Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*
#1

*ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*
*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*

*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు . నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*
*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ? ఇచ్చి వెళ్ళాడు .*
*ఆ డబ్బు ? మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*
*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు ?? ను సంపాదించలేను .*
*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*

*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు ? పంపించడం లేదా ? "* 

*ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల ? నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .*

*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .*

*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .*
*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*
*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*

*ఆ ముసలావిడకు చదువు రాదు .*
*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .*

*ఫ్రెండ్స్ , ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు .*
*కానీ , మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*

*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం  ఉంది .*

*కానీ , మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*
*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*

*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత  ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .*

*ఫ్రెండ్స్ ,*

*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం* 

*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .*

*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో  కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత  .*

*ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి*

*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.*

*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత  .*

*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న  గ్రంథం భగవద్గీత.*

*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .*

*ఫ్రెండ్స్ ,*
 *దేవుడు  మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి  , అర్థం చేసుకొని , దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ! *

*ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి మన భారతదేశ హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి*
*అందరిక శుభాకాంక్షలు*

Source:Internet
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మన్నించాలి - ఈ ప్రతిస్పందన కొంత విచిత్రం..గానే ఉంటుంది.
సందేశాన్ని ఇక్కడ పోస్టు చేసిన మీపై విమర్ష కాదని గమనించాలి.

Quote:ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు
అవును. విచిత్రమే.
ఉద్యోగం కోసం వెళ్ళిన కొడుకు ప్రతినెలా పెద్ద మొత్తానికి బ్యాంకు చెక్కులు పంపాడు.
8 చెక్కులు - అంటే 8 నెలలు అలా పంపాడు. ఆమెకి చదువు రాదని , బ్యాంకు
చెక్కుని మార్చుకోలేదని అతనికి తెలుసు. కనీసం ఉత్తరం కూడా వ్రాయలేదు !
కొడుకు క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు ఆమె తపనపడుతూ ఉంటుంది కదూ.

ఏదో రంగుల కాగితం కొడుకు నుంచే వస్తూ ఉందని ఆమెకి తెలుసు.
అది ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన ఆమెకి కలగలేదు !

అసలు విచిత్రం ఏమిటంటే,
ఇలా కధలని అల్లేవారు పోలిక సరైనదేనా అని ఆలోచించకుండా తోచినట్లు
కధలల్లి నెట్లో పెట్టడం & అందరూ గ్రూపులలోకి ఫార్వార్డులు చొప్పించడం !

Quote:ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి
మన భారతదేశ హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి
ఫార్వార్డు అయితే అందరూ చేసేస్తున్నారు కానీ
ఈ సందేశం వల్ల సనాతన ధర్మం గొప్పదనం మనకేమైనా తెలుస్తున్నదా !

అలా తెలుసుకుని
మనం అలాంటి విషయాలని ఏమైనా ఆకళింపు చేసుకుంటున్నామా !
Like Reply
#3
(17-01-2019, 03:47 PM)~rp Wrote: మన్నించాలి - ఈ ప్రతిస్పందన కొంత విచిత్రం..గానే ఉంటుంది.
సందేశాన్ని ఇక్కడ పోస్టు చేసిన మీపై విమర్ష కాదని గమనించాలి.

అవును. విచిత్రమే.
ఉద్యోగం కోసం వెళ్ళిన కొడుకు ప్రతినెలా పెద్ద మొత్తానికి బ్యాంకు చెక్కులు పంపాడు.
8 చెక్కులు - అంటే 8 నెలలు అలా పంపాడు. ఆమెకి చదువు రాదని , బ్యాంకు
చెక్కుని మార్చుకోలేదని అతనికి తెలుసు. కనీసం ఉత్తరం కూడా వ్రాయలేదు !
కొడుకు క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు ఆమె తపనపడుతూ ఉంటుంది కదూ.

అసలు విచిత్రం ఏమిటంటే,
ఇలా కధలని అల్లేవారు పోలిక సరైనదేనా అని ఆలోచించకుండా తోచినట్లు
కధలల్లి నెట్లో పెట్టడం & అందరూ గ్రూపులలోకి ఫార్వార్డులు చొప్పించడం !  

ఫార్వార్డు అయితే అందరూ చేసేస్తున్నారు కానీ
ఈ సందేశం వల్ల సనాతన ధర్మం గొప్పదనం మనకేమైనా తెలుస్తున్నదా !

అలా తెలుసుకుని
మనం అలాంటి విషయాలని ఏమైనా ఆకళింపు చేసుకుంటున్నామా !

Asalu chadive varu leru, inka emi arthamu chesukuntaaru sir.
Like Reply
#4
చందమామ కథలు ఎంతమంది  తెలియదు. ఒక అందమైన రాజకుమారి. ఎంత అందం అంటే............ఏ చిత్రమైన చిత్తరువు అవ్వాల్సిందే..................అంత అందమైన అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు.
ఆ రాక్షసుడిని ఎదుర్కొని వాడి కోటకు వెళ్లి ఆ అమ్మాయిని సాధించుకుంటాడు మన కథానాయకుడు. 
ఇక్కడ ఆ రాజకుమారి అందాన్ని ఆ రాక్షసుడు ఆరాధించాడు అని ఎవ్వరికి అర్ధమవుతుంది?......మూసలో పొయ్యే కొద్దీ మందికి తప్ప., 

నేను నా చిన్నతనం లో ఒక కథ చదివాను. అది ఇంగ్లీష్ కథ లో పడింది. నాకు తెలిసిన పద్దతిలో ఆ కథ ఈజ్ మిస్స్ కాకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను.
సుబ్బారెడ్డి భద్రాచలం లో A O గా చేస్తున్నాడు. ఇంకా 10 ఎల్లా సర్వీస్ ఉంది. ఆ రోజు మన్నా రెడ్డి గారి రిటైర్మెంట్. చాలా అట్టహాసంగా సభ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుండి వసంత madam, జగన్నాథ్ గారు వస్తున్నారు. ఆ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, డిప్యూటీ ఆ ఊరి మ్మెల్యే ని కూడా ఆహ్వానించారు.
మన్నా రెడ్డి ని అందరూ దండలతో ముంచెత్తారు. అయన నిజాయితీనే వేనోళ్ళ పొగిడారు. కొంతమంది అజాతశత్రువు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 
చిన్నా పెద్దా అందరూ కాళ్ళ మీద పడిపోయారు.
మన్నా రెడ్డి మాట్లాడే సమయం వచ్చింది.  గంభీరంగా ఉన్న మన్నా రెడ్డి గారి గొంతు గద్గదమై పోయింది. మాట పెగల్లేదు. ఈ రోజే రిటైర్మెంట్ ఆయన ముఖం లో ఆ బాధ కొట్టొచినట్లుగా కనపడింది. 
మాట రాక బాధపడుతూంటే...........అందరూ దగ్గరగా వచ్చి ప్రోడివి పట్టుకుని ఓదార్చారు. అంటే అలా విరుచుకు పడిపోయాడు మన్నా రెడ్డి గారు.
ఎవ్వరూ ఊహించలేదు. హార్ట్ ఎటాక్ తో ఇలా రిటైర్మెంట్ రోజే వెళ్ళిపోతారని. 
రిటైర్మెంట్, ప్రాణం తీసిందా???!!!!!
వాళ్ళ కుటుంబాన్ని ఆపలేకపొయ్యారు.  ఆ కన్నీటికి శోక సముద్రం అయిపొయింది.
ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారా ఎవ్వరికీ తెలియదు కానీ తోటి కోల్లెగ్స్  అందరూ ఏడుస్తున్నారు. రేపు మా పరిస్థితి కూడా ఇదే కదా అని. 
సన్మాన సభ కాస్తా సంతాప సభ అయిపొయింది.
సుబ్బా రెడ్డికి భయం పట్టుకుంది రేపు నేనూ రిటైర్ అవుతే?! నా పరిస్థితి ఇలానే ఉంటుందా? బరువెక్కిన  హృదయం ఎవ్వరిని కదిలించినా అదే విషయం.
  
సుబ్బా రెడ్డికి  భద్రాచలం నుండి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడం తో ప్రభుత్వ వాహనం లో బయలుదేరాడు. దారిలో వసంత మేడమ్ (మదాం-Madam) ని ఎక్కించుకుని డ్రైవర్ తీసుకుని వెళ్తున్నాడు.

వసంత మాడం తన రిటైర్మెంట్ త్వరలోనే ఉంది అంటూ మన్నా రెడ్డికి జరిగింది చాలా బాధాకరం అంటూ ఆలా రిటైర్మెంట్ తోనే ఇలా గుండె ఆగిపోతే పరిస్థితి ఏంటి? రేపటి స్థితి ఏంటి అన్న సందేహం వెలిబుచ్చింది వసంత మాడం.
కార్ కొంత దూరం రాగానే చిడిపోయింది.
చేసేది ఏమీ లేక దగ్గరలో బస్ స్టాండ్ కి వెళ్ళడానికి దారిలో ఊరి మధ్య తిరిగే జీపుని ఆపి ఇద్దరూ ఎక్కారు.
అదే అక్కడి ట్రాన్స్పోర్ట్. దొరికితే పొద్దున్న ఒక బస్సు మధ్యాహ్నం ఒక బస్ అంతే అందుకే అక్కడి వాళ్లకి జీప్ ఒక ట్రాన్స్పోర్ట్.

కొద్దీ దూరం లో ఒక 75  ఏళ్ళు ఉంటాయి. 
ఆమె చేతిలో పూల బుట్ట ఉంది. ఆ ముసలామెని చూడగానే మన్నా రెడ్డి గుర్తుకు వచ్చాడు ఇద్దరికీ.
ఈమె కన్నా చాలా చిన్న వాడు మన్నా రెడ్డి మరి ఎందుకు చనిపోయాడు. రిటైర్మెంట్ అయినా మన్నా రెడ్డికీ ఈమెకీ ఏంటి తేడా? రిటైర్ అవ్వడంతోనే జీవితం అయిపొయింది అనుకున్న మన్నా రెడ్డికి ఈ ముసలామెకీ బ్రతుకు మీద చివరి వరకూ ఆశతో ఎలా ఉంటోంది అని ఆ సందేహాన్ని వేలి బుచారు ఇద్దరూ ఆ ముసలామెతో.
ఆ ముసలామె చెప్పడం మొదలు పెట్టింది. తనకు ఇద్దరు కొడుకులని ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని...ఒకడు బొంబాయి ఇంకొకడు హైదరాబాద్ లో అంటూ వాళ్ళు తనని పదేళ్ళక్రితమే వదిలేసి వాళ్ళ పిల్లలని చూసుకుంటూ ఉండి పోయారని. 
ఆమె చెప్పిన ఒక మాట సుబ్బా రెడ్డి మనసులో నాటుకుపోయింది.
"బాబూ, మనిషి చేవలేని సమయంలో, చావు దగ్గరపడే సమయం జీవితం లో చాలా లాస్ట్ లో వస్తుంది. ఆ సమయం లో మాత్రమే తోడు కావాల్సి వస్తుంది. 
అంటే ఓపిక ఉన్నంతవరకూ ఎదో ఒకటి చెయ్యవచు. నేను చిన్న మల్లె తోట పెంచుతూ ఆ మల్లె పూలను మాల గా కట్టి అవి పట్నం లో అమ్మి పొట్ట పోషించుకుంటున్నాను. చేవ గలిగెనేని చేవ చెయ్యని వృత్తిగలదే................ధరణిలోన ప్రాణం నిలుప పలుకు ప్రాణం నిలవ గలదె............."

ఒక రాజు గారు, రాజ్యం ఉన్నప్పుడు అందరికీ కష్టం కలిగించిన వ్యక్తి ఎవ్వరికీ పిడికెడు బియ్యం దానం చెయ్యని వ్యక్తి రాజ్యం శత్రువుల పరం అయినప్పుడు గీత, భారం, భాగవతం వంటివి చదివి జనాలకు భోదిస్తూ మంచి ని ప్రాచారం చేశాడు. ఆ రోజున రాజు ఈ రోజున భోదించే వ్యక్తి అయ్యాడు. 
సత్యాన్ని అన్వేషించడానికి అనేకం అడ్డు.
సత్యం నిన్ను అన్వేషించడానికి నువ్వే అడ్డు.

కంచం లో రోజూ అమ్మ లడ్డు పెట్టేది. ఒక్క రోజు లడ్డూ పెట్టకపోతే అమ్మ చెడ్డది.
నేనే ఆ చెత్త కొడుకుని 

మీ 
కమల్
Like Reply
#5
(20-01-2019, 01:53 PM)kamal kishan Wrote: చందమామ కథలు ఎంతమంది  తెలియదు. ఒక అందమైన రాజకుమారి. ఎంత అందం అంటే............ఏ చిత్రమైన చిత్తరువు అవ్వాల్సిందే..................అంత అందమైన అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు.

Baga chepparu.
Like Reply

Users browsing this thread: