Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ కథ మీరే టైటిల్ పెట్టండి...by paul
#13
ఇక్కడో, అక్కడో ఓ చోట కుదురుగా వుండు. గ్రహణం అప్పుడు బయటికి రాకూడదు."

"అలానే."

నేను సరస్వతి అవ్వ ఇల్లు చేరుకున్నాను. ఆమెకు ఎనభై ఏళ్ళు పైగానే వుంటాయి. నడుం పూర్తిగా వంగిపోయింది. కళ్ళు మసగ్గా కనిపిస్తాయి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి పడుకుంటూ వుంటాను గనుక అమ్మ కూడా ఎలాంటి సందేహం లేకుండా పంపింది.

నేను వెళ్ళేసరికి ఓమూల పడుకుని వుంది ఆమె.

లికిడి కాగానే "ఎవరూ?" అంది.

"నేనే"

గొంతుపట్టి కనిపెట్టింది. మళ్ళీ ముసుగుదన్ని పడుకుంది.

అది పెద్ద అడ్డాపిల్లు. ఓవార తడిక కట్టి వుంటుంది. దాంట్లో అవ్వ బట్టలు, ఓ పెద్ద చెక్కపెట్టె వుంటాయి. ఇవతల ఓ పెద్ద నులకమంచం వుంటుంది. దానిమీద పరుపు, రెండు దిండ్లూ వుంటాయి.

పరుపుమీద పడుకుని కాలక్షేపం కోసం తెచ్చుకున్న వీక్లీ తెరిచాను.

మరో పదినిముషాలకు సుధీర్ వచ్చాడు.

యధాప్రకారం అవ్వ "ఎవరూ?" అంది.

"సుధీర్ ని"

అవ్వ తిరిగి కళ్ళు మూసుకుంది.

ఆమెకు సరిగా కనిపించదని, సక్రమంగా వినిపించదనీ తెలుసు కాబట్టి సుధీర్ రాగానే నా పక్కన మంచంమీద కూర్చున్నాడు.

ఇంకా గ్రహణం ప్రారంభం కాలేదు కాబట్టి అటు ఎవరయినా వచ్చే ప్రమాదం వుందని ఠక్కున లేచి మంచానికి దగ్గరగా వున్న స్టూలుమీద కూర్చున్నాను.

ఇద్దరం ఏవేవో స్వీట్ నాన్సెన్స్ అంతా మాట్లాడుకుంటున్నాం.

మూడయ్యింది.

గ్రహణం ప్రారంభమైంది. అయితే అందరూ చెప్పింట్లు చీకట్లు కమ్ము కోలేదు. ఎండ తీక్షణత బాగా తగ్గింది. అంతేగాక ఎండలో ఏదో మార్పు వచ్చింది. కొలిమిలో బంగారును కరగబెడుతున్నట్లు ఎండ బంగారు రంగులోకి మారిపోయింది.
ద్వారం దగ్గరికి వచ్చి చూశాను.
వీధిలోగానీ, ఇళ్ళ బయటగానీ ఒక్కరూ కనిపించలేదు. అందరూ తలుపులు బిడాయించుకుని లోపల వుండిపోయారు.

నేనూ లోపలికి వచ్చి తలుపు కొద్దిగా మూసాను.

ఇక భయంలేదని సుధీర్ పక్కన కూర్చున్నాను.

అవ్వ తలుపువైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె వీపు మాకు కనిపిస్తోంది.

నేను తగులుతుండడంతో సుధీర్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మనసు మరేదో కోరుకుంటున్నట్లు ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాయి.

"ఏమిటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్?" అని అతని అవస్థ చూసి కిలకిలా నవ్వాను.

"నీలాంటి అందమైన అమ్మాయిని పక్కన వుంచుకుని ఊరకనే వుంటే పిచ్చి పట్టకుండా వుంటుందా?"

"ఏం కావాలి?"

అతను నావైపు తిరిగాడు. కళ్ళు కోరికతో ఎర్రగా చెర్రీస్ పళ్ళలా తయారయ్యాయి. శ్వాస బరువుగా వదలడంవల్ల ఛాతీ ఎగిరెగిరి పడుతోంది.

"ప్లీజ్! ఒకసారి ముద్దు పెట్టుకుంటాను" అభ్యర్థిస్తున్నట్లు అడిగాడు.

సుధీర్ చాలా సెన్సిటివ్ గనుక అలా ప్రతిదానికీ పర్మిషన్ అడుగుతాడు. నిజానికి అలాంటప్పుడు ఆడపిల్లను పర్మిషన్ అడగకూడదు. మరీ అబ్జెక్షన్ చెప్పేవరకు తనపని తాను చేసుకుపోవడం ఉత్తమం.

నేను మౌనంగానే వుండిపోయాను.

నా ముఖం ప్రసన్నంగా వుండటంతో మౌనం అంగీకారమణి గ్రహించి నా తలను పూర్తిగా రెండుచేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

మొత్తం నా శరీరం మధురంగా కంపించింది.

గ్రహణం కనుక ఎవరూ అటు రారన్న ధైర్యంతో తలను వదిలి గట్టిగా కౌగిలించుకున్నాడు. నాలో ఎత్తయిన భాగం అతని ఛాతీలోకి చొచ్చుకు పోతోంది.

ఇంకాస్త...... ఇంకాస్త..... నాలోకి కలిసిపోవాలన్న ఆరాటంతో నన్ను హత్తుకుంటున్నాడు. ఎముకలు విరిగిపోతాయేమోననిపించింది నాకు. ఊపిరి అందడం లేదు. అంతవరకు అలాంటి సుఖమెరుగని శరీరం మత్తులో మూర్ఛనలు పోతోంది.

అతని బరువుకి మెల్లగా అలా దిండుమీద వాలిపోయాను. అతను నడుం వరకు నా మీదకు ఒరిగి పెదవుల్ని నోటిలోకి తోశాడు. చిన్నప్పుడు ఎంగిలి అని మనం ఇతరులు ఇచ్చింది తినం. కానీ ఇప్పుడు అతని ఎంగిలి అమృతప్రాయంగా తోచింది. అతని వేళ్ళు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. అంతవరకు ఆ అవయవాలు అంత సుఖాన్ని ఇస్తాయని తెలియదు. ఈ సుఖం నాకు ఇవ్వడానికే అవి పెరిగాయేమోననిపించింది.

అతను మరింత ముందుకు ప్రొసీడ్ కావడానికి సర్దుకుంటున్నాడు.

అప్పుడు తట్టింది నాకు రానున్న ప్రమాదం. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని గ్రహించాను. చిన్నప్పట్నుంచీ అమ్మ, అమ్మమ్మా, సినిమాలు, టీ.వీ. పుస్తకాలూ బోధించిన పాతివ్రత్యం నన్ను వెనక్కి లాగింది.

సుతారంగా అతనిని తప్పించడానికి ప్రయత్నించాను.

అంతవరకు వచ్చి అర్థాంతరంగా వెనక్కి మళ్లడం కష్టంగా వుంది అతనికి. అందుకే నాకళ్ళలోకి ప్రార్థనా పూర్వకంగా చూస్తూ ప్లీజ్! కరుణించవా?' అని అడిగాడు.

కరుణించడం దేనికో తెలుసు కానీ వంద భయాలు నన్ను అతని నుంచి దూరంగా లాగుతున్నాయి.

"ఇప్పుడు కాదు - ఇంకెప్పుడైనా."


ఆ మాటతో అతను మంత్రించినట్టు ఆగిపోయాడు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడానికి కూడా సాహసించడని తెలుసు.

నేను అతని పట్టును విడిపించుకుని లేచి స్టూలు మీద కూర్చున్నాను.

అతనిని డైవర్ట్ చేయడానికి ఏవేవో ప్రశ్నలు అడిగాను. అతను అన్యమనస్కంగానే సమాధానాలు చెప్పాడు. చివరికి సురక్షితంగా బయటపడ్డాను.

ఇక అప్పట్నుంచి ఎప్పుడయినా మేం కలుసుకున్నప్పుడు ముద్దులు పెట్టుకున్నాక 'ఇప్పుడైనా కరుణింఛవా?' అని అడిగాడు.

'ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా' అని స్టాక్ సమాధానమే చెబుతుండేదాన్ని.

అతను ఫైనల్ ఇయర్ లో వుండగా నాకు పెళ్ళిసంబంధం వచ్చింది.

నా ప్రేమేకాదు, చాలామంది ప్రేమలు యిలా అర్థాంతరంగా ఆగిపోయేవి. ఏదీ పెళ్ళి వరకు వచ్చేదికాదు. దీనికి చాలా కారణాలు.

మా ఊర్లో అమ్మాయిల్లో తొంభైశాతం మంది ప్రేమలోపడేవాళ్ళే, కొందరు చూపులతో పుల్ స్టాప్ పెట్టేస్తే, మరికొందరు ఉత్తరాల వరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు. ఇంకొందరు సినిమాలకు పోవడం వరకు వస్తే, ఎవరో ఒకరు మంచం వరకు వెళ్ళేవాళ్ళు. ఇక పెళ్ళివరకు వెళ్ళడమనేది చాలా రేర్. కులాలు, ఆస్తీ - అంతస్తులు యిలా ఎన్నో అడ్డుగోడలు వుండడంతో పాటు ప్రేమించినవాడ్నే పెళ్ళి చేసుకోవాలన్న పరిణితి రాకపోవడం కూడా ఓ కారణం. ఏదైనా ఫ్రీగా చర్చించే స్వేచ్ఛనివ్వని తల్లి తండ్రులకు భయపడే చాలామంది అమ్మాయిలు మధ్యలోనే టాటా చెప్పేసేవాళ్ళు.

నేనూ అంతే. మానాన్న మంచివాడే కానీ ఈ విషయంలో మాత్రం చండశాసనుడు. నేను సుధీర్ ను చేసుకుంటానంటే ఇంట్లో ఎంత రభస జరుగుతుందో తెలుసు కాబట్టి అమ్మా వాళ్ళు తెచ్చిన సంబంధమే చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను.

పెళ్ళి చూపులయ్యాయి. అందరికీ అన్నీ నచ్చాయి. గనుక ఆ రాత్రి ఇరువైపులా పెద్దలంతా కట్న కానుకల గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

పెళ్ళి చేసుకునే వాళ్ళ ముందు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్చల్లో మునిగిపోయారు.

పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులూ కట్నకానుకల దగ్గర కనబరిచిన లేకిబుద్ధిని చూస్తుంటే పెళ్ళి కుదిరిందన్న సంతోషం స్థానే దిగులు ప్రారంభమైంది. నేనేదో మొసళ్ళ మడుగులోకి అడుగుపెడుతున్నట్లనిపించింది.

"విస్తర్లుగా అరిటాకులే వేయాలి......" అని కండిషన్ పెట్టాడు కాబోయే మామయ్య.

"పాయసం దొన్నెలు బాగా పెద్దవి కుట్టించండి. మా బంధువులంతా పెద్ద మహారాజులు. చిన్న దొన్నెలు పెడితే నామోషీగా వుంటుంది" అంది మా అత్తమ్మ.

"పెళ్ళి అట్టహాసంగా జరిపించాలి. నా ఫ్రెండ్స్ చాలామందే వస్తారు పెళ్ళికి" అని ప్రగల్భాలు పలికాడు పెళ్ళికొడుకు.

ఇలాంటి కండిషన్ లతో బాటు ముప్ఫైవేల రొక్కం, పాతికసవర్ల బంగారానికీ బేరం సెటిలైంది.

ఇక లేస్తారేమో అనుకుంటూ వుండగా పెళ్ళికొడుకు మరోమారు తన టేస్టును తెలియజేస్తూ కోర్కెల చిట్టా విప్పాడు.

"సీకో వాచీ, వైట్ డయల్, డే, డేటూ వుండాలి" అన్నాడు.

"కాశీ ప్రయాణం అప్పుడు గొడుగు పెడతారు కదా. లేటెస్ మోడల్ కొరియా గొడుగైతే బావుంటుంది" అని సూచించాడు.

"ఈ తంతు జరిగేటప్పుడు చెప్పులు పెడతారుగదా చెప్పులు నాకొద్దు బూట్లు కావాలి. అవీ యాక్షన్ కంపెనీవి... లేసులుండాలి" అని కోరాడు.
నాకైతే అతని చెంపలు వాయించాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాను. ఇలాంటివాణ్ని ప్రేమించడం సాధ్యం కాని పని అందుకే చాలా జంటల్లో పెళ్ళి సంబంధమే కానీ ప్రేమబంధం వుండదు.

అన్నిటికీ నాన్న ఒప్పుకున్నాక నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. మరో ఇరవై రోజుల్లో వుండే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

పెళ్ళికొడుకు వాళ్ళు ఉదయం వెళ్లగానే మా ఇంట్లో పెళ్ళి పనులు ప్రారంభమయ్యాయి.

పెళ్ళంటే వుండాల్సిన థ్రిల్ గానీ, పట్టలేని ఆనందంగానీ, లేవు. పైపెచ్చు ఏదో చెప్పలేని దిగులు నాలో పేరుకుపోయింది.

డబ్బు కోసం గడ్డి తినే ఆ మనుషుల మధ్య జీవితం మీద మమకారాన్ని పోగొట్టుకోకుండా ఎలా బతకాలాన్న ఆలోచనే నాకు. అందుకే పుట్టింటినుంచి ఆ అపురూపమైన కానుక నొకదానిని తీసుకువెళ్ళాలన్న కోరిక పుట్టింది. అయితే అదేమిటో నాకు బోధపడడం లేదు.

పెళ్ళి దగ్గర పడింది. పనులు చకచకా జరుగుతున్నాయి.

పెళ్ళి మరో వారం రోజులు వుండగా శుభలేఖలు వచ్చాయి. మొదటి శుభలేఖను తీసుకుని దానిమీద "ఫలానా రోజున నా పెళ్ళి అనీ, ఈలోగా ఓసారి వచ్చి కలవమనీ' రాసి సుధీర్ కు పోస్టు చేశాను.

గోళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం, మ్యాచింగ్ బ్లౌజులు కుట్టుకోవడం, స్నేహితురాళ్ళకు శుభలేఖలు పంచడం, వస్తున్నా బంధువులను రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోయింది కాలం.

మరుసటి రోజు తెల్లవారుజామున మా ఊరికి దగ్గరలోని వెంటకగిరిలోని ఓ సత్రంలో పెళ్ళి. అందువల్ల ఆరోజు సాయంకాలం నేను పెళ్ళికూతురై తరలి వెళ్ళాను.

సత్రం చేరుకునే సరికి సాయంకాలం ఏడయ్యింది. ఆడపెళ్ళి వారంతా అక్కడ సర్దుకున్నారు. మగపెళ్ళి వాళ్ళకోసం హోటల్లో గదులు బుక్ చేశారు. పెళ్ళికొడుకు తెల్లవారుజామున మూడుగంటలకు విడిది నుంచి బయల్దేరి వస్తారు. మధ్యలో దేవుడి పూజ తదితర ఘట్టాలున్నాయి.

రాత్రి పదిగంటల ప్రాంతాన భోజనం చేశాను. ఓ గదిలో పడుకున్నాను. రెండు గంటల ప్రాంతాన అమ్మలక్కలు వచ్చి లేపారు. ఇక స్నానం చేశాక నన్ను సింగారించడం ప్రారంభించారు. అలంకరణ పూర్తయ్యేసరికి తెల్లవారు జాము మూడయ్యింది. తామూ స్నానాలు చేసి తయారవుతామని చెప్పి అమ్మలక్కలంతా వెళ్ళిపోయారు.

అలా ఒంటరిగా గదిలో మిగలిపోయాను. మ్యారేజ్ హాల్లో వున్న కొంతమంది బంధుజనం మాటలు తప్ప ప్రశాంతంగా వుంది సత్రమంతా.

అక్కడే వున్న సూట్కేసు మీద నడుం ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరో రెండు గంటలకి పెళ్ళి.

అంతలో ద్వారం దగ్గర అలికిడి అయ్యింది. కళ్ళు విప్పి చూస్తే ద్వారం దగ్గర నిలబడి వున్న సుధీర్ కనిపించాడు.

ఒక్క ఉదుటున పైకి లేచి కెరటంలా అతని దగ్గరకి వచ్చి నిలబడ్డాను.

"సారీ! ముందు రాలేకపోయాను. బ్యాంక్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ వుంటే హైదరాబాద్ వెళ్ళాను. రాత్రే గదికి వచ్చాను. తలుపు తెరవగానే నీ శుభలేఖ. బట్టలైనా మార్చుకోకుండా ఇలా వచ్చేశాను" చాలా బాధపడుతూ చెప్పాడు.

నోట మాట రావడం లేదు. ఏదో తెలియని భావోద్వేగం నన్ను ఊపేస్తుంది. కాని టైమ్ లేదు. నా నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి.

"సుధీర్! నీకోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా! ఇక నాపెళ్ళిలో నువ్వు రావేమోనన్న దిగులు, ఇదిగో ఈ పట్టుచీరకంటే బరువుగా నా గుండెల్లో పేరుకుపోయింది. ఇంకో రెండు గంటల్లో పెళ్ళి, నువ్వు నాకో అపురూపమైన బహుమతి ఇవ్వాలి. ఇస్తావా?"

"తప్పకుండా! ఏం కావాలి?" తన ఒంట్లోని రక్తాన్నంతా తోడివ్వమని అడిగినా జంకని ఈ దీరుడి ముందు సీకో వాచ్ కోసం, లేసులున్న బూట్లకోసం యాగీ చేసిన పెళ్ళికొడుకును పోల్చుకోకుండా వుండలేక పోయాను. నా నిర్ణయం సరైనదేనని కళ్ళముందు రుజువు కనబడింది.

"నువ్విచ్చే బహుమతి నన్ను అత్తింటి ఆరళ్ళ నుంచి కాపాడుతుంది. అన్నం వార్చేటప్పుడు చేయి వణికి గంజి నాపై పడి చర్మం కాలిపోయినప్పుడు నా కన్నీళ్ళను తుడుస్తుంది. ఇంట్లోని దరిద్రానికంతా నేనే కారణమని మా అత్తా నన్ను గదమాయించినప్పుడు తిరగబడే శక్తినిస్తుంది. కూరలు బాగాలేవని మా మామగారు విసుక్కునప్పుడు నన్ను ఊరడిస్తుండి. నావల్ల తన సుఖాలన్నీ దూరమైనాయని నా భర్త నావైపు అసహ్యంగా చూసినప్పుడు భుజం తట్టి ధైర్యమిస్తుంది."

ఏడుపు తన్నుకుంటూ రావడంతో నా మాటలు తడబడుతున్నాయి. కానీ ఆపలేదు. చెప్పుకుపోయాను.

"అవును సుధీర్! నువ్విచ్చే బహుమతి నాకు ప్రతిక్షణం మన ఊరును గుర్తుకు తెస్తుంది. నా స్నేహితురాళ్ళను నా కళ్ళముందు నిలుపుతుంది. మా అమ్మా నాన్నల వెచ్చటి ఒడిని మరిపిస్తుంది. పెరట్లోంచి కాలు పెట్టగానే పచ్చ పచ్చని చేతులతో ఆహ్వానం పలికే పంటచెలు నా మనసులో మెదులుతుంది. ఇదంతా ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి ఏమిటో తెలుసా? ఓ అందమైన జ్ఞాపకం. అవును సుధీర్. జ్ఞాపకం అయితే అది ఎప్పటికీ ఎడబాటు లేకుండా నా గుండెల్లో ఉండిపోతుంది. నాలో రసస్పందన చచ్చిపోకుండా కాపాడుతుంది. అత్తింటి నరకాన్ని మరిచిపోవడానికి పుట్టింటి నుంచి నేను తీసుకుపోవాలను కుంటున్నది ఓ అందమైన జ్ఞాపకాన్ని. అది నువ్వొక్కడివే ఇవ్వగలవు. మరిస్తావా?" అని చేయి ముందుకు చాచాను.

అతని కళ్ళల్లో నీళ్ళు ఊరడం లైట్ వెలుగులో స్పష్టంగా తెలుస్తోంది.

నా చేతిలో చేయి వేసాడు.

"అయితే రా" అంటూ ముందుకు కదిలాను.

అలా నడుస్తున్న నాకు తాళం వేయకుండా కేవలం గొళ్ళెం పెట్టిన ఓ గది కనిపించింది. అదృష్టం నా పక్కనుంది. తలుపులు తెరిచి చూస్తే ఎవరూ లేరక్కడ. స్టోర్స్ గది కాబోలు ఓ మూల ఉల్లిపాయలు, వాటి ప్రక్కన బీన్స్, కాబేజీ, టమేటాలు రకరకాలు కూరగాయలున్నాయి.

సుధీర్ లోపలికి రాగానే తలుపులు మూసి బోల్టు వేశాను. మధ్యలోనున్న జీరో క్యాండిల్స్ బల్బు మసగ్గా వెలుగుతోంది. అలానే పెళ్ళికూతురి అలంకరణలో వున్న నేను ఇంకో గంటలో వేరోకడిచేత తాలి కట్టించుకోవాల్సిన నేను గోడకు జారగిలబడి కూర్చుని సుధీర్ చేయి పట్టుకుని లాగాను. అతను నాపైపడి సర్దుకున్నాడు.

అతన్నిగాఢంగా హత్తుకుంటూ "ప్లీజ్! కరుణించవా- అని ఎప్పుడూ అడిగేవాడివి. ఇదిగో ఇప్పుడు కరునిస్తున్నాను" అని అతని పెదవులను నా పెదవులతో అద్దాను.

అతను నను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

పదినిమిషాల తరువాత ఇద్దరం ఒకరి నుంచి ఒకరు విడివడ్డాం.

"వస్తాను సుధీర్. ఈ అద్భుతమైన జ్ఞాపకాన్ని నాకందించినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడంలేదు. నేను అత్తింటికి నాతో పాటు తీసుకువెళుతున్న ముప్ఫైవేల రూపాయలను వాళ్ళు భూముల్లోకి మార్చేయవచ్చు. నా ఒంటిమీదున్న పాతిక సవర్ల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు. సారెతో పాటు నేను తీసుకెళ్ళే వెండిబిందెను చెడగొట్టి తండ్రీ కొడుకులు మొలతాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ మధురమైన జ్ఞాపకాన్ని వాళ్ళు నా నుంచి దొంగిలించలేరు కదా. అదే నాకు శ్రీరామరక్ష" చివరిగా అతని ముంజేతిమీద ముద్దు పెట్టుకుని తిరిగి నా గదికి వచ్చేశాను.
ముహూర్తం ప్రవేశించిందన్నట్లు పెళ్ళి పందిట్లో మంగళ వాయిద్యాలు మ్రోగడం ప్రారంభించాయి" అంటూ చెప్పడం ముగించింది ఆమె.

ఆమె చెప్పిన ఈ సంఘటనకు గోపాలకృష్ణ కదిలిపోయాడు. కళ్ళల్లో పలుచటి నీటిపొర.

చాలాసేపటివరకూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేకపోయారు.

యిదంతా చాటు నుంచి గమనిస్తున్న పులిరాజు ఠక్కున పైకి లేచాడు.
అతడు గోపాలకృష్ణ మీద ద్వేషంతో రగిలిపోతున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి నుండి కదిలాడు.

ఊరిలోకి వచ్చి దివాను వెంకట్రామయ్య ఇంటి తలుపు తట్టాడు. మరో ఐదు నిమిషాలకు తలుపులు తెరుచుకున్నాయి.

అంత రాత్రిపూట దెయ్యం జడలా పరమవికారంగా కనిపిస్తున్న పులిరాజును చూసి ఆయన ఓక్షణం పాటు జడుసుకున్నాడు. కాసేపట్లో సర్దుకుని అతన్ని లోపలికి పిలిచాడు.


"అయితే గోపాలకృష్ణను ఏం చేయబోతున్నావ్? చేతబడి చేసి చంపేస్తున్నావా? బాణామతితో వాడి బతుకును కాల్చేస్తున్నావా? ఇన్ని రోజుళు ఆలోచించి ఏం నిర్ణయించుకున్నావ్?" దివాన్ వెంకట్రామయ్య చాలా కూల్ గా కుర్చీలో జారగిలబడుతూ అడిగాడు పులిరాజును.
అప్పుడు రాత్రి తొమ్మిదయి వుంటుంది. చుట్టూ చీకటి భయంకరంగా వుంది. పౌర్ణమి వెళ్ళి వారమో, పదిరోజులో అయినట్టు గుర్తుగా చీకటి మందంగా పేరుకుని వుంది.

"వాడికి నేను చెయ్యబోయేది చేతబడి కాదు- వాతబడి" కళ్ళల్లోని క్రూరత్వం ఒలుకుతుంటే అన్నాడు పులిరాజు.

"వాతబడా- అంటే?" వెంకట్రామయ్య అడిగాడు.

"అంటే వాడ్ని చంపను. చంపడం ఇష్టం లేదు నాకు. వాడు ఎందుకూ పనికిరాకుండా, ముష్టెత్తుకుని బతికేటట్టు..... పువ్వులాగా గుభాళించే వాడి బతుకు వాడిపోయేటట్టు వాతలు పెట్టాలి. దానికి నేను పెట్టిన పేరు వాతబడి."

పునర్వసు తనను ప్రేమించకపోగా గోపాలకృష్ణను ఇష్టపడుతున్నానని చెప్పడాన్ని పులిరాజు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏదో బాధ గుండెను ముక్కల కింద పగలగొడుతోంది.

పునర్వసు మీద అతనికి కోపం కలగడం లేదు. గోపాలకృష్ణ లేకుంటే ఆమె తనను ప్రేమించి వుండేదని బలంగా నమ్ముతున్నాడు. ప్రేమలో వుండే శక్తి అది. మనం ప్రేమించిన వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా మనం ఆ వ్యక్తిని అసహ్యించుకోలేం. ఆ తప్పు ఇతర కారణాల వల్లే చేస్తూ వుందని నమ్మి , ఆ కారణాలకు కారణమైన వాళ్లను ద్వేషిస్తాం.

అయితే పులిరాజు మాత్రం అంతటితో ఆగక తమ ప్రేమ సఫలం కావడానికి గోపాలకృష్ణకు శత్రువైన వెంకట్రామయ్యతో చేతులు కలిపాడు.

వెంకట్రామయ్య గ్లాసులోని విస్కీనంతా ఒక్క గుటకలో తాగి మూతి తుడుచుకుంటూ "అయితే నీకూ ఒక బలమైన శత్రువు తయారయాడన్న మాట. అసలు శత్రువు అనేవాడు లేడంటే మనం ఎప్పటికీ ఇలాగే వుండిపోతాం. జీవితంలో రెట్టింపు కష్టం చెయ్యాలంటే శత్రువులుండాలి. మన లక్ష్యాన్ని, నిర్ణయించేది కూడా శత్రువులే. అంతే కాకుండా ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సినంత ఇన్స్ పిరేషన్ కూడా శత్రువులే ఇస్తారు మనకు. నేను ఇంతగా సంపాదించడానికి నాకు ఏర్పడ్డ మొదటి శత్రువే కారణం. ఆ శత్రువు ఎవరో తెలుసా? నా భార్య."


* * *

కళ్ళు కూడా ఆర్పకుండా పులిరాజు శ్రద్ధగా వింటున్నాడు.

"అవును. నా మొదటి శత్రువు నా భార్యే. అప్పట్లో నేను గోపాలకృష్ణ తండ్రి భూపతిరాజు దగ్గర దివానుగా పనిచేసేవాడ్ని. ఏదో వాళ్ళిచ్చిన దానితో సుఖంగా కాపురం చేసేవాడ్ని. నా భార్య అసంతృప్తి ప్రకటించడం ప్రారంభించింది. నా ఆదాయాన్నీ, నా బతుకునీ పరిహసించడం ప్రారంభించింది. ప్రతి పనిలోనూ నా చేతకానితనాన్ని చూపించి పాశవికంగా ప్రవర్తించేది.

ఇలా కొంతకాలం జరిగాక నన్ను సాధించడం ప్రారంభించింది. కుత్తుకలు కత్తిరించో, కుతంత్రాలు చేసో డబ్బు సంపాదించమని పోరు పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా చేసింది.

అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నాకు తెలిసి పోయింది. నాలోని సైతానును నిద్ర లేపాను. సమయం కోసం చూస్తున్నాను.

అదిగో అప్పుడే భూపతిరాజు భార్య సుమతీదేవికి నెలలు నిండాయి. టౌన్ లోని ఓ నర్శింగ్ హోమ్ లో ఆమె గోపాలకృష్ణను కన్నది. తిరిగి వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న కారును లారీ గుద్దేసేటట్లు ఏర్పాటు చేశాను. నేను, మరికొంతమంది పనివాళ్ళు వెనుక మరో కారులో బయలుదేరాం.

అనుకున్నట్లే యాక్సిడెంట్ జరిగింది. అయితే అనుకోకుండా గోపాలకృష్ణ బతికి బయటపడ్డాడు. యాక్సిడెంట్ జరిగాక వచ్చి చూస్తే పెద్దవాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే రోజుల బిడ్డ అయిన గోపాలకృష్ణ బతికాడు. చుట్టూ జనం వుండటంతో వాడ్ని చంపలేకపోయాను. ఇక గ్రామస్థులంతా వాడి బాధ్యత తీసుకోవడంతో నాకు వాడ్ని చంపే అవకాశం
Like Reply


Messages In This Thread
RE: ఈ కథ మీరే టైటిల్ పెట్టండి...by paul - by Milf rider - 22-10-2019, 11:25 AM



Users browsing this thread: 3 Guest(s)