇవన్నీ యవ్వనంలో జరగాలి. లేకపోతే యవ్వనానికి అర్థం లేదు. ఇలాంటి అనుభవాలు ఏమీ లేకుండా డైరెక్టుగా పెళ్ళి చేసుకోవడం ఎంత నిస్సారమో తెలుస్తోంది నాకు. మళ్ళీ నాకు యవ్వనం వచ్చిన ఫీలింగ్. ఇది చాలా గొప్ప అనుభూతి.
తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది. పెళ్ళయ్యాక మొదటిసారిగా ఆలస్యంగా నిద్రలేచాను. మెలుకువ రాగానే ఆ రోజు సాయంకాలం జయంత్ వస్తాడన్న ఆలోచన వెచ్చవెచ్చగా నన్ను పెనవేసుకుంది. ఏదో తెలియని ఉత్సాహం, థ్రిల్లింగ్ నన్ను కుదిపేశాయి. నాకు ఒక్కదానికే పండగ వచ్చినట్లుంది.
చకచకా పనులు చేశాను. పిల్లలిద్దర్నీ కాలేజీకి పంపాను. ఏ పని చేస్తున్నా జయంత్ వస్తాడన్న ఆలోచన అంతర్లీనంగా కలకలం లేపుతోంది. పాతదనంతో మాసిపోయిన ప్రపంచానికి కొత్తగా వెల్లవేసినట్లుంది. ప్రపంచంలోని అందాలన్నీ నాకొక్కదానికే కనిపిస్తున్నాయి. ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్న నేను అందరికంటే అధికురాలినన్న గర్వం సన్నగా పాకుతుంది. మిగిలిన అందరూ ఏదో రొటీన్ గా జీవచ్ఛవాలుగా దొర్లుకుంటూ పోతున్నట్టనిపించింది.
కాలం ఎలా గడిచిందో తెలియదు. పగలు వెళ్ళిపోయి సాయంకాలం రావడం ఏదో మహేంద్రజాలంలా అనిపించింది. రోజూ ఎంతో సాధారణంగా జరిగే కాలంలోని మార్పులు మహేంద్రజాలంలా అనిపిస్తున్నాయంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించమని జనాన్ని అడగాలనిపించింది.
అయిదు అయ్యేసరికల్లా తయారయ్యాను. చాలారోజుల తరువాత అత్యుత్సాహంతో అలంకరించుకున్నాను. లైట్ నీలం కోటా కాటన్ చీర బాగా నప్పింది. పిల్లలిద్దర్నీ మా ఎదురింటి ఫ్రెండ్ ఇంటిలో ఆడుకోమని చెప్పి ఇంటికి వచ్చాను. వరండాలో ఫ్రేము కుర్చీలో కూర్చుని వీక్లీని తిరగేస్తున్నాను.
మల్లెపూల వాసనను ఎక్కడికో ఎగరేసుకు వెళుతున్నట్టు గాలి సువాసనలను విరజిమ్ముతోంది. సంధ్యాకాంతి ప్రపంచానికి మేలి ముసుగును కప్పింది. చీకట్లు లోకంమీద వాలడానికి దారి వెతుక్కుంటున్నాయి.
అప్పుడొచ్చాడు జయంత్. గుండె ఒక్కసారి ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది.
గేటు తీసుకుని వచ్చి "లోపలికి రావచ్చా?" అని అడుగుతూ అక్కడే నిలబడి పోయాడు.
నేను చిరునవ్వు నవ్వుతూ వుండిపోయాను.
అతను వరండాలోకి రాగానే "కూర్చో" అన్నాను కుర్చీ చూపిస్తూ.
"సాయంకాలాలు మిమ్మల్ని చూడడం ఎంతో బావుంటుంది" అన్నాడు.
నా శరీరంలోని జీవకణాలన్నీ ఒక్కసారిగా కదిలినట్లనిపించింది.
వయసు డిఫరెన్స్ వల్ల కాబోలు నేను అతన్ని బహువచనంతో పిలవలేక పోతున్నాను.
అతడి చొరవ చూసి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ కోపం రావడం లేదు. ఇలా నాకు కోపం రాకుండా వుండటానికి నా భర్త ఎంతో కొంత బాధ్యుడని కూడా తోచింది.
లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చాను. ఓ కప్పు అతనికిచ్చి, మరొకటి నేను వుంచుకున్నాను.
అతను కప్పు అందుకుంటూ "ఏమిటీ ఈ అకాల అమృతం" అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.
అద్భుతంగా బిరియానీ చేసినప్పుడు కూడా నా భర్త నోరు తెరిచి ఓ మాట అని కూడా ఎరగడు.
అతను నాటకీయ ఉచ్ఛారణతో అలా అందం వింటుంటే కాఫీ మరోసారి పెట్టాలనిపించింది.
"మీ డాబా మీద వీణ వినే భాగ్యం కలిగిస్తారా?"
నేను మౌనంగా లేచి ఇంట్లోకి వెళ్ళాను. ఎప్పుడో మూల పెట్టేసిన వీణను దులిపి సిద్ధం చేసి వుంచాను. దానిని, ఓ బ్లాంకెట్ నూ తీసుకుని డాబా మీదకు చేరుకున్నాను.
నా వెనకే జయంత్ వచ్చాడు.
దుప్పటి పరిచి దానిమీద శ్రుతి చేసుకుంటున్నాను. జయంత్ నా ఎదురుగా పిట్టగోడమీద కూర్చుని నావైపే తదేకంగా చూస్తున్నాడు. అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. దూరంగా వున్న వీధి దీపం వెలుగు రేఖామాత్రంగా పడుతోంది.
వీణ శృతి అయ్యాక ఏవో రెండు మూడు బిట్లు వాయించాక 'పలుకే బంగారమాయెనా' వాయించాను.
మధ్యలో అతని ఏమీ మాట్లాడలేదు.
'అదిగో అల్లదిగో.....' వాయించాను. ఆ తరువాత మరో రెండు త్యాగరాజకృతులు వాయించి, ఇక చాలన్నట్లు వీణను పక్కకు పెట్టాను.
అతను ఒక్క గెంతులో నా దగ్గరకి వచ్చి కింద కూర్చుంటూ "అద్భుతంగా వాయించారు. మీకు అతివిలువైనదేదో ఇవ్వాలని వుంది. కానీ ఏమివ్వగలను?" అన్నాడు.
అతను చాలా కదిలిపోయినట్లు గొంతే చెబుతోంది.
"ఏమీ ఇవ్వక్కరలేదు. ఎప్పుడో నేర్చుకున్నది నువ్వడిగితే దాని మీదున్న బూజు దులిపి వాయించాను."
అతను ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఆ రసానుభూతి నుంచి తేరుకున్నట్టు లేదు.
అలా మౌనంగా ఇద్దరం ఓ పదినిమిషాలపాటు కూర్చుండి పోయాం.
అప్పటికి తేరుకున్నట్టు అలా కదిలి నా చేతిని తీసుకొని ముంజేతి మీద సుతారంగా పెదవులు ఆన్చి వదిలాడు. మరేమీ మాట్లాడకుందా పైకి లేచి వెళ్ళిపోయాడు. గేటు తీయడం, తిరిగి మూయడం మాత్రం విని పించాయి.
అతను ముట్టుకుంటాడని ఊహించని నేను అలా కూర్చుండి పోయాను. ఇదీ అని చెప్పలేని భావనలు నాలో తుఫానులను రేపుతున్నాయి.
అందుకే ఇలాంటివి ప్రారంభించకూడదు. ఒక్కసారి ప్రారంభిస్తే అవి ఎక్కడ ఆగుతాయో ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేం.
మొదటిసారిగా నా భర్త కాక మరో మగవాడు నన్ను ముట్టుకున్నాడు. అది సంతోషమో, బాధో నాకు తెలియడం లేదు. ఆ రెండింటి మధ్య అంత తక్కువబేధం వుందని తెలియడం కూడా మొదటిసారే. అందుకే కాబోలు నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి.
చీకటి నన్ను చుట్టుకుంటున్నట్లే వుంది. అలా ఎంతసేపు కూర్చుండి పోయానో నాకే తెలియదు. పిల్లలిద్దరూ కింద నుంచి అరుస్తున్నారు. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు ఠక్కున లేచి కిందకు వచ్చాను.
పిల్లలిద్దరికి త్వరత్వరగా భోజనాలు పెట్టి నిద్ర పుచ్చాను. నాకు మాత్రం ఆకలి వేయలేదు.
అలా బెడ్ మీద వాలిపోయాను.
చాలా కాలం తరువాత నేను బతికున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. మొత్తానికి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. మన అస్తిత్వం మనకి తెలియాలంటే బాధో, ఆనందమో వుండాలి. కానీ మన జీవితాలు ఎక్కువ రొటీన్ గా సాగిపోతుంటాయి. మనం జీవించి వున్నామన్న ఫీలింగ్ కలగదు. అందుకే చాలామందిలో జీవకళ వుండదు.
మా ఇద్దరి మధ్యా ఓ రహస్యం ప్రారంభమైపోయింది. ఈ రహస్యంలో నా భర్తకు గానీ, నా తల్లిదండ్రులకు గానీ మ్ నా స్నేహితులకిగానీ ఎవరికీ ఎలాంటి భాగమూ లేదు. నాకొక్క దానికే ఇది పరిమితం. దీన్ని ఎవరికీ చెప్పుకోలేమన్న నిజం తెలిశాక, మనకు కలిగిన ఆనందం మనకే పరిమితం అనిపించాక ఏదో అలవిగాని అమృత భాండాగారాన్ని గుండెల్లో దాచుకున్నట్లు ప్రతిక్షణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ప్రస్తుతం నేనూ అదే పరిస్థితిలో వున్నాను.
నాకు తెలియకుండానే నా ముంజేతిని పదే పదే చూసుకుంటున్నాను. అతను అలా ముద్దు పెట్టుకోవడాన్ని న్నెఉ ఇష్టపడుతున్నానో లేక అయిష్టపడుతున్నానో కూడా స్పష్టంగా తెలియడం లేదు.
ఇలాంటివి జరిగాక అతన్ని నేను ఏవిధంగా, ఎంత మేరకు కోరుకుంటున్నానో మనసుని డిటెక్షన్ చేసి తెలుసుకోవాలి. కాని చాలామందిలాగే నేనూ నాలోకి తొంగి చూసుకోవడానికి భయపడ్డాను.
మనిషి ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాడయ్యా అంటే తనంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితులలో ఇలాంటి సందిగ్ధం ఆడపిల్లల్లో ఎక్కువ. వాళ్ళు మనసుతో ఆలోచిస్తారే తప్ప, మెదడుతో దేన్నీ విశ్లేషించుకోరు. అందుకే ఎవరిని ఏ పరిధి మేరకు వుంచాలో తెలియదు.
ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా కాస్తంత ప్రొసీడ్ అయిపోతే మీరు షాక్ కు గురవుతారు. 'అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేనప్పుడు వచ్చి చేయి పట్టుకున్నాడు' అతని కళ్ళను విశాలం చేసి మగజాతి మీదే గౌరవం లేనట్లు మాట్లాడతారు.
నేనూ అంతే. అందుకే జయంత్ తో ఎలాంటి రిలేషన్ కోరుకుంటున్నానో విశ్లేషించుకోలేదు. సంసారం అనే రొటీన్ నుంచి నన్ను దూరంగా తీసుకుపోయే థ్రిల్ కలిగిస్తున్న మెజీషియన్ లా కనిపిస్తున్నాడతను. పెళ్ళికి ముందు ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవంలోకి రాకపోవడమే దానికి కారణం అనుకుంటాను. అందుకే ప్రతి ఆడపిల్లా పెళ్ళికి ముందు ఇలాంటిదేదో కొంతమేరకు అనుభవించి వుండాలనిపించింది. నా భర్త ఎలాంటి ఉద్వేగాలూ నా దగ్గర ప్రదర్శించక పోవడంవల్ల ఈ థ్రిల్ మరింత బావున్నట్టనిపిస్తోంది.
ఎప్పుడో తూర్పు ఆకాశంలో శుక్రుడు ఒంటరిగా తోడుకోసం వెతుక్కుంటున్నప్పుడు నిద్ర పట్టింది.
* * *
ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాన నా భర్త వచ్చాడు. రావడమే హడావుడిగా ఆఫీసుకెళ్ళాడు. లేకుంటే నా కంగారును దాచుకోవడం కష్టమయ్యేది.
ఆరోజు సాయంకాలం యథాప్రకారం మేమంతా చంద్రగిరికి వెళ్ళాము. నేను వెళ్ళేసరికి జయంత్ తన మిత్రులతో వున్నాడు. మేమిద్దరం చూసుకోవడమే కొత్తగా వుంది. అంతకు ముందు లేని రహస్యం మా ఇద్దరి మధ్యా ప్రారంభం కావడమే కారణం.
అప్పుడప్పుడు అతన్ని గమనించడం, అతని గొంతు వినిపిస్తుందే మోనని చెవులను రిక్కించడం, వీలైనప్పుడల్లా అంతకు ముందు రోజు సాయంకాలాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకోవడంతోనే టైమ్ అయి పోయింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడూ అతని మాట్లాడాలని ప్రయత్నించడం, వీలుకాకపోవడం జరిగింది. ఇక తట్టుకోలేక కాబోలు ఆరోజు అందరం ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఎవరూ గమనించకుండా నా చేతిలో లెటర్ కుక్కాడు.
నేను తేరుకునే లోపలే అతను నన్ను దాటి వెళ్ళిపోయాడు. దాన్ని ఏం చేయాలో పాలుపోక స్త్రీకున్న ఏకైక రహస్య స్థావరంలో పెట్టుకున్నాను.
ఇంటికొచ్చి అందరూ పడుకున్నాక బాత్రూమ్ లో దూరాను. ఉత్తరం మడతలు విప్పాను. తెల్లటి పేపర్ మీద రంగు రంగుల స్కెచ్ పెన్నులతో రాసిన అక్షరాలు ఒకే పంజరంలో బంధించిన రకరకాల పక్షుల్లా అనిపించాయి. "రేపు ఉదయం పదకొండు గంటలకు వస్తాను' అన్న ఒకే లైన్ వుంది. ఎందుకో దాన్ని పారవేయబుద్ధి కాలేదు.
అది మొదటి ఉత్తరం జీవితంలో. నేను పురుళ్ళకు ఇంటికి పోయినప్పుడు కూడా నాభర్త ఒక్క ఉత్తరమూ రాయలేదు. అమ్మా, అమ్మమ్మా రాసిన ఉత్తరాలు తప్ప ఇలా పర్సనల్ గా ఉత్తరం అందుకోవడం ఇదే ప్రధమం. అందుకే దాన్ని తీసుకొచ్చి నా సూట్ కేసు అడుగున చీర మడతల్లో దాచిపెట్టాను.
పడుకున్నాను గానీ నిద్ర పట్టడంలేదు. ఏవేవో ఆలోచనలు ఇలా అతనితో కంటిన్యూ చేస్తే ఏమౌతుందో తెలుస్తూనే వుంది. ఈ కలుసు కోవడాలూ, మాట్లాడుకోవడాలూ, ఉత్తరాలు, ఫోన్ సంభాషణలూ ఇంత వరకే నాకు కావాలి. ఆ తరువాత ఇష్టంలేదు. కానీ ఇవన్నీ ఒక మగవాడి దగ్గర నుంచి రావాలంటే అతను కోరుకున్నది అతని ఇచ్చెయ్యాలి.
మరి రోజంతా థ్రిల్లింగ్ ఇచ్చే ఇత్తరాలు, ఫోన్ సంభాషణల కోసం నన్ను అతనికి అర్పించుకోవాలా? లేక అర్పించుకోవడం ఇష్టంలేక ఇవన్నీ వదులుకోవాలా? అన్న సంఘర్షణ ప్రారంభమైంది నాలో. నాలుగు గంటల తర్వాత కూడా ఏమీ నిర్ణయించుకోలేకపొయాను.
నెక్ట్సుడే కరెక్టుగా చెప్పిన టైమ్ కి వచ్చాడు. ఆయన ఆఫీసుకు వెళ్ళారు. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు. వరండాలో కాకుండా హాల్లో కూర్చున్నాం.
కాఫీలయ్యాక మా బెడ్ రూమ్ వైపు చూస్తూ 'మీ శృంగార సామ్రాజ్యం అదేనా?' అని అడిగాడు నావైపు నవ్వుతూ చూస్తూ.
చాలారోజులు అలా నన్ను చూస్తూ దూరంగా కూర్చోడని నాకు తెలిసిపోతోంది. ఏదో జంకు, భయం, కాస్తంత సంస్కారం- ఎగిసే అతని అవయవాలకు కళ్ళెం వేస్తోందే తప్ప మనసు మాత్రం వాంఛతో కాలిపోతున్న విషయం అర్థమౌతూ వుంది.
వరండాలోంచి హాల్లోకి వచ్చిన అతను బెడ్ రూమ్ లోకి దూకడానికి అట్టేకాలం పట్టాడని బోధపడింది.
అతని వయసు అలాంటిది. ఆకలితో వున్నవాడు అతను. ఆకలి తీరినదాన్ని నేను. ఆ డిఫరెన్స్ మా చేష్టల్లోనే బయటపడుతోంది. ఆ ఒక్క విషయాన్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అలా నేను ప్రవర్తిస్తే ఈ థ్రిల్ అంతా ఎక్కడ అదృశ్యమౌతుందో నన్న భయం నాలో.
'రోజూ దానిమీద మీరెన్ని సుఖాలు అనుభవిస్తున్నారో కదా' నా మీద పిచ్చి మొదలైందని అతని మాటలే చెబుతున్నాయి.
'అలాంటి మాటలు నిషిద్ధం. నేను పెళ్ళయినదాన్ని; అన్నాను ముక్తసరిగా.
వెన్నెల్లో నన్ను చూడాలని అంత రాత్రిపూట దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన అతని తో నిర్దయంగా ప్రవర్తించానేమోనన్న గిల్టీనెస్ నిద్రను దూరం చేసింది. ఇక ఎంతోకాలం ఈ టెన్షన్ ను భరించ లేననిపించింది. అతనితో సంబంధం కొనసాగించాలో, పుల్ స్టాప్ పెట్టెయ్యాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఎంత టైమ్ అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయాను.
* * *
మరో రెండు రోజులు కూడా చంద్రగిరికి వెళ్ళలేదు. అతనూ రాలేదు. అతన్ని మరిచిపోవాలని వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యాను.
మూడోరోజు పిల్లలు మామయ్యని చూడాలని పోరుపెట్టారు. సరేనని అన్నాను. నాకూ వెళ్లాలని వుందా?
మేం వెళ్ళేసరికి జయంత్ లేడు. మిగిలిన మిత్రులు మాత్రం వున్నారు. అతను లేకపోవడం వెలితిగా అనిపించింది. కానీ అదీ ఒకందుకు మంచిదేనని సర్దిచెప్పుకున్నాను.
కాసేపు అన్యమనస్కంగానే గడిపి ఏడున్నర ప్రాంతానికి బయల్దేరాము. పిల్లలు రైలుకి పోదామని మారాం పెట్టారు. వాళ్ళను తీసుకుని రైల్వేస్టేషన్ కి నడిచాను.
రైల్వేస్టేషన్ లో కరెంట్ లేదు. సిగ్నల్ లైట్లు కొరివిదెయ్యాల్లా కనిపిస్తున్నాయి. మసక వెలుతురులో స్టేషన్ గత శతాబ్దపు వాకిట వున్న ఇనుపగేటులా వుంది.
పిల్లల్ని చేతులతో పట్టుకుని వెయిట్ చేస్తున్నాను జయంత్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. బహుశా ఫ్రెండ్స్ తో ముందులా కలవడం లేదేమో.
అంతలో ట్రైన్ వచ్చింది. జనం బాగానే వున్నారు. అంతగా రష్ లేని కంపార్ట్ మెంట్ వెదికాను.
అప్పుడు వినిపించింది జయంత్ కంఠం. "ఏమండీ..... ఏమండీ ఎక్కడున్నారు?" అని అరుస్తున్నాడు. స్టేషన్ అంతా చీకటిగా వుండడం వల్ల మమ్మల్ని ట్రేస్ చేయలేకపోయాడు. పేగులు బయటొచ్చి పడతాయేమో నన్నంత బిగ్గరగా అరుస్తున్నాడు. గొంతు వినిపిస్తూ వుందే తప్ప మనిషి కనబడడం లేదు.
ఎప్పుడో గత జన్మలో తప్పిపోయిన మనిషి కోసం ఈ జన్మలో వెదుకుతున్నట్లు అతను అరుస్తున్నాడు.
వెంటనే ట్రైన్ నుంచి కిందకు దిగి కనిపించాలన్న తాపత్రయాన్ని బలవంతంగా అణుచుకున్నాను.
విజిల్ ఊదారు.
అతను మరింతగా కంఠాన్ని పెంచాడు. ఆ చీకట్లో నేను ఎక్కనున్నాడో తెలియక గింజకుపోతూ అరుస్తున్న అతను ఎలా పిచ్చి పట్టినట్టు స్టేషన్ లో తిరుగుతున్నాడో ఊహించాను. మనసంతా ఏదోలా అయిపోయింది.
కిందకు దిగుదామని కాళ్ళను కదిలిస్తున్నాను. కానీ లేవలేకపోయాను.
ట్రైన్ పెద్దగా కూత పెడుతూ కదిలింది. జయంత్ గొంతు రైలు కూతను మింగేయాలని చేస్తున్న ప్రయత్నం తెలుస్తూనే వుంది.
రైలు వేగం పుంజుకుంది.
ఇంత జరిగాక అన్నం సహిస్తుందనిగానీ, నిద్ర ముంచుకువస్తుందనిగానీ అనుకోలేదు. అన్యమనస్కంగానే పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టాను. ఇక ఎప్పుడూ ఇలా ఒంటరిగా వుండకూడదని నిర్ణయించుకున్నాను.
* * *
మరుసటిరోజు జయంత్ నేను ఊహిస్తున్నట్టే ఇంటికొచ్చాడు. అప్పుడే పిల్లలు కాలేజీకి వెళ్ళారు. ఏం చేద్దామా అనుకుంటూ వుండగానే వచ్చాడతను. ముఖంలో కళ తప్పింది. జ్వరం వచ్చి ఇంకా కోలుకోనట్లు వున్నాడు.
తెల్లటి ప్యాంటుమీద తెల్లటి ఖద్దరు చొక్కా లూజుగా వేలాడుతోంది. వంకీలు తిరిగిన జుట్టును మాత్రం శుభ్రంగా దువ్వుకున్నాడు. తన జుట్టు మీద అతనికి చాలా మోజు. అంత అందంగా జుట్టు చాలాకొద్ది మందికి మాత్రమే వుంటుందని అతని నమ్మకం. అది నిజం కూడా. అంత తపన లోనూ అతని జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడంటే తన జుట్టుమీద తనకెంత ఇష్టమో తెలుస్తూ ఉంది.
రాగానే నాకు మరింత దగ్గరగా నిలబడి "నిన్నరాత్రి మీకోసం రైల్వేస్టేషన్ లో ఎంతగానో వెదకాను. నా దురదృష్టం కొద్దీ స్టేషన్ లో కరంట్ లేదు. అప్పటికీ మీకోసం అరిచాను. కానీ మీకు వినిపించినట్టు లేదు ఎంతో నిరాశతో వెనక్కి వచ్చేశాను.
"ఎందుకు నన్ను వెదకడం?"
"మిమ్మల్ని చూడాలని."
"ఎందుకు చూడడం?"
అతను జవాబు చెప్పలేకపోయాడు. ఏమని చెబుతాడు! అంత డైరెక్టుగా అడగకూడని ప్రశ్నలు అవి. వాటికి జవాబు హృదయస్పందనే. అది వినాలంటే ఎదుటి వ్యక్తి మనసును పరవాలి. అతను జవాబు చెప్ప కూడదనే అడిగాను.
"నాకు బజారులో అర్జంట్ పనుంది వెళ్ళాలి" అంటూ అతనివైపు చూడకుండా తాళం కప్ప అందుకున్నాను. బయటకొచ్చి తాళం వేశాను. అతనూ నా వెనకే బయల్దేరాడు.
"ఎందుకు నన్నిలా వెంబడించడం? నన్ను వెళ్ళనీ" నడక స్పీడు పెంచాను. అతను ప్రార్థించే స్థితికి చేరుకున్నాడు.
"మీతో మాట్లాడాలి" నా వెనకే పరుగెత్తుతూ చెప్పాడు.
"ఏం మాట్లాడాలి?"
"చాలా"
"చాలా కుదరదు. ఎందుకు నన్నిలా విసిగిస్తావ్? ఎవరయినా చూశారంటే నా పరువు గోవిందా. నా భర్తకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి తరిమేస్తాడు. ఆ తరువాత నా గతేం కాను?"
"ఈ జీవితానికి నేను బాధ్యత వహిస్తాను. అంత జరిగితే మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకుంటాను" నిశ్చయంగా చెప్పాడు.
నేను ఠక్కున ఆగాను. ఇక దీనికి ఇంతటితో పుల్ స్టాప్ పెట్టకపోతే చాలా దూరం పోతుందని గ్రహించాను.
"ఇప్పుడు అలానే అంటావ్. కానీ రేపు మన సంబంధాలు బయట పడితే నువ్వు సులభంగా తప్పించుకుంటావ్. ఇదెక్కడి పీకులాట అని తేలుకుట్టిన దొంగలా నోరు మెదపవ్.
నువ్వు ఇంకా పెళ్ళికాని వాడివి. నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. నువ్వు సంఘానికి వెరవకుండా నన్ను పెళ్ళి చేసుకోగలవా? నీ జీవితాన్ని త్యాగం చేయగలవా? నీవల్లకాదు. పది రాత్రులయ్యాక నేనంటే నీకు మోహం మొత్తుతుంది. పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు