Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఒక ప్రేమకథ... by sindhukumari
#1
Heart 
                ఒక ప్రేమకథ
[Image: 72243303-767163037041033-7790132087150870528-n.jpg]

                   ... by sindhukumari
[+] 2 users Like Milf rider's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ప్రేమ కథ

.హాయ్ ఫ్రెండ్స్ ...ఇక్కడ అందరు కధలు బాగుంటున్నాయి......ఒక్కోరు ఒక్కో రకమైన కథ తో మనల్ని ఆనంద పరుస్తున్నారు ...నేను ఇక్కడ ఒక కథ ని పోస్ట్ చేస్తున్నాను ...ఇది ఒక లవ్ స్టొరీ ,,,ఇందులో ఎటువంటి బూతులు ఉండవ్ ....అందరు ఆశించే శృంగారం కూడా ఉండదు ....ఒక మంచి ఫీల్ ఉన్న ప్రేమ కథ........మీ అందరికి నచ్చుతండానే ఆశతో తో పోస్ట్ చేస్తున్న ......ఎలా ఉందొ చదివి చెప్పండి ..........
______________________________
Sindhu
Like Reply
#3
ఆర్యన్ ..ఆఅహ్హ్హ్హ్ ... !! "ఆ పేరు వింటేనే నాకు కోపం కట్టలు దాతేస్తుంది ......
వాడు మా క్లాసు topper....
మా కాలేజీ ఫాకల్టీ ల ముద్దు బిడ్డ .... అన్నిట్లో తనే ఫస్ట్......
అయితే ఏంటి అంట గొప్ప .. వాడిలా ఉండాలంట అందరు......రోజు వాడి పొగడ్తలు మా టీచర్స్ నుంచి వినలేక పోతున్నాను.
ఓహ్.....ముందు నన్నుపరచియం చేస్కోడం మర్చేపోయాను....ఏం చెయ్యను వాడు అంటేనే చాలు చిరాకు...కోపం తప్ప నాకు ఇంకేం గుర్తురావు అసలు.....సరేలెండి నా పేరు శిశిర.నేను బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా.....
నాకు చిన్నపిల్లలు,కుక్క పిల్లలు,మంచి పాటలు,గులాబీలు,కధలు,కవితలు అంటే చాలా ఇష్టం......క్లాసు బుక్స్ తో పాటు ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు చదవటం అంటే నాకు చాల ఇష్టం.....అన్నిరకాల పుస్తకాలు ఫిక్షన్,నాన్ ఫిక్షన్ ఇలా పుస్తకాలూ చదువుతా....ఇంకా ...హా ...అవును మర్చేపోయా ఫిల్టర్ కాఫీ అంటే పిచ్చినాకు.........
చిన్నప్పటి నుంచి నేను అన్నిట్లో ఫస్ట్ నే కానీ ఇప్పుడు నా ఫస్ట్ వాడు అదేనండి ఆ ఆర్యన్ తీసేస్కున్నాడు........ అదేంటో అండి వాడిని చూస్తే ఫస్ట్ పోసిషన్ నాది...నీది కాదు అని వాడి collar పట్టుకుని అరవాలి అన్పిస్తుంది........నాకు వాడి మీద ఇంత కోపం వున్నా వాడితో ఒక్కసారి కూడా ఎప్పుడు గొడవ పడలేదు.ఇప్పటివరకు వాడితో సరిగ్గా మాట్లాడిందే లేదు.......
కానీ ఆ రోజు నాకు పట్టలేని కోపం వచ్చింది......ఇంకా ఎవ్వరు దొరకనట్టు వాడ్ని,నన్ను మాత్రమే internship కి సెలెక్ట్ చేసారు . వాడు ఫస్ట్ ఇంకా నేను సెకండ్ మరి క్లాసు లో ......
IIT చెన్నై,వెళ్ళాలనే ఉంది నాకు కానీ వీడితోన.. వాడి మీద కోపం తో నేను ఇంత మంచి వదులుకోలేను గా ....అందుకే ఇంకా తప్పదు అని బయలుదేరా,ఎలా గడుస్తాయో ఈ రెండు నెలలు అని అన్కుంటూ నా luggage సర్దుకున్నాను .
కాని అదే రెండు నెలలు నా జీవితం లో చెరగని ముద్ర వేస్తాయి అని.......నా ఆశలని,ఆలోచనలని చాల వరకు మార్చేస్తాయి.....అని నా కలలో కూడా ఉహించల.......అన్ని అనుకున్నటు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది.......
మీరు తెల్సుకున్టార ఆ రెండు నెలలలో ఏం జరిగిందో ????????????........


________________________
Like Reply
#4
పార్ట్ -2
IIT లో intership వచ్చిందని చాల హ్యాపీగా ఉంది కానీ,అమ్మని... నాన్న ని వదిలేసి వెళ్ళాలి కదా.....అందుకే కొంచెం బాధగా ఉంది.......నాకు ఊహ ...తెలిసినప్పటి నుంచి వెళ్ళని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు ..........కావలసినవి అన్ని అమ్మ సర్దుకోవడం లో హెల్ప్ చేసింది ......నాన్న ఏమో కార్డు లో డబ్బులేస,చూస్కుని వాడకో తల్లి ...ఇంకా అవసరం అయితే ఫోన్ చేసి చెప్పు వేస్తా అని చెప్తూ డెబిట్ కార్డు చేతిలో పెట్టారు......అప్పటిదాకా IIT కి వెళ్తున్న అని ఒక చిన్న excitement ఉంది కానీ ఇంటి గుమ్మం దాటి బైటకి వచ్చానో లేదో కళ్ళు నీళ్ళ తో నిండి పోయాయి,ఎక్కడ్నుంచి వస్తున్నాయో ఇన్ని కన్నీళ్ళు నాకు...... "పిచ్చిపిల్లా .. రెండు నెలలు ఎంత సేపు రా,యిట్టె అయిపోతాయి తల్లి " అని నాన్న నన్ను గట్టిగ పట్టుకుని,తల నిమురుతూ అన్నారు.
"హ్మ్మ్" అని కళ్ళు తుడ్చుకున్నాను.
"నేను రాను రైల్వే స్టేషన్ కి,నేను చూడలేను నువ్ వెళ్తోంటే" అంది అమ్మ నా నుడురుమీద ముద్దు పెడుతూ..
"పిచ్చిపిల్లా..రెండు నెలలు ఎంత సేపు,యిట్టె అయిపోతాయి"అని అచ్చం నాన్నలా అన్నాను అంతే నవ్వేసింది అమ్మ....
"ఎంతైనా నువ్వు మీనాన్నకుతురివే,వెళ్ళు నీకేం బెంగ ఉండదులే నామీద"అంది మా అమ్మ మూతిముడుచుకుంటూ...... ."నువ్వులేకుండా అసలు ఎలా ఉంటాను అనుకుంటున్నావు స్వీటీ అని అమ్మని గట్టిగా పట్టుకుని అమ్మ బుగ్గ మీద ముద్దు పెడ్తూ "అన్నాను నేను.
"ఫోన్ ఉంది గా,మాట్లాడుతూనేవుంటాను రోజు మార్నింగ్....నైట్. జాగ్రత్తగా ఉండు రాకన్నా"అనిఅమ్మఇంకోముద్దుపెట్టింది.
తర్వాత కార్ ఎక్కం ...నేను...అప్పా, అప్పా డ్రైవ్ చేస్తూ ఉన్నారు ....విండో లోంచి అమ్మకి టా టా చెప్తూ చూస్తున్న ...క్రమంగా కారు వేగాన్ని పుంజుకుని మా అమ్మకి ...మా ఇంటికి దూరం గా వెళ్తోంది .......
కళ్ళుతుడుచుకుంటూ అలా ఆలోచిస్తూ ఉన్నా.
"నీతోపాటు సెలెక్ట్ అయిన ఇంకో అబ్బాయి ఎవరుతల్లి? "నాన్నఅడిగారు.......,
నేను ఆయన భుజం మీద తల వాల్చుకుని కూర్చున్న.
" తన పేరు ఆర్యన్" అన్నాను.
హ్మ్మ్..నీ ఫ్రెండ్ నే కదా,మీరిద్దరే ఉంటారు గా మరి ఈ 2 నెలలు " నాన్నఅడిగారు.
వాడు నాకు ఫ్రెండ్ ఏంటి?! వాడు అంటేనే చిరాకు.....కోపం........వాడితో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు అని అరవాలి అనిపించింది.......కాని ఆయనని వదిలివెళ్తున్న అనే బాధపడుతున్నారు, నాకు నచ్చని వాడితో ఉండాలి అని తెలిస్తే ఇంకా బాధపడతారేమో అనిపించింది నాకు.
"హా నాన్న, మా క్లాసు ఫస్ట్ tanu,చాల సైలెంట్"అన్నాను.
"నువ్వు వేరేవాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇస్తావు? అందరు సైలెంట్గానే అన్పిస్తారు అందుకే నీకు "అన్నారు నాన్న నవ్వుతు .రైల్వేస్టేషన్కి వచ్చేసాం, నేను ఒక laptaap bag,ఒక పెద్ద trolly తెచ్చుకున్నాను,ఆర్యన్ కోసం చూస్తున్నాం నేను ,నాన్న .ఇంతలో తను నాలానే ఒక laptap bag , ఒకచిన్న trolly తెచ్చుకున్నాడు.
"నాన్న,తిను ఆర్యన్..ఆర్యన్ మై డాడ్ "ఇద్దర్ని ఒకరికిఒకరిని పరిచయం చేసాను....
"నమస్తే అంకుల్" విష్ చేసాడు ఆర్యన్.
"నమస్తేబాబు..... ఒక్కడివే వచ్చావ ?మీవాళ్ళు ఎవరు రాలేదా? "నాన్నఅడిగారు.
"లేదు అంకుల్,అమ్మ బిజీగా ఉన్నారు....... నాన్న అవుట్ ఆఫ్ స్టేషన్."చెప్పాడు తను.
ఇంతలో ట్రైన్ వచ్చింది.. మేము ఎక్కి కూర్చున్నాం....ఇద్దరిదీ సైడ్ లోయర్ అండ్ అప్పర్ బెర్త్స్.నాన్న నాకు లిట్లే హార్ట్స్ biscuts.." ఇచ్చారు
"థాంక్యు అప్పా" అని గట్టిగ పట్టేస్కున్నాను ఆయనని..మల్లి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి..
"ఏం కావాలన్నా ఒక్క ఫోన్చెయ్యి చాలు, సరేనా "అన్నారు నాన్ననా భుజం మీద తడుతూ.
"హ్మ్మ్.." అని ఊ కొట్టాను........ అమ్మతో మాట్లాడదాం ఉండు అని ఇంటికి ఫోన్చేసారు నాన్న......అమ్మ ఏడుస్తోంది, నాకు ఆమె గొంతు అర్ధం అయిపొయింది........
"ఏడుస్తూ పంపకు స్వీటీ నన్ను......ఒక్కసారి నవ్వు ప్లీజ్ అని అన్నాను,నా కళ్ళు నేను తుడుచుకుంటూ.
"ఏడవడం లేదు నేనేమి, బాగా తిను,జాగ్రత్తగా ఉండు,ఎవ్వర్తో గొడవ పడద్దు.. సరేనా " అంది అమ్మ.
"అలాగే స్వీటీ .. ఇంకా వేల్లోస్తాను, ట్రైన్ మూవ్ అవ్తుంది "అని చెప్పి ఫోన్ నాన్నకి ఇచ్చేసా.
అప్పా , మీరేమి చెప్పరా నాకు,అమ్మ అన్ని చెప్పింది అన్నాను .....
"నువ్వు చిన్న పిల్లవి కాదు, నాకు రాంక్లు, గ్రేడ్లు అక్కర్లేదు...నువ్వు ఏం చెయ్యాలనుకున్న చేయి, లైఫ్ లో ఎప్పుడు.....అయ్యో ఇది చేయలేకపోయనే అని regret ఫీల్ అవ్వకూడదు నువ్వు అంతే."అన్నారు నాన్న......
నాన్న మాటలకి ఒక చిరునవ్వు మెరిసింది నా మొహంలో.వేల్లోస్తాను అని చెప్పా ట్రైన్ మూవ్ అవ్తోంది,నాన్న దిగిపోయారు.....అందరు పేరెంట్స్ అన్ని మార్క్స్ రావాలి,ఇంత స్కోర్ కావాలి అనుకుంటారు ఈ రోజుల్లో కాని నేను చాల అదృష్టవంతురాలిని,ఒక్కసారి కూడా ఎప్పుడు నన్ను ఏ విషయంలో ను ప్రెషర్ చెయ్యలేదు వాళ్ళు. నాకు నచ్చిన బ్రాంచ్ నేనే ఆప్ట్ చేస్కున్నాను, నా మార్క్స్ విషయంలో నా పేరెంట్స్ చాల గర్వపడతారు,నాకు ఆ విషయం తెల్సు కాని ఎవ్వరి ముందు నన్ను పొగడరు. వాళ్ళ హప్పినెస్స్ ఎప్పుడు అలానే ఉండేలా నేను మాక్సిమం ట్రై చేస్తా,మా అమ్మ,నాన్న ల గారాల పట్టిని నేను.నేను ఒక్కదాన్నే కాబట్టి వాళ్ళే నాకు అన్ని,నాన్న ఐతే ఫ్రెండ్ కన్నా ఎక్కువ .తను నా బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్
ఏ విషయమైన ఆయన తోనే షేర్ చేస్కుంటాను.ఆయన సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్.ట్రైన్ స్టేషన్ వదిలే వరకు కిటికీలో నుంచి చెయ్యి ఊపి నాన్నకి "టా టా "చెప్తూనే వున్నాను.


______________________________
Like Reply
#5
ట్రైన్ స్టేషన్ దాటాక కాని గుర్తు రాలేదు ఆర్యన్ నన్ను గమనిస్తున్నాడని..........
నేను ఏడవటం అంతా చూసేశాడ వీడు.......ఏమనుకున్తూన్నాడో .....అసలెల మాట్లాడాలి ఈ అబ్బాయితో.........అని మనసులో అనుకుంటున్నాను ........ఇంతలో తనే
"నాకు చాల హ్యాపీ గా ఉంది "అన్నాడు ఆర్యన్,నా థాట్స్ నుంచి బయటకి తెస్తూ.
"హ .. ఏంటి .. ఎందుకు? "అని అన్నాను.
"IIT చెన్నై లో internship గురించి......ఏం నువ్వు హ్యాపీగా లేవా?"అడిగాడు తనూ,చిన్నగా నవ్వూతు.
"హా...అదా అవునూ,నేను కూడా హ్యాపీ గా ఉన్నా "అన్నాను నేను.
వీడు,మాములుగా మాట్లాడతాడ?మనసులో నవ్వుకున్నాను నేను.
"నువ్వు మీ అమ్మ,నాన్నతోవుంటావా? "అడిగాడు ఆర్యన్.
"హ..నువ్వు కూడా ఇంట్లోనే ఉంటావుగా,hostler కాదు గా నువ్వు.."అన్నాను నేను.
""హా..నేను ఇంట్లోనే ఉంటాను అని."తను చెప్పాడు.
ఇంతలో నా బాగ్ లో నుంచి head phones తీస్కుని MP 3 ప్లేయర్ లో పాటలు విందామని పెట్టేస్కున్న,తనేదో మాట్లాడబోయి ఆగిపోయాడు.
"ఏదో చెప్పబోయావ్?"అడిగాను నేను.
"ఏం లేదు,you carry on.."అని తను ఒక బుక్ తీసి చదువుకోవడం స్టార్ట్ చేసాడు.......

ట్రైన్ జర్నీ చాల బోరింగ్..చాల పాటలు విన్నాను అయిన టైం కదలడం లేదు.తను కుడా బుక్ మూసేసాడు,కిటికీ లో నుంచి బైటకి చూస్తున్నాడు.
"రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలో తెలుసా?"అడిగాను నేను."
తెలీదు,google maps and GPS ఉన్నాయిగ..ఆటో ఎక్కుదాం IIT చెన్నై అంటే వాడే తీస్కేల్తాడు"చెప్పాడు తను తాపీగా." మెయిన్ గేటు రీచ్ ఐతే చాలు,అక్కడనుంచి buses ఉంటాయిటగా అడ్మిన్ ఆఫీసు వరకు"అడిగాను మల్లి నేను.
"హ,ఉంటాయంట...మన internship acceptance letter అండ్ college ID చూపిస్తే security outlet నుంచి వెళ్ళిపో వచ్చు" చెప్పాడు తను.
"హ్మ్మ్.. సరే " అన్నాను
నేను.మల్లి పాటలు వినడం మొదలు పెట్టాను నేను.తను బుక్ తీసి రాస్తున్నాడు ఏదో..
"ఏం రాస్తున్నావ్ ?"అడిగాను ఇంకా curiosity తట్టుకోలేక.
"హ్మ్మ్.. ఏం లేదు,ఏదో పిచ్చి రాతలు"అన్నాడు తను.
"నువ్వు పిచ్చి రాతలు కూడా రాస్తావ? నేను చూడచ్చా? "అడిగాను నేను.
"హ్మ్మ్..చూడచ్చు కానీ చదివి నవ్వకూడదు మరి " అన్నాడు.
"నవ్వనులే,ఇవ్వు"అన్నాను,తను రాస్తున్న diary నా చేతిలో పెట్టాడు.
" గమ్యం చేరుకోవాలని గుండె తొందర పడుతోంది .. !!
ఈ రైలు కన్నా వేగంగా నా ఆలోచనలు పరిగెడుతున్నాయి .. !!
కొత్త పరిచయాలు తలుపు తడుతున్నాయి ..!!
చల్లగా వీచే ఈ గాలి .. వెనక్కి పరిగెడుతున్న చెట్లు చేమలు .. !!
అస్తమిస్తున్న సూర్యుడి ఇమ్పయిన రంగుతో నిండిన ఆకాశం .. !!
ఇంతకన్నా ఏముంటాయి మనసు పరవసించడానికి .. !! "
చదివాను తను రాసింది.."ఇది నువ్వే రాసావ? "ఆశ్చర్యం నిండిన కళ్ళతో అడిగాను నేను.
"హ్మ్మ్.."అన్నాడు తను.
"నువ్వు ఇలా కూడా రాస్తావ?ఎగ్జామ్స్ ఒక్కటే నీకు తెల్సు అనుకున్న"అని అడిగాను నేను ఆశ్చర్యంతో నిండిన ఆత్రుతతో".... .."చెప్పానుగా, ఏవో పిచ్చి రాతలు "అంటూ తన డైరీ వెనక్కి తీస్కుని బాగ్లో పెట్టేస్కున్నాడు.
"చాల బాగా రాసావ్ ఆర్యన్ "అని చెప్పను,నవ్వుతు.
"Thank You శిశిర " అన్నాడు.
కాని మొఖం లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు .....మనసులో అనుకున్న....నవ్వడం రాదేమో అని.....చదవడం తప్ప నవ్వడం నేర్చుకోలేదు అని కాని తను రాసినది పిచ్చి రాతలు నాకు నచ్చింది
అదే తనతో చెప్పను "నాకు నచ్చాయి నీ పిచ్చి రాతలు,నేను కధలు,కవితలు ఎక్కువ చదువతాను."చెప్పాను నేను.
" హ్మ్మ్..నేను కూడా చదువతాను,అప్పుడప్పుడు ఇదిగో ఇలా పిచ్చి రాతలు రాస్తాను కూడా "అన్నాడు తను.
నేను ఇలా చదువతాను అని నా ఫ్రండ్స్ అంతా నన్ను "old mentality, ఇంకా తెలుగు చదివే వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో " అని అనే వారు.......ఎప్పుడు fluent ఇంగ్లీష్ లో మాత్రమె మాట్లాడే ఆర్యన్ తెలుగులో ఇలా రాస్తాడని ,తను కూడా తెలుగు బుక్స్,కధలు,కవితలు చదువుతాడని నేను అనుకోలేదు.నాకు తెలియనివి కొన్నిsimilarities మా ఇద్దరిలో ఉన్నాయి అనిపించింది..ఎప్పుడు చదువ్కుంటూ కనిపించే ఆర్యన్ నాకు మొదటిసారి "Something different "anipinchadu .
______________________________

తర్వాత తను బుక్ చదవటం లో బిజీ గా ఉన్నాడు......నేను పాటలు వింటూ బిజీ గా ఉన్నా ......అలా రాత్రి అవుతోంది......ఇద్దరం తినడానికి ఎవరి బాగ్స్ వాళ్ళు ఓపెన్ చేసాం......
నేను అమ్మ పెట్టిన చపాతి లు తింటున్న....తను ఏమో fruits తెచ్చుకున్నాడు.....నేను నా చపాతీ తనకి ఆఫర్ చెయ్యలేదు.....తన fruits నాకు ఆఫర్ చెయ్యలేదు...ఇద్దరం తినేసాక .......నేను ఇంకా నిద్రపోత అన్నా....సరే అని తను అప్పర్ బెర్త్ కి వెళ్ళిపోయాడు....నేను అప్పాకి కాల్ చేసి good night చెప్పేసి నేను చాలా బాగా నిద్రపోయాను..కళ్ళు తెరిచేసరికి అప్పుడే తెల్లవారుతోంది, ట్రైన్ కిటికీ లో నుంచి చూస్తె .......ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు.........హడావిడిగా వెళ్ళిపోతున్న పక్షుల గుంపులు,పసిడి మెరుపులా పువ్వులతో నిండిన చెట్లు కనిపించాయి నాకు.ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్న నేను.అప్పటికి మొహం తుడ్చుకుంటూ ఆర్యన్ అవతలి వైపు నుంచి వస్తున్నాడు.
"Good morning!" విష్ చేశా నేను .
"Morning శిశిర" అన్నాడు తను .
ఇద్దరం నా బెర్త్ మీద కూర్చుని బయిటికి చూస్తున్నాం .
"నిద్ర బాగా పట్టిందనుకుంట? "అడిగాడు తను .
"హా.. చాల అల్సిపోయనుగా, సో వెంటనే నిద్రపోయాను "అని జవాబిచ్చాను ."
హ్మ్మ్....... "అన్నాడు తను .
"పాలు తాగుతావా?నెక్స్ట్ స్టేషన్లో కొంచెంసేపు ఆగుతుందిట ట్రైన్,ఇప్పుడే కనుక్కున్నాను "అన్నాడు ఆర్యన్.
"ఫిల్టర్ కాఫీ" అని నవ్వుతు చెప్పాను........
"హ్మ్మ్.......సరే" అన్నాడు తను.
"నాకు ఫిల్టర్ కాఫీ చాలా ఇష్టం తెలుసా...... అసలు వేడి వేడి కాఫీ నుంచి వచ్చే సువాసన........హ్మ్మ్మం .......సూపర్బ్ ఉంటుంది "అని ఫీల్తో చెప్పను .
"నీకు కాఫీ అంటే అంతా ఇష్టమా? "అడిగాడు తను.
"ఇష్టమా .. పిచ్చి నాకు.... చెన్నైలో ఇంకా చాలా బాగా ఉంటాది అంటా తెలుసా" చెప్పను నేను చిరునవ్వుతో.
"అవను, మైలాపూర్ చాల ఫేమస్ కాఫీకి "అన్నాడు తను.
"నువ్వు తాగుతావా కాఫీ ? నీక్కూడా ఇష్టమేనా? "అడిగాను నేను...
"ఊఉహూ.....నాకు కాఫీ నచ్చదు,చేదుగా వుంటుంది కదా.........అందుకే నేను పాలు మాత్రమే తాగుత" చెప్పాడు తను.
"చేదుగా ఏం ఉండదు..........ఒక్కసారి ట్రై చేసి చెప్పు"అన్నాను నేను.
"నో,థాంక్స్........... "అన్నాడు తను .
నా మనసులో అనుకున్న "నీ ఖర్మ.......కాఫీ నచ్చదంట ఈ మహానుభావుడికి.......ఏంటో..జీవితాంతం ఇలా పుస్తకాలూ చదువ్కుంటూ బ్రతికేస్తాడు ఏమో? అనుకుని నవ్వుకున్న.
"ఎందుకు నవ్వుత్నావు?"అడిగాడు తను.
"ఏం లేదు.......ఊరికె "అన్నాను.
కానీ అల నవ్వుతూనే ఉన్న...తను అలా నా వైపే చూస్తున్నాడు...ఇంకా నవ్వితే బాగోదని ఆపుకుని కిటికీ నుంచు బయటకు చూస్తున్న......అలానే తను నా వైపు చూడటం గమనించ...
ఏంటి అల చూస్తున్నావ్ అని అడిగా...నీ నవ్వు చాలా బాగుంది అన్నాడు.నాకు ఇంకేం చెప్పాలో అర్ధం కాలేదు....ఎప్పుడూ బుక్స్ తోనే ఉండే ఈ మహానుబవుడికి ..నా నవ్వు నచ్చడం ఏంటి...అనకున్న....
ఇంతలో స్టేషన్ వచ్చింది తను దిగాడు.
ట్రైన్ కొంచెంసేపు ఆగింది...... తర్వాత సిగ్నల్ వేసాడు, ఆర్యన్ ఇంకా రాలేదు.ట్రైన్ స్టార్ట్ అవుతుంది కూడా..ఎటు వెళ్ళిపోయాడు తిను,ట్రైన్ మిస్ అయిపోతే......తనకి ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ తీసా కాని తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు.....కిటికీ దగ్గరకు వచ్చి ప్లాట్ఫారం వైపు చూస్తున్న...తను కనపడ్తేమో అని......అనవసరంగా దిగాడు .. కొంచెం ఐన చుస్కోవాలిగా అనుకుంటూ కంగారు పడ్తున్నాను. ఇంతలో డోర్ దగ్గరకు వచాడు కాఫీ చేతిలో పట్టుకుని."హమ్మయ్య.......అనుకున్న....మనసులో......
"హమ్మయ్య "వచ్చేసావా ....ఎటు వెళ్ళిపోయావు? ట్రైన్ స్టార్ట్ అయిపొయింది నువ్వు ఇంకా రాకపోయేసరికి ఎంత కంగారుపద్తున్న"గుక్క తిప్పుకోకుండా అనేసాను
"కాఫీ వల్లే లేట్ "అన్నాడు తను,కాఫీ కప్ నా చేతికి ఇస్తూ.
"థాంక్యు,కాని వదిలేయాల్సింది.....ట్రైన్ పొతే ఏం చేసేవాడివి"అన్నాను నేను కాఫీ మొదటి గుటక వేస్తూ.
"చుస్కునే ఎక్కాను,don't worry "అన్నాడు తను.
" Why will I worry,It's just that we need to attend there on time......"అనేసి కిటికీ వైపు మొహం తిప్పెస్కున్న.
నా ఫిల్టర్ కాఫీ నేను ఎంజాయ్ చేస్తున్నాను......తను మాత్రం మల్లి పుస్తకంలో మునిగిపోయాడు.ఈ మనిషి ఇంతే లే అని అనుకుని కిటికీ నుండి చూస్తూ నా కాఫీ ని ఎంజాయ్ చేస్తున్న.
ఇంకొంత సేపట్లో చెన్నై సెంట్రల్ వచేస్తుంది,చుట్టూ తమిళ్ sign boardlu,రజనికాంత్ wall paintlu....కమల్ హస్సన్ cutout లు కన్పించాయి......Luggage తీస్కుని స్టేషన్ రాగానే,దిగాం ఇద్దరం.బైటకి వచ్చి ఆటో ఎక్కం.చెన్నై IIT అని చెప్పం,ఆటో ఆటను తీస్కేల్తున్నాడు, నేను GPS లో రూట్ వెరిఫై చేస్కుంటున్న..ఆటో ఆటను చెడ్డవాడని కాదు కానీ,మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా.....ఆర్యన్ నన్ను చూసి నవ్వుకున్నాడు.ఆల్మోస్ట్ వచేసం అన్నాను నేను ........
______________________________
Like Reply
#6
నేను వచ్చేసాం అని అన్నాను ......హ్మ్మ్..అన్నాడు తను.IIT చెన్నైకి చేరిపోయాము, మా కాలేజీ ID కార్డ్స్ ని ఇంకా మా interenship confirmation letter చూపించి security check దాటేసాం.....Shuttle buses ఉంటాయని అక్కడ ఒకావిడ చెప్పింది,ఇంతలో ఒక బస్సు వచ్చింది. ఇద్దరం ఎక్కి కూర్చున్నాం..డ్రైవర్ దగ్గిరకివెళ్లి "Please,let us know when we reach Admin office" అని చెప్పను. "ఎన్న?"అన్నాడు అతను..... అక్కడ మాతో పాటు ఎక్కిన ఒకాయన.." I'll let you know don't worry" అని చెప్పాడు.

నేను ఒకావిడ ప్రక్కన కూర్చున్నాను,కొంచెంసేపు ఆవిడతో మాట్లాడను.ఆవిడ,లైబ్రరీలో స్టాఫ్ అంట, Central library చాలా పెద్దది,ఒన్స్ మీకు ID కార్డ్స్ ఇష్యూ చేసాక రండి అని చెప్పింది ఆవిడ.ఆర్యన్ మాత్రం ఎవ్వరితో మాట్లాడకుండా ఒక్కడే కూర్చున్నాడు.హ్మ్మ్....వీడు ఈ జన్మకు మారడు అనుకుని తల కొట్టుకున్నాను తనని చూసి...
Admin office రాగానే మాకు చెప్పాను అన్న ఆయన చెప్పారు,సో ఇద్దరం దిగి వెళ్ళాం..ఇంకా అక్కడ అన్ని formalities కంప్లీట్ చేసుకున్న తర్వాత,మాకు hostel allot చేసారు.నాది "సరయు" బ్లాక్, ఇంకా ఆర్యన్డి "నీలగిరి" బ్లాక్.రూట్ మ్యాప్ కుడా తెల్స్కుని,ఇద్దరం బయలుదేరాము.రూట్లో నా hostel ముందు సో,నేను నా బ్లాక్ రాగానే తనకి బాయ్ చెప్పి వెళ్లిపోయాను.రిసెప్షన్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తుంటే గుర్తొచింది,ఆర్యన్ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదని...తెల్లవారి ట్రైన్ దగ్గర కూడా ఇలానే అయ్యింది.....ఇప్పుడు కూడా ఫోన్ నెంబర్ లేకపోతె తనని కాంటాక్ట్ చెయ్యడం ఎలా అని అనకున్న నేను....వెంటనే luggage అక్కడే వదిలేసి,తనకోసం సగం ఫిల్ చేస్తున్న అప్లికేషను పట్టుకుని బయటకి పరిగెత్త.....తను కొద్ది దూరం లోనే ఉన్నాడు,సో ఆర్యన్.....ఆగు అని గట్టిగ అరిచాను.....మొదటిసారి తన పేరు తో తనని అలా నేను పిలవడం......తను వెనక్కి తిరిగి చూసి ఆగాడు.ఇద్దరం సగందూరం ఒకరివైపు ఒకరం అలా నడిచాం.."ఏమైంది శిశిర?నీ బ్లాక్ ఇది కాదా? అని అడిగాడు తను.ఈ బ్లాక్ నే "నీ ఫోన్నెంబర్ కూడా లేదు నాదగ్గర,నిన్ను ఎలా కాంటాక్ట్ చెయ్యాలి,సడన్గ గుర్తొచింది అందుకే వెనక్కి వచ్చాను"అని ఆయాస పడుతూ చెప్పను."ఓహో.... అవను కదా" నీ నెంబర్ కూడా నా దగ్గర లేదు...మంచి పని చేసావు..లేదంటే తర్వాత బాగా ఇబ్బంది పదేవ్వాలం అని తన నెంబర్ చెప్పాడు,నేను నా ఫోన్లో ఫీడ్ చేస్కుని.....తనకి missed కాల్ ఇచ్చను."ఇది నా నెంబర్,సేవ్ చేస్కో".....అన్నాను...."ఒకే....వెళ్ళనా మరి"అన్నాడు......."హ్మ్మ్..సరే, 1 hr లో అక్షయ కాంటీన్ దగ్గర కలుద్దాం"అన్నాను నేను."ఒకే,బాయ్ "అని తను వెళ్ళిపోయాడు......మేము వచ్చే దార్లోనే అక్షయ కాంటీన్ వుంది,సో అక్కడ కలుద్దాం.రూంలో సెట్ అయ్యాక అనుకున్నాం.నేను వెనక్కోచి డీటెయిల్స్ ఫిల్చేసి అప్లికేషను ఇచ్చేశాను.నాకు రూంనెంబర్.504 ఇచ్చారు.5th ఫ్లోర్, లిఫ్ట్ కూడా లేదు....చచ్చాను నిజంగా ఆ పెద్ద త్రోల్లీ మోస్కేల్లదానికి .
నేను రూంకెల్లి luggage పెట్టుకుని,ఫ్రెష్ అయ్యి అక్షయ కాంటీన్కి వచ్చాను.తను ఆల్రెడీ వచ్చివున్నాడు అక్కడ.ఎంతసేపు అయ్యింది వచ్చి అన్న...ఒక 10min అయ్యింది అన్నాడు....ఫోన్ చెయ్యొచ్చు గా అన్నా.....హా ఇంకా చేద్దాం అన్కునే లోపు కనిపించావ్......అన్నాడు.......సరే పద అని ఇద్దరం కుర్చుని టిఫిన్ తిన్నాం."రేపటి నుంచి internship స్టార్ట్ అవ్తుందిగా,ఈరోజు వెళ్లి ఒక్కసారి రూట్ చూస్కుని ఉందాం తర్వాత ఇబ్బంది పడకుండా అని" అన్నాను నేను."సరే" పద అని లేచాడు తను.ఎవరి బిల్ వాళ్ళు పే చేస్కుని బయల్దేరం .."ఏరోనాటిక్స్ డిపార్టుమెంటు ఎక్కడండి? "అని హెల్ప్ డెస్క్లో అడిగి, రూట్ తెల్స్కున్నం.మా హాస్టల్ బ్లాక్ నుంచి,అక్షయ కాంటీన్ 5min వాక్, తన బ్లాక్ నుంచి 10min పడ్తుందిఅంట.ఏరోనాటిక్స్ డిపార్టుమెంటు కి వెళ్ళే బస్సు అక్షయ కాంటీన్ దగ్గరకి 7:50కి వస్తుంది అంట రోజు మార్నింగ్. ఆ బస్సు ఎక్కితే కొంచ్సం అటు ఇటు గా 8:30 కి రీచ్ అవుతాం అని అక్కడ అడిగి తెల్సుకున్నం ఈ... డీటెయిల్స్ అన్ని తెల్స్కునే అప్పటికి లంచ్ టైం అయిపొయింది
Like Reply
#7
ఏరోనాటిక్స్ డిపార్టుమెంటు దగ్గర cafteria ఉంది,అక్కడకి వెళ్ళాం.. మనకి క్లాసు 8: 30కి కాబట్టి రోజు 7:50 బస్సు టైం మిస్ అవ్వకూడదు మనం అన్నాడు తను,అక్కడ మెనూ కార్డు చూస్తూ.హ,అవను...అన్నాను నేను.మా ఇద్దరం 4 సంవత్సరాలు గా ఒకే క్లాసు ఐన మా ఇద్దరికీ పెద్దగ పరిచయం లేదు...వాడు ఎవరితోనూ మాట్లాడడు పెద్దగా.....నేను అందరితో బాగానే ఉన్న...వీడు అంటే నాకు కోపం కనుక నేను ఎప్పుడు వీడితో మాటాడలేదు......కాబట్టి,ప్రొఫెషనల్ కే పరిమితం అయ్యం.....ఇంకా అక్కడే లంచ్ చేసేసాం....నాన్నతోనూ,అమ్మ తోనూ మాట్లాడను నేను.తను మాత్రం ఎవ్వరితోను మాట్లాడలేదు.నేను వాళ్లతో మాట్లాడడం అయ్పోయక "ఇంటికి ఫోన్ చేయ్యవ? "అడిగాను నేను.తను నా వైపు చుస్తూ "హ్మ్మ్..మాట్లాడేస పొద్దున్నే"అన్నాడు తను.

ఇద్దరం అలా నడచుకుంటూ IIT చెన్నైని explore చేస్తున్నాం......కాంపస్ చాలా పెద్దది..ఇంచుమించు ఇంకో ఊరులో ఉన్నట్టేఉంది,జింకలు,నెమల్లు,కుందేళ్ళు ఎంతో స్వేచ్చగా తిరుగుతున్నాయి అక్కడ.."హే, తెలుసా నీకు 7th సెన్స్ సినిమా ఇక్కడే తీసారంట.. చాలా "excitement తో చెప్పాను నేను ఆర్యన్ కి....తను మాత్రం చాలా సింపుల్గా....."ఓహో..."అన్నాడు తను."ఏంటి,ఓహో.. అసలేమాత్రం excitement గా లేదా?నీకు? "అడిగాను నేను."ఇందులో అంత ఎక్సైట్ అవ్వడానికి ఏముంది......."అన్నాడు తను casual గా."హ్మ్మ్.......ఏమ్లేదులే "అన్నాను మొహం ముడ్చుకుని.అసలు ఏమాత్రం చలనంలేని ఈ పుస్తకాల పురుగుతో....రెండు నెలలు...ఎలా గడపాలి.. బాబోయ్....నేనా మాట్లాడకుండా ఉండలేను....వీడా ఏమీ మాట్లాడడు.....ఇంకా ఈ 2 నెలలు నాలో నేనే మాట్లాడుకోవలేమో ఇంకా..... మాట్లాడితే టాక్స్ వేస్తారు అన్నట్టు behave చేస్తాడు ఏంటిరా బాబూ.......ఇలానే ఉంటె నాలో నేనే మాట్లడ్కుని పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నా...అని అనుకున్నమునంగా.......మా నడక అలా మౌనంగా మా hostels వైపు సాగుతుంది.......అప్పుడే hostelకి వెళ్లి ఏం చేస్తాం.....అలా లైబ్రరీ కి వెళ్దామా..అన్నాను......సరే పద అన్నాడు.....ఈ మనిషి తో కంటే...ఆ పుస్తకాల తోనే ఉండడం బెటర్ అని మనసులో అనుకున్నా....
ఇద్దరం అలా నదుచుకున్తూ సెంట్రల్ లైబ్రరీ కి వెళ్ళాం......ఛాలా....పెద్దది.....ఆల్మోస్ట్ 5 ఫ్లోర్స్ లైబ్రరీ.. అన్ని రకాల బుక్స్ available గా ఉన్నాయి అక్కడ.....
ఇద్దరం ఇంకా ఎవరికీ నట్చ్చిన బుక్స్ వాలు వెతుక్కునే పన్లో నిమగ్నం అయ్యం.......కాసేపు అయ్యాక తను రీసెంట్ టెక్నాలజీ జర్నల్ తెచ్కుని చదువుకుంటున్నాడు......నేను అలా వెతుకున్తూ fictions corner నుంచి ఒక నవల తీస్కుని తన opposite చైర్లో కూర్చున్నా........

అలా చదువుకుంటూ ఉన్నాం చాలాసేపటివరకూ.........టైం గడచిపోయింది......చూసెసరికి ఈవెనింగ్ అయింది........
"ఇంకా చదువుకుంటావా?వెళ్దామా? " అడిగాను ఆర్యన్ని తన దగ్గరకు వెళ్లి......తను ఒకసారి తల ఎత్తి చూసి.."హ్మ్మ్..ఈవెనింగ్ అయ్యిందా.....సరే వెళ్దాం పద."అని లేచాడు....ఇద్దరం బయటికి వచ్చాం ........
లైబ్రరీ రైట్లో ఒక పెద్ద చెట్టు ఉంది.....దాని చుట్టూ సిమెంట్తో కట్టిన రౌండ్ బెంచ్ ఉంది.
కొంచెంసేపు కుర్చుందమ అని అడిగాడు తను.....
సరే అని ఇద్దరం కూర్చున్నాం........ఇంతలో ఒకమ్మాయి పక్కన నడుస్తూ ఫోన్లో మాటాడుతూ " Happy Fathers day pappa" అని విష్ చెయ్యడం విన్నాను.

"ఓహ్.....!! Eroju Father's day నా?!" అన్నాను తల కొట్టుకుంటూ..
"హ్మ్మ్.. అవను" అన్నాడు తను.
How Stupid Iam అని అనుకుంటూ వెంటనే మా నాన్నకు కాల్ చేసి విష్ చేశా.....కొంచెంసేపు మాట్లాడేసి ఫోన్ పెట్టేస.
"నీకు గుర్తుందా ఈరోజు Father's day ani?నువ్వు మార్నింగ్నే విష్ చేసేసావ మీ ఫాదర్ కి? " అడిగాను నేను.
"I don't follow all these శిశిర " అన్నాడు తను.
Why?అడిగా nenu .
Father's day ఏంటి అసలు childish గా.. అన్నాడు తను .
"మనకి మన పేరెంట్స ఎంత స్పెషల్ నో చెప్పడానికి ఒక్కరోజే కావాలా ఏంటి ?" అన్నాడు మల్లి....
"అలాఅని ఎవరన్నారు..నీ పేరెంట్స్ కే కాదు నీకు తెల్సిన పేరెంట్స్ కి కుడా విష్ చేయచుగా..అయినా.. మనం ఎంత ఎదిగిన మన పేరెంట్స్ కి ఇంకా infants లానే అన్పిస్తాం అని "నవ్వుతు జవాబిచ్చా....
"నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం.He is my ఎవెర్య్థింగ్.........So....ఇది ఒక occassion ఆయనకి ఇంకోసారి నా ప్రేమని convey చెయ్యడానికి అంతే"అని చెప్పాను నవ్వుతు.
నా వైపు తిరిగి కూర్చొని"హ్మ్మ్ ఇంకా చెప్పు.. మీ బాండింగ్......, నాకు వినాలని ఉంది"అని అన్నాడు తను....


______________________________
Sindhu
Like Reply
#8
ఏమ్మ్ చెప్పనూ.. ఆయన నన్ను వాళ్ళ అమ్మలా చుస్కుంటారు.నాకు suggestions ఇస్తారు....గైడ్ చెస్తారూ.....నేను చెప్పేవి ఎంత సిల్లీగా ఉన్న వింటారు..నేను అన్న ఒక్కోసారి ఈ కాలేజీ....క్లాసు....ఎగ్జామ్స్...రికార్డ్స్...ప్రాజెక్ట్స్...వీటి వాళ్ళ ఆయన్ని చిరాకు పడతా...విసుకుంటా...ఒక్కోసారి కోపం లో తనపి అరిచేస్తా .....కాని తను నన్ను ఎప్పడు విసుక్కోరు.....కోప్పడరు....మా ఫ్రెండ్స్ అంత chepparu....వాళ్ళ నాన్న ఒక్కసారన్న కొట్టారు అని....నన్ను ఇంట వరకు ఎపడు కొట్టలేదు.... నన్ను ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా కోపం గా చూడనుకూడా లేదు......ఎంత బిజీ గా ఉన్న ...నాకోసం అంటే ఆ పనులన్నీ పక్కన పెతేస్తారు .....నీకు తెలుసా మా నాన్నకు మా అమ్మ కన్నా నేనే ఎక్కువ ఇష్టం......తన లైఫ్ లో నా తర్వాత నే ఎవరన్న......ఇంకా....నాకు నచ్చిన సినిమాలు.....పాటలు..అన్నినాతొపాటు ఎంజాయ్ చేస్తారు.నాకు ఏం కావాలన్నా నిమిషాలలో ముందుంచుతారు...ఇవన్ని ఒకటి నా లైఫ్ లో తను నాకు ఇచ్చే సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేరు....నేను ఏం చెయ్యాలి అనకుంటే అది చెయ్యమంటారు.... ఇంకా Late night నాకు నా బాల్కనీలో కుర్చుని old bollywood songs వింటూ,నాన్నతో కబుర్లు చెప్పడం అంటే చాలా ఇష్టం.."
"తను నా వైపు అలా చూస్తూ హ్మ్మ్.. ఇంకా.."అన్నాడు ఆర్యన్..
"తెలుసా, అప్పాకి వంట చెయ్యడం రాదు,కాని నేను అడిగానని ఒకసారి అమ్మని వెనుక వుంచి ఆయనే ఫ్రైడ్ రైస్ చేసారు.ఇంకా ఆయన రోజు నాకోసం పెట్టె ఫిల్టర్ కాఫీ world's best తెల్సా.....నేను మా నాన్న కూతుర్నిఅని మా అమ్మ అస్తమాను ఉదుక్కున్తూ ఉంటాది..కాఫీ పిచ్చి నాకు ఆయన నుంచే వచ్చింది ..నాకు ఆయన చెప్పే good మార్నింగ్ తో నే రోజు మొదలయ్యి good night,తో నే రోజు పూర్తవుతుంది .నా కళ్ళలో నీరు వస్తే చాలు ఆయన తట్టుకోలేరు.ఇంకా అలా చెప్తూపొతే ఎన్నిరోజులు అయినా చాలావ్ మా అప్ప గురించి...... అని లేచి చేతులు చాపుతూ....చిత్తూ tirugutoo He is my king and I'm his princess" ........he is my best friend.............i lovu you Appaa అని గట్టిగ అరుస్తూ చుట్టూ తిరుగుతూన్న....నవ్వుతు గర్వంగా.

తను నన్ను అలా చూస్తూ ఉండడం చూసి ఆగిపోయ.....నవ్వుతూ తన పక్కన కూర్చిని "హ్మ్మ్......ఇప్పుడు నీకు మీ డాడీ కి ఉన్న బాండింగ్ చెప్పు"అడిగాను నేను .
తను అలా చుట్టూ చుటూ "హ పద చీకటి పడింది.....లేట్ అవ్తుంది,బైల్దేరదాం ఇంకా " అంటూ లేచాడు తను........నేను మొబైల్ లో టైం చూసేసరికి around 9:30 అయింది....సరేలే అని లేచాను నేను కూడా ఇద్దరం అలా నడుస్తూ ఉన్నాం....తను ఎప్పటిలానే సైలెంట్ గా ఉన్నాడు "నువ్వు ఎందుకు ఎప్పుడు సైలెంట్గ ఉంటావ్....అసలెల ఏమీ మాటాడకుండా ఉండగాల్గుతున్నావ్?!నీకు బోరింగ్ గా ఉండద అలా ఉంటె? నేను మాత్రం కోట్లు ఇస్తా అన్న సరే 2నిముశలు కూడా సైలెంట్గ ఉండలేను."అన్నాను నేను తన పక్కన నడుస్తూ.......
"You know.....నువ్వు చాలా plain hearted" అన్నాడు తను నవ్వుతు.......
"హ్మ్మ్..!? "questioning face తో chusa తనని....
"నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ లేరు శిశిర.......... నా ప్రపంచం చాలా చిన్నది.........ఒంటరిగా ఉండటం కొత్త కాదు నాకు.."అన్నాడు తను.
నాకు,తన మాటలు అర్ధం కాలేదు కాని ఏదో తెలియని బాధ మాత్రం ఉందని అనిపించింది.
"ఏమయింది?నువ్వు బానే ఉన్నావా? "అడిగాను నేను.
"హా..బానే ఉన్ననే.. నాకేమయ్యింది...iam perfectly allright " అన్నాడు తను.
"ఏమో..నీ మాటలు బాధగా అన్పించాయి నాకు.." అన్నాను.
"హ్మ్మ్ Ice cream తిందామా? "అడిగాడు తను మాటమారుస్తూ ..
"హ్మ్మ్.. సరే అన్నాను. "
ఇద్దరం ఐస్ క్రీం తిన్నాం......నేను butterscotch .... tanu venella .....
"Food తినలేను ఇంకా" అన్నాను ఐస్ క్రీం కంప్లీట్ చేస్తూ..
"ఇప్పుడు అలానే ఉంటుంది....రూం కేల్లక పడుకుంన్నప్డు ఆకలేస్తుంది.....కొంచెం తిను"అన్నాడు తను.
తను అలా అంటుంటే నాకు,మా నాన్నే మాట్లాడుతున్నట్టు అన్పించింది.........ఇంకేం అనలేదింక...నేను.. ఇద్దరం అలా అక్షయ కాంటీన్ కి వెళ్ళాం.తనే ఆర్డర్ చెప్పాడు,నేను సైలెంట్గా కూర్చున్నా.....4 idly ఆర్డర్.....వచ్చింది.....
"తిను"అన్నాడు ప్లేట్ నా వైపు తోసి."మరి నువ్వు?"అడిగాను నేను."నాకు ఆకలి లేదు"అన్నాడు తను.
"ఓహో..నీతులు నాకు చెప్పడానికేన.......అదేం కుదరదు బాబు..నువ్వు తినాలి అన్నాను.....లేదు శిశిర....వద్దు అన్నాడు.....పోనీ Half-half తిందాం"అన్నాను....తను అలా ఆలోచిస్తూ జవాబిచ్చేలోపు వెయిటర్ని ఖాలీ ప్లేట్ తెమ్మని చెప్పేస.
"హే....వద్దు......నిజంగా ప్లీజ్ అంటూ.....ఏదో చెప్తున్నాడు "....తను.నేనేం మాట్లాడకుండా..అలా కూచుని ఉన్న..ఈ లోపు వెయిటర్ తెచ్చిన ప్లేట్లో 2 ఇడ్లీ కొంచెం చట్నీ వేసి తన ముందు పెట్టి..తిను ఇంకా..... మారం చెయ్యకు"అన్నాను.
తను ఏమీ అనలేదు....ఇంకేమి మాటాడకుండా సైలెంట్గా తినేసాడు....నేను కూడా తినేస.....నేను బిల్ ఇస్తున్న...తనే బిల్ పే చేసాడు.ఇద్దరం బైటకి వచ్చేసాం........అలా Hostel వైపు నడుస్తున్నాం..

"థాంక్యు" అన్నాను నేను.తను నా వ్య్పి చూస్తూ " for what ?"అడిగాడు తను...." for forcing that idly "అని నవ్వుతు చెప్పా.
"అలాగ.. ఐతే thank you and same to you " అని తను కూడా నవ్వుతూ చెప్పాడు.
"నేను ఆశ్చర్యంగా చూసా ....తను నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు ........ఆర్యన్ నీకు నవ్వటం కూడా వచ్చా ......నువ్వు ఇలా నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు....."అన్నాను నేను.
తను అదోల చూస్తూ "May be ఇంత హాయిగా ఎప్పుడు నవ్వలేదేమో నేను"అన్నాడు తను నా వైపు చూస్తూ.
నేను జవాబిచ్చేలోపే నా hostel వచేసింది........."see you tomorrow" అన్నాను నేను.
"You know something shishira, I'm verymuch jealous of you Shishira "అనేసి నవ్వుతు వేల్పోయాడు.
నేనేమి మాట్లాడలేదు..తను వెళ్ళేవరకు,తనవైపే చూస్తూ ఉన్నాను....తను నాకు ఇక కనపడలేదు..వాళ్ళ హాస్టల్ వైపు వెళ్ళిపోయాడు....May be for few సెకండ్స్ అలానే తను వెళ్ళిన దారి వైపే చూస్తూ ఉన్న ..తర్వాత నా రూంకి వేల్పోయ......
Like Reply
#9
రూంకి వెళ్ళాక నాన్నకు ఫోన్ చేశా ...ఇంకా ఆ రోజు జరిగిన విషయాలు చెప్పి...క్లాస్స్లు టైమింగ్ అవి చెప్పి....గుడ్ నైట్ చెప్పి ....fresh అయ్యాను.....నా నైట్ డ్రెస్ కి చేంజ్ అయ్యా....అలా బెడ్ మీద నిద్రపోవడానికి చూస్తున్న కాని నాకు తను అన్న"You know something shishira, I'm verymuch jealous of you Shishira " ఆ మాటలే గుర్తొస్తున్నాయి....... తను నన్నుచూసి ఈర్ష్య పడ్తున్నాడ?
ఏ విష్యంలో.. తను అన్నిట్లోనూ నాకన్నా బెటర్గా perform చేస్తాడుకదా.......పైగా వీడు అంటే మా కాలేజీ ప్రోఫ్ఫెసోర్స్ అంతా మెచ్చుకుంటారు....పైగా వేడిని చూపించి మీరంతా ఆర్యన్ ని చూసి నేర్చుకొంది...అంటారు ఎప్పుడూ......మరి వీడు ఎందుకల అన్నాడు......కాని తన మాటలు ఎంతో బాధతో నిండినట్టు ఎందుకనిపిస్తున్నాయి నాకు.. అని ఆలోచిస్తూ......ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు........

అలారం కొట్టింది,కళ్ళు నలుపుకుంటూ లేచాను.టైం 6am అయ్యింది.... నాన్న గుడ్ మార్నింగ్ కాల్ వచ్చింది,కొంతసేపు మాట్లాడేసి,గబగబా రెడీ అయ్యాను... రూంలాక్ చేస్కుని,1st డే క్లాసు అటెండ్ అవ్వడానికి ఎంతో ఉత్సాహంగా బైల్దేరాను.అక్షయ కాంటీన్ దగ్గర ఆర్యన్ వెయిట్ చేస్తుంటాడు అని,అక్కడికి బైల్దేరాను.
నేను వెళ్లి చూసేప్పటికి,తను ఇంకా రాలేదు......సరేలే ఇంకా 15మినిత్స్ టైం ఉందిగా అనుకుని కాంటీన్లో వెయిట్ చేస్తున్నా.చెన్నైఫేమస్ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చెప్పి, మొబైల్లో FM ఆన్ చేశా.తమిళ్ పాటలు వస్తున్నాయి,సంగీతాన్ని ఆస్వాదించడానికి భాషతో పనిలేదుగా,సో అర్ధం కాకపోయినా కొన్ని పాటలు మజాగా ఉన్నాయి ....ఇంతలో నేను ఆర్డర్ చేసిన కాఫీ...ఇంకా ఆర్యన్ ఒకేసారి వచ్చారు.
"good morning Shishira "విష్ చేస్తూ నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు తను.
" Gooooood mooooooorninnnggg Aaaaryyannnnn " అని FM లో RJ లాగ విష్ చేశా తనని......
తను నా చేష్టలకి ఏమనాలో తెలియక నవ్వాడు......నా కాఫీ నేను ఎంజాయ్ చేస్తున్న...తను బ్రెడ్........ జామ్ అండ్ బట్టర్ తెచ్చుకుని తింటున్నాడు........నేను చపాతీ రోల్స్ ఆర్డర్ చెప్పాను.........తను తినేసాక ఇద్దరం స్టార్ట్ అయ్యాం.....అక్కడనుంచి...........

"అదేంటి,రోల్స్ ఆర్డర్ చెప్పవ్గా,తినవా"అడిగాడు ఆర్యన్.
"దార్లో తింటానులే,ఇక్కడే కుర్చుని తింటే బస్సు మిస్ అవుతాం మనం..........నాకు 1st డే నే లేట్ అవ్వడం ఇష్టంలేదు"....ani వెయిటర్ తెచిన రోల్స్లో కెచప్ ఆడ్ చేస్కుని,పేపర్ నాప్కిన్లో ఫోల్డ్ చేసి తింటూ బైటకి వచ్చేసా.....ఇద్దరం bus stop దగ్గర వెయిట్ చేస్తున్నాం........
"ఏం సాంగ్స్ వింటున్నావ్?"అడిగాడు తను.
"FM వింటున్నా.."రోల్ నముల్తూ చెప్పా నేను.
"తమిళ్ పాటలు కూడా వింటావా నువ్వు? "అడిగాడు తను .
"స్పెసిఫిక్గా ఇవే పాటలు వినాలని ఏముంది,ట్యూన్ నచితే వింటాను.. "అని casual గా చెప్పాను.
"నేను అలా వినలేను తెల్సా" అన్నాడు తను........ఈ లోపు Bus వచ్చింది..ఇద్దరం ఎక్కాం......"Window నాది......."అన్నాను నేను.. తను చిన్నగా నవ్వుతూ సరేలే తీస్కో అని విండో సీట్ నాకిచ్చేసి తను నా పక్కన కూర్చున్నాడు.
"హ్మ్మ్..ఏదో చెప్తున్నావ్...చెప్పు"అన్నాను నేను.
"నేనా.....ఏం చెప్తున్నాను? "అడిగాడు తను".....
అరేయ్,ఇప్పుడే కదా నేను అలా వినలేను పాటలు అన్నావ్......అలా అంటే ఎలా అని ?........ఇంతలోనే మర్చిపోయావ..........అసలెలా గుర్తు ఉంటాయి బాబు... నీకు చదివినవి, అసలుఎలా వస్తోంది నీకు 1st పోసిషన్.....హా? "అని వెటకారంగా అన్నాను.
"ఓహో........అదా......నేను పాటలు అర్ధం తెలియకుండా ఆస్వాదించలేను.నాకు ముందు లిరిక్స్ నచ్చాలి...ఆ తర్వాతే పాట నచ్చుతుంది.......అయినా.... గుర్తుపెట్టుకోవలసినవి గుర్తుంటాయి నాకు....అందుకే 1st "అని తను జవాబిచ్చాడు.
"హ్మ్మ్.....parledu,నీకు మాట్లాడం వచ్చే.....నువ్వేదో సైలెంట్ అనుకున్న,మాటకి మాట సమాధానం బాగానే చెప్తున్నావ్ గా " అన్నాను నేను.
ఇంతలో మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది....ఇద్దరం వెళ్లి మా ప్రోగ్రాం హెడ్ ని కలిసాం.
Mrs. Janaki Raman,మిడిల్ ఏజ్ లేడీ.Cream colour కలంకారి డిజైన్ ఉన్న శారీ కట్టుకున్నారు..........చాలా హుందాగా ఉన్నారు..........
చూస్తేనే చాలా స్ట్రిక్ట్ అని తెలుస్తోంది.మేము నవ్వుతూ విష్ చేసి,మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేస్కున్నం. ఆవిడ మా internship లో చెయ్యాల్సిన project details and related documents.....మాకు ఇచ్చారు.....Attender ని పిల్చి మమ్మల్ని ల్యాబ్ కి తీస్కెళ్ళి అజయ్కి పరచియం చెయ్యమని చెప్పారు.మేము ఆవిడకి థాంక్స్ చెప్పేసి ల్యాబ్కి వెళ్ళాం.......


ఫుట్వేర్ తీసి లోపలికి వెళ్ళాం,ల్యాబ్ చాలా పెద్దది......ovel shape లో seperate చాంబర్స్ ఉన్నాయి,ఒక్కో ఛాంబర్లో ఒక్కో ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతోంది. మా టీం లీడర్ Mr.Ajay.తను మాకు 2years సీనియర్.చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేస్కున్నాడు మమ్మల్ని. తను ముంబై నుంచి వచ్చాడు అని చెప్పాడు.అక్కడ మేము ఇద్దరం,అజయ్ కాకుండ ఇంకో 2 అబ్బాయిలు సెల్వమణి,కృష్ణన్ ani...వాళ్ళది చెన్నైఅని introduce చేసాడు అజయ్.వాళ్ళు హాయ్ అని చెప్పి వాల్ పన్లో మునిగిపోయారు....టోటల్ 5 మెంబెర్స్ మా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నది.తర్వాత వాళ్ళు కూడా బానే మాట్లాడారు మాతో ....... వర్కింగ్ ambitious అంతా చాలా బావుంది......అందరం వర్క్ చేస్తున్నాం...ఆర్యన్ నా రైట్ సిస్టం అండ్ నా లెఫ్ట్ సిస్టంలో అజయ్ వర్క్ చేస్తున్నాడు.నేను కొంచెంసేపు ప్రోగ్రామింగ్ చేశా,తర్వాత బోర్ కొట్టింది ....సో మొబైల్లో పాటలు ప్లే చేశా......వాల్యూం మీడియంలో పెట్టా......అవి ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ కాబట్టి అందరు ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతలో మాప్రాజెక్ట్ హెడ్ మా ఛాంబర్కి వచ్చారు,సాంగ్స్ ప్లే అవ్తున్నాయి కదా వెంటనే సీరియస్ అయ్యారు.ఎవరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు ఇక్కడ,వర్క్ టైంలో ఎంటర్టైన్మెంట్ నాకు అస్సలు నచ్చదు,మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోతె వెళ్లిపోవచ్చు...... అని కళ్ళు ఎర్రచేసి ఇంగ్లీష్లో అరిచారు ఆవిడ.....ఈలోపు మెల్లగా మొబైల్ తెస్కుని సాంగ్స్ ఆఫ్ చేసేసా.ఎవరు సాంగ్స్ ప్లే చేస్తున్నారు ...common stand-అప్ అని చాలా కోపంగా అన్నారు......నేను సైలెంట్గ లేవబోతున్నా...ఇంతలో ఆర్యన్ నా చేతిలో ఫోన్ లాక్కుని,నిల్చోపోతున్న నన్ను చెయ్యి పెట్టి ఆపేసి తను నిల్చున్నాడు..... ఆవిడ నువ్వేనా అయితే సాంగ్స్ ప్లే చేసింది?తను ఏమీ మాట్లాడకుండా తల దించుకుని Iam Sorry Madam"అని అన్నాడు.ఆవిడ కోపం బద్దలయ్యి ఆవిడ కోపాన్నంతా ఆర్యన్ మీద చూపించేసి వెళ్ళిపోయారు.ఒక 15మిన్ తర్వాత వచ్చి ఒక 4 డాకుమెంట్స్ ఆర్యన్ కి ఇచ్చి ఈవెనింగ్ లోపు కోడింగ్ చేసెయ్యమని చెప్పి వెళ్ళిపోయింది.ఆవిడ కోపం ధాటికి మా ఛాంబర్ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది,కొంతసేపటికి అందరు నార్మల్ స్టేజికి వచ్చారు.ఆర్యన్ మొహంలో ఎలాంటి మార్పులేదు, నవ్వుకానీ కోపం కానీ బాధకానీ..అస్సలు ఎలాంటి expression లేదు మౌనంగా కుర్చుని కోడింగ్ చేస్తున్నాడు.మిగతా ముగ్గురు లంచ్కి వెళ్లారు,నేను ఆర్యన్ మాత్రం వెళ్ళలేదు
."ఐ అం సారీ ఆర్యన్" అని తన దగ్గరగ నా చైర్ జర్పుకున్నానునేను.తను ఏమీ మాట్లాడలేదు.
"కోపమా?"అని అడిగాను నేను..తను ఏమీ మాట్లాడలేదు,
కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు."నాకు ఆకలేస్తోంది,తినేసి వాడడం రావా ప్లీజ్"అని అన్నాను......
తనలో ఏమాత్రం చలనం లేదు.తన మౌనం నాకు ఏదో తెలీని gulty ఫీలింగ్ ల వచ్చింది.......ఏదో తెలియని బాధ....అంతే,ఇంకా నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి..
"చూడు నేకు నా మీద కోపముంటే తిట్టు కానీ ఇలా ఒక మాట కూడా మాట్లాడకపోతే నావల్ల కాదు,అయినా నేనేమి నిన్ను హెల్ప్ చెయ్యమని అడగ లేదుకదా,ఎందుకు పెద్ద నువ్వు హీరోల nee పేరు చెప్పావ్? తిడితే తిట్టేది నన్ను..నీకేంటి మధ్యలో"అని ఏడుస్తూ అన్నాను.నా కన్నీళ్లు చూసిగాని కరగలేదు తను..
"హే, చిన్నపిల్లలా ఏడుస్తున్నావ్ ఏంటి.......... నేను కోడింగ్ చేస్తున్న కదా,నాకేం నీ మీద కోపం లేదు.."అన్నాడు తను.
"అబద్దాలు చెప్పకు,నీకు నన్ను కొట్టేయాలి అన్నంత కోపంగా ఉంది కదా "అన్నాను నేను.
"ఛ..ఛా........పిచ్చి పిల్ల అదేమీ లేదు.....,ముందు నువ్వు కళ్ళు తుడుచుకో నిన్ను ఇలా చూడకూడదు అనే నేను అలా చేశా...మల్ల నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు" అంటూ తన రుమాలు నా చేతికిచ్చాడు.
"నాకేం అక్కర్లేదు......నేను మార్గదర్శిలో చేరాను,ఒక రుమాలు కొనుక్కున్నాను"అన్నాను నేను నా కళ్ళు తుడ్చుకుంటూ.......అప్పటిదాక చెట్టు లా చలనం లేని ఆర్యన్ ఫక్కుమని నవ్వేసాడు.
"హమ్మయ....... నవ్వేసావ...!!ఇంకా పద...తినేసి వద్దాం.... "అని తన చెయ్యి పట్టుకుని లాగాను నేను."నాకు పనుంది శిశిర,నువ్వెళ్ళు"అన్నాడు ......
తను నా చెయ్యి వదిలించుకుంటూ.....
"మల్లి మొదటికి రాకు మహానుభావ,ప్లీజ్.....కొంచెం తినేసి వచ్చి వర్క్ చేస్కుందాం..."అని బుంగమూతి పెట్టి అడిగాను......ఏమనుకున్నాడో ఏమోమరి లేచి వచ్చాడు..............నాతొ ..............................
______________________________
Like Reply
#10
ఇద్దరం వెళ్లి Cafteria లో లంచ్ తినేసి మళ్లీ వెనక్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేశాం.ఈవెనింగ్ 6 అయ్యింది......నా వర్క్ కంప్లీట్ అయింది కాని ఆర్యన్ తన చైర్ లోంచి ఇంచ్ కూడా కదలకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు,మిగతా వాళ్ళు అయిన అజయ్,సెల్వమణి,కృష్ణన్ అందరూ వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోయారు.ఆర్యన్ నన్ను కూడా ఆ ఇద్దరు తమిళ్ తంబిలతో పాటు వేల్లిపోమన్నాడు కాని నేను మాత్రం వెళ్లనని ఉండిపోయాను.
"శిశిర నాకు చాలా వర్క్ ఉంది చూసావుగా.....నువ్వు హాస్టల్కి వెళ్ళిపో,నీకు లేట్ అవుతోంది..."అన్నాడు తను తల కూడా నా వైపు తిప్పకుండా.
"పర్వాలేదు,నేను కూడా ఉంటాను..అయినా నీకు ఈ పనిష్మెంట్ నా వల్లనేగా.. నువ్వు వర్క్ చేస్కుంటుంటే నేను ఎలా వెళ్లిపోతాను చెప్పు,నాకు చాలా గిల్టీగ ఉంటుంది"అని చెప్పను.
"మొండిదానివి శిశిర,సరే నీ ఇష్టం ఉండు...."అన్నాడు తను."
నేను కూడా తన పనిష్మెంట్ వర్క్లో షేర్ తీస్కున్న,ఎంతైనా నా మూలంగానే కదా పాపం మొదటిరోజే తిట్లు తిన్నాడు....కాలేజీ లో ఎవ్వరి చేతా ఒక్క మాట కూడా అన్పించుకోలేదు ఇంతవరకు...కానీ ఇక్కడ నేను బాడ్ అవ్వకూడదు...ఏడవకూడదు అని తిట్లు కాసాడు....అని బాధేసింది నాకు."
ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ చేశాం,ల్యాబ్ లాక్ చేసి attender కి కీస్ ఇద్దామని వచేప్పటికి atender కూడా వెల్పోయాడు.ఇంకా చేసేదేం లేక డైరెక్ట్ గా మేడం రూమ్కి వెళ్ళాం......
మేము వెళ్లేసరికి ఆవిడ ఏదో ఫైల్ చూస్తున్నారు.
"May we get in Madam "అన్నాం ఇద్దరం.....ఆవిడ తలెత్తి మమ్మల్ని చూశారు..లోపలికి రండి అన్నట్టు చేత్తో సైగ చేశారు. ఆవిడ మొహంలో కోపం ఇంకా తగ్గినట్టు నాకు అనిపించలేదు..అలా గుండెని అరిచేతుల్లో పెట్టుకుని ఇద్దరం మేడం రూంలోకి అడుగుపెట్టాం.
" Good evening madam ..!! "అని విష్ చేశాం.
"Keys madam .. attender already left , so we came to give the lab keys.."అని ఆర్యన్ కీస్ ఆవిడ టేబుల్ మీద పెడుతూ అన్నాడు.
"Hmm.....okay , so, you completed all the work then "అంది ఆవిడ.
"Yes, mam "అని ఆర్యన్ అని తల దించుకున్నాడు.
"Good .. don't repeat the mistake again . It's your 1st mistake so I'm sparing you . You may leave now "అంది ఆవిడ.
"sorry mam "అనేసి బైటకి వచ్చేసాం మేము.
"ఆవిడ అసలు నవ్వాదా?! ఎందుకు మూతి ములక్కాడలా పెట్టుకుంది.....అయ్యో పాపం ఇంతసేపు ఉండి వర్క్ చేసారుఅని కూడా లేదు..ఃఉహ్హ్..!!" అన్నాను నేను తన పక్కన నడుస్తూ....
"శిశిర..తప్పు మనది,వర్క్ టైంలో పాటలు పెట్టాం...అందుకే ఆవిడ కోప్పడ్డారు,ఇంకా వదెలెయ్.. అయిపొయింది కదా "అన్నాడు తను.
"హ్మ్మ్.. సరేలే బాబు పదా..!!నువ్వు చాల స్ట్రైన్ అయ్యావ్కదా..అంత వర్క్ చేసావ్,1minute కూడా రెస్ట్ లేకుండా..సారీ "అన్నాను నేను.
"అరేయ్ బాబా,it's okay..అయినా నాకు వర్క్ చేస్తుంటే స్ట్రైన్ అనిపించదు.....అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడం నాకు నా చిన్ననాటి నుంచి అలవాటు అయ్పోయింది"అన్నాడు తను.
"సరే పద,నేను ట్రీట్ ఇస్తా.. వేడి వేడి కాఫీ అండ్ దోస.. సరేనా?"అడిగా నేను.
"హ్మ్మ్.. దోస సరే కానీ,కాఫీ నాట్ ఒకే ...చెప్పానుగా నాకు కాఫీ నచదు.."అన్నాడు తను .
"అరేయ్,ఒక్కసారి తాగిచూడు......ఒక hectic day of work తర్వాత ఒక వేడి వేడి కప్ కాఫీ స్ట్రెస్ బస్టర్ తెలుసా.."అన్నాను .
అప్పటికి బయటకు వచ్చేసాం మేము...అక్కడ ఒక్క వెహికల్ లేదు ......
"ట్రీట్ సంగతి తర్వాత .....ముందు ఇక్కడ్నుంచి ఎలా వేళ్ళలో చూదు..బస్సు టైం ఎప్పుడో దాటిపోయింది.. ఇక్కడ్నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఎలా .."అంటూ అటు ఇటు చూస్తున్నాడు ఆర్యన్...
అప్పటిదాకా గమనించలేదు కాని,టైం చుస్తే 9:30దాతుతొన్ది....ఇంచుమించు అందరు వేల్పోయారు,మేము మా డిపార్టుమెంటు బిల్డింగ్ దగ్గర నించుని ఏదయినా వెహికల్ లిఫ్ట్ దోర్కుతుందేమో అని చూస్తున్నాం.......
ఒక పావుగంట చూసామ్...ఏది కన్పించ్లా...ఇంకా అల్లా నడుస్తూ వెళ్ళడమే అని అంకున్తూ...ఉన్నాం..ఇన్తలో మా మేడం బైటకి వచ్చారు,మేము వెయిట్ చెయ్యడం చూసారు.ఆవిడ ఫోన్ లో మాట్లాడతూ మమ్మల్ని రండి అన్నటు సైగ చేసారు...మేము ఆవిడా దగ్గరకు వెళ్ళాం...ఆవిడ ఫోన్ మాట్లాడడం అయ్యేసరికి ఒక కార్ మా దగ్గర వచ్చి ఆగింది.. ఆవిడ కార్లో ఎక్కి కూర్చున్నారు.
"హమ్మయా"అనుకుంటూ మేము వెళ్లి ఆవిడ కార్లో కూర్చున్నాం.ఆర్యన్ ఫ్రంట్ సీట్లో,నేను మేడం బ్యాక్ సీట్లో....బ్లాకు కలర్ మెర్సిడెస్ బెంజ్.. ఆవిడ లాగే చాల డాంబికంగా ఉండి......
"Where do you want me to drop you ? "అంది ఆవిడ.
"Akshaya canteen Madam "అని ఇద్దరం ఒకేసరి జవాబిచ్చం....ఆవిడ దానికి నవ్వుతు...
"Ramana..drop them at Akshaya canteen and take off for today "అని...మాతో మాములుగా మాటాడ్డం మొదలుపెట్టారు ...నవ్వుతూ....మాకోసం అడిగారు..తర్వాత మాకు కొన్ని టిప్స్ చెప్పారు....మంచి బుక్స్ సజెస్ట్ చేశారు....కొంత దూరం వచ్చాక,స్టాఫ్ రెసిడెన్స్ దగ్గర దిగిపోయారు.
"Thank you madam "అన్నాంమేము.ఆవిడ నవ్వుతు..."aaryan tommorrow bring some good songs for me bur dont play at your work time okey good night kids" అనేసి వెళ్ళిపోయారు.


______________________________
Like Reply
#11
మేడం కార్ లోనుంచి దిగిపోయాక అనుకున్నమనస్సులో ఈవిడ మాతో..ఇలా కూడా ఉంటారా అని
"మేడం అంత చెడ్డవారు ఏమికాదు కదా.."అన్నాను నేను ఆర్యన్ తో.
"హ్మ్మ్...."అన్నాడు తను.
"మీరు తెలుగు వాళ్ళ?"అడిగాడు డ్రైవర్.
"అవను..మీరు కూడా తెలుగేన?"అడిగా నేను ఉత్సాహంగా.
"హా..అవను.. కాని 15years అయిపొయింది చెన్నైకి వచేసి"అన్నారు రమణ.
"మేడం చాల మంచివారు.....ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం..కొంచెం కటువుగా మాట్లాడినా వెంటనే కరిగిపోతారు "అని చెప్పారు ఆయన.తర్వాత ఆయన కోసం చెప్తున్నారు..వాళ్ళ ఉరు ఇక్కడ సంగతులు అలా చెప్తునారు....మేము ఆయన మాటలు వింటూ "ఊ"కొడుతున్నాం......
కొంచెంసేపటికి మమ్మల్ని అక్షయ కాంటీన్ దగ్గర దింపేసి వెళ్ళిపోయారు ఆయన.
"పద ట్రీట్ ఇస్తాను"అన్నాను నేను .........ఆర్యన్ "సరే పద,నాక్కూడా చాలా ఆకలేస్తోంది"అన్నాడు.ఇద్దరం వెళ్లి కూర్చున్నాం.దోస అండ్ కాఫీ ఆర్డర్ చెప్పను.
"మనం అనుకున్నట్టుగా జనాలుండరు కదా ".....అన్నాను నేను.
"అదేం అలా అన్నావ్?"అడిగాడు ఆర్యన్.
"ఊహూ.....లెదూ..జనరల్ గా అన్నాను.మేడం చాలా కోపిస్టి అనుకున్న కాని అంత చెడ్డవారేమి కాదు అనిపించింది"అన్నాను నేను.
"ఓహో....అదా....అందరు మనం అనుకునేట్టుగా ఉండరు శిశిర"అన్నాడుతను.
"అవను......నాకది ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవ్తునాది"అన్నాను.
"అవనా..అదేంటి?"అడిగాడు తను.......
"తెలుసా.....నువ్వంటే నాకు చాలా చిరాకు,కోపం.....నిన్ను తిట్టుకొని రోజుండేది కాదు....కాని ఇప్పుడు మంచివాడివే అనిపిస్తున్నావ్ నాకు"అన్నాను.
నేను అల చెప్తుంటే తను నా వైపే వింతగా చూస్తున్నాడు...
"అవునా....నేనేం చేశాను నిన్ను,నన్ను రోజు తిట్టుకునేంతగా?"ఆశ్చర్యంగా అడిగాడు తను.
ఇంతలో ఆర్డర్ వచ్చింది....ఇద్దరం ఇంకా తినడం స్టార్ట్ చేశాం......
"కోపం గా అరేయ్,ఏమ్చేసావా....నువ్వు అన్నిట్లోనూ 1st మరి.... చిన్నపట్నుంచి నేను అన్నిట్లో 1st కాని ఇప్పుడు naa 1st నువ్వు తీసేస్కున్నావ్..నేను నా 1st మల్లా నీ నుంచి తీస్కోడానికి ఎంత ట్రై చేసిన ఒక్కసారి కూడా నిన్ను ఓడించాలేకపోయాను... అందుకే నాకు నీ మీద కోపం..ఇంకా కాలేజీ లో ఫాకల్టీ అంటా నిన్ను మేచ్చుకోడమే...నిన్ను చూసి మమ్మల్ని నీల ఉండమనేవర్రు...అందుకే నాకు నువ్వంటే చాల చిరాకు.."అన్నాను నేను దోస కంప్లీట్ చేస్తూ......
తనేమి మాట్లాడలేదు..దోస తినేసాడు..నాకు ఇంకేం మాట్లాడాలో అర్ధం కాలేదు..నా కాఫీ నేను తాగేసి బిల్ ఇచ్చా....తను మౌనంగా కుర్చుని అటుఇటు చూస్తున్నాడు.......
తన మొహంలో కోపంఅయితే కనిపించలేదు కాని....మౌనంగా ఉన్నాడుకదా సో నాకు కొంచెం awkward గా అనిపించింది.......ఇద్దరం బయటికి వచ్చాం కాంటీన్ నుంచి,అల నడుస్తునాం...తను మాత్రం తన మౌనాన్ని వీడలేదు.....నాకు ఇంకేం మాట్లాడాలో అర్ధంకావట్ల.....అలా సైలెంట్ గానే మా నడక సాగిస్తున్నాం......నా హాస్టల్ కి కొంచెం ముందున్న లాన్ దగ్గరకి వచ్చాం.....
"కొంచెంసేపు ఇక్కడ కుర్చున్దామా"అన్నాడు తను........
"సరే "అని జవాబిచ్చాను.....
ఇద్దరం వెళ్లి లాన్లో కూర్చున్నాం.......కానీ మా మద్య ఎలాంటి సంభాషనా లేదు.......ఇంకా నేను అలా ఉండలేకపోయ....
"నేను అన్న మాటలు నిన్నుహర్ట్ చేసుంటే సారీ"అన్నాను నేను.
"Shishira I admire you "అన్నాడు తను....
"నాకేం అర్ధం కాలేదు.....You admire me?but,why?"అన్నాను నేను.....
"శిశిర....నీలా చాలా తక్కువమంది ఉంటారు తెలుసా..ఏం అనాలంటే అది అంటావ్....ఎలా ఉండాలంటే అలా ఉంటావ్....నువ్వు జెలసి కూడా తెలియనంత నిర్మలంగా పెరిగావు.....నీకు నామీద ఉన్నది కోపంకాదు తెలుసా......ఒక విదంగా చెప్పాలంటే అది ఈర్ష్య,కాని నీకు అది కూడా తెలియలేదు......ఈరోజుల్లో అసలెవరు నాకు నువ్వంటే చాలా కోపం,ఎప్పుడు తిట్టుకునేదాన్ని అని డైరెక్ట్ గా ఆ తిట్టే వ్యక్తి కే చెప్తారు చెప్పు?మనసులో వాళ్ళని తిటుకున్న..పైకి మాత్రం నవ్వుతూ సంమధానం చెప్తారు " అన్నాడు తను నావైపు చూస్తూ ..............
నాకు తను అన్నదానికి ఎలా react అవ్వాలో తెలియలేదు...అలా సైలెంట్గా కూర్చున్నాను........
"నువ్వు నవ్వలంటేనే నవ్తావు,ఏడుపు వస్తే చిన్న పిల్లలా ఏడుస్తావు..అసలెల ఇంత pure hearted గా ఉన్నావు?"అడిగాడు తను.
"నువ్వు చెప్పేదంతా ఫిలాసఫీలా ఉంది,మరీ అంత పెద్ద పెద్ద మాటలు నాకు తెలియవు "అనేసి కాళ్ళు చాపుకుని ఆకాశంలోకి చూస్తున్నాను నేను.
"నాకు నీలా ఉండాలని ఉంది శిశిర.....లైఫ్ లో ఏమాత్రం regrets లేకుండా.."అని తను కూడా నాలా కాళ్ళుచాపుకుని పైకి చూస్తూ అన్నాడు......
"నాలా ఏంటి,నేను నీలా ఉండాలని కాలేజీ అంతా అంటుంటే .."అని తన భుజం మీద సరదాగా కొడుతూ అన్నాను......
"సరే లే...నువ్వు నాలా,నేను నీలా ఉండాలి సరేనా ఇంకా .."అన్నాడు తనునవ్వుతూ.
"హ్మ్మ్..బెటర్.."అన్నాను నేను.
కొంచెం సేపు FM లో పాటలు విన్నాం..ఇంకా టైం 11అవ్తొన్దని,ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాం......
నాన్నకి కాల్ చేసి కాసేపు మాటాడ...good night చెప్పేసి..నా మంచం మీద వాలి కళ్ళు ముస్కున్నాను......నవ్వుతున్న ఆర్యన్ మొహం కనిపించింది నాకు,వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచేస.. ఇన్నాళ్ళు చిరాకు పడుతున్నప్డు ఎప్పుడు కనిపించని తన మొహం ఇప్పుడెందుకు నా కళ్ళ ముందుకు వచ్చిందో.....అర్ధంకాలేదు..ఈ కొత్త మార్పుకి కారణం ఏంటో ,,,ఇన్నాళ్ళు శత్రువులా భావించిన ఆర్యన్.. నాకు ఆప్తుడిలా అనిపిస్తున్నాడు......నాగురించి ఇంతగా తెల్సుకున్న తను కొత్తగా కన్పిస్తూన్నాడు నాకు.....నాకు మాత్రం తన గురించి ఏమి తెలీదు.. తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను అని ఆలోచిస్తూ నిద్రపోయాను..... ......మెలుకువ వచ్చి టైం చూసా 5 అయ్యింది.....అలారం కన్నా ముందే లేచాను నేను........
అప్పుడే సూర్యోదయం అవ్తోంది..మార్నింగ్ వాక్కి వెళ్ళడం అలవాటు లేదుకాని,ఎప్పుడైనా ఇలా వేరం లేస్తే తెల్లవారుఝామున వీచే ఆ చల్లగాలిలో అల నడవటం అంటే చాల ఇష్టం నాకు......
సో,కొంచెంసేపు అలా నడుద్దామని,నేను నా హాస్టల్ నుంచి బయటకి వచ్చి అలా నడుస్తూ ఉనా...నిన్న నైట్ మేము కోచుని మాటలడుకున్న ప్లేస్ దగ్గరకి వచ్చా....రాత్రి మా ఇదారి సంభాషణ అంట గుర్తువస్తోంది.....నట నేను తనకోసం పద్కునే అప్పుడ్ ఆలోచించింది ...పద్కునే అప్పుడు తన నవ్వు మొహం గుర్తు వచ్చి నేను ఉలిక్కిపడి లేవడం......ఎందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ అలా పాటలు వింటూ నడుస్తున్న......అలా నడుస్తూ ..ఉన్న...మ్ప్3 ప్లేయర్ లో మంచి సాంగ్స్ ని....తెల్లవారి వీచే ఆ చల్ల గాలిని ఆస్వాదిస్తూ అలా పరిసరాలను చూస్తు ఉన్న ఇంతలో ఆర్యన్ వాళ్ళ హాస్టల్ కనిపించింది.......అలా నడుస్తూ ఏం చేస్తున్నాడో వీడు.....నిద్ర లేచాడ....లేచే ఉంటాడు......లేచిన వెంటనే ఏ పుస్తకమో పట్టుకుని చదువ్తుంటాడు ఈ మహానుభావుడు......హ్మ్మ్మ్ ఫోన్ చేసి చూద్దమ్ ఏం చేస్తున్నాడో అని ఫోన్ కోసం చూస.....అబ్బ ఫోన్ తేలేదు....సరే ఏం చేస్తాం...అని నడుస్తూ ఉన్నా.....
Like Reply
#12
అలా నడుస్తూ తనహాస్టేల్ వైపు చూస్తున్న....ఇంతలో ఆర్యన్ తన హాస్టిల్ నుంచి బయటకు వస్తూ కన్పించ్చాడు......నన్ను తాను చూడలేదు...అటు వైపు వెళ్తున్నాడు...నేను గట్టిగా పిలిచా...ఆర్యన్ అని..తాను వెనక్కి తిరిగి నన్ను చూసి నా వైపు వచ్చాడు........
"Good Morning shishira .. ఏంటి ఇలా వచ్చావ్? "అడిగాడు తను.
"Good Morning aaryan....ఏంలేదు... త్వరగా లేచాను ఇవ్వాళ సో,అలా కాసేపు చల్లగాలి పీల్చుకున్నట్టు ఉంటుందని ఇలా వచ్చాను"అన్నాను.......
"ఓహో.....అలాగా..సరేపద అయితే అలా నడుద్దాం "అంటూ రెండు అడుగులు వేసాడు తను.....
ఇద్దరం అలా నడుస్తున్నాం...
"ఇప్పుడే నీకోసం అనుకుంటున్నా.....లేచావ లేదా.....లేస్తే ఏం.చదువుతున్నావ....అని....నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ న ఫోన్ తేలేదు..."అన్నాను నేను.....
తను చిన్నగా నవ్వుతూ "లేదు శిశిరా నాకు sun rise అంటే చాల ఇష్టం..మనలో కొత్త ఉత్సాహాన్నినింపుతుంది....అందుకే ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తుంటా...ఆ తర్వాతే నా activities స్టార్ట్ చేస్తాను "అన్నాడు తను.
"హ్మ్మ్.. నాకు Sunset అంటే ఇష్టం....సేద తీరమంటూ వెళ్ళిపోతాడుకదా సూర్యుడు"అని నవ్వుతూ అన్నాను నేను.
"హ్మ్మ్.. మన ఇద్దరిది డిఫరెంట్ మెంటాలిటీ కదా.."అన్నాడు తను.......
"అవను.....compatibility టెస్ట్ పెడితే zero score చేస్తాం మనం"అన్నాను నేను నవ్వుతూ.
"హ్మ్మ్ ఇంకా ..... "అన్నాడు తను...... .
"నువ్వే చెప్పాలి......."అన్నాను.
"ఏం చెప్పను......ఏం లేవు......నువ్వే ఏదోకటి మాట్లాడు......."అంటూ లాన్లో చతికిల పడ్డాడు తను.
"ఎప్పుడు నేనే ...లొడా...లొడా..... వసపిట్ట లాగ వాగుతుంటాను కదా...... ఈసారి నువ్వు చెప్పు" అని అంటూ నేను తన పక్కన కూర్చున్నా......
"ఏం మాట్లాడాలో నువ్వే చెప్పు అయితే....."అన్నాడు తను..........
హ్మ్మ్...అని ఆలోచిస్తూ ఉన్నా తన కోసం నాలో ఉన్న ప్రశ్నలు కోసం అడగాలి అనిపించింది.....కాని ఇది సరయిన సమయం కాదు....అనిపించింది......
"హ్మ్మ్ ...సరే నువ్వు కవివి కదా..సో నా మీద ఏదైనా చెప్పు "అన్నాను నేను గడ్డం కింద చేయి పెట్టుకుని pose.ఇస్తూ .......
"నీమీద?!నువ్వొక 19yrs వచ్చిన చిన్నపిల్లవి"అన్నాడు తను నవ్వుతూ .......తను అలా అనేసరికి నాకు కొంచం కోపం వచ్చింది......ఒక్కసారి నా బుగ్గ మీద చేయి తీసి అలా తనవైపు చూస్తూ
"ఓహ్.. హలో..!! నేనేమి చిన్నపిల్లని కాదు.."అన్నాను నేను.....
తను చిన్నగా నవ్వుతూ నువ్వు చిన్న పిల్లవే.....
"అదేంటి అలా అన్నావ్...."అన్నాను..
స్టేషన్ లో మీ నాన్న వేల్పోతున్నాడు నీ కళ్ళలో....చిన్నప్డు కాలేజ్ లో వదిలి వెళిపోతే ఎలా ఉంటారో అలా ఉన్నావ్....
ఇంకా నిన్న సాంగ్స్ వింటూ మేడం కి దొరికిపోయినప్డు......నేను లంచ్ కి రాలేదని నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకున్నప్డు ....ఇంకా నే ఫస్ట్ రంక్ నేను తెస్కున్న అని బుంగమూతి పెట్టినప్పుడు.....నువ్వు చిన్న పిల్ల లానే ఉన్నావు అన్నాను.....
తను అలా నాకోసం చెప్తుంటే ఛల వింతగా ఉంది నాకు......ఇంకా కొంచం సిగూ....ఇంకేదో తెలియని ఫీలింగ్ తో అలా కిందకి చూస్తున్నా....
తర్వాత..అలా ఇద్దరం ఆ లాన్ లోనే మా ఫిజిక్స్ లెక్చరర్ కోపం గురించి.....మా కాలేజీ కాంటీన్లో వేసే సమోసాల గురించి..... మా క్లాసులో ఉన్న కొంతమంది లవ్ బర్డ్స్ గురించి..ఇలా ఏవో random topics మీద మాట్లాడుకున్నాం.........
ఇంకా క్లాసుకి వెళ్ళాలి కదా అని ఎవరి రూంకి వాళ్ళం వెళ్లి రెడీ అయ్యి కొంచెం సేపటికి అక్షయ కాంటీన్కి వెళ్ళాం................

నేను వేల్లెప్పటికే ఆర్యన్ వున్నాడు,మరు నిమిషంలో నా కాఫీ అండ్ రోల్స్ వచాయి............
"ఆర్డర్ నువ్వే చెప్పావ?థాంక్యు"అంటూ కాఫీ ఒక గుటక వేసాను నేను.....
"నిన్నటిలా రోల్స్ తింటూ వస్తావేమో అని ఆర్డర్ చెప్పెసుంచాను"అన్నాడు తను.
"హ్మ్మ్ .. మంచిపని చేసావ్...."అన్నాను నేను........
తర్వాత ఇద్దరం క్లాసుకి వేల్లిపోయం.. asusual గా వర్క్ చేస్కున్నం..నిన్న లేట్ నైట్ వరకు వర్క్ చేసాం కాబట్టి ఈరోజు మధ్యానం ఆఫ్ తీస్కోమని మా టీం లీడర్ అజయ్ అన్నాడు.......సో,మేము after noon లంచ్ చేసేసి బయటకి వచ్చాం.........
"ఎక్కడికైనా వెళ్దామా ? ఇప్పుడే రూంకి వెళ్లిపోయి ఏంచేస్తాం ?"అని annanu నేను......
""సరే నువ్వే చెప్పు ఎక్కడికి veladamo"అన్నడు తను ..
"సరే పద, టి-నగర్ వెళ్దాం.....అక్కడ షాపింగ్ చేద్దాం"అన్నాను నేను.
మాకు పెద్దగ చెన్నై తెలీదు కాబట్టి......అలా ఆటోలోనే T-నగర్ వెళ్ళాం .. చాలా రద్దీగా ఉంది ఆ బజార్ అంతా........ఎటు చూసినా చిన్న చిన్న చీమల్లగా హడావిడిగా వేల్పోతున్న జనమే కనిపించారు......
ఆ రోడ్లో ఎటు చుసిన శరవనా స్టోర్స్ నే కనిపించాయి నాకు..ఎన్నిబ్రాంచ్లు ఉన్నాయో వీళ్ళకి ఎటు చూసినా అదే పేరు కన్పిస్తోంది అనుకున్నాను నేను........
"ఇద్దరం ఒక శరవణ స్టోర్స్లోకి వెళ్ళాం..పెద్ద షాపింగ్ మాల్ ,5 ఫ్లోర్స్ ఉంది......ఒక్కో ఫ్లోర్ చూస్తూ వస్తున్నాం మేము....... నాకు టాప్స్ తీస్కోవాలని ఉంది "అన్నాను నేను,బట్టల దగ్గరకి వచ్చి.
"వెళ్ళు.. తీస్కో.. I'll wait here"అన్నాడు తను బిల్లింగ్ కౌంటర్ దగ్గరే నించుని .......
"నాకు మా అప్పా సెలెక్ట్ చేస్తారు,నాకు నేను ఎప్పుడూ ఏం కొనుక్కోను....కాని ఇంకెవరికైనా అయితే మాత్రం చాల బాగా సెలెక్ట్ చేస్తా"అన్నాను నేను.........
"సరే,పద అయితే నేను హెల్ప్ చేస్తా "అన్నాడు తను.
ఇద్దరం వెళ్లి కొన్ని టాప్స్ సెలెక్ట్ చేసాం.....నేను trail చూద్దామని వెళ్లి ఒక్కో టాప్ వేస్కుని వచ్చి ఏది బాగుందో చెప్పు అన్నాను..
తను ఒక బ్లూ కలర్...ఇంకో బ్లాకు కలర్ tops బాగున్నాయి అన్నాడు....నాకు,రెడ్ కలర్ టాప్ కుడా నచ్చింది,సో మొత్తం 3 తీస్కున్నాం......
"నువ్వేమి కొనావా?ఏవైనా షర్ట్స్ చూడు ,నువ్వు నాకు హెల్ప్ చేసావ్గా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా"అన్నాను నేను.నేను కూడా నాన్న కు తీసుకుంటా అన్నాను.......
సరే అని Men'sshirts వైపు వెళ్ళాం..తన షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాం..నాకు ఒక్కటి కూడా నచ్చలేదు......తను చాలా ట్రై చేసాడు కానీ నేను anni "NO" అన్నాను........తనకి ఏవి కరెక్ట్ గా శుఇతె కావట్ల.....
"ఇంకా నా వాళ్ళ కాదు శిశిర.. నా ఓపిక మొత్తం అయిపొయింది.......ఆడవాళ్ళ తో షాపింగ్ అంటే ఎందుకు మగాళ్ళు జడుచుకుంటారో అర్ధమయింది నాకు ..నీకు ఏవి నచ్చవు...కాని బైల్దేరదాం ఇంకా "అన్నాడు తను నా దగ్గరికి వచ్చి..... ..నేను అలా ఇంకా షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్న అప్పటికి ....."హ్మ్మ్ .. పర్ఫెక్ట్ ..!! ఇది ట్రై చేయి.. నీకు చాలా బాగా సెట్ అవ్తుంది" అని బ్లాకు coloured ఫార్మల్ షర్టు తీసిచ్చాను....
"నో వే..ఇంకా నావల్ల కాదు తల్లి.. "అని చేతులు జోడించి బుంగ మూతి పెట్టి అనేసాడు.......
"నాకు తనని చుస్తే నవ్వు వచ్చింది.. తనని ఎప్పుడూ అలా చూడలేదు...ఇంకా చాలా క్యూట్ గా ఉన్నాడు.......నేను అదే చెప్పా తనతో ...అబ్బా చల్ల బాగున్నావ్ ....ఎంత క్యూట్ గా ఉన్నవో ఇలా అని తన బుగ్గలు లాగాను..తను నా వైపు అదోలా చూస్తూ ప్లీజ్ శిశిరా అన్నడు....అబ్బ..పద పద అంటూ తన గడ్డం పట్టుకును చేతిలో ఆ షర్టు పెట్టి ...తనని అలా trail room వరకు తన వీపు మీద నా చేతులు పెట్టి నెట్టుకుంటూ వెళ్ళాను "తను ఏమనలేదు, నా వైపు అలానే బుంగ మూతి తో కొంచం కోపం గా చూస్తూ trail room లోకి వెళ్ళిపోయాడు..
కొంచెం సేపటికి ఆ షర్టు వేస్కుని బైటకి వచ్చాడు....... "చాలా బాగుంది తనకి ఆ షర్టు .....
"హబ్బ సూపర్....బాగుంది .......ఇది ఫైనల్ ఇంకా.. తీసేస్కో.."అన్నాను నేను......
"హమ్మయ్య.....ఫైనల్లీ ఒక్కటి నచ్చింది నీకు ..... ఇంకా పదా "అన్నాడు తను......
తర్వాత నేను అమ్మకి 2 చీరలు, అప్పాకి 3 షర్ట్స్ కూడా కొన్నాను నేను.......మీ పేరెంట్స్ కి తెస్స్కోవా అని అడిగాను తనని...
"లేదు ఇప్పుడు కాదు తర్వాత తెస్కుంటా నేను"అన్నాడు .....
ఇంకా కొన్నవాటికి బిల్ ఇచ్చేసి,అన్ని పాకెట్స్ తీస్కుని బైటకి వచ్చేసాం..


______________________________
Like Reply
#13
ఇంత తిరిగాక.......ఆకలేస్తుంది కదా..సో ఇద్దరం ఏదన్న తిందామని అల చూస్తున్నాం....
"పానీ పూరి తిందాం....నా ఫేవరెట్ "అన్నాను నేను.
సరే పద అని ఇద్దరం అలా చాట్ బండి దగ్గరికి వెళ్ళాం....2 ప్లేట్స్ పానీ పూరి చెప్పాడు తను..........
ఇద్దరి చేతుల్లోను మేము షాపింగ్ చేసిన తాలూకు బాగ్స్ ఉన్నాయి......నిన్చోడానికి కూడా చోటులేనంత రద్దీగా ఉంది అక్కడ......మేము బాగ్స్ ఎక్కడ పెట్టాలో అని చుస్కుంటుంటే..చాట్ బండి అతను,ప్లేట్ తీస్కోమని సైగ చేసాడు........
చేసేదేంలేక,ఆర్యన్ బాగ్ నేను తీస్కున్నాను.....
ఇంతాలో చాట్ బండి వాడు ఆర్యన్ కి ఒక ప్లేట్ ఇచ్చి ....ఒక పూరి పెట్టాడు......
"మరి నువ్వో ? "అన్నాడు తను ఒక పూరి నోట్లో పెట్టుకుంటూ.......
"నువ్వు తినేయిలే,తర్వాత ఈ బాగ్స్ నీకిచ్చి నేను తింటాను"అన్నాను నేను........
తను ఏం మాట్లాడలేదు,రెండో పూరి షాప్ అతను ఇవ్వగానే,ఆర్యన్ తీస్కుని,నా నోట్లో పెట్టేసాడు........
నోట్లో పూరి ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక పోయాను......కాని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్న తన వైపు.....
"ఇప్పుడు నువ్వు క్యూట్గా ఉన్నావు "అని తను నవ్వాడు........గబగబా నోట్లో ఉన్న పూరి తినేసి......
"నేను తింటాను,నువ్వు పెట్టకు"అనేస.....
మాట అయితే అనేసాను కాని,తను ఏమయినా అనుకున్నాడు ఏమో అన్పించింది వెంటనే నాకు.........
"నేను తింటుంటే అలా కళ్ళు అప్పగించి చూస్తున్నావుగా,నాకు దిష్టి తగుల్తుంది,అందుకే నీకు పెట్టాను..ఇంకా పెట్టను,నీ టర్న్ వచ్చేవరకు ఆగు"అని పూరి సగం నవుల్తూ గజిబిజిగా అన్నాడు తను.........
తను సరదాగానే జవాబిచ్చాడు కాబట్టి,హమ్మయ్య అనిపించింది నాకు......తను తిందాం పూర్తయ్యాక,నేను నా పానీ పూరి తిన్నాను........తను బుద్దిగా షాపింగ్ బాగ్స్ అన్ని పుచ్చుకుని నించున్నాడు..........
అక్కడ బిల్ సెటిల్ చేసేసి.....నద్చుకున్తూ side-lane లోకి వచ్చాం.....
"ఇక్కడేదో గుడి వుంది,వెళ్దాం పద "అన్నాను నేను.........
"నువ్వెళ్ళు,నేను బైట నిన్చుంటాను "అన్నాడు తను.......
"అదేంటి,నువ్వు రావా,ఎందుకు? "అడిగాను నేను.........
"నేను దేవుడిని నమ్మను..... "జవాబిచ్చాడు తను.....
"నువ్వు నాస్తికుడివా?"అడిగాను నేను.........
"హా..అయినా నీ నమ్మకాన్ని నేను తప్పు పట్టను..నువ్వెళ్ళు లోపలికి,నేను ఇక్కడే వెయిట్ చేస్తా "అన్నాడు తను.
"తనని ఎన్నో ప్రశ్నలు అడగాలని అనిపించింది.......కానీ ,అది సమయం కాదులే అనుకుని,గుడిలోకి వెళ్లి ,కాళ్ళు కడుక్కుని,దర్శనం చేస్కుంటున్నా......
"కశ్యప గోత్రం......శ్రీ రామ్,సీత...అని అమ్మ ,నాన్నల పేర్లు చెప్పి అర్చన చేయిస్తున్నాను......"
"భారద్వజ గోత్రం......ఈశ్వర్,శైలజ అన్నాడు తను నా పక్కన నించుని......."
"ఆర్యన్..!! దేవుడిని నమ్మను అన్నావు ?"అడిగాను నా పక్కన నించున్న ఆర్యన్ ని చూసి.........
"హా....అవును......నమ్మను"అన్నాడు తను.......
"మరి అర్చన ఎవరి పేరు మీద చేయిస్తున్నావ్ ? "అడిగాను నేను.......
"ఓహో.... అదా.. పొంగళి ప్రసాదం పెడ్తున్నారు,ఇందాకే ఒకావిడ బైటకి వస్తుంటే,ఆవిడ చేతిలో చూసా.....నాకు పొంగళి చాల ఇష్టం........
కొనుక్కుందామని లోపలకి వచ్చా......కానీ అర్చన చేయించిన వాళ్ళకే పొంగళి ప్రసాదం అన్నారు.. సరేలే అని అమ్మ,నాన్న పేర్లతో అర్చన చేయిస్తున్నా.. అంతే.. "వివరించి చెప్పాడు తను.........
ఇష్టం లేకపోయినా,గుడిలోకి రాకతప్ప లేదు,దేవుడు ఊరుకుంటాడ అనుకుని నేను నవ్వుకున్నా..ఇద్దరం దర్శనం చేస్కుని,ప్రసాదం తీస్కున్నాం..... ఇంకా వెళ్దాం పద అన్నాడు తను వెంటనే.......
"అరేయ్,ఉండు..గుడికి వచ్చినప్పుడు కొంచెంసేపు కుర్చుని వెళ్ళాలి"అంటూ కూర్చున్నాను నేను .....
"అబ్బా ఏంటి శిశిరా...పద అంటూ కదలబోయాడు . "అన్నాడు....
ఇంతలో నేను తన చేయి పట్టుకుని లాగుతూ కూర్చో దా అంటూ లాగాను.....తను చేసేది లేక ....నా పక్కన కుర్చుని
"కూర్చుంటేనే పుణ్యం వస్తుందా ఏంటి "అన్నాడు..........
"అరేయ్...... కాదు.. మనం కుర్చుని కళ్ళు మూస్కుని,చిత్రగుప్తుడికి చెప్పాలి అంటా"నేను గుడికి వచ్చాను స్వామి", అని అప్పుడు ఆయన మనం చేసిన మంచి పనుల లిస్టులో ఎంటర్ చేస్తాడుఅంట."అన్నాను నేను........
"ఓహో.....నువ్వు చెప్పకపొతే రాయడా?తప్పులు చేసినప్పుడు ఎంటర్ చేస్తాడుగా అప్పుడు కూడా.. "కళ్ళు మూస్కుని దేవడా..నేను తప్పు చేసాను,ఇది కూడా ఎంటర్ చేస్కో అని చెప్తారా? ""అని వెటకారంగా అడిగాడు పొంగళి తింటూ ........
"నకదంతా తెలీదు..మా బామ్మా చెప్పింది ఇలా చెప్పాలి అని అంతే.......అంత వెటకారం ఏం అక్కర్లేదు......నీకు నేనేమి చెప్పట్లేదు అలా చేయి....ఇలా చేయి అని....."అన్నాను నేను కొంచం సీరియస్గా..........
తను కళ్ళు మూస్కుని ఏదో తల్చుకున్నాడు..........తర్వాత "వెళ్దామా ? "అని అడిగాడు.........
"ఏం కోరుకున్నావు ? "అడిగాను నేను.......
"నాకేం కావాలన్న నేను achieve చెస్కొగలను,ఎవరో ఏదో ఇవ్వాలి అని నేనేమి కోరుకోను..... " అన్నాడు.
"మరి కళ్ళు మూస్కుని ఏం చేసావ్ ఇంతకు ముందు ? "అడిగాను నేను........
"ఓహో.......అదా.. !!ఇంకా నువ్వు ఉన్నావు అంకుని నిన్ను నమ్మే వాళ్ళు వున్నారు,కొంచెం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకో అని దేవుడికి చెప్పనులే "అన్నాడు తను.......
నేను అప్పుడు,తన మాటలకి react ఐతే,అక్కడే డిబేట్ మొదలవుతుంది అని,సైలెంట్ గా ఊరుకున్నాను.......
ఇద్దరం బైల్దేరాం..తన ప్రవర్తన,మాటలు అన్నిట్లో ఏవో కారణాలు ఉన్నాయి అనిపించింది నాకు,అవి ఏంటో తెల్సుకోవాలని......నా మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలని ఇంకా తనని అడిగేద్దామని నిర్ణయించుకున్నాను .......ఇలా ఆలోచిస్తూ ఉన్న మా ప్రయాణం కొంచంసేపటికి కాంపస్కి వచ్చేసాం ....... ..
అక్కడ ఆటో దిగి అలా నడుస్తూ ఉన్నాం ......మా హాస్టల్ కి వెళ్ళటానికి.....
"లైబ్రరీ దగ్గర లాన్ లో కొంచెం సేపట్లో కలుద్దాం,త్వరగా రా ......నీతో చాలా మాట్లాడాలి "అన్నాను నేను నా హాస్టల్ లోకి వెళ్తూ..........
"నేను కూడా నీకు కొన్ని చెప్పాలి శిశిర "అన్నాడు తను.....
"ఏం చెప్పాలి "అడిగాను నేను వెంటనే..........
తను అలా అనేప్పటికి నా గుండె వేల మైళ్ళ వేగంతో కొట్టుకోడం మొదలు పెట్టింది,ఎందుకో తెలియలేదు మరి.........
"కలుస్తాంగా.. మాట్లాడుకుందాంలే "అనేసి వెళ్ళిపోయాడు తను..
తను వెళ్ళిపోయాక నేను నా హాస్టల్ లోపలి వెళ్ళిపోయా ........నా గుండె మాత్రం మామూలు స్థాయికి రాలేదు.......అదే వేగంతో నా చెవులకి వినిపించే అంత గట్టిగ కొట్టుకుంటోంది....... మారుతున్న పరిణామాలకు కారణాలు తెలియబోతున్నాయిలే అన్కుంటూ నా రూంలోకి వెళ్ళిపోయాను నేను........
రూంకి వెళ్ళాను .....బాగా తిరిగి తిరిగి అలసిపోయ.......అందుకే స్నానం చేయ్యానికి వెళ్ళ...స్నానం చేస్తున్నా....షవర్ ఆన్ చేసి.......నా చేతలు అయితే యాంత్రికంగా పనిచేస్తున్నాయి కాని...నా మనసంతా ఆర్యన్ నాతొ మాట్లాడాలి అన్న విషయాల మీదనే ఉంది.......షవర్ హోరు లోకూడా నా గుండె చప్పుడే నాకు వినిపిస్తూ ఉంది.....అల ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యాను......పింక్ కలర్ చుడిదార్ వేస్కున్నాను.....ఆర్యన్ ఏం చెప్పాలని అనుకున్తున్నాడో అని అనుకుంటూ రెడీ అయ్యాను........త్వరగా రెడీ అయ్యి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను ,అక్కడ ఉన్న రౌండ్ బెంచ్ మీద కుర్చుని వెయిట్ చేస్తున్నాను.......తను ఇంకా రాలేదు.......చాలా సేపు వెయిట్ చేశాను...... అల 1 గంట వెయిట్ చేశా.....తను రాలేదు ఇంకా... అబ్బా .....ఏంటి ఈ మనిషి మాములుగా ఎప్పుడు టైం కి వస్తాడే ఇప్పుడేంటి,ఇంత లేట్ చేస్తున్నాడు అనుకున్నాను.....ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం అనుకున్నాను .. ఫోన్ తీసి తన నెంబర్ డయల్ చేస్తున్నాను.................


______________________________
Like Reply
#14
ఇంతలో తను వస్తున్నాడు .......వైట్ coloured కుర్తా...పైజామా...వేస్కుని.....తనని అలానే చూస్తున్నా....ఏంటి ఈ అబ్బాయి ప్రతి పరిచయానికి కొట్టగా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నా.....తను నా దగ్గరికి వచ్చేసాడు.......
"సారీ,లేట్ అయ్యాను కదా......చాలా సేపట్నుంచి వెయిట్ చేస్తున్నావా? "అడిగాడు తను నా పక్కన కూర్చుంటూ..
"పర్లేదులే,ఏంటి ఈ కొత్త లుక్..... "అన్నాను నేను నవ్వుతు..
"Nothing special,casual గా వేస్కున్నాను......బాలేద "అని అడిగాడు తను.
"హ్మ్మ్మ్...బాగుంది ...నీకు ఏదయినా బానే ఉంటుంది......కాని ఏదో తక్కువగా ఉంది.... "అని అనేసి నాలుక కర్చుకున్నాను నేను.
"అవునా....అని తన డ్రెస్ వైపు చెక్ చేస్కుంటూ బానే ఉందిగా.....ఇంకేం తక్కువ అయ్యింది.....నీకు ఏవి ఒక పట్టాన నచ్చవు..అనుకుంటా..ఇందాక షాప్ లోను అంతే "అన్నాడు తను,నవ్వుతు.
"హా......ఇదే ...ఇదే....ఈ నవ్వే .....తక్కువగా ఉంది.....ఇప్పుడు బాగున్నావు.....అంటూ......చేతిని సూపర్ సింబల్ చూపిస్తూ .....చిన్నగా తల వంచా.....ఒక కన్ను మూస్తూ ....చెప్పా తనతో......
దానికి తను ఒక వైరాగ్యాపు నవ్వు ....నవ్వి....ఎటో చూస్తున్నాడు.......
"అబ్బా అని నా తల కొట్టుకుంటూ సరేలే ....., ఏదో చెప్పలన్నావు ?ఏంటి ? "అడిగాను నేను "........
"హా చెప్తాను....నువ్వు ఏదో అడగాలి అన్నావ్ కదా ఏంటో అడుగు.....లేడీస్...ఫస్ట్ కదా....."అన్నాడు
"ఫస్ట్ నా....నా ఫస్ట్ నువ్వు ఎప్పుడో తీసేస్కున్నావు గా ...సో ...నువ్వే ముందు చెప్పు ......"అన్నాను
"ఇప్పుడు నేనే ఇచ్చేస్తున్నా నీ ఫస్ట్ నీకే...చెప్పు " అన్నాడు....
"అబ్బా వద్దు బాబు నాకు ఇలా ....నేనే సాధించుకుంటా......ఇందాకటి నుంచి....వెయిట్ చేస్తున్నా.,,,చెప్పు అన్నా...కొంచం సీరియస్ గా.......
"సరే శిశిరా....నువ్వు నన్ను అడిగావు కదా...ఎందుకు మాటాడవు...ఎలా ఉంటావు నువ్వు మాట్లాడకుండా అని Actually నేను ఒక introvert ని శిశిర, అంత త్వరగా ఎవ్వరితో mingle అవ్వలేను.. " అన్నాడు తను.
"హ్మ్మ్.. I know .. "అన్నాను నేను.
"శిశిర,నీకు చెప్పను గా , I am jealous of you అని.....ఎందుకో తెలుసా .. నీకు ఒక loving family ఉంది,నా లాగ కాదు."అంటూ తల దించుకున్నాడు తను.
"అదేంటి,నువ్వు మీ మమ్మీ,డాడీ తోనే ఉంటావు కదా.."అని ఆశ్చర్యంగా అడిగాను.
"లేదు శిశిరా మా మమ్మీ మాత్రమె ఉంటారు,మేము ఇద్దరమే ఇంట్లో"అన్నాడు.
"మరి మీ డాడీ?"అడిగాను నేను.
"మా డాడీ మాకు దూరంగా ఉంటారు......నాకు అన్ని మా మమ్మీనే శిశిర,నాన్నతో నాకు attachement లేదు.చిన్నప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం.......అప్పుడు కూడా నాన్న నన్ను ఎప్పుడు దగ్గిరకి తీస్కోలేదు......అందరిలా నేను మా నాన్న చేతులు పట్టుకుని పెరగలేదు శిశిర.. "అన్నాడు తను.......
తన మాట బరువెక్కుతోంది.....కళ్ళు చేమరిస్తున్నాయి......ఇవన్ని నేను మౌనంగా గమనిస్తున్నాను.....
నాకు అందరి పిల్లల్లా మా నాన్నతో ఆడుకోవాలని....తనతో కలిసి బయట తిరగాలని....ఉండేది.....కాని నాకు ఎప్పడు ఆ అవకాశం దొరకలేదు.......అన్నింట్లో ఫస్ట్ వస్తే అన్నా ..తను నన్ను ప్రేమగా దగ్గరకు తీస్కుంటారు అనే ఆశతో ఉండేవాడిని.....కాని నా ఆశ ఏరోజు నేరేవేరలేదు........ఇంకా...నాతొ ఉన్న కొంతమంది నేను ఫస్ట్ వస్తున్నా అని ......టీచర్స్ నన్ను ఎప్పుడూ పొగుడుతుంటారు అని మా నాన్న తో నా మేడే ఏవేవో చెప్పేవారు ........ చిన్నప్పుడు ఎవరేమి చెప్పిన నమ్మేవారు ఆయన ,ఎవరో మీ అబ్బాయి ఇలా చేసాడు,అలా చేసాడు అంటే నన్ను వీపు చిత్లిపొయెల కొట్టేవారు......తర్వాత నిజం తెల్సినా ఊరుకునేవారు తప్ప .... అప్పుడు కూడా నన్ను దగ్గరికి తీస్కునేవారు కారు ......అందుకే నేను అప్పుడే డిసైడ్ అయ్యా...ఎవ్వరితోను ఇంకా మాటడకూడదు.....అని అందుకే నేను పెద్దగా ఎవ్వరితోను కలవను....ఇంకా మా నాన్న,అమ్మ
గోడవపడుతుంటే,ఇల్లు నరకంల అనిపించేది నాకు...... దేవుడు ఉంటాడు,మనం కోరుకుంటే మన కోరికలు తీరుస్తాడు అని,రోజు మా ఇంటి దగ్గరున్న గుడికి వెళ్లి కళ్ళు తిరిగే వరకు ప్రదక్షిణాలు చేసి,ఏడుస్తూ మొక్కుకునేవాడిని ,,,మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా చూడు స్వామి...మా నాన్న నాతో ప్రేమగా ఉండాలి...నన్ను ఎత్తుకోవాలి...ముద్దులాడాలి అని రోజు కోరుకునేవాడిని .. నిజంగా దేవుడనే వాడు ఉండివుంటే,ఆ చిన్న వయసులో కన్నీరుతో నేను కోరుకున్న ఒక్క కోరిక అన్నా తీర్చేవాడు.."" తరవాత
నాకు ఆ బాధని కోపాన్ని ఎవరిమీద చూపించాలో....ఎలా చూపించాలో తెలిసేది కాదు..... నాకు అప్పుడు తెల్సిన్డల్లా చదువుకోవడమే,అప్పటినుంచి నా కసిని దాని మీద చూపించడం మొదలుపెట్టాను......ఎవ్వరయినా సరే...నన్ను వోడించలేని స్థితికి వచ్చాను..కేవలం నేను అన్నిట్లో 1st అని తెలిస్తే ఒక్కసారయినా మా నాన్న నన్ను దగ్గరకి తీస్కుని.. "I'm proud of you ra Aaryan "అని అనకపోతార...ఒక్కసారయిన ప్రేమగా ముద్దు పెడతారని అనేది నా ఆశ ..!"అని అన్నాడు తను......

"నువ్వు చిన్నప్పట్నుంచి,ఇంత బాధని ఎవ్వరికి చెప్పలేద?"అడిగాను నేను తన చేతిని నా చేతిలోకి తీస్కుంటూ.
"లేదు శిశిర ఎవ్వరికి చెప్పలేదు ఎవ్వరయినా,మా నాన్న గురించి అడిగితె ఆయన బిజీగా ఉంటారు అని చెప్పేస్తా అంతే...."చిన్నప్పుడు కొన్నాళ్ళు ఇంట్లో ఉండే చదువ్కునే వాడిని.. తర్వాత బోర్డింగ్ కాలేజ్లో జాయిన్ చేసారు..అందరిని కలవడానికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచేవారు,కానీ నన్ను మాత్రం మా అమ్మ మాత్రమే వచ్చి కలిసి వెళ్ళిపోయేది..... మిగత వాళ్ళని చూసి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడ్చేవాడిని.... అప్పట్నుంచి దేవుడు లేడు,గుడిలో విగ్రహాలు,మనుషులు చేసిన రాతి బొమ్మలు అని అర్ధమయ్యింది నాకు "అన్నాడు.
"ఇంట pain ఉందా నీలో.. I'm sorry .. నిన్ను నేను చాలా తప్పుగా అర్ధం చేస్కున్నాను" అని అన్నాను ,తన చెయ్యి ని గట్టిగా పట్టుకుంటూ..
"నాకు ఎవ్వరి సింపతీ అక్కర్లేదు,నాకేమి బాధ లెదు......ఇన్ఫచ్త్ మొదట్లో బాగా బాధ గా ఉండేది....ఒక్కడినే కూచుని ఎన్ని రాత్రు లు నిద్ర లేకుండా ఏడ్చేవాడిని...నాలో నేనే కుమిలిపోఎవాడిని ఇప్పుడైతే అలవాటు అయిపొయింది.నాకు relationships మీద నమ్మకం అయితే పోయింది.... ఇద్దరు వ్యక్తులు life long ఎప్పటికి కలిసి ఉండలేరు అనేది నా గట్టి నమ్మకం."అన్నాడు తను .
"ఇదంతా నాకే ఎందుకు చెప్తున్నావు? "అడిగాను నేను.
"నాకు friends కూడా చాలా తక్కువమంది చిన్నప్డు నేను ఫస్ట్ రావడం తో కొంతమంది నా పి కోపం పెంచుకుని మా నాన్నతో ఏదో చెప్పి నన్ను కొట్టించి వాలు ఆనందించే వాళ్ళు .....అందుకే అప్పటి నుంచి ఎవారితోను పెద్దగా కలిసేవాడిని కాను..వాలు పైకి ఒకలా మనసులో ఒకలా ఉండేవారు..కాని నువ్వు అలా కాదు.....చెప్పగా నీకు ఇంతకూ ముందే ...ఏది అన్పిసే అది చెప్తావ్...అదే చేస్తావ్ ...ఇంకా ఇప్పుడు నువ్వు నాకు ఎన్దుకో చాలా close అనిపిస్తున్నావు కాబట్టి నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెల్స్కోవాలి అనిపించింది ..అందుకే చెప్తున్నాను ."అన్నాడు.
తన మాటలకి ....ఒక విధంగా నేను చాలా బాధ పడ్డాను,కాని తను నన్ను ఇంతగా నమ్మాడు అని same time లో హ్యాపీ గా కూడా అనిపించింది నాకు.
"ఇదే శిశిర నేను చెప్పాల్సింది....నీకు చెప్తాను అన్నది,చెప్పాను..ఇప్పుడు నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో చెప్పు "అన్నాడు తను.
"నేను అడగాలి అనుకున్నవి అన్ని నువ్వే చెప్పేసావ్ "అన్నాను నేను .
" హ్మ్మ్ .. "అన్నాడు తను...ఒక్కసారి కూడా మా నాన్న నన్ను తన దగ్గరగా తెస్కుని ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు శిశిరా ...స్టేషన్ లో మీ నాన్న నిన్ను అలా ముద్దు పెట్టుకుంటుంటే...ఇంకా ఇదే ప్లేస్ లో నీకు మీ నాన్నకు ఉన్న బాండింగ్ నువ్వు గర్వం గా చెప్పుకుంటుంటే ...ఎంత అదృష్టవంతురాలివి అనుకున్న ....అందుకే అన్నా అలా ...నువ్వంటే నాకు jealosy అని..సారీ చెప్పాడు.
"సారీ ఎందుకు నేనే నీకు చెప్పాలి sorry....నీకోసం తెలీక నిన్ను రోజు నానా రకాలుగా తిట్టులునేద్దాన్ని".....మీ డాడీ నిన్ను చూసి proud గా ఫీల్ అయ్యే రోజు...నిన్ను ప్రేమగా తన దగ్గరకి తెస్కునే రోజు తప్పకుండా వస్తుంది ఆర్యన్ చూడు .. "అన్నాను నేను నవ్వుతు..
"నువ్వు నవ్వుతు చెప్తోంటే వస్తుంది అనే అనిపిస్తోంది నాక్కూడా "అన్నాడు తను,చిన్నగా నవ్వుతు.
"సరే,నువ్వు నీ గురించి ఇన్ని విషయాలు చెప్పావ్ కదా,నేను ఒక్కటి చెప్పాన.. "అని అడిగాను.
"నువ్వు permission తీస్కుని ఎప్పట్నుంచి మాట్లాడుతున్నావ్ ? చెప్పు "అన్నాడు తను .
"అయితే ,నేనేం చెప్పాను.. పో "అని బుంగమూతి పెట్టుకుని ఇంకో వైపు తిరిగి కూర్చున్నాను.
తను నేను తిరిగున్న వైపుకి వచ్చి ..తన చెవులు పట్టుకుని .. "సారీ తల్లి.. అలగకు,ఈ టైంలో నీ అలక తీర్చడానికి Filter Coffee కూడా దొరకదేమో "అన్నాడు తను.
"Coffee, అయితే కాంటీన్లో 24x7 దొరుకుతుంది"అని నవ్వుతు చెప్పాను.
"coffee అంటే చాలే,ఎంత కోపమైన కరిగి పోతుంది నీకు.."అన్నాడు తను.
"హ్మ్మ్..హ్మ్మ్.... "అని తలూపాను.
"సరేలే,చెప్పు .. ఏంటో చెప్తా అన్నవ్గా "అని అడిగాడు.
"Naaku, నువ్వు senty గా ఉంటె నచలేదు.. ఇలా నవ్వుతు ఉంటేనే బాగున్నావు .."అని నేను స్మైల్ చేసి చూపిస్తూ చెప్పాను .. స్మైల్ emotion
"ఏం చేసిన నాకు satisfaction లెదు శిశిర.. ఒన్స్ నా మనసుకి నచ్చే పని చేస్తే అప్పుడు హాయిగా నవ్వుతనేమో "అన్నాడు తను.
"నవ్వడానికి కూడా reasons వెతుకుతావేంటి,మనం dull గా ఉంటె నవ్వు మన మీద అలిగి వెళ్ళిపోతుంది ..మన దగ్గరికి ఎప్పుడూ రాదు,అదే welcome చెప్పి రమ్మంటే , మన పేదలని వదిలి పోనేపోదు .. "అని చెప్తూ...మూడి గా ఉన్న తన పేస్ ని పైకి ఎత్తి బుగ్గలు 2 లాగి smiley సింబల్ చూపించా... .
తను చాలా bright గా నవ్వాడు..
"ఎలాంటి mood లో వున్నా, నువ్వు కంఫర్ట్ చేసేయగాలవు నీ మాటలతో జనాలని తెలుసా "అన్నాడు తను.
"హా నాకు ఆ విషయం బాగా .. తెలుసు,నాలా నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో..ఇంకెవ్వరు ఉండరు,నేనొక antique piece నిలే.. "అని నా చున్నిని collar ల ఎగరేస్తూ చెప్పాను....
తను నా చర్యలకి మాటలకి నవ్వుతూ ఒక పేపర్ తీసి,ఇదిగో చదువుకో అన్నాడు......
"ఏంటిది?"అడిగాను నేను.
"నీ మీద ఏదయినా రాసిమ్మన్నావు గా,రాసి తెచ్చాను,అందుకే లేట్ అయ్యింది."అన్నాడు.
"అవనా..ఇప్పుడే చదివేడ్డం ఐతే "అని excited గా paper open చేశాను.......
నా బాధని పంచుకోడానికి .......
పోయిన నా చిరునవ్వుని తెచ్చి ఇవ్వడానికి..
అలసిన మనసుకి సేద తీర్చడానికి......
దివినుంచి భువికి దిగి వచ్చిన పసి పాప.....
తేనే మనసున్న చిలిపి మాట......
బంగారు వన్నెలున్న ముద్దుల మూట... ..
ఎప్పుడూవసంతాలు పూయించే నా శిశిర..!!
తను రాసింది చదివాను ...అలా ఉండిపోయా సిలలా
"తను నా భుజం పయ్ చెయ్యి వేసి ...నన్ను అలా కొంచం ఊపి ..ఎం శిశిరా బాలేదా అన్నాడు .....
"OMG .. ఇంత బాగా నన్ను ఎవ్వరు పొగడలేదు ఇప్పటిదాకా తెలుసా .. ...చాల ante చాలాలాలా......చా..........లాఆఅ బాగుంది .. థాంక్యు సో మచ్ .."అని చెప్పాను... ."ఇందులో పొగడ్త ఏమిలెదు,నీ గురించే నీకు చెప్పాను అంతే .. you are my most trusted Friend so far Shishira "అన్నాడు తను .
" Aina thank you .. ఇంత బాగా రాసావ్ .. నేను దీన్ని భద్రంగా దాచుకుంటాను "అన్నాను .
ఆ తరువాత అలా.. ఇంకా ఏవో కబుర్లు చెప్పుకున్నాం ..


______________________________
Like Reply
#15
అలా కాసేపు మాట్లడ్కున్నాక నేను కొన్ని టాపిక్స్ చెప్తే వాటి మీద అప్పటికి అప్పుడే కవితలు చెప్పాడు.....చీకటి పడేంతవరకు అక్కడే మాట్లాడుకున్నాం.....తర్వాత అక్షయ కాంటీన్ లో భోజనాలు చేసేసి ఎవరి రూం కి వాళ్ళు వెళ్ళిపోయాం......ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేసి ఇంక నిద్రపోవడానికి ఉపక్రమించాను......అలా ఈ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తొస్తున్నాయి.....తన కళ్ళలో కన్నీలు,తను ఇన్నాళ్ళు పడ్డ బాధ .....తన మనసులో ఇంత బాధని ఈ అబ్బాయి ఇన్నాళ్ళు ఎలా భరించాడు.....నేను కూడా తనని అనవసరం గా రోజు తిట్టుకున్నా.. .నేనొక స్టుపిడ్ ని.....తను నన్ను నమ్మి..ఒక ఆప్తురాలిగా నన్ను భావించి తన బాధలన్ని షేర్ షేర్ చేస్కున్నాడు....ఇకపైన తన కళ్ళలో నీలు ఉండకూడదు...తన పెదాలపైన చిరునవ్వు చెరిగిపోనివ్వకుండా చుస్కుంటాను...ఇలా ఆలోచిస్తూ ఉన్నాను...సాయంత్రం తను నాకు తినిపించిన పానీపూరి గుర్తొచింది.....చిన్నపుడు మా అమ్మ నాకు తినిపించింది.....ఇప్పటికి మా నాన్న నాకు తినిపిస్తూంటారు అప్పుడప్పడు....తర్వాత నువీ తినిపించావ్.....ఏంటో ఎవరితో నేను రెండు నెలలు భరించాల,ఎలా గడపాల అనుకున్నానో.....వాళ్ళ కోసమే ఇలా ఇపడు ఆలోచిస్తూ ఉన్న......అలా ఆలోచిస్తూ నిద్రపోయాను...అలా ఆ రోజు గడిచిపోయింది తర్వాత ..రోజులు ఇలానే గడచిపోతున్నాయి.....ఇప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది......రోజుకో experince తనతో...కాని ఇది వరకట్ల నేను విసుగు చెందట్ల....చిరాకు పడట్లేదు....కోపం తెచ్చుకోవట్లేదు...తనతో ఉండే ప్రతి నిమిషం...infact every second ఎంజాయ్ చేస్తునా... ప్రతి విషయం ఇద్దరం షేర్ చేస్కునే వాళ్ళం....నేను మాట్లాడటం ఆపి తనకి ఛాన్స్ ఇచ్చేదాన్ని.....తను కూడా కబుర్లు చెప్పేవాడు wink emotion ......మా ఇద్దరికీ కాంపిటీషన్ లేదు కాబట్టి,ఇక్కడ చాలా హాయిగా ఉంటోంది.రోజు మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు వర్క్ చేస్కోడం,సాయంత్రం లైబ్రరీ దగ్గర,ఇప్పుడది మా డైలీ మీటింగ్ స్పాట్ అయిపొయింది లెండి........బెంచ్ మీద కుర్చుని బోలెడు కబుర్లు చెప్పుకోడం....పాటలు,వీడియోస్ షేర్ చేసుకోడం......అటు ఇటు వెళ్ళే వాళ్ళని చూసి కామెంట్ చేస్కుని నవ్వుకోడం..తర్వాత తినేసి ఎవరి రూంకి వాళ్ళు వేల్లిపోడం.....ఇలా సరిగ్గా ఒక నెల రోజులు గడిచి పోయాయి..ఆర్యన్,నా అల్లరిని మా నాన్నలా contol చేస్తాడు.....అమ్మలా కేర్ తీస్కుంటాడు.....ఒక విధంగా చెప్పాలంటే రోజులో నిద్రపోయేప్పుడు తప్ప మిగతా టైం అంతా almost ఏదోకటి మాట్లాడుకోడం,కల్సుకోడం జర్గుతూనే ఉంటోంది..........
"నేను...చాలాసార్లు చాలా విషయాల్లో అలా వద్దు ఇలా అని మొండిగా నాకు నచినట్టు చేసేదాన్ని కాని తను ఒక్కాసారి కుడా,నన్ను తనకి నచినట్టు ఉండమని అడగలేదు.....నా childish behaviour వళ్ళ చాలా సార్లు ప్రొబ్లెమ్స్ ఎదుర్కున్నం.....ఒక సారి నేను మెస్లో సాంబార్ ఒమ్పేస,కావాలని కాదు,ఆర్యన్ చెప్తూనే వున్నాడు ఒకేసారి 2 plates పట్టుకోవద్దు అని చెప్తూనే ఉన్నాడు,నేను వినలేదు,ఎంతైనా మొండి దాన్నికదా..తన ప్లేట్,నా ప్లేట్ రెండు నేనే పట్టుకుని నడుస్తున్న,పక్కన వాటర్ మెషిన్ లీక్ అవ్తోంది...... "చూస్కో శిశిర వాటర్"అని తను అరిచేలోపే పడిపోబోయాను......లక్కీగా తను పట్టుకున్నాడు కనుక నాకేం తగలలేదు కాని,సాంబార్ మాత్రం ఎదురుగ వస్తున్నఆయన మీద పడిపోయింది..నేను కళ్ళు ముస్కుని,ఆర్యన్ షర్టుని గట్టిగా పట్టేస్కున్న..తను నా వీపు తట్టి ఏంపర్లేదు,lite తీస్కో అన్నాడు,ఇద్దరం,ఆయనకి సారీ చెప్పాం..ఆయన మమ్మల్ని గుర్రుగా చూస్తూ,తిట్టుకుని వెళ్ళిపోయాడు.....
ఇంకోసారి మా మేడం ఒక వర్క్ ఇచ్చి చేయమన్నారు.....తనని మద్యానం అయ్యింది...నాకు ఆకలేస్తుంది...తనని లంచ్ కి రమ్మన్న....తను సీరియస్ గా వర్క్ చేస్కుంటున్నాడు...కాని కదలడు.....రా బాబు...అని ఎంత పిలచిన...వస్తాను నువ్వే వెళ్ళు అంటాడే తప్ప...రావట్లేదు..నాకేమో తను లేకుండా వెల్ల బుడ్డి కాట్లేదు...లాస్ట్ కి వస్తావా రావా అన్న....నువ్వేలు అన్నాడు నేను కోపం తో సిస్టం switches ఆఫ్ చేసేసా....తను చేసిన వర్క్ అంతా పోయింది..అయనా విసుగు చెందలేదు...అబబ్బ...పద అన్నాడు...లంచ్ చేసి వచ్చేసాం...మల్ల సిస్టం ఆన్ అవ్వలేదు...సిస్టం క్రాష్ అయ్యింది...విషయం మదం కి తెల్సి తనపి చాల కోప్పడ్డారు....ఇంత అజాగ్రత్త గా ఉంటె ఎలా అని....పనిష్మెంట్ గా..తనకి డబల్ వర్క్ ఇచ్చారు...నాకు చాల బాధ వేసింది...నా వల్లే 2ndtime మేడం తో తిట్లు తిన్నాడు.నాకు తెలీకుండానే ఏడుపు వచేసింది ..అయినా ఒక్క మాట కూడా నన్ను అనలేదు..తన దగ్గరికి వెళ్లి ఏడుస్తూ సారీ చెప్పా...ఇంత జరిగినా తను నార్మల్ గా ఉన్నాడు.....తన చేతులతో నా మోహాని తీస్కుని.....తన వేళ్ళతో నా కాళ్ళ లో నా చెంపల పయ్ కారుతున్న కన్నీరు తుడుస్తూ.."పిచ్చి శిశిర...నన్ను అలా ఉండొద్దని నువ్వు కన్నీరు పెడ్తే ఎలా....వెళ్ళు వర్క్ చుస్కో అంటూ నా బుగ్గలు లాగాడు....తర్వాత తన పని తను చుస్కున్నాడు....ఇంత జరిగిన,నన్ను తను ఒక్క సరి కూడా కోప్పడలేదు,ఇన్నలు తనకి నవ్వడం రాదేమో అని తిట్టుకునేదాని....అసలు కోపం అనే factor తనేకి తెలీదేమో అనిపించింది నాకు....అలంటి పని చేసినండ్కు నన్ను నేను తిట్టుకున్నా.....
ఇలా మేమిద్దరం,బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం.నాన్నకి రోజు ఫోన్లో చెప్పే కబుర్లలో సెకండ్ కి ఒకసరి ఆర్యన్ పేరే చెప్తున్నాను......ఆర్యన్ అలా..... ఆర్యన్ ఇలా అని నాన్న....అడిగారు "చాల సైలెంట్ అన్నావు తను,నీ అల్లరి అంతా ఆ పిల్లాడికి కూడా నేర్పెస్తున్నావాఅని " "నేనేమి నేర్పట్లేదు అప్పా.....ఆర్యన్ నే నేర్చుకుంటున్నాడు."అని నవ్వుతు చెప్పను......
రోజులా నే నా పిల్లోని పట్టుకుని బజ్జున్నాను......ఇంతలో ఫోన్ రింగ్ అయింది ఇంత పొద్దున్నే కాల్ ఎవర్ర బాబు అనుకుంటూ చూసా .....ఆర్యన్ ఫోన్ చేస్తున్నాడు...వీడేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేశా.......
" ఇంకా నిద్రలోనే ఉన్నావా ?"అడిగాడు ఆర్యన్.
"హ్మ్మ్.ఇంత పొద్దున్నే లేచెం చెయ్యాలి.. పడుకోనివ్వు." అన్నాను నేను కళ్ళు కూడా తెరవకుండా........
"లే తల్లి నీ హాస్టల్ బైట వెయిట్ చేస్తున్న......త్వరగా రెడీ అయ్యిరా ఇంక.." అన్నాడు ఆర్యన్.......
"ఇంత పొద్దున్నే ఏం ప్రోగ్రాం అసలు ?!" అడిగాను నేను,నాకసలు లేచే ఉద్దేశ్యం లేదు
"Tv9 anchor లా questions వెయ్యకు.. లేచిరా....I'm waiting "అనేసి ఫోన్ పెట్టేసాడు తను.....
వీడికి నిద్రపట్టదా.......పట్టకపోతే వాడికి నచినట్టు ఏదోకటి రాస్కోచుగా......నన్ను లేపి ఏం సాధిస్తాడు అనుకుంటూ లేచి రెడీ అయ్యి బైటకి వచాను......
Like Reply
#16
హమ్మయ్య.ఫైనల్లీ వచ్చావ్,పద " అన్నాడు తను ఒక అడుగు వేస్తూ..
"హాయిగా బజ్జున్న వాళ్ళని ఇంత ఎర్లీ గా లేపేస్తే చాల పాపం తెలుసా నేకు......"అన్నాను తన వెనుక అడుగువేస్తూ.
" నాకు తెలుసు నువ్వు ఇదే అన్తావని కానీ ఇవాళ ఒక్కరోజు కి క్షమించేయ్యి .."అన్నాడు తను.....
"ఈరోజు ఏంటిత స్పెషల్ ?" అడిగాను నేను కొంచం విసుగ్గా.....
"మరీ అంత స్పెషల్ ఏం కాదులే గాని,ఈవల నా birthday" అన్నాడు తను.......
ఏంటి ఇవాళ నీ birthday నా.....చెప్పనే లేదు....Many more happy returns of the day " అని shake hand ఇచ్చను.
" హ్మ్మ్..థాంక్యు,అంత ఇంపార్టెంట్ ఏంకాదు,usually నేను పెద్దగ ఏం సెలెబ్రేట్ చేస్కోను అన్నాడు తను......
"మరీ జీవితంలో అన్ని పోయినట్టు మాట్లాడకు,ఇవాళ ఒక్కసారి కూడా నువ్వు senty అవకూడదు,డే అంత నవ్వుతూనే ఉండాలి" అన్నాను నేను....
"Birthday నాది.....డిమాండ్స్ నీవ ?"అడిగాడు తను....
"నావే మరి.....ముందు చెప్పలేదుగా నువ్వు,అందుకే పనిష్మెంట్ "అన్నాను నేను నవ్వుతు.
"సరే....ఈరోజు నువ్వేం చెప్పిన చేస్తా......నువ్వు కూడా ఇవాళ నేను చెప్పినట్టు చేస్తావ?"అడిగాడు తను
"ఒకే ..నువ్వు ఎలా అంటే అలా "అని జవాబిచ్చాను."
ఈరోజు మనం ఆఫ్ అని అజయ్ కి కాల్ చేసి చెప్పను,సో బైటకి వెళ్దాం"అన్నాడు తను.......
"హ్మ్మ్....నాకు నీ birthday అని చెప్పలేదు కాని...ఏవో plannings వేసేసావ్.....okay, done......వస్తాను కానీ నువ్వు ఇలా వస్తే కాదు,నేను సెలెక్ట్ చేసిన బ్లాకు షర్టు వేస్కో అప్పుదోస్త" అన్నాను నేను"
ఎందుకు..... ఈ షర్టు బానే ఉందిగా" అన్నాడు తను......
"ఏం చెప్తే అది వింటా అన్నావ్ ..ఒక్క మాటకె నో అనేసావ్ " అని పెదవి విరిచేస నేను.....
"ఒకే..ఒకే .. 2minutes లో వస్తా" అనేసి వెళ్ళాడు తను......
నేను కూడా మొన్న కొనుక్కున్న బ్లాకు టాప్ వేస్కుని,రెడీ అయ్యాను.....రెడీ అయితే అయ్యాను గాని ఏదో వెలితిగా అన్పించింది నాకు......నిద్ర తక్కువయిందిగా సో కళ్ళు ఎర్రగా ఉన్నాయి.....కాటుక పెట్టుకుందామని తీసి పెట్టుకున్నాను.......
నాకు కాటుక పెట్టుకోడం అస్సలు నచ్చదు,అమ్మ మాత్రం కంటికి చలవ తల్లి అని ఎప్పుడు లాగే ఈసారి కూడా సద్దింది,ఇన్నాళ్ళకి ఈవల పెట్టుకున్న కాటుక......అమ్మని తల్చుకుని నవ్వుకున్నాను.
రూంలాక్ చేస్తుంటే ఆర్యన్ కాల్ వచ్చింది........ఎలాగు వెళ్తున్నాను కదా అని కట్ చేశా......కొంచెంసేపటికి వెళ్లి తన ముందు నించున్నాను.......
"ఓహో.......నువ్వు కూడా black .. మాచింగ్ మాచింగ్.."అని నా చెయ్యి గిల్లాడు తను .....
"ఓఉఛ్.......నీ birthday కాబట్టి బతికి పోయావు లేదంటే ఈ పాటికి చెయ్యి ఎర్రబడే ల గిల్లెదాన్ని"అన్నాను నేను......
"నాకు తెల్సు నువ్వు అంత పని చేయగలావ్.. రాకాసి పిల్లవి" అన్నాడు తను.....
"గుడ్.....ఆ మాత్రం భయముండాలి లే ఇంక పద " అని ముందుకు నడుస్తున్న.......
"ఏది ఒక నిముషం ఆగు,చూడని నన్ను" అన్నాడు తను నా చెయ్యి పట్టుకుని ఆపుతూ.......
"ఏంటి" అన్నాను నేను.......
"ఈరోజు బాగున్నావ్?నీ పేస్ లో ఏదో difference.. అందంగా ఉంది నీ మొహం ఈరోజు " అన్నాడు తను.......
"ఓహో....అదా కాటుక పెట్టుకున్నాను,usually నాకు నచ్చదు కానీ కళ్ళు strained గా ఉన్నాయి,సో పెట్టుకున్నాను" అని చెప్పాను.......
"రోజు పెట్టుకో...... ఆడపిల్ల లా ఉన్నావ్ ఇవాళ " అన్నాడు తను......
"ఓయ్.....!అది commenta?Compliment ఆ? ఆడపిల్లల ఉన్నాను అంటే ఏంటి అర్ధం? రోజు ఉండట్లేద?"అని రెండు చేతులు నడుము పయ్ వేస్కుని కొంచం కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ రెట్టించి అడిగాను.
"మొహంలో చిన్న చుక్క లాంటి బొట్టు తప్ప ఎప్పుడు ఏం cosmetics వాడ్తావని నాకు అనిపించదు..........మెరిసే చిన్న ముక్కుపుడక.. కలిసి కలవనట్టుగా ఉండే కనుబొమ్మలు .. మాత్రమె నీ మొహంలో అసలయిన అట్రాక్షన్,కాని ఇవాళ నీ కళ్ళు చాల అందంగా ఉన్నాయి.. అర్ధమయింద?" అన్నాడు తను.
"ఓహో......Complimente ఇచవు అయితే ....పర్లేదు..థాంక్యు .."అని నవ్వుతు సమాధానం ఇచ్చాను.........

ఇద్దరం బైటకి వచ్చాం.......

"ఎక్కడికేల్తున్నాం?"అని అడిగాను నేను.....
"వెళ్తున్నాం గా....వెయిట్ చేయి"అన్నాడు తను.......
"సరే లే " అని మూతి తిప్పుకున్నాను నేను.........కొంచెం సేపటికి ఒక ఆటో మాట్లాడి తెచ్చాడు తను.....ఇద్దరం ఎక్కి కూర్చున్నాం.."
నువ్వు తీస్కేల్లె చోటికి వెళ్ళే ముందు నాతోపాటు నువ్వు గుడికి రావాలి" అన్నాను నేను.
"శిశిర......నీకు తెల్సుగా.."అని తను ఏదో చెప్పేలోపే ...
"హా......నాకు తెలుసు....నువ్వు దేవుడిని నమ్మవు..కాని నన్నునమ్ముతవుగా... నువ్వు ఏం చెప్పినా చేస్తా అన్నావు ...సో.....తప్పదు"అని చెప్పాను.....
సరేఅని ఆటో ఆపి,ఒక టెంపుల్ కి వెళ్ళాం........

"ఆటో పంపించేయి,టైం పడ్తుంది మనకి మల్లి అతనికి మన ఆస్తులు ఇవ్వాల్సి వస్తుంది."అన్నాను నవ్వుతు......
తను ఆటో అతనికి డబ్బులిచ్చి పంపేసాడు.......
" గణపతి అంటే నాకు చాలా ఇష్టం......నాకు తెల్సు నువ్వు ఏం చెప్తావో ....సో ఏం చెప్పకు,calm గా ఉండు కాసేపు చాలు"అని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నేనే చెప్పేస.......
తను నవ్వుతు సరే అనట్టు తల ఊపాడు.....ఇద్దరం వెళ్ళాం,గుడిలో మా ఇద్దరి పేర్ల మెడ అర్చన చేయించుకున్నాం......
నేను చెప్పినట్టు ఆర్యన్ బుద్ధిగా దండం పెట్టుకున్నాడు,సిందూరం పెట్టుకున్నాడు.. వచ్చి నా పక్కన కుర్చుని ప్రసాదం కూడా తిన్నాడు.....
"స్వామి......ఆర్యన్ లైఫ్ లో కోరుకున్నవన్నీ ఇచేయండి....మీరు లేరనుకున్తున్నాడు.....వున్నాను అని తెలిసేలా చెయ్యండి.....హ .. వాళ్ళ డాడీ తనని చూసి proud గా ఫీల్ అయ్యేలా చెయ్యండి....తను చిన్నప్డు మిస్ అయిన వళ్ళ నాన్న ప్రేమను ఇక పయ్ తనకు వచ్చేల్ల చూడండి ..ఇంకా తను నవ్వుతుంటే బాగుంటాడు స్వామి.......సో ఎప్పుడు హ్యాపీగా ఉండేలా .....తన పెదాల పయ్ చిరునవ్వు చెరిగిపోకుండా చెయ్యండి " అని ఆ గణేసుని కి కళ్ళు ముస్కుని అన్ని చెప్పేస్కున్నాను.
కళ్ళు తెరవగానే పువ్వు పడింది.......స్వామి సరే అన్నట్టు అనిపించింది నాకు.......
"శిశిర..మరీ నీ లిస్టు అంతా చెప్పకు పాపం ఆయన "అన్నాడు తను.......
"నేను నా గురించి ఏం కోరుకోను.. నాకేం కావాలో ఆయనకే తెలుసు.. " అని చెప్పాను నవ్వుతు.......
"అడగనిదే అమ్మ కూడా పెట్టదు అంటారు ఇంక ఇయనెమ్ ఇస్తారు?" అన్నాడు తను.....
"ఆర్యన్.. ఇవాళ నో డిబేట్ .. Just do as I say" అని ఇంకో కొబ్బరి ముక్క చేతికిచాను తనకి......
Like Reply
#17
తను సైలెంట్గా కాలేజ్ పిల్లాడిలా నోటి మీద వేలు వేసుకుని కొబ్బరి ముక్క నముల్తున్నాడు..............
నేను తన బుగ్గలు లాగి "గుడ్ బాయ్"అన్నాను..............
అక్కడనుంచి బైటకి వచ్చాం.......ఒక స్వీట్ షాప్ కి తీసుకెళ్ళాడు......అక్కడ choclates ,biscuts ,చిన్న cake pieces తీసుకుంటున్నాడు.....
"ఇంటి బాబు ఎవరికీ...ఇన్ని తీస్కున్తున్నావ్...చిన్న పిల్ల లా ఉన్నా అని నాకు వీటి తోనే పార్టీ సరిపెట్టేస్తవ ...నాకు ఇవి వద్దు "అన్నాను నేను ....
"లేదు ఇవి నీకు కాదు" అన్నాడు
"ఔనా మరెవరికి ఇన్ని తీస్కున్తున్నావ్ " అన్నాను...
"చెప్తాను పద..."అంటూ బయటకి నడిచాడు...నేను ఇంకా అల తనని ఫాలో అయ్యాను.....
కొంచెంసేపటికి ఇద్దరం ఒక బిల్డింగ్ దగ్గరికి వచ్చాం.......
""Kaartikeyan orphanage for deaf and dumb " అని బోర్డు చదివాను........
వచ్చే దారిలో ఆర్యన్ కొన్న biscuits,chocolates n fruits ఎందుకో నాకు అప్పుడు అర్ధమయింది........
"నాకు నా birthday రోజు happiness ఇచ్చేది ఈ పని ఒక్కటే"అన్నాడు తను గేటు తీసి లోపలి వెళ్తూ........
తనతోపాటు లోపలకి వెళ్ళాను..చాలమంది చిన్న పిల్లలున్నారు అక్కడ......ఇద్దరం తెచినవన్ని పంచాం వాళ్ళకి......తర్వాత వాళ్ళ తో అలా అక్కడ కాసేపు ఆడుతున్నాం.....ఇంతలో ఒక చిన్ని పాపా,చిన్ని గ్రీన్ coloured frock వేస్కుని ఉంది ...తను భలే క్యూట్ గా చాలా ముద్దోచ్చేల లా ఉంది......
తనని ఎత్తుకున్నా.......తనని నీ పేరేంటి అని అడిగాను......తను అలా చూస్తుంది కాని ఏమి మాటాడదు....
తను మాట్లాడలేదు,కానీ విన గలదు...తన పేరు అబిలాష అన్నారు అక్కడున్న మేడం......
ఇంత బాగుంది పాప.....తన కి మాటలు రావు అనేసరికి నాకు ఎంతో బాధ వేసింది...నాకు తెలీకుండానే పాప ని గట్టిగా హత్తుకున్నా.......
తనని "నీకు నచ్చాయ... ఈ biscuits n chocolates ? "అని అడిగాను.. తనకి నేను చెప్పింది అర్ధంకాలేదు అనుకుంటా ఆ మేడం వైపు చూస్తుంది ....నేను అన్నది తమిళ్ లో translate చేసి చెప్పారు....
అప్పుడు తను రెండు బుల్లి చేతులు చాపి నచ్చాయి అన్నట్టు తన చిన్ని తలను ఊపుతూ చెప్పింది......తర్వాత తను నాకు ఒక ముద్దు పెట్టింది...... నాకు తన చిన్ని పెదాలు నా బుగ్గని తాకగానే కళ్ళలో నుంచి నీళ్ళు కరిపోయాయి........
"థాంక్స్ అని చెప్తోంది" అన్నాడు ఆర్యన్ నా భుజం మీద చేయి వేసి.......వెంటనే తనని గట్టిగ పట్టేస్కున్నాను......
రెండు నిముషాలు నా చుట్టూ ఏం జరుగుతోందో అర్ధం కాలేదు నాకు.........
"శిశిర....చూడు.. "అన్నాడు తను.......
వెంటనే తన్ని వదిలేసి కళ్ళు తుడుచుకుని " థాంక్యు ఆర్యన్ " అన్నాను నేను.........
ఆ పాపకి నేను ఒక ముద్దు పెట్టాను.. ఇంకో chocolate ఇచ్చాను తనని కిందకి దిమ్పుతూ.....
నాకు మా అమ్మ...నాన్న చిన్నపాటి నుంచి చాల సార్లు నన్ను ప్రేమ గా ముద్దు పెట్టారు....కాని ఈ పసి పాపా ముద్దు నా మదిలో ఏదో చెరిగిపోని గుర్తుని.....మనసులో తెలియని ఆనందాన్ని కలిగించింది ..........
కొంచెంసేపు వాళ్లతో గడిపాము మేము.తర్వాత బయట ఉన్న వరండా లో కూర్చున్నాం ఇద్దరం..... ఆ పిల్లలు ఎదురుగ ఉన్న గ్రౌండ్లో ఆడుకుంటున్నారు.......
"థాంక్ యు శిశిర" అన్నాడు తను......
నేను ఏం మాట్లాడలేదు.....ఎప్పుడు కట్టుబడని నా నోరు లైఫ్ లో మొదటిసారి మూగబోయింది......ఏం చెప్పిన వ్యక్తపరచలేనిది మౌనం తెలియజేస్తుంది అనే మాటకి అప్పుడే నాకు అర్ధంతెలిసింది........
"శిశిర.. " అని కదిపాడు తను నన్ను......
"థాంక్యు అని నేను చెప్పాలి నీకు..... తెలుసా ఆ పాపా నాకు ముద్దుపెట్టినప్పుడు ఏదో తెలియని భావం....పైకి చెప్పలేని ఇక ఆనందం....డివైన్ ఫీలింగ్ అంటారే.....అది ఇదేనేమో అనిపించింది నాకు.......ఎంతమంది ఉన్నారో కదా ఇలా,మనం చూపించే ఈ కొంచెం ప్రేమ కోసం తపించేవాళ్ళు....." అన్నాను నేను......
"హ్మ్మ్......నువ్వు అడిగావే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతావు అని.. వీళ్ళని కలిసినప్పుడు,కొంచెం సమయం గడిపినప్పుడు నవ్వుతాను హ్యాపీగా...చిన్నపుడు మా నాన్న ప్రేమ కోసం ఎంతో తపించేవాడిని......కానీ నాకు అది అందని ద్రాక్ష లానే ఉండిపోయింది...చాల బాధపదేవాడిని...కాని ఏం చేయలేను...నా లానే ఇలా చాలమంది ఉన్నారు....వాళ్ళని కలిసి నా బాధ లో కొంత తీర్చుకునేవాడిని...నా ప్రేమని వాళ్లకి పంచి నా ఆనందాన్ని వాళ్ళ నవ్వులలో వెతుకునేవాడిని ..అందుకే ప్రతి బర్త్ డే కి ఇలాంటి చోటుకి వెళ్తా..... ఇంకా నాకు వీలు కుదిరినప్డు వీళ్ళతో గడుపుతా...... "అన్నాడు తను.....

అప్పుడు ఆర్యన్ కళ్ళలో నాకు మెరుపులు కనిపించాయి......తన పెదాలలో పరిపూర్ణమైన నవ్వు కనిపించింది......చుట్టూ ఉన్న ప్రపంచం అంతా blured gaa అనిపించింది నాకు కేవలం తన నవ్వుతున్న మొహమే కనిపించింది.....
"శిశిర నాకు ఈ కల్మషం లేని నిర్మలమైన మనసు ఉన్న వీళ్ళతో ఉన్దేప్డు కలిగిన ఆనందం ...అనుభూతి మల్ల నీతో ఉన్నప్డు నాకు అనిపించాయి..."అని అక్కడనుంచి లేచి బైటకి నడుస్తున్నాడు .......నేను అల తననే చూస్తూ ఉన్న...తను వెనక్కి తిరిగి రమ్మన్నట్టు ...సైగ చేసాడు....అల సైలెంట్ గా తనని ఫాలో అవ్తూ...వేళ్ళ.....తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ......బరువైన హృదయం తో .....తెఇల్యని ఫీలింగ్ తో ....నా లైఫ్ లో నేను ఎప్పుడు పొందని ఆననడం తో ఆ గేటు దాటి బయటకు వచ్చాను ఆర్యన్ తో.........
Like Reply
#18
ఆంధ్రా భోజనం తిందాం అన్నాడు తను........సరే అని వెతికి ఒక రెస్టారంట్ కి వెళ్ళాం..........
అంతా మనవాళ్ళే ఉన్నారు అక్కడ......
పచ్చని పైర్లు........ ఏటిగట్టు దగ్గర కుండలతో నీళ్ళు మోస్కేల్తున్న అమ్మాయిలు.........
కట్టెలపొయ్యి దగ్గర వంట చేస్తున్న ముసలి అవ్వ.....ఇలా తెలుగుతనం ఉట్టిపడుతున్న పెయింటింగ్స్ తో నిండిన గోడలతో చాలా లైవ్లీగా ఉంది ఆ చోటు........
పంచ కండువా వెస్కున్నవెయిటర్ ఆర్డర్ తీస్కోడానికి వచ్చాడు........
ఆంధ్రా మీల్స్ రెండు చెప్పాం.......
"మావూరు ఇలాగే ఉంటుంది.....ఇంకా చాల బాగుంటుంది" అన్నాడు ఆర్యన్ అక్కడున్న పెయింటింగ్స్ చూస్తూ ........
"నాకు పల్లెటూర్ల తో పెద్దగా పరిచయం లేదు......నేను పుట్టేప్పటికే మా వాళ్ళు సిటీలో సెటిల్ అయిపోయారు" అని చెప్పాను తనకి....
"అవునా.. అయితే నువ్వు ఒకసారి మా వూరు వద్దువుగాని.....నేను తీస్కేలత..ఒక్కసారి చుసావంటే ఇంకా తిరిగి ఎక్కడికి పోను అంటావ్" అన్నాడు తను......
నేను నవ్వాను.......
తర్వాత వచ్చిన అచ్చమయిన ఆంధ్రాభోజనం చేసేసి బైల్దరుతున్నాం
"కిల్లీ తినవా?"అడిగాడు తను...
"ఉహూ.....నాకు అలవాటు లేదు......"అన్నాను నేను.......
"పెళ్లిలో కూడా ఎప్పుడు తినలేదా నువ్వు ?"అడిగాడు తను.......
"లేదు.....కొంచం awkward గా ఉండదు పాన్ తింటుంటే" అన్నాను నేను.
"హ హ హ హ హా..పాన్ కాదు కిల్లీ అను......చిన్నప్పుడు దొంగ చాటుగా పెళ్ళిలలో కిల్లీలు దొంగలించి తినేసే వాడిని.......అమ్మకి దొరికితే తంతుంది అని జాగ్రత్త పడే వాడిని....."అన్నాడుతను.
"ఓహో....నువ్వు గుడ్ బాయ్ అనుకున్నా..తమరు ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు చేసేవదివన్న మాట"అన్నాను నేను....తను దానికి తల మీద చెయ్యి వేసి జుట్టు నిమిరుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉన్నాడు.......
నాకు అంతగా ఏం తెలీవులే" అన్నాను నేను.
"ఇప్పుడు తిను.....నీక్కూడా నచ్చుతుంది." అంటూ ఒక కిల్లీ చేతికిచ్చాడు నాకు.......నేను సందేహిస్తూనే నోట్లో పెట్టుకుని నముల్తున్నాను..........
"బాగుంది.....తీయగా ఉంది.. జూసీ కూడా" అన్నాను నేను.
"చెప్పాను గా.. "అన్నాడు తను.
"నీ నోరు ఎంత ఎర్రగా పండితే నీ వైఫ్ కి నువ్వంటే అంత ప్రేమ ఉన్నట్టు"అన్నాను నేను.
"కిల్లీ తినవ్ కాని ఇలాంటివి మాత్రం బా తెలుస్తాయిగా"అన్నాడు తను నవ్వుతూ.....నేను నవ్వేసా..........
అక్కడనుంచి బయటకి వచ్చాం..
"So, what next ?"అడిగాడు తను..
"Movie .. ఎలాగు matniee movie టైం అవ్తోంది..వెళ్దాం.."అన్నాను.
"Book my show లో చెక్ చేస్కున్నాం..
హమారీ అధూరి కహాని కి వెళ్దాం.. Please .. Please .. Please.. "అన్నాను నేను.......
తను ABCD2 కి వెళ్దాం అన్నాడు.....
కానీ నేను కళ్ళు చిన్నవి చేసి తనని క్యూట్ గా please please అని request చేసేప్పటికి నా మాటే నెగ్గించాడు......సో ఇద్దరం వెళ్లి మూవీ లో కూర్చున్నాం.....
నేను టైటిల్స్ దగ్గర్నుంచి రెప్ప వెయ్యకుండా చూస్తున్నాను......తను మాత్రం నన్నొకసారి స్క్రీన్ని ఒకసారి చూస్తున్నాడు........
"ఫ్చ్ఛ్హ్..!!ఓయ్ ఏంటిఅలా చూస్తున్నావ్.....మూవీ చూడు ఆర్యన్.."అన్నాను నేను తన భుజం మీద చిన్నగా కొట్టి........
"ఎంత స్లో గా ఉందో ఈ మూవీ....అసలు..ఎలా చూస్తున్నావా అంత interesting గా అని చూస్తున్నాను"అన్నాడు తను.....
"ఫీల్ తో కనెక్ట్ అవ్వరా బాబు.. అప్పుడు నచ్చుతుంది నీకు"అన్నాను నేను.......
"రా నా ?!గాస్ప్ ఎమోషన్ నన్నురా అన్నావ" అన్నాడు తను.....
"ఓహో..సారీ ఏదో ఫ్లో లో వచ్చేసింది......ఏమనుకోకు.."అన్నాను నేను.
"సరేలే అనేసవ్గా ఇంకేం చేస్తాం"అన్నాడు తను....
"నేను కాం గా ఉండు.. చూడనీ నన్ను"అన్నాను......
ఇలా నాకు entertaining గా...పాపం ఆర్యన్ కు బోరింగ్ గా మూవీ ఎండ్ అయ్యింది..........
మూవీ నుంచి బయటకు వచ్చేసాం.....
"హ్మ్మ్మ్ ఇప్పుడు ఏంటి ప్లాన్" అన్నాను నేను
"ఈసారి బీచ్.....నా ఛాన్స్..మూవీ నీకు నచ్చింది చూసాం కాబట్టి."అన్నాడు ఆర్యన్.....నేను ఒకే అన్నట్టుగా స్మైల్ ఇచ్చాను......
ఇద్దరం బీచ్ కి వెళ్ళాం.....సైలెంట్ గా లేదు..చాల సందడిగా ఉంది....కొంచెంసేపు బీచ్ లో అలా తిరిగాం......తర్వాత నేను వెళ్లి అలలలో తడిసి ఆడుకున్నాను.....తను ఎక్కువ దూరం వెళ్ళకు,ఇక్కడే ఎంజాయ్ చెయ్యి అంటూ వడ్డున నించుని నన్ను గమనిస్తున్నాడు......ఒక్కదాన్నే ఎంతసేపు ఆడుకుంటాను......ఇంకా ఇలా కాదులే అని ఆర్యన్ దగ్గరకి వెళ్లి తన చెయ్యి పట్టుకుని లాక్కొచ్చాను....తను వద్దు వద్దు అంటూనే నీళ్ళలోకి వచ్చాడు...ఒకరి మీద ఒకరం నీళ్ళు చిమ్ముకున్తూ చాలాసేపు గడిపేసాం.......తర్వాత పీచు మిఠాయి కొనుకున్నం.....ఇంకా బుడగల పైప్ కూడా కొనుకున్నాను....పెద్ద పెద్ద బుడగలు ఊది అవి ఎంత దూరం వేల్తాయో అని చూస్తున్నాను నేను,ఒడ్డు మీద తను సీ షెల్ల్స్ తో చేసిన ఐటమ్స్ చూస్తున్నాడు పక్కనే ఉన్న షాప్ లో........
తర్వాత నేను కూడా వెళ్లి షాపింగ్ లో జాయిన్ అయ్యాను.....తను చూడకుండా ఒక సాండ్ టైమర్ అండ్ గ్లాస్ మీద శిశిర,ఆర్యన్ అని చెరోవైపు చెక్కించిన కీ చైన్ తీస్కున్నాను.........
ఇంకా చీకటిపడుతోంది కాబట్టి బైల్దేరి మా కాంపస్ కి మేము వేల్లిపోయం...

ఎవరి హాస్టల్ వాళ్ళు బయలుదేరాం....నేను నా హాస్టల్ కి వెళ్తూ...
"ఆర్యన్ ఫ్రెష్ అయ్యాక మన రెగ్యులర్ ప్లేస్ కి వచ్చేయ్"...అన్నాను....తను సరే అని చెప్పి.....వెళ్ళిపోయాడు
కాసేపట్లో ఫ్రెష్ అప్ అయి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను.........ఆర్యన్ వచ్చాడు........
"This is for you" అని చిన్న గిఫ్ట్ ప్యాక్ తన చేతిలో పెట్టాను.
"ఏంటిది ? " అని అడిగాడు తను.
"A happy birthday gift,నా నుంచి..ఓపెన్ చేసి చూడు"అన్నాను నేను......
తను ఓపెన్ చేసాడు.........
సాండ్ టైమర్ అండ్ దానికి నేను రాసి పెట్టిన స్టిక్కీ నోట్ తీసి చదివాడు..
## ఈ నిమిషం నుంచి నీ లైఫ్ లో అంతా happyness నే ఉండాలి.. సో,యువర్ happiness starts from now .. !! ##
నెక్స్ట్ గిఫ్ట్ కీ చైన్ ..దానికి పెట్టిన స్టిక్కీ నోట్లో
## ఇక్కడ నుంచి నీ ప్రయాణం లో అంతా సక్సెస్ నే ఉండాలి,సో నీ కీ అఫ్ సక్సెస్ నీ దగ్గరకి చేరాలి అందులో నేను కూడా నీతో ఉండాలి కాబట్టి మనిద్దరి పేర్లున్న కీ చైన్ ## అని రాసిపెట్టాను.
లాస్ట్ గా ఒక రోజ్ అండ్ లెటర్ ..
## లెటర్ ##
నాకు నీలా కవితలు రాయడం.....పెద్ద పెద్ద మాటలు చెప్పడం తెలీదు..నాకు మా అమ్మ నాన్న తర్వాత ఇంకెవరు నీఅంత గా నచ్చలేదు ఇప్పటిదాకా.ఒక్కసారి కూడా నన్ను నీకు నచినట్టుగా ఉండమని నువ్వు అడగలేదు......నేను చాల తెల్సుకున్నాను నీనుంచి....జీవితానికి అర్ధం మనం ఎదుటివాళ్ళకి పంచె ప్రేమ లో ఉంటుందని తెల్సుకున్నాను.....నా లైఫ్ లాంగ్ నీతో కలిసుండాలి అనేది పెద్ద డెసిషన్ అయినా కాని నీతో ప్రతి అడుగు వేసే అవకాసం నాకు ఇస్తే,అంతకన్నా నేను కోరుకునేది ఏమి ఉండదు.నీ birthday కి నా మనసు నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను ఆర్యన్........
నీ శిశిర......
తను చదివాడు,ఏం మాట్లాడలేదు..మౌనం గా ఉన్నాడు........

"ఏం మాట్లాడవా ?"అని అడిగాను నేను.
"నీకోసం కాఫీ తెచ్చాను,చల్లారిపోతుంది,తాగు.. "అన్నాడు తను,గిఫ్త్స్ అన్ని కవర్ లో సద్దుకుంటూ.
"నేను అడిగినదానికి సమాధానం చెప్పు ముందు"అన్నాను నేను.
"టైర్డ్ గా ఉంది శిశిర,వెళ్తాను.....రేపు మాట్లాడుకుందాం"అంటూ లేచి కొంత దూరం నడిచాడు.
"డిన్నర్ చేసి వెళ్ళు.."అని వెనక్కి తిరిగి చెప్పాడు.
"కడుపు నిండిపోయింది" అనేసి పరిగెత్తుకుంటూ నా హాస్టల్ కి వెళ్ళిపోయాను....తను ఆగమని అనలేదు....ఆగమంటాడు ఏమో అని ఆశ పడ్డాను .... నాకు..కళ్ళనిండా నీళ్ళు..ఆగట్లేదు..రూంలో కి వెళ్ళిపోయాను......తలుపెస్కుని అక్కడే కుర్చుని ఏడుస్తున్నాను.......
తను నో అనలేదు....అలా అని ఎస్ అని కూడా అనలేదు.. మరెందుకు ఏడుస్తున్నాను.....ఏంటి ఈ ఫీలింగ్ అసలు.........తన మీద కోపమా.....నా మీద నాకు జాల......మాముల్గా మేము మల్లి ఉండలేమనే బాధ.. అసలేన్టిది ?! .. ఒక్క నిమిషంలో అంతా మారిపోయింది.......
ఇంతలో నా ఫోన్ మోగింది........నేను లిఫ్ట్ చెయ్యలేదు..అది మోగుతూనే ఉంది......అప్పుడు నేను వెళ్లిపోతుంటే ఆపలేదు కాని,ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు ఆర్యన్ అనుకున్నాను.......మల్లి మల్లి సెల్ మోగుతూనే ఉంది.వెళ్లి బాగ్లో నుంచి సెల్ తీశాను....అప్పా కాలింగ్ అని వచ్చింది......ఇంత సేపు కాల్ చేస్తుంది అప్పా naa,ఆర్యన్ అనుకుంటున్నానే అనుకుంటూ,కళ్ళు తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేసాను.
"శిశిర తల్లి నువ్వు బానే ఉన్నావా?ఎంత సేపట్నుంచి కాల్ చేస్తున్నాను రా నీకు నేను.....ఎందుకు కాల్ లిఫ్ట్ చెయ్యలేదు?"అని కంగారుగా మాట్లాడుతున్నఅప్పా గొంతు విన్నాను.
"అబ్బీ.....ఏంలేదు అప్పా..!! I am fine "అన్నాను నేను,నా ఏడుపు వినపడకుండా జాగ్రత్త పడుతూ.
"ఓహో..నువ్వు నా కాల్ లిఫ్ట్ చెయ్యలేదు,ఇప్పుడేమో బానే ఉన్నాను అంటున్నావు,నువ్వు నా కూతురివి raa,నువ్వు దాచాలనుకున్న నా దగ్గర ఏం దాచాలేవు,కళ్ళు తుడుచుకుని ఏమయ్యిందో చెప్పు "అన్నారు ఆయన.......
నేను ఎక్కడున్నా,నా గొంతు విని నా మూడ్నీ చెప్పెయ్యగలరు ఆయన.అప్పటిదాకా చాల కష్టం మీద కంట్రోల్ చేస్కున్న,కన్నీళ్లు ఒక్కసారి గట్టు తెగిన గోదారి లా బైటకి వచేసాయి.......
"అప్పా,నాకేం అర్ధం కావట్లేదు........నేను చేసింది కరెక్ట్నో కాదో కూడా తెలీటంలేదు.. అసలు నా లైఫ్ లో నేనే ప్రాబ్లం కొని తెచుకున్నాను.."అని వెక్కుతూ చెప్పాను...
"ష్హ్ ..ష్హ్ .. అన్ని మాట్లాడుకుందాం రా,ముందు ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగు."అన్నారు ఆయన.
"హ్మ్మ్.. సరే,ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి "అనేసి,వెళ్లి నీళ్ళు తాగి,
"హ్మ్మ్.. తాగేశాను,అప్పా నేను మీ దగ్గరికి వచేస్తాను,నాకు బాధ గా ఉంది "అన్నాను.
"వాటర్ తాగావ,that's like my Darling శిశిర,స్క్యపే కాల్ కి రా ఇప్పుడు,మాట్లాడుకుందాం " అనేసి కాల్ కట్ చేసేసారు ఆయన.....
వెంటనే లాప్పి ఆన్ చేసి,స్క్యపే కి కనెక్ట్ చేశా,అప్పా నుంచి స్కయ్పే కాల్ వచ్చింది.ఆయన స్క్రీన్ మీద కనిపించగానే,నా ఏడుపు మరింత ఎక్కువయ్యింది...
"అరె,రాంగ్ కాల్ కనెక్ట్ అయిందనుకుంటా,సారీ నేను నా బంగారి పాప శిశిర కి కాల్ చేద్దాం అనుకున్నాను "అన్నారు ఆయన.
"అప్పా..నేనే శిశిరనీ.. "అని అన్నాను చిరాకుగా....
"శిశిర..!!నువ్వా?! ఛీ....ఛీ.. అలా ఏడుస్తుంటే ఎవరో అనుకున్నా,నా బంగారం ఎప్పుడు నవ్వుతు ఉంటుంది మరి.."అన్నారు ఆయన......
ఆయన మాటకి,చిన్న చిరు నవ్వు మెరిసింది నా మొహం లో......
"హ్మ్మ్.....ఇప్పుడు బాగున్నావ్ ,కళ్ళు తుడుచుకో.."అన్నారు అప్పా.
"హ్మ్మ్.."అని ఊ కొడుతూ,కళ్ళు తుడుచుకున్నాను.
"చెప్పరా,ఏమయ్యింది ?ఆర్యన్ తో గొడవ పడ్డావ? "అడిగారు ఆయన.......
నేను ఆ రోజు,జరిగినది అంతా చెప్పాను.ఆయన కాలం గా నేను చెప్పేదంతా విన్నారు........
"హ్మ్మ్.. సో నువ్వు తనతో లైఫ్ లాంగ్ కలిసుండే ఛాన్స్ ఇవ్వమని అడిగావ్"అన్నారు ఆయన.
"హ్మ్మ్......"అని తల దించుకుంటు చెప్పాను.
"తను,నో అనలేదు కదా రా "అన్నారు ఆయన....
"ఎస్,కూడా చెప్పలేదుగా...... అసలేమనుకుంటూన్నాడో నా గురించి,ఒక వేళ తనకి నేను నచ్చకపోతే,మేము ఇంతకూ ముందులా ఫ్రెండ్స్ లా కూడా ఉండలేము కదా "అని బిక్కమొహం వేసి చెప్పాను."
"నువ్వు నచ్చని వాళ్ళంటూ ఉంటారా అసలు చెప్పు.. "అన్నారు ఆయన.
"మరి ఎందుకు వెంటనే ఎస్ చెప్పలేదు"అడిగాను నేను....
"శిశిర,నువ్వు నీ పాయింట్ అఫ్ వ్యూ లో నే ఆలోచించి బాధ పడుతున్నావు......ఒకసారి తన సైడ్ నుంచి ఆలోచించి చూడు "అన్నారు ఆయన.
"ఏం ఆలోచించాలి అప్పా,నేనేమి తన attention కావాలి అనుకోట్లేదు,నేను తనకి సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను."అన్నాను నేను.
"నువ్వు తన గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనకి లైఫ్ లో గోల్స్ ఉన్నాయి రా,తను achieve చేయాల్సింది చాల ఉంది.....మోర్ ఓవర్ లైఫ్ డెసిషన్ తీస్కునేంత స్టేజి కి మీరు ఇంకా రాలేదు...... నువ్వు తన కి లైఫ్ లో సపోర్ట్ అవ్వాలి అనుకోడం లో తప్పు లేదు,కానీ ఇప్పుడు నిన్ను accept చేస్తే అది తనకి deviation అవ్తుంది కాని సపోర్ట్ కాదు అనుకుంటూ ఉంటాడు తను"అని అన్నారు ఆయన.......
నేను ఏం మాట్లాడలేదు.."నేను ఎప్పటిలాగే childish గా behave చేసాను కదా అప్పా ."అన్నాను నేను.
"లేదు రా,ఈసారి నీ behaviour childish కాదు..నువ్వు చాల ఆలోచించే డిసైడ్ చేస్కుని ఉంటావు gaa "అన్నారు ఆయన.
"ఇప్పుడు నేనేం చెయ్యను ? మల్లి ఆర్యన్ నీ ఎలా పేస్ చెయ్యను ? "అడిగాను నేను .
"నీ intention తప్పుకాదు రా,ఒకటి చూడు నీ గిఫ్త్స్ తను తీస్కున్నాడు.....రిటర్న్ చెయ్యలేదు......నువ్వు ఎంత ఆలోచించి ఈ డెసిషన్ తీస్కున్నావ్......తనని ఆలోచించటానికి టైం ఇవ్వు.....రేపు మార్నింగ్ తనని కలిసి చెప్పు,నాకు నీ కమిట్మెంట్ కానీ attention కాని ఇవ్వల్సినావసరం లేదు,I want to be your support till you reach all your goals అని "అన్నారు ఆయన.
"అలా చెప్తే వింటాడ?ముందు లా నాతో ఫ్రెండ్లీ గా ఉంటాడ?"అడిగాను నేను.
"నువ్వు చెప్పేది నిజం అయితే నీ కళ్ళలో ఆ నిజాయితీ కనిపిస్తుంది రా,తప్పకుండా నిన్ను అర్ధం చేస్కుంటాడు తను "అన్నారు అప్పా.
"నాకు మూవీ లో చూపించే ప్రేమ గురించేమి తెలీదు అప్పా,నాకు తెలసినది మీరు పంచే ప్రేమ,అది తను మిస్ అవ్తున్నాడు,అది నేను తనకి పంచాలి అనుకుంటున్నాను అంతే "అన్నాను నేను.....
"నాకు తెల్సుర,నువ్వు నాకు సంజాయిషీ లు చెప్పాల్సిన అవసరం ఎప్పటికి రాదు"అన్నారు ఆయన."అప్పా , you trust me so much kada .."అన్నాను నేను...
."శిశిర తల్లి, నువ్వు నా కూతురివి రా,నిన్ను నమ్మకపోతే నన్ను నేను నమ్మనట్టే "అన్నారు ఆయన.
"appa I am the luckiest daughter in the universe and I love you so much ....."ani స్క్రీన్ పి కనిపిస్తున్న తన పేస్ పయ్ కిస్ చేసాను,బ్రైట్ గా నవ్వుతు.
"నువ్వు ఇలా నవ్వుతు ఉంటె చాలు నాకు,ఈ వరల్డ్ అంతటి నీ గెలిచేసినట్టు ఉంటుంది..నువ్వు ఇంకెప్పుడు డల్ గా ఉండొద్దు,అంతే కాదు ఇలా ఏడిచేటట్టు అయితే కాటుక అస్సలు పెట్టుకోద్దు,అడ్డం లో చూస్కో ఒకసారి ఎలా ఉన్నవో....చంద్రముఖి లా "అన్నారు ఆయన నవ్వుతు......
నేను కూడా ఫక్కుమని నవ్వేస ఆయన మాటలకి.
"శిశిర,anything to share, I am just one call away "అన్నారు ఆయన నవ్వుతు.
"I know Appa .. "అన్నాను నేను .Good night చెప్పి లాప్పి ఆఫ్ చేశాను.
అప్పా తో మాట్లాడక నిజంగా లైఫ్ లో పేరెంట్స్ సపోర్ట్ ప్రతి అడుగు లోను మనకి ఎంత అవసరమో నాకు అర్ధమయ్యింది,నేను చిన్న గా upset అయితే నే నిద్రమానుకుని నన్ను నార్మల్ స్టేజి కి తీస్కు రావడానికి ప్రయత్నించే అప్పా నాకున్నారు,కానీ ఆర్యన్ ఎన్ని సార్లు వాళ్ళ నాన్న సలహాలు కోరుకుని ఉంటాడో కదా అనిపించింది నాకు.అప్పా ఇచ్చిన థెరపీ తర్వాత నేను నార్మల్ స్టేజి కి వచ్చాను.... నెక్స్ట్ డే ఆర్యన్ నీ కలవాలి అనుకుంటూ నిద్రపోయాను.....
నెక్స్ట్ డే ఎర్లీ గా లేచాను,అలారం కాదు అప్పా కాల్ చేసారు.."వెళ్లి ఆర్యన్ నీ కలవాలి కదా ఆల్ ది బెస్ట్ " అని చెప్పారు.
నేను నవ్వుతు "మీరే నా లక్కీ చార్మ్ అప్పా,థాంక్స్ అండ్ లవ్ యు" అని చెప్పి కాల్ పెట్టేసి,రెడీ అయ్యి ఆర్యన్ వాళ్ళ హాస్టల్ కి బయలుదేరాను.
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#19
నేను వెళ్లేసరికి తను వాళ్ళ హాస్టల్ దగ్గరున్న లాన్ లో కుర్చుని బొమ్మ గీస్తున్నాడు,నేను వెళ్లి తన పక్కన కూర్చున్నాను....తను నన్ను చూసి నవ్వాడు.....
"Good morning "అని విష్ చేసాడు .....
"Good morning Aaryan "అన్నాను నేను.ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు... సైలెంట్ గా తను వేసే బొమ్మ నీ చూస్తున్నాను.
"ఏంటి,ఇవాళ సైలెంట్ గా ఉంది శిశిర? "అన్నాడు తను నా వైపు చూస్తూ .
"ఆర్యన్ నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు "అన్నాను నేను తల దించుకుంటు.....
"శిశిర,నిన్న జరిగినదాని గురించా ? నువ్వు నా మీద జాలి పడుతున్నావ్ శిశిర,అది ప్రేమ కాదు "అన్నాడు తను.
తను అలా అనేసరికి నాకు కోపం వచ్చింది తనని నా వైపుకి కోపం గా లాగి వాడి collar పట్టుకుని "
"నీకు అలా ఎందుకు అనిపించింది రా అసలు,ప్రేమకి,జాలికి తేడా తెలీదా రా నాకు...నాకు నిన్న పాప మాటాడలేదు అని తెలిసినప్పుడు తన పయ్ నాకు కలిగింది జాలి......తను నాకు ముద్దు పెట్టినప్పుడు వచ్చింది ప్రేమ...నేను తనని ముద్దు పెటింది ప్రేమతో......
నీతో ఉన్నప్డు నన్ను నేను మర్చిపోయేలా చేస్తావు రా నన్ను.....
మా అప్పా తో ఉన్నప్డు ఎంత secure గా ఉంటానో..ఎంత ఆనందం గా ఉంటానో మల్ల నీతోనే అంతా ఆనందం గా ఉంటార్ర....
ఏరా.. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావ్ రా నా మనసులోని ఆ ఫీలింగ్ ను..
నా మది మాటున దాగున్న ప్రేమను చెప్పాగా ముందు నువ్వంటే నాకు కోపం...నువ్వు కన్పిస్తే చిరాకు పడేదాన్ని...
కాని నీతో గడిపాక,నువ్వంటే ఏంటో తెలిసాక...ఒక్క క్షణం నువ్వు కనబడకపోతే
నీ జాడ కోసమే వెతుకుతాయి తెలుసా నా కళ్లు....నిన్ని నా నుంచి దూరం చేసే రాత్రి అంతే కోపం నాకు......
రోజు పడుకునే అప్పుడు నీతో గడిపిన క్షణాలే గుర్తొస్తాయి రా....
మార్నింగ్ నీతో గడిపే క్షణాల కోసమే ఎదురు చూస్తుంటా రా......
కొద్దిసేపు నువు మాట్లాడకపోతే ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని నీ పిలుపు కోసమే ఎదురుచూస్తుంది తెలుసా నా
మనసు.. ఆ సమయాల్లో నా కంట కన్నీరుని నువ్వు ఎప్పుడన్నా గమనించావా.. లేదు కదా.
నీ కోసం నేను పడే ఆరాటం, తపన నీకెప్పుడు అర్థమౌతాయిరా...నీకు తెలుసో లేదో
ఒక్కోసారి నువ్వు ఎదురు పడినప్పుడు ఎప్పడు గల గల మాటాడే నేను నీ పక్క నుండే మౌనంగా తలదించుకుని
ఎందుకు మౌనం గా ఉంటానో తెలుసా ?.ఆ క్షణాన నాకు ఊపిరి ఆడదురా.. నీ నీడలా
నిరంతరం నీ వెంటే తిరుగుతున్నా.. నీ తలపులతోనే పొద్దు గడుపుతున్నా..
నువ్వే శ్వాసగా నీ కోసం నిరీక్షిస్తూ బతుకుతున్నా...ఒరేయ్.. నేన్నిన్ను
బాగానే అర్థం చేసుకుంటున్నా .. కానీ నువ్వే నాలో నీ మీద ఉన్న ప్రేమను
కాస్తైనా గుర్తించావా?.లేదు...ఇంకెప్పుడు గుర్తిస్తావో నాకు
తెలీట్లేదు..అసలు ఈ జన్మకు గుర్తిస్తావా?ఏమో... నా ప్రేమ నీకు
అర్థమవ్వాలంటే నా జీవితకాలం సరిపోతుందో లేదో.. నా ఈ ఫీలింగ్స్ అన్నీ
నీకింకెప్పుడు అర్థమౌతాయో ఏంటో?.నా ప్రేమను ఇంకెలా నీకు తెలిజెప్పేది...ఇంతకన్నా చెప్పటం రాదు రా...నీల కవితలు రాయటం నాకు రాదు...నా మనుసులో ఉన్నది చెప్పటం ఒక్కటే తెలుసు ర .
నాకు తెలీట్లేదురా.. ఆడపిల్లను రా పెదవి విప్పి నీకు ఈ విషయం చెప్పటానికి చాల మదన పడ్డాను రా . ఇంకేం చేయలేనురా నువు
నా ప్రేమను అర్థం చేసుకునే ఆ సమయం కోసం వేయి కళ్లతో వేచి చూడటం తప్ప!!" అని ఏడుస్తూ చెప్పాను,,,తర్వాత అర్ధం అయింది..కోపం లో నేను ఏం చేస్తున్నానో...వాడి collar వదిలి .....
"నిన్న అప్పా తో మాట్లాడి అంతా చెప్పాను,ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను చాల లక్కీ అనిపించింది,నీకు నీ లైఫ్ గోల్ achieve చేయిడం ఎంత important ఓ నాకు అర్ధం అయింది,నేను నీకు సపోర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను ఆర్యన్ అంతే.నాకు నీ కమిట్మెంట్ కానీ attention కానీ అవసరం లేదు "అన్నాను నేను అలా నేల పయ్ మోకాళ్ళ మీద కుర్చుని కంటి నిండా నీళ్ళ తో.
"నాకు తెలుసు శిశిర, అందుకే చెప్తున్నాను.నువ్వు చాల మంచి అమ్మాయివి,you are like a flawless pearl, నాకన్నా బెటర్ పర్సన్ నీకు దొరుకుతాడు "అన్నాడు తను.
"నేను కోరుకునేది నిన్ను ఆర్యన్."అన్నాను నేను.తను గీసిన బొమ్మని నా చేతి లో పెట్టి హాస్టల్ లోపలి వెళ్ళిపోయాడు..ఆ బొమ్మని చూస్తున్నాను.. ఆ కాగితం నా కన్నీటి బొట్లతో తడుస్తోంది .. అలా అక్కడే కూర్చున్నాను
Like Reply
#20
అలా ఏడుస్తూ కూచున్న......తర్వాత నా భుజం మీద ఎవరో చేయి వేసారు......నేను వెనక్కి తిరిగి చూసాను,ఆర్యన్ నించున్నాడు........

"Thank you so much for coming into my life Shishira .. "అంటూ చేతులు చాపి నించున్నాడు .....నా ఆనందానికి అవధులు లేవు వెంటనే తనని గట్టిగా పట్టేస్కున్నాను,నా కన్నీళ్ళు తన భుజాన్ని తడుపుతున్నాయి..
"నిన్ను ఏడిపించాను కదా.. I am sorry,నీ లెటర్ చదివిన వెంటనే ఎస్ అనాలి అనుకున్నాను కానీ, నేను ఉన్న situation లో ఆ మూడు అక్షరాలూ చాల expensive అనిపించాయి నాకు"అని నా తల నిమురుతూ అన్నాడు తను.

"నాకు నీలా పెద్ద పెద్ద మాటల్లో చెప్పడం రాదనీ చెప్పను గా "అన్నాను నేను కళ్ళు తుడుచుకుంటూ.
"నువ్వు ఇలా చిన్న పిల్లలా ఉంటేనే నాకు ఇష్టం"అన్నాడు తను నా నుదుటి మెడ ముద్దు పెట్టుకుంటూ....
"కాని ఇంతలా ఏడిపించాలా నన్ను...ఇది ఇందాకే చెప్పొచు కదా" అన్నాను నేను....
"నేను నీకు చెప్పాను...నువ్వే చూడలేదు" అన్నాడు
"చెప్పావ....ఎప్పుడు బాబు" అన్నాను
నా చేతిలో ఉన్న తను వేసిన బొమ్మ పేపర్ తెస్కుని విడదీసి చూపించాడు.....అందులో ఒక అమ్మాయి అబ్బాయి కలసి ఉన్న బొమ్మ ఉన్నది....అందులో ఇలా రాసి ఉంది........

"చెలియా నా సఖియా....!!
ప్రేమను ఎలా చూపించాలో తెలిసిన నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు.....
కాలంతో పరిగెత్తాలనుకునే నా పాదం ఈ క్షణం నీతో నడవాలని చెబుతోంది.....
ఎన్నడూ లేని విధంగా 72 లో కొట్టుకోవాల్సిన నా గుండె నిన్ను చూడగానే 143 లోకి వెల్తోంది.....
నీ మాట వినగానే నాలో ఏదో తెలియని సంతోషం... నీ పేరు వినబడినా నాలో అలజడి మొదలవుతుంది.
నా కళ్ళెపుడూ నిన్నే చూడాలని,నా మాటలన్నీ నీతోనే చెప్పాలని అనిపిస్తోంది.
నిన్నెంత ప్రేమిస్తున్నా అంటే చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు,గుండెలో దాచేంత తక్కువ కూడా కాదు.కాలాన్ని కొలవడానికి సెకండ్లు ఉన్నాయి...నీపై నా ప్రేమను నా గుండె చప్పుడుతో కొలుస్తాను.....నువు గుర్తొచ్చినపుడే స్పందించమని నా మనసుకి చెప్పా...అమ్మలా ప్రేమిస్తాను నాన్నలా చూసుకుంటాను అని అందరిలా డైలాగులు చెప్పను కానీ నేను చూపించు ప్రేమలో మీ అమ్మా నాన్నల ప్రేమ కనబడుతుంది..నేను అందరి లాంటి అబ్బాయే అయినా అందరిలా కాకుండా నిన్ను నీలా ప్రేమించి నాలా చూసుకుంటా....నా ప్రేమను నీకు ఇవ్వాలని నీతో నా జీవితాన్ని పంచుకోవాలని నా మనసు పదే పదే ప్రతి స్పందనలో నాకు చెబుతోంది....నా ఈ జన్మ నీతోనే ప్రియతమా.....!!"

అది చదివాక వాడిని గట్టిగా పట్టేస్కున్న....
"ఏరా ఇలానే చెప్పాలా...నువ్వు ఎస్ అన్న ఒక్క ముక్క చెప్తే చాలు కదా రా.....జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని చూస్కుంటా ర నిన్ను అన్నా"
"నీకు నేను చెప్పేది నీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి అందుకే ఇలా " అన్నాడు....
"సరే పద ఆకలి వేస్తుంది ఇప్పుడు" అన్నా

సరే పద అని ఇద్దరం నవ్వుతు చేతులు పట్టుకుని అక్షయ కాంటీన్ వైపు నడుస్తున్నాం.
"ఈ రోజు నీ ఫిల్టర్ కాఫీ తో సెలెబ్రేట్ చేస్కుందాం "అన్నాడు తను.
"నువ్వు తాగవ్ గా .."అన్నాను నేను.
"నువ్వు తాగుతావ్ గా "అన్నాడు తను.
ఇద్దరం నవ్వుకుంటూ నడుస్తున్నాం.
"అవను,నువ్వు బొమ్మలు కూడా వేస్తావా?"అడిగాను నేను..
"హా.. వేస్తాను,ఎప్పుడైనా నేను చెప్పాలి అనుకున్నప్పుడు మాటలు కరువైతే....నేను చెప్పలేని భావాలను ఇలా గీస్తుంటాను,ఏదో పిచ్చి రాతలు రాస్తుంటాను... "అన్నాడు తను.
"నువ్వు మాట్లాడటం అలవాటు చేస్కో,నీ కవితల్లోనూ,బొమ్మల్లోను అర్ధాలు వెతుక్కోడం నాకు కొంచెం కష్టంఅవుతోంది కదా."అన్నాను నేను నవ్వుతూ.
"ఇప్పుడిప్పుడే మాటలు ఆడడం నేర్చుకుంటున్నాను నీ దగ్గర్నుంచి,ఇంకా బాగా నేర్చుకుంటాను లే "అన్నాడు తను కూడా నవ్వుతూ.
కాంటీన్ దగ్గిరకి వచ్చేసాం.......
"నేను,అప్పా కి కాల్ చేసి వస్తాను,నువ్వెళ్ళి ఆర్డర్ చెప్పు"అన్నాను నేను.
తను లోపలి వెళ్ళాడు,నేను మా నాన్న కి కాల్ చేసి నా ఆనందాన్ని ఆయన తో పంచుకున్నాను.తను చాల హ్యాపీ గా ఉన్నారు.....ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండమన్నారు......
ఫోన్ అయ్యాక లోపలికి వెళ్ళాను..ఆర్యన్ ఆర్డర్ చెప్పుంచాడు.....సో,వెళ్ళిన వెంటనే వేడి వేడి ఫిల్టర్ కాఫీ వచ్చింది.
"నువ్వు తాగవ?"బుంగమూతి పెట్టి అడిగాను నేను.
"ఊహూ.. " అన్నాడు తను .
"నేను నిన్ను ఇబ్బంది పెట్టానులే " అంటూ నేనే తాగాను.

ఆ తర్వాత ఇద్దరం మా డిపార్టుమెంటుకి వెళ్ళాం..వర్క్ చేస్కున్నం..ఈవెనింగ్ వరకు చాల వర్క్ లోడ్ ఉంది. నేను మాత్రం మధ్యలో కొంత సేపు మిగతా 3 టీంమెంబెర్స్ తో కల్సి బ్రేక్ తీస్కున్నాను కాని ఆర్యన్ కి వర్క్ ముందు ఇంకేమి కనిపించవు కాబట్టి తను అసలు deviate అవ్వలేదు.....నేను కాఫ్తెరియా నుంచి ఒక కోక్ ఇంకా సమోసా తెచ్చి ఆర్యన్ ముందు పెట్టాను.తను తిరిగి నా వైపు చూసాడు..
"కొంచెం బ్రేక్ నీక్కూడా అవసరం,సమోసా బాగుంది ఇవాళ అందుకే తెచ్చాను...హ్మ్మ్ తిను "అంటూ తన చేతిలోనుంచి మౌస్ పక్కకి పెడ్తూ అన్నాను.
"హ్మ్మ్..థాంక్యు " అని నవ్వుతూ సమోసా తింటున్నాడు తను.
"బాగుందా?"అడిగాను నేను.
"ఆకలేస్తున్నప్పుడు ఏదైనా tasty గానే ఉంటుంది"అన్నాడు తను.
"మరింత ఆకలేస్తున్నపుడు 2min బ్రేక్ తీస్కోవచ్చుగా "అన్నాను నేను.
"వర్క్ కూడా ఉందిగా"అన్నాడు తను.
"హెల్త్ ఉంటె నే చెయ్యగలవ్ ఏమైనా.. ముందు నీ గురించి నువ్వు కేర్ తీస్కోవాలి"అన్నాను నేను.
"మా అమ్మ తర్వాత నా హెల్త్ జాగ్రత్త అని చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే శిశిర..థాంక్యు "అన్నాడు తను.
"మరి నీలా వరల్డ్ తో సంబంధంలేకుండా వర్క్ కి అంకితం అయిపోయేవాళ్ళుంటే మేము అయినా ఎవరకి చెప్తాము,బాబు ఇలా చేస్తే కష్టం సుమ .. హెల్త్ కూడా ఇంపార్టెంట్....ఇంతవరకు ఆంటీ నిన్ను జాగ్రత్త గా చుస్కున్నారు....ఇకపయ్ నిన్ను జాగ్రత్త గా చుస్కోవలసిన భాద్యత నాదే కదా ... అని తన తల పయ్ నా తల పెడ్తూ" అన్నాను నేను.
"హ హ హ.. అవను చెప్తావ్ చెప్తావ్ .." అన్నాడు తను నా కళ్ళలోకి చూస్తూ......
"ఏంటి శిశిరా కళ్ళకి కాటుక పెట్టావా"అన్నాడు
"హ్మ్మ్మ్....నువ్వే గా బాగుంటా అన్నావు.....అందుకే "....
తను నా చేతిని తన చేతిలోకి తీస్కుని ముద్దు పెట్టాడు......
"ఎందుకు శిశిర...నా లిఫ్ లోకి ఇంత లేట్ గా వచ్చావు"........అన్నాడు
"నువ్వే మాటాడకుండా దూరం గా ఉన్నావు ...అయిన ఈ ఇంటర్న్షిప్ ౧స్త్ ఇయర్ లోనే వస్తే బాగుణ్ణు "అన్నాను
"హ్మ్మ్ ...పోన్లే ఇప్పటికన్నా దొరికావు నాకు ఇకపయ్ జాగ్రతగా చూస్కుంటా " అన్నాడు ...
తర్వాత మిగిలిన టీం మెంబెర్స్ రావటం తో మల్ల మా వర్క్ లోకి వేల్లిపోయం .......

ఇలా కొంచెం కేరింగ్ గా.. స్వీట్ గా..డే అంతా workload తో ఈవెనింగ్ pleasant గా ఆర్యన్ చెప్పే కవితలతో,నేను చెప్పే బోల్డన్ని కబుర్ల తో మా రెండు నెలల ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ అయిపొయింది.
రేపే ఆఖరి రోజు అక్కడ.....నా డైరీ లో ఈ రెండునెలలు నా జీవితాన్ని ఎంతలా మార్చేసాయో రాస్కుంటున్నాను నేను,ఈవెనింగ్ లాన్ లో కుర్చుని.. ఇంతలో ఆర్యన్ వచ్చాడు.......

"ఏంటి రాస్తున్నావ్ ?"అడిగాడు తను నా పక్కన కూర్చుంటూ.." హ్మ్మ్..... వచ్చావ.. ఏంలేదు ఈ 2 మంత్స్ ఇంటర్న్షిప్ డేస్ ఎలా గడిచాయో రాస్కుంటున్నాను."అంటూ పెన్ డైరీలో పెట్టి ముసాను..
"ఓహో..నీ పర్సనల్ డైరీ నా.. సరే "అంటూ తీసిన వాడే మల్లి డైరీ కింద పెట్టేసాడు.
"అరేయ్.... అలా ఏంలేదు.. చూడవచ్చు నువ్వు"అన్నాను నేను.
"వద్దు శిశిర.....ఎవరికీ వాళ్ళకి కొంత ప్రైవసీ ఉండాలి అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ "అన్నాడు తను.

తన మాటలకి నా ప్రైవసీ అండ్ స్పేస్ నాకు ఇస్తున్నాడని నేను హ్యాపీ గా ఫీల్ అవ్వాలో.... లేదంటే నన్ను పరయిదాన్ని అనుకుంటున్నాడు అని బాధ పడాలో నాకు అర్ధం కాలేదు.. చిన్న చిరునవ్వు ఇచ్చాను.... అంతే......

"రేపు లాస్ట్ డే కదా..మేడం కి ఏదైనా memorable గా ఇద్దామ ?" అడిగాడు తను.
మా initial డేస్ లో ఆవిడ తో ఉన్న ఎక్స్పీరియన్స్ తర్వాత మేము మల్లి ఎటువంటి ఆడ్ sequences కి తావివ్వలేదు.ఆవిడ వచ్చి వర్క్ ఎలా నడుస్తోందో చూసి వేల్పోయేవారు అంతే.......
"హా.. మన టీం అందరం నైట్ డిన్నర్ కి వెళ్తున్నాం కదా.. ఆవిడ ని డిన్నర్ కి పిలిస్తే బాగుండదు కదా సో, ఇవాళ వెళ్లి ఆవిడకి గిఫ్ట్ కొందాము."అన్నాను నేను.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)