Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
#1
Heart 
హలో ఫ్రెండ్స్ నేను మీ విక్కి కింగ్ నీ ఇన్ని రోజులు సెక్స్ కథలు రాసి, థ్రిల్లింగ్ కథలు రాసి బోర్ కొట్టింది అందుకే బాగా కష్టపడి ఒక మంచి పాయసం లాంటి తీపి ప్రేమ కథ నీ మీ ముందుకు తీసుకొని వస్తున్న ఇది స్వచ్ఛమైన ప్రేమ కథ ఇందులో ఏలాంటి శృంగార సన్నివేశాలు ఉండవు పూర్తిగా ప్రేమ కథ కాబట్టి నా ముందు కథల మాదిరిగా ఈ కథ నీ కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నా  నేను  ఇప్పుడు  ఈ కథ తో  పాటు  గా మరో కథ  కూడా  రాస్తున్నా  కాబట్టి మీరు update లు కనుక సరిగా రాక పోతే కొంచెం  అడ్జస్ట్ అవ్వండి.

ఇంక కథ లోకి వెళ్లితే

ఉదయం ఆరు గంటల సమయం "చల్ చల్ ఛలో లైఫ్ సే మీలో" అంటూ ఫోన్ మొగితే బెడ్ మీద నుంచి చెయ్యి కింద పెట్టి నిద్ర మబ్బు లో వెతుక్కుంటూ ఉన్నాడు రాజా ఫోన్ ఎత్తి "హలో ఎవరూ" అని అడిగాడు "నీ బాబు నీ" అని అవతలి నుండి ఒక కంచు కంఠం వినిపించే సరికి నిద్ర మబ్బు వదిలి లేచి కూర్చున్నాడు రాజా "హా నాన్న చెప్పు "అని భయం కంగారు కలిసిన గొంతు తో అడిగాడు రాజా "సాయంత్రం బయలుదేరుతున్నావా" అని అడిగాడు రాజా వాళ్ల నాన్న రామ్మూర్తి "హా నాన్న టికెట్ కూడా బుక్ చేశాను మీరు ఏమి దిగులు పడవద్దు నేను వచ్చేస్తా" అని హామీ ఇచ్చాడు రాజా, "సరే జాగ్రత్తగా రా ట్రైన్ దిగ్గిన తరువాత ఫోన్ చెయ్యి మేము స్టేషన్ దెగ్గర నే ఉంటాం" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రామ్మూర్తి, తరువాత తిరిగి బెడ్ మీద నుంచే టైమ్ వైపు చూశాడు 6:30 అయినట్టు చూపిస్తొంది, దాంతో ఇట్టు వైపు తిరిగి చూసాడు బీర్ బాటిల్ నీ వాటేసుకోన్ని పడుకొన్ని ఉన్న తన ఫ్రెండ్ రామ్ నీ చూసి కాలు తో కోడితే బెడ్ మీద నుంచి జారీ పడ్డాడు రామ్ "నీ అబ్బ అట్ల కొట్టినావ్ ఎందిరా" అని నిద్ర మబ్బులో అరిచాడు రామ్, "నీ అబ్బ రాత్రి వద్దు అంటే తాగించావ్ ఎద్దవా మార్నింగ్ జాగింగ్ లో కీర్తి వాళ్ల నాన్న నీ పరిచయం చేస్తా అని చెప్పింది ఇప్పుడు 7 అవుతుంది దాని బాబు అసలే మిలిటరీ డిసిప్లిన్ కీ ప్రాణం ఇస్తాడు నా కొడక తేడా రావాలి నీ చేతిలో ఉన్న బాటిల్ లోపలికి దూరి పొది" అని రామ్ నీ తీడుతు రెడీ అయ్యి వెళ్లాడు.


పార్క్ కీ వెళ్లిన రాజా కీర్తి కీ ఫోన్ చేశాడు కానీ కీర్తి ఫోన్ కట్ చేస్తుంది ఎక్కడ ఉందా అని వెతుకుంటు వెళ్లిన రాజా అక్కడ కీర్తి నీ చూసి షాక్ అయ్యాడు ఎందుకు అంటే తను వాళ్ల నాన్న మరి రాజా శత్రువు అయిన కిరణ్ తో నవ్వుతూ మాట్లాడుతున్నారు, అసలు ఏమీ అర్థం కాని రాజా కీర్తి దగ్గరికి వెళ్లి పిలిచాడు దాంతో కీర్తి రాజా వైపు వచ్చింది

కీర్తి : హాయ్ ఏంటి ఇక్కడ ఏమీ చేస్తున్నావు అని ఆశ్చర్యం భయం కలిసిన గొంతు తో అడిగింది

రాజా : రాత్రి నువ్వే గా what's app లో మార్నింగ్ 6 కీ పార్క్ కీ రా మా డాడీ కీ పరిచయం చేస్తా అని మెసేజ్ చేశావ్ అని అడిగాడు

కీర్తి కంగారూ గా తన ఫోన్ చూసుకుంది అందులో తను కిరణ్ కీ పంపిన మెసేజ్ రాజా కీ కూడా పంపింది అది చూసి షాక్ అయినా కీర్తి కవర్ చేయడానికి వేరే దారి లేదు అని అర్థం అయ్యి 

కీర్తి : అది కాదు రాజా నువ్వు ఏమో ఒక్కటే జాబ్ చేస్తూ ఉన్నావు ఆ video game కంపెనీ లో 5 years నుంచి ఎలాంటి improvement లేదు పోనీ వేరే జాబ్ చూసుకో అంటే నాకూ నచ్చిన పని నేను చేస్తున్న అంటావు మా నాన్న కీ నేను బెటర్ గా ఉండటం ఇష్టం సో అందుకే కిరణ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మా నాన్న కూడా సులువుగా ఒప్పుకొన్నాడు

రాజా : సరే నీ ఇష్టం నేను నిన్ను ఫోర్స్ చేయను ఒక విషయం అడుగుతా దానికి సమాధానం ఇవ్వు వెళ్లిపోతా "కాలేజీ లో నువ్వు నా వెంట పడ్డావా నేను నీ వెంట పడ్డానా"

కీర్తి : నేనే నీ వెంట పడ్డాను కానీ అప్పటి లా నువ్వు ఇప్పుడు లేవు అప్పుడు నీ attitude నీ activeness నాకూ నచ్చాయి కానీ ఇప్పుడు నీకు చాలా తేడా ఉంది నువ్వు మారిపోయావు

రాజా : నువ్వు మరి రఫ్ గా ఉన్నావు మారు అని అడిగింది ఎవరూ నువ్వే కదా అలాంటిది ఇప్పుడు నువ్వే మారిపోయావు అని అంటే ఏంటి అర్థం

కీర్తి : అది అంతా నాకూ తెలియదు నాకూ నీకు సెట్ అవ్వదు నీకు నాకన్న మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్పి వెళ్లి పోతుంటే

రాజా : మరి ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగిన విషయం గురించి ఏంటి అని అడిగాడు

కీర్తి : ఆ రోజు నువ్వు చేసింది నాతో కాదు ఆ రోజు నేను ఆ రూమ్ లోకి రాలేదు నీకు ఈ విషయం తెలిస్తే బాగోదు అని చెప్పలేదు కాబట్టి నను బ్లాక్మెయిల్ చేయాలి అని ట్రై చేయదు అని చెప్పి వెళ్లి పోయింది

దాంతో రాజా ఆలోచన లో పడ్డాడు అంటే ఆ రోజు తనతో పాటు ఉన్నది కీర్తి కాకపోతే మరి ఆ రోజు రాత్రి అంతా నాతో ఉన్న ఆ అమ్మాయి ఎవరూ అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాడు, అదే ఆలోచన తన మెదడు నీ తొలించి వేస్తుంది అదే ఆలోచన తో ఆఫీసు లో సరిగా పని కూడా చేయలేదు, కాంటిన్ లో కాఫీ తాగుతూ ఉండగా రామ్ వచ్చి అడిగాడు ఏమీ అయ్యింది అని జరిగినది మొత్తం చెప్పాడు రాజా

రామ్ : బాధ పడకు రా ఈ పిల్ల కాకపోతే ఇంకో మంచి అమ్మాయి నీ జీవితం లోకి వస్తుంది

రాజా : నీ అబ్బ నేను ఫీల్ అవుతుంది ఆ దొంగ మొహం దాని కోసం కాదు అది హ్యాండ్ ఇస్తుంది అని నాకూ ఎప్పుడో తెలుసు

రామ్ : మరి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావూ

రాజా : ఆ రోజు నేను కీర్తి అనుకోని నేను గడిపిన ఆ అమ్మాయి ఎవరు అన్ని నా ఆలోచన

రామ్ : అవును రా మీరు ఒక రాత్రి అంతా కలిసి ఉన్నారు ఒకరినొకరు చూసుకోలేదా

రాజా : లేదు అక్కడ లవ్ ఇన్ డార్క్ అని పార్టీ కాన్సెప్ట్ అందరూ ఒక్కటే డ్రస్ లు మాస్క్ లు వేసుకొని ఉన్నారు ఎవరూ ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి నేను కీర్తి అనే అనుకున్న

రామ్ : ఎప్పుడో 3 years క్రితం జరిగిన విషయం దాని గురించి ఇప్పుడు తలచుకొని బాధ పడితే లాభం లేదు

రాజా : అది నిజమే కానీ ఆ అమ్మాయి నాకూ చాలా సుఖం ఇచ్చింది అంటే తను అక్కడ తన బాయ్ ఫ్రెండ్ కీ ఎంతో సంతోషం ఇవ్వాలని ఆనుకుంది కానీ అది అతను కాదు అని తెలిస్తే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూన్నా

రామ్ : ఇప్పుడు దాని గురించి ఆలోచించే అంత టైమ్ లేదు ట్రైన్ కీ టైమ్ అవుతుంది పద వెళ్లదాం అని ఇద్దరు రూమ్ కీ బయలుదేరారు

కానీ ట్రాఫిక్ జామ్ అవ్వడం తో వాళ్లు కొంచెం లేట్ గా వెళ్లారు అప్పటికే ట్రైన్ కదలడం మొదలు అయ్యింది రాజా రామ్ కీ బై చెప్పి స్టేషన్ లోకి వెళ్లాడు, అప్పుడే ఒక ఆటో వచ్చింది అందులో ఉన్న అమ్మాయి కళ్లు మూసుకొని ఏదో ఆలోచిస్తూంది "తన కళ్ల ముందు తన ఒంటి పైన ఉన్న దుప్పటి తప్ప మిగిలిన తన బట్టలు అన్ని రూమ్ నిండా పడి ఉండటం చూస్తోంది అప్పుడే తను లేచి ఒళ్లు విరుచుకొన్ని పక్కకు చూస్తే తన పక్కన పడుకోన్ని ఉన్న అతని పులి tattoo చూసింది" ఆ tattoo గుర్తు రాగానే ఉలికిపాటు తో కళ్లు తెరిచింది అప్పుడే లోపలి నుంచి announcement వచ్చింది
" హైదరాబాద్ నుండి తిరుపతి కీ వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది " అని విన్నపడగానే వెంటనే ఆటో కీ డబ్బులు ఇచ్చి టికెట్ కింద పారేసుకుంది అది చూసుకోకుండా ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తుతు ఉంది తన పక్కనే రాజా కూడా పరిగెత్తుతు ఉన్నాడు ఆ అమ్మాయిని చూశాడు అంతే అప్పుడే తన పక్క నుంచి వెళ్లుతున్న కోచ్ డోర్ నీ పట్టుకుని ట్రైన్ ఎక్కి ఆ అమ్మాయిని కూడా లోపలికి లాగాడు.

అంతే ఒకసారి గా ఆ అమ్మాయి కూడా ట్రైన్ లోకి వచ్చింది అప్పుడు రాజా కీ ఆ అమ్మాయి కీ మధ్య సూది కూడా దూరని అంత దెగ్గర గా ఉన్నారు దాంతో ఒకరి కళ్ల లోకి ఒక్కరూ చూసుకుంటు ఉన్నారు ఇద్దరి గుండె చప్పుడు లో వేగం పెరిగింది. 
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ప్రేమ తో మాకు మాంచి ప్రేమ కథ అందించడం ద్వారా మీ శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చదివి మేము పొందిన ఆనందం మరువ లేని విధంగా ఉంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
#3
(02-10-2019, 07:13 PM)Chiranjeevi Wrote: ప్రేమ తో మాకు మాంచి ప్రేమ కథ అందించడం ద్వారా మీ శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చదివి మేము పొందిన ఆనందం మరువ లేని విధంగా ఉంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

మీ లాంటి ప్రేమ పంచే అభిమానులు ఉన్నందుకే నాలో కొత్త కథలు రాయడానికి స్ఫూర్తి నీ ఇస్తుంది మీ ప్రేమ కీ ధన్యవాదాలు
Like Reply
#4
Nice starting
Like Reply
#5
(03-10-2019, 07:43 AM)Sachin@10 Wrote: Nice starting

Thank you bro
Like Reply
#6
మిత్రమా మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Like Reply
#7
(03-10-2019, 08:38 AM)Chiranjeevi Wrote: మిత్రమా మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను

అదే పని లో ఉన్న కొద్ది సేపు వేచి ఉండండి
Like Reply
#8
రాజా నీ చూడగానే ఆ అమ్మాయి కళ్లు లో ఏదో తెలియని ఒక మెరుపు మేరిసింది, డోర్ దెగ్గర గాలి గట్టిగా రావడంతో ఆ అమ్మాయి మోహం పైన కురులు ఎగురుతున్న తన కన్ను రెప్పలు మాత్రం వాలకుండా రాజా నే చూస్తూ ఉంది, రాజా కూడా ఆ అమ్మాయి నీ తన గుండెల పై నుంచి పక్కకు పంపుతే ఎక్కడ తన గుండె చప్పుడు ఆగిపోతుందో అని అలాగే తనని తన ఎద పైన ఎప్పటికీ అలాగే ఉంచాలి అనుకున్నాడు అప్పుడే, లోపలి నుంచి TC రావడం తో ఇద్దరు వేరు అయ్యారు ఆ అమ్మాయి తన పర్స్ లో టికెట్ కోసం వెతుకుతూ ఉంది కానీ అది కనిపించడం లేదు దాంతో రాజా వైపు చూసి చెవిలో "excuse me నా టికెట్ ఎక్కడో మిస్ అయ్యింది కొంచెం హెల్ప్ చేస్తారా" అని అడిగింది, దాంతో రాజా తన టికెట్ తీసి చూపించాడు అది చూసిన TC సైలెంట్ గా వెళ్లిపోయాడు ఆ అమ్మాయిని టికెట్ గురించి కూడా అడగలేదు. ఆ తర్వాత తన సిట్ వెతుక్కుంటూ వెళ్లి కూర్చున్నాడు రాజా తన వెనకే వచ్చింది ఆ అమ్మాయి" మీరు ఏమి చేశారు అసలు నను టికెట్ అడగలేదు "అని అడిగింది రాజా తన టికెట్ తీసి చూపించాడు అందులో రెండు సిట్లు ఉన్నాయి "నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాతో పాటు గా రావాలి కానీ తను రాలేదు అందుకే తన ప్లేస్ లో మిమ్మల్ని తీసుకొని వెళుతున్న" అని చెప్పాడు రాజా, "చాలా థాంక్స్ నా పేరు రమ్య "అని పరిచయం చేసుకుంది," నా పేరు రాజా" అని బదులు ఇచ్చాడు
అప్పుడే రమ్య కీ ఫోన్ రావడంతో ఎత్తి మాట్లాడటం మొదలు పెట్టింది కాకపోతే తెలుగు లో కాదు మలయాళం లో

రాజా : మీరు కేరళ నుంచా అని అడిగాడు

రమ్య : అవును నేను సగం మలయాళీ సగం తెలుగు

రాజా : అది ఏంటి

రమ్య : అంటే పెద్ద స్టోరీ

రాజా : పర్లేదు మనకు జర్నీ కీ టైమ్ పాస్ అవుతుంది

రమ్య : సరే మా నాన్న కేరళ నుంచి MBA చేయడానికి అహ్మదాబాద్ వెళ్లారు అక్కడ అమ్మ కూడా చదువుతోంది ఒక ప్రాజెక్ట్ పని మీద ఇద్దరు కలిసి పని చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల ఇద్దరు ప్రేమలో పడ్డారు అలా అమ్మ తెలుగు నాన్న మలయాళీ ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోలేదు ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నేను నా చెల్లి పుట్టాక మళ్లీ ఫ్యామిలీ లు కలిశాయి అని తన కుటుంబ చరిత్ర చెప్పింది రమ్య

కానీ తన మాటలు ఏవి రాజా చెవిలోకి వెళ్లడం లేదు తను మాట్లాడుతూ ఉండగా ఎగురుతున్న తన కన్ను బొమ్మలు, పిండితే తేనె కారిపోయేలా ఉన్న తన ఎర్రని పెదవులు, నేరేడు పండు లాంటి పెద్ద కళ్లు ఆ చూపులు తన మనసులో కీ బాణం లాగా దూసుకొని వెళ్లి గాయపరచుతున్నాయి. అప్పుడే రాజా ఫోన్ మొగ్గింది ఈ టైమ్ లో ఎవడు రా అని చిరాకు తో ఫోన్ ఎత్తి "హలో ఎవరూ" అని అడిగాడు "నీ అమ్మకు మొగుడు" అని అవతలి నుండి వచ్చింది ఆ మాట ఎవరూ అని ఫోన్ వైపు చూశాడు వాళ్ల నాన్న దాంతో రాజా కొంచెం బెదిరి

రాజా : హా నాన్న చెప్పు

రామ్మూర్తి : ఏరా ఎప్పుడు ఫోన్ లో ఎవరు చేశారో చూసుకోవా

రాజా : అది కాదు నాన్న రామ్ గాడు ఏదో మెయిల్ అడిగితే దాని గురించి చూస్తూ చూసుకో లేదు

రామ్మూర్తి : సరే బయలుదేరావా

రాజా : హా నాన్న ట్రైన్ లోనే ఉన్న

రామ్మూర్తి : సరే అయితే తిరుపతి దాకా అవసరం లేదు కడప లోనే దిగేయి మీ అమ్మ అందరం కలిసి ఇంటి నుంచే వెళ్ళదాం అంటుంది

దాంతో రాజా గుండె లో బాంబ్ పేలినట్టు అయింది

రాజా : నాన్న అది కాదు రిజర్వేషన్ తిరుపతి దాకా చేశాను డబ్బులు వేస్ట్ చేయదు అని నువ్వే అంటావు ఇప్పుడు ఏమీ చేయాలి అని అడిగాడు

రామ్మూర్తి : సరే అయితే తిరుపతి లో కలుదాం అని ఫోన్ పెట్టేసాడు

ఇక్కడ రమ్య మాత్రం గూగుల్ లో ఏదో అడ్రస్ తెగ వెతుక్కుంటూ ఉంది

రాజా : ఏమీ అయ్యింది అని అడిగాడు

రమ్య : నాకూ జాబ్ వస్తే తిరుపతి వస్తా అని ముక్కుకున్నా

రాజా : మంచిది ఇప్పుడు ఏమీ అయింది

రమ్య : తిరుపతి నాకూ కొత్త అక్కడ నా ఫ్రెండ్ వుంటుంది వాళ్లు ఊరికి వెళ్లారు అంటా అడ్రస్ ఇచ్చింది వాళ్ల ఇంటి స్పేర్ కీ అక్కడ పెట్టి వెళ్తాము నువ్వు వెలు అంటుంది

రాజా : అంటే మీరు దర్శనం కీ రెడీ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి అంతే కదా

రమ్య : అవును

రాజా : ఏమీ భయపడకండి మా బాబాయ్ వాళ్ల ఇళ్లు తిరుపతి లోనే మేము దర్శనం కీ వెళుతున్నాం కలిసి వెళ్ళదాం

రమ్య : అయ్యో మీకు ఎందుకు శ్రమ అసలే ఇప్పటికే మీరు నాకూ టికెట్ ఇచ్చారు ఈ హెల్ప్ చాలు పర్లేదు నేను ఎలాగోలా మా ఫ్రెండ్ ఇంటికి వేళ్లతా

రాజా : దీంట్లో శ్రమ ఏమీ ఉంది నను మీ ఫ్రెండ్ అనుకోండి అని అడిగాడు 

అలా ఒక 10 నిమిషాల కీ రమ్య ఒప్పుకుంది

ఉదయం ట్రైన్ దిగిన తరువాత రాజా, రమ్య బయటికి వెళ్లారు అక్కడ రాజా వాళ్ల కార్ తో తన బాబాయ్ కొడుకు హర్ష రాజా కోసం ఎదురు చూస్తున్నాడు, రాజా తో రమ్య నీ చూసిన హర్ష

హర్ష : ఎవరూ కీర్తి ఆ అని అడిగాడు

రాజా : దానికి నాకూ నిన్న బ్రేక్ అప్ అయ్యింది ఈ అమ్మాయి నా కోలిగ్ తిరుపతి కీ 1st టైమ్ అందుకే నాతో పాటు తీసుకొని వచ్చా అన్నాడు

రమ్య నీ ఇంట్లో అందరికీ కోలిగ్ గానే పరిచయం చేశాడు ఆ తర్వాత అందరూ రెడీ అవుతుండగా రాజా వాళ్ల బాస్ ఫోన్ చేయడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి వెనకు తిరిగాడు, రమ్య ఒక పసుపు తెలుపు కలిసిన ఒక చీర కట్టుకుని తడి గా ఉన్న తన జుట్టు నీ ఒక వైపు వాల్చి టవల్ తో ఆరబెట్టుకుంటు ఉండగా, తన నడుము చుట్టూ పడిన మడత రాజా గుండె నీ మెల్లి పెట్టింది.

(6 నెలల తర్వాత కేరళ కొచ్చి)

అందరూ కలిసి రమ్య కీ మంగళ స్నానాలు చేయించి గదిలోకి తీసుకొని వెళ్లి పట్టు వస్త్రాలు వేసి ఒంటి నిండా నగలు వేసి తయారు చేస్తూన్నారు, అప్పుడే డొల్లు సన్నాయి రాగాల మధ్య కొని కార్ లు లోపలికి వచ్చాయి అప్పుడు రమ్య చెల్లి విద్య పరిగెత్తుతూ వచ్చి రమ్య చెవిలో "బావ వచ్చాడు" అని చెప్పింది అంతే రమ్య గుండెల్లో ఒక పుల్ల తోట పువ్వులు పరిమళించిన్నటు మనసు వికసించింది అప్పటి వరకు కొంచెం వాడి పోయి ఉన్న తన మొఖం పైన చిన్న నవ్వు చందమామ లా మెరిసింది, దాంతో కిటికీ వైపు పరిగెత్తుతు వెళ్లింది అప్పుడే కార్ లో నుంచి దిగాడు రాజా తన చేతిలో ఉన్న అద్దం తో వచ్చే కాంతి నీ రాజా మోహం వైపు తగిలేటట్టు ఉంచింది అప్పుడు రాజా అట్టు వైపు చూశాడు రమ్య నీ చూడగానే రాజా మోహం పైన కూడా నవ్వు పూసింది. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
#9
Nice updates
Like Reply
#10
(03-10-2019, 10:44 AM)Sachin@10 Wrote: Nice updates

Thank you for your helping comments
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#11
Excellent bro waiting for next update
Like Reply
#12
చాలా బాగుంది బ్రో
Like Reply
#13
(03-10-2019, 12:21 PM)SVK007 Wrote: Excellent bro waiting for next update

Thank you bro next update kuda meru enjoy chestharu
Like Reply
#14
(03-10-2019, 12:59 PM)Karthik Wrote: చాలా బాగుంది బ్రో

మీ కామెంట్స్ కూడా చాలా థాంక్స్ బ్రో
Like Reply
#15
Excellent bro... Good start and one of the best story avuddi ilage rayandi bro pure love story waiting for next update bro
Like Reply
#16
ఆధ్బుతం రమ్య రాజా ల పెళ్ళి చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది
Like Reply
#17
(03-10-2019, 01:17 PM)HitmanA007 Wrote: Excellent bro... Good start and one of the best story avuddi ilage rayandi bro pure love story waiting for next update bro

Thank you bro if you all encourage it I would give it a better feel good love story
Like Reply
#18
(03-10-2019, 02:08 PM)Chiranjeevi Wrote: ఆధ్బుతం రమ్య రాజా ల పెళ్ళి చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది

పెళ్లి మొదలు అయ్యింది ఇంకా అవ్వలేదు దానికి మధ్యలో ఒక పెద్ద   ట్విస్ట్ వస్తుంది
Like Reply
#19
ఆహా మళ్ళీ అదరగొట్టారుగా కొత్త కధతో. కధ అద్బుతంగా ఉంది. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ ఉంటాం.
Like Reply
#20
(03-10-2019, 07:23 PM)d.ramya341 Wrote: ఆహా మళ్ళీ అదరగొట్టారుగా కొత్త కధతో. కధ అద్బుతంగా ఉంది. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ ఉంటాం.

నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా చేసుకుని ఈ కథ మొదలు పెట్టాను
Like Reply




Users browsing this thread: 2 Guest(s)