21-10-2019, 05:37 PM
(21-10-2019, 11:47 AM)Vickyking02 Wrote: చాలా కృతజ్ఞతలు నాకూ ఆశ్వథామా యొక్క మానసిక స్థితి మరియు అతని అహంకారం కు గల కారణం అతను చిరంజీవి ఎందుకు ఎలా అయ్యాడు ఇలాంటి విషయాలు నాకూ కావాలి
ఆశ్వత్తామ కౌరవుల మరియు పాండవుల గురువు అయిన ద్రోనుడి పుత్రుడు. స్వతహాగా మంచివాడే కాని తన తండ్రికి జరిగిన అవమానం వల్ల మరియి తన తండ్రికి జరిగిన అవమానాన్ని కౌరవులే పొగొట్టగలరు అనుకుని కౌరవులతో ఎక్కువ స్నేహం చెస్తాడు. కాని ఇచ్చిన మాటమీద ఎంతకాలమైనా అలాగే నిలబడతాడు. కర్ణుడి లాగ ఇచ్చిన మాటమీద నిలబడే మనస్తత్వం కలిగినివాడు. అందుకే ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగేప్పుడు అక్కడ జరుగుతున్నది తప్పు అని తెలిసినా కౌరవులకు ఇచ్చిన మాటకోసం ఎదురుచెప్పలేక పోతాడు.
అతని అహంకారంకు గల కారణం:
కౌరవులు, పాండవులు గురుకులంకు వచ్చేప్పటికి కౌరవులు అప్పటికే యువరజులుగా ప్రకటించి ఉండడం అలగే వీళ్ళు మాత్రమే తన తండ్రికి జరిగిన అవమానాన్ని పోగొట్టగలరు అని ఎక్కువ విస్వసించడం వలన అహంకారం వచ్చింది.
అతను చిరంజీవి ఎందుకు ఎలా అయ్యాడు:
అతను ఎందుకు చిరంజీవి అయ్యాడంటే; కురుక్షేత్రం జరిగే సమయంలో ఉత్తర గర్బవతి. ఒకవేళ పాండవులు యుద్దంలో గెలిస్తే కురువంశానికి పుట్టబోయే బిడ్డకే రాజ్యాదికారం వస్తుంది అని, యుద్ద సమయంలో ఒక బాణం వేసి ఉత్తర కడుపులో పెరుగుతున్న బిడ్డని సంహరిస్తాడు. ఇది తెలిసిన కృష్ణుడు ఆశ్వత్తామ నుదుటన ఉన్న మణిని తొలగించి శాపగ్రస్తుదిని చేస్తాడు. 3000 సంవత్సరాల వరకు నీకు మరణం లేదు. మ్రుత్యువు(చావు) కోసం నీవు ఎల్లప్పుడు ప్రాధిస్తు నీ మిగిలిన జీవితాన్ని అరణ్యంలో సంచరిస్తూ జీవించమని శాపం ఇస్తాడు కృష్ణుడు.
నేను చెప్పినవి తప్పుగా అనిపిస్తే పురాణాల మీద పట్టు ఉన్నవారు సరిచేయగలరు అని మనవి.
తప్పులు రాసి వుంటే నేను సరిచేసుకోగలను. పైన రాసినవన్నీ నా చిన్నప్పుడు విన్నదాని ఆదారంగా రాసినవి మాత్రమే
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం


My first story: ప్రేమ+పగ=జీవితం